Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వీర సావర్కర్ క్షమాబిక్ష ఉత్తరాలపై మెగామైండ్స్

కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు వినాయక దామోదర్ (వీర) సావర్కర్ ని దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూనే ఉంది. రాజకీయ దురుద్దేశం...

కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు వినాయక దామోదర్ (వీర) సావర్కర్ ని దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూనే ఉంది. రాజకీయ దురుద్దేశంతోనే ఈ పని చేస్తోంది. సావర్కర్  "హిందుత్వ" పుస్తకం ద్వారా దేశ ప్రజల్లో నూతనోత్తేజాన్ని అందించారు. రాహుల్ గాంధీ చెప్తున్నట్టు ఆర్ఎస్ఎస్ ను సావర్కర్ స్థాపించ లేదు. కనీసం అందులో సభ్యులు కూడా కాదు. ఏసీ గదుల్లో కూర్చుని సావర్కర్ దేశభక్తిని, వారు అండమాన్లో గడిపిన కఠినమైన కారగార జీవితాన్ని శంకిస్తూ కాంగ్రెస్ నాయకులు తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సావర్కర్ అండమాన్ జైలులో క్షమాభిక్షను అర్థించారు అంటూ ఆయనను దేశద్రోహిగా కాంగ్రెసు పార్టీ  పేర్కొంటున్నది.

నిజానికి అండమాన్ జైలులో ఆ సమయంలో ఎటువంటి వసతులు కావాలన్నా అది వ్యాజ్యాల ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది. స్వయంగా న్యాయవాది అయిన సావర్కర్ చట్టపరమైన మార్గం ద్వారా బయటికి రావాలనుకున్నారు. ఆయనకు జైలులో కాలం వెళ్లదీయడం ఎంత మాత్రం ఇష్టం లేదు. విప్లవకారులందరూ బ్రిటిష్ చెర నుండి విముక్తులైతే తప్ప  స్వాతంత్రం కోసం పనిచేయలేరని గట్టిగా విశ్వసించారు. ఇలా జైలులో మగ్గిపోవడం ద్వారా దేశ స్వాతంత్రానికి ఏ విధంగా సహకరించగలం? ఇదే విషయాన్ని జైలులోని తన సహచరులతో చర్చించేవారు. దేశ ప్రజలను సంఘటితం చేయడం, విప్లవకారులకు ప్రేరణ కలిగించడం తప్ప, ఆయన బయటికి రావడం వల్ల తీవ్ర పరిణామాలు మరేవీ లేవు. అండమాన్ యాజమాన్యం జైలు శిక్ష అనుభవిస్తున్న విప్లవకారుల యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచేది.

సావర్కర్ తన అండమాన్ లో ఆజన్మాంతం పుస్తకం  ఇలా వ్రాశారు: "అండమాన్ జైలులోని ఖైదీలు అందరికీ సంవత్సరానికి ఒకసారి తమ కుటుంబానికి ఉత్తరం రాసే వీలుంది. అది వీలైనంత క్లుప్తంగా ఉండాలి. అక్కడి యాజమాన్యం పట్ల ఒక్క మాట కూడా వ్యతిరేకంగా రాయకూడదు. ఉత్తరాన్ని బ్రిటిష్ అధికారులు పరిశీలించి ఆమోదించిన తర్వాతే బయటకు వెళ్ళేది. జైల్లో గట్టిగా అరిచినా, సహచరులతో మాట్లాడిన, వరుసలో కూర్చోకున్నా, ఏ చిన్న తప్పు చేసినా ఆ సంవత్సరం అతనికి ఉత్తరం రాసే అవకాశం కూడా ఉండేది కాదు. సంవత్సరానికి ఒక ఉత్తరం రాయడానికి పైన చెప్పిన షరతులు పాటించడం ఎంత కష్టంగా ఉంటుందో మనం ఊహించగలం. జైలు నుంచి ఇంటికి సమాచారం పంపడం, అదేవిధంగా ఇంటి సమాచారం ఖైదీలకు తెలియడం అసంభవం. ఈ విధంగా అనేకమంది విప్లవకారులు తాము బతికున్నామని రెండు ముక్కలు రాసే వీలు కూడా లేకుండా పోయింది."

