ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసిన రక్త బీజులు మాదిరి దేశ వ్యతిరేఖులు తయారయ్యారు, ఏ రూపంలో ఉండి తమ కార్యకలాపాలు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థిత...
ప్రమాదకరమైన అడవి కావడంతో కృష్ణుడు..
"బలదేవ, సాత్యకి.. ఈ రాత్రి వంతుల వారీగా మనం నిఘా ఉంచుకోవడం మంచిది... అర్ధరాత్రి వరకు మీరిద్దరూ నిఘా ఉంచండి, అర్ధరాత్రి నుండి ఉదయం వరకు నేను నిఘా ఉంచుతాను" అని సూచించాడు.
వారిద్దరూ అంగీకరించారు... కృష్ణ బలరాములు నిద్రపోయారు.
కొన్ని గంటలు గడిచాయి....
మెలకువగా ఉన్న సాత్యకి కొన్ని కేకలు విన్నాడు... అతను శబ్దం వైపు కొంచెం ముందుకు నడిచాడు.
ఇప్పుడు సాత్యకి ఒక రెండు అంగుళాలు మాత్రమే ఉన్న చిన్ని రాక్షసుడు తన దగ్గరికి రావడాన్ని గమనించాడు.
రాక్షసుడు మళ్ళీ కేకలు వేశాడు.. సాత్యకి కి కోపం వచ్చి...
బొటన వ్రేలంత లేవు.. ఇప్పుడే నీ సంగతి చూస్తానని... అరిచాడు..
ఆశ్చర్యంగా అంగుష్టం మాత్రం ఉన్న రాక్షసుడు... కొంచెం పెరిగాడు...
సాత్యకి మరింత క్రోధంతో... తిట్టడం మొదలు పెట్టాడు... కొంచెం కొంచెం ఆ రాక్షసుడు పెరగడం ప్రారంభించాడు...
గట్టిగా రెండు మూడు దెబ్బలు వేసి, అరిచాడు సాత్యకి... మరింతగా పెరిగాడు ఆ అంగుష్టి...
అలసిపోయిన సాత్యకి, బలరాముడు లేవడంతో... విశ్రాంతికి వెళ్ళిపోయాడు..
బలరాముడు ఆగ్రహంగా దూకి... అప్పటికే తనలో సగం ఉన్న ఆ రాక్షసుడిని తిడుతూ, తన్నుతూ అరుస్తూ గట్టిగా తన స్థాయి చెబుతూ పోరాడటం మొదలు పెట్టాడు...
అంతే... అంతకంతకూ పెరిగిపోయిన బ్రహ్మ రాక్షసుడు బలరాముడిని ఇంచుమించు.. ఓడించేంత పని చేశాడు.. బలరాముడు అలసిపోయాడు..
అప్పటికే వృక్షం అంత అయిన అంగుష్టిని చూసి భయపడ్డాడు, భయంతో వణికిపోయాడు. తిట్టి, అరిచిన ప్రతిసారీ రాక్షసుడు రెట్టింపు పరిమాణంలో పెరిగాడు.
రాక్షసుడి శబ్దం, పరిమాణం మరియు భయంకరమైన వాసన చూసి భయపడిన బలరాముడు "కృష్ణా! కృష్ణా!" అని అరిచాడు.
అరుపుతో మేల్కొన్న కృష్ణుడు ఆ శబ్దాన్ని అనుసరించి , 'ఇది ఇప్పుడు నా వంతు అయి ఉండాలి' అని అనుకున్నాడు.
బలరాముడు అలసి స్పృహ తప్పడంతో.. కృష్ణుడు సమీపంలో నిలబడి ఉన్న రాక్షసుడిని గుర్తించాడు.
వాడ్ని చూసిన కృష్ణుడు చిన్నగా చిరునవ్వు నవ్వాడు..
కృష్ణుడి వద్ద రాక్షసుడు కేకలు వేశాడు.
"ఏమీ...నీ సంగతి చూస్తా... నువ్వొక్కడివా... మళ్లీ" అంటూ అరిచాడు.. రాక్షసుడు.
"నీకు ఏమి కావాలి?" కృష్ణుడు భయపడకుండా, మెత్తగా అడిగాడు.
ఆశ్చర్యంగా రాక్షసుడి పరిమాణం తగ్గింది...
"ఏయ్... నీ సంగతి చూస్తా... నీ బలమూ చూస్తా... నిన్ను అందరూ... గొప్ప వాడు అనుకుంటున్నారేమో.. అదీ చూస్తా..." అంటూ కృష్ణుడి వెంటబడ్డాడు అంగుష్టి రాక్షసుడు...
దాన్ని పట్టించు కోకుండా కృష్ణుడు సరదా చేస్తూ... అటూ ఇటూ... చెట్టు చుట్టూ పరిగెట్టించాడు..
ఆశ్చర్యంగా రాక్షసుడి పరిమాణంలో సగానికి తగ్గిపోయింది.
ఇంకా క్రోధంతో రగిలిన రాక్షసుడు మరింతగా కృష్ణుణ్ణి అనడం మొదలు పెట్టాడు.... రాక్షసుడు మళ్ళీ కుంచించుకుపోయాడు.
కృష్ణుడు ప్రశాంతంగా ఆట పట్టిస్తూనే ఉన్నాడు.. ప్రతిసారీ రాక్షసుడు తగ్గిపోతూనే ఉన్నాడు.
ఇప్పుడు రాక్షసుడు కేవలం 2 అంగుళాల పొడవుకి వదిగిపోయాడు.
కృష్ణుడు వాణ్ణి చేతిలో తీసుకొని నడుము చుట్టూ ఉన్న ఉత్తరీయంలో ఉంచాడు.
రాత్రి గడిచిపోయింది...
సాత్యకి బలరాముడు ఉదయం లేచారు.
బలరాముడు కృష్ణుడిని చూసి ఆనందంగా..
"కృష్ణా...కృష్ణా! మీరు నిద్రలో ఉన్నప్పుడు ఏమి జరిగిందో మీకు తెలియదు. మా ఇద్దరినీ చంపడానికి భారీ రాక్షసుడు ఉన్నాడు. మేము ఎలా బయటపడ్డామో నాకు తెలియదు, చివరిగా నాకు గుర్తుంది నేను మూర్ఛపోయాను."
నిన్న రాత్రి జరిగిన సంఘటనలను గుర్తుచేసుకునేందుకు ప్రయత్నిస్తూ బలరాముడు చెప్పాడు.

కృష్ణుడు తన జేబులోంచి ఉన్న చిన్న రాక్షసుడిని బయటకు తీసి, "ఇదే రాక్షసుడా?" అన్నాడు...
"అవును, కానీ అది చాలా పెద్దది! ఇది ఎలా కుంచించుకుపోయింది?" అడిగాడు బలరాముడు.
మనం పదే పదే వ్యతిరేకుల గురించి ఆలోచిస్తూ... ఏదో వొకటి అంటూ... క్రోధంగా ఉన్నంత సేపూ... రాక్షసుడు ఎలా పెరిగాడో... అలాగే వారి బలమూ పెరిగి పోతుంది... అన్నాడు కృష్ణుడు.
మనం మన హిందుత్వం గురించి ఆలోచన చేస్తూ... కృష్ణుడి లాగా భయం లేకుండా... ప్రశాంతంగా.. మనం మన పని చేసుకుంటూ, రాక్షసుణ్ణి విస్మరిస్తూనే, అలసిపోయేలా చెయ్యాలి...
దానికి మనం మన పని మీద, సమాజకార్యం పైనే ఎక్కువ దృష్టి పెట్టాలి...

No comments