అనేకమంది విప్లవకారులు ఈ శిక్షలను తట్టుకోలేక మరణించారు. వారి మరణం స్వాతంత్ర పోరాటానికి  ఉపయోగపడిందా? ఇలా జైలులోనే మరణించిన విప్లవకారుల పేర్లు మనలో ఎంతమందికి తెలుసు? కొందరి పేర్లు గుర్తుండి ఉండవచ్చు. మరణించిన తర్వాత వారిని బేస్మెంట్లో కప్పెట్టారు తప్ప వారెవరో ఎవరికి తెలియదు. అండమాన్ లోని ఖైదీలు అందరూ నరకయాతన అనుభవించారు. అది మరణం కంటే దుర్భరమైనది. 28 సంవత్సరాలు వయస్సులో సావర్కర్ కి రెండు యావజ్జీవ (50 సం.) కారగారాల శిక్ష విధించారు. అండమాన్ జైలు లాంటి నరక కూపంలో 50 సంవత్సరాలు గడపడం అసంభవమే! సావర్కర్ ఉత్తరాల్లో పూర్తి విడుదలను కోరలేదు. చట్టబద్ధంగా తనకు ఏ అధికారాలు హక్కులు ఉన్నాయో వాటిని కోరాడు. నిజానికి ఆయనను 50 సంవత్సరాలు జైల్లో ఉంచకూడదు. మూడు సంవత్సరాల తర్వాత జైలు నుండి విడుదల చేసి అండమాన్ లోనే ఉండి ఏదో ఒక పని చేసుకోవచ్చు. కుటుంబంతో కూడా ఉండవచ్చు. పెళ్ళికాని వారు పెళ్లి కూడా చేసుకోవచ్చు. సావర్కర్ విడుదలను కోరలేదు. 

ఆయన వేసిన వ్యాజ్యంలో ఏమున్నాయో తెలుసుకుందాం:
దయచేసి నన్ను భారతదేశంలోని జైలుకు బదిలీ చేయండి దానివల్ల నేను అనారోగ్యం నుండి కోలుకుంటాను. నాలుగు నెలలకు ఒకసారి మా కుటుంబ సభ్యులను కలుసుకుంటాను. చట్టపరంగా కాకపోయినా నైతికంగా 14 సంవత్సరాలు జైలు శిక్ష తర్వాత విడుదలకు అర్హుడిని. అనేక ఉత్తరాలు రాస్తాను. కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. (లేదా)
నన్ను భారతదేశానికి పంపించని పక్షంలో ఇతర ఖైదీలకు వర్తించినట్టే, ఆశవాహ దృక్పథంతో నన్ను సెలవు మీద విడుదల చేసి మా కుటుంబాన్ని ఇక్కడకు రప్పించాలి. ఐదు సంవత్సరాలకు ఒకసారి జైలుకు వచ్చే వీలును కల్పించాలి. ఇది జరిగిన క్రమంలో కేవలం నా తప్పులకు మాత్రమే నన్ను బాధ్యులను చేయాలి ఇతరులు చేసిన తప్పులకు నేను బాధ్యుడిని కాను.

ఈ విధంగా సావర్కర్ తనకు చట్టం ద్వారా సంక్రమించిన హక్కులను మాత్రమే కోరారు. బ్రిటిష్ ప్రభుత్వం సావర్కర్ కు ఈ హక్కులను కూడా తిరస్కరించింది. సావర్కర్ ఇతర ఖైదీల కంటే ప్రమాదకరంగా పేర్కొన్నది. అండమాన్ జైలులోని వారి బ్యాడ్జీలో D 39 అని రాసి ఉంటుంది. D అంటే Dangerous అన్నమాట. ఇతరులు చేసిన తప్పులకు కూడా సావర్కర్ ను అన్యాయంగా శిక్షించేవారు. అయన తన హక్కులను అడిగారు తప్ప క్షమాపణ కోరలేదు.

మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు, సావర్కర్ 1914లో భారత ప్రభుత్వానికి వినతిపత్రం పంపారు. వలస రాజ్యాల స్వపరిపాలన అధికారం బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వాలని, విప్లవకారులు మరియు కేంద్ర శాసనమండలి లో అధిక శాతం సభ్యులు యుద్ధంలో బ్రిటన్‌కు సహాయం చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఐరోపా ప్రభుత్వాలు తమ రాజకీయ ఖైదీలను విడుదల చేసిన సందర్భాలు మరియు ఐర్లాండ్‌లోని రాజకీయ ఖైదీల విముక్తికి సంబంధించిన ఉదంతాలు కూడా ఆయన ప్రస్తావించారు.

ఈ విషయమై తమ పుస్తకం  ఇలా వ్రాశారు "భారత్‌ను బాసిసత్వ సంకెళ్లు నుండి విముక్తి చేయడానికి ఇంగ్లండ్ సిద్ధంగా ఉందని ప్రజలను ఒప్పించేందుకు మమ్మల్ని విడుదల చేయండి. ఆఫ్ఘనిస్తాన్ మరియు టర్కీ దళాలు ఉత్తరాది నుండి భారతదేశంపై దాడిని అరికట్టడానికి పెద్ద సంఖ్యలో భారతీయ సైన్యంలోకి చేరికల కోసం మా వంతు కృషి చేస్తామని మేము మాట ఇస్తున్నాము. భారతదేశాన్ని రక్షించడానికి మరియు ఇంగ్లండ్ విజయం కోసం ఆ సైన్యంలో పనిచేస్తాము. మమ్మల్ని విడుదల చేయండి, భారతదేశంలో వలసరాజ్య స్వపరిపాలన ప్రకటించండి. ప్రజల విధేయతను మరియు ప్రేమను గెలుచుకోండి. ప్రస్తుత సంక్షోభంలో ప్రభుత్వానికి ప్రజల నుండి అవసరమైన అన్ని సహకారాన్ని అందిస్తాము. ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు. ఒకవేళ ప్రభుత్వానికి అనుమానం ఉంటే, నేను ముగింపులో వ్రాసినట్టుగా, లేఖ రాయడంలో నా ఉద్దేశ్యం, నన్ను విడుదల చేయకపోయినా సహకరిస్తానని ప్రతిపాదిస్తున్నాను.

అండమాన్‌లోని నా సెల్‌లో నన్ను ఒంటరిగా వదిలి దేశంలోని రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయండి. వారి స్వేచ్చ నా స్వేచ్ఛ గా భావించి నేను ఆనందిస్తాను. ప్రభుత్వం నన్ను అనుమానించడం సరైనదే; బహుశా, స్వేచ్ఛగా ఉన్నప్పుడు, భారతదేశంలో శాంతిని విచ్ఛిన్నం చేయడానికి నేను ఆందోళనకు నాయకత్వం వహించవచ్చు. నేను నా స్వంత విముక్తి కోసం లేఖ రాయలేదు, లేదా ఇలాంటి లేదా అదే రాజకీయ కుట్రలలో పాల్గొన్న ఇతర రాజకీయ ఖైదీలతో పాటు నన్ను విడుదల చేయమని వారిని బలవంతం చేయడానికి నేను లేఖ రాయలేదు. అందువల్ల నన్ను వెనక్కి ఉంచి, మిగతా వారందరినీ విడిపించాలనే ప్రతిపాదన చేశాను. సూపరింటెండెంట్ లేఖను పంపించడానికి అంగీకరించారు, నేను దానిలో ఈ క్రింది విధంగా వ్రాసాను.

భారతదేశంలోని విప్లవ ఉద్యమంతో సన్నిహితంగా ముడిపడి ఉన్నందున, ఇంగ్లండ్ మరియు జర్మనీ మధ్య జరిగిన యుద్ధంలో భారతదేశంలోని ప్రస్తుత పరిస్థితి గురించి నేను ఏమనుకుంటున్నానో, దానిని ప్రభుత్వానికి తెలియజేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను అని రాశాను. భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం మా లక్ష్యం. కానీ ఆ స్వాతంత్ర్యం సాధించడానికి మేము హింసాత్మక మార్గాలను మాత్రమే ఎంచుకుంటామని చెప్పలేదు. ఆ ప్రయోజనం కోసం ఇంతకు ముందు మరేదైనా నిశ్చయమైన సాధనాలు మాకు అందుబాటులో ఉంటే, మేము తీవ్రవాద మరియు విప్లవాత్మక పద్ధతులకు వెళ్ళేవాళ్ళం కాదు అంటూ సావర్కర్ My Transportation for life అనే పుస్తకంలో  రాశారు."

దీని ద్వారా సావర్కర్ ఎలాంటి స్వలాభము అపేక్షించలేదని ఇతర విప్లవకారులను విడుదల చేయమని కోరుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికైనా సావర్కర్ గురించి అవాకులు చెవాకులు పేలే వారు సావర్కర్ గురించి తెలుసుకోండి... ఆయన వ్రాసిన పుస్తకాలు అధ్యయనం చేయండి. అండమాన్ లో ఆజన్మాంతం వీర సావర్కర్ జైలుగాథ ను తప్పక చదవండి... ఆయన ఎటువంటి శిక్షలు, కష్టాలు అనుభవించారో తెలుస్తుంది... జై హింద్. - మైగామైండ్స్ టీం.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

2 comments

  1. Trying to glorify the coward. There are many who sacrificed their life. If they thought what's the point in dying, when it won't help in securing freedom. Their lives inspired people to fight more.

    This literally guy begged for his freedom saying treat me as a child of yours to British.

    ReplyDelete
  2. He was a revolutionary before he was jailed. We can sympathise with his hardships during his Andaman jail life. We can even ignore his mercy petitions. What makes him a hate figure is his conduct after his Andaman jail stint. He truly honoured his undertaking in his mercy petitions and remained a British loyalist. He along with other associates were main proponents of religious hatred in league with Jinna and Muslim league

    ReplyDelete