భారతదేశం మన మాతృభూమి: ఇది మన పవిత్ర భారత భూమి. దీని గురించి దేవతలు సైతం కీర్తించారు. గాయంతి దేవాః కిల గీతకాని ధన్యస్తుతే భారత భూ...
గాయంతి దేవాః కిల గీతకాని ధన్యస్తుతే భారత భూమిభాగే |
స్వర్గాపవర్గాస్పదహేతుభూతే భవంతి భూయః పురుషాః సురత్వాత్ ||
(విష్ణు పురాణం 2-3-24, బ్రహ్మపురాణం 19-25)
స్వర్గం మరియు అపవర్గం (మోక్షం) యొక్క సాధనకు అన్ని విధాలా శ్రేష్ఠమైన ఈ భారత భూమిలో జన్మించిన ప్రజలు మనకంటే ధన్యులు అని స్వయానా దేవతలు కీర్తిస్తున్నారు.
మహాయోగి అరవిందులు భారతమాత యొక్క సాక్షాత్కారాన్ని పొందారు. విశ్వజననిగా, జగన్మాతగా ఆదిశక్తి, మహామాయ మహా దుర్గ వంటి అవతారములలో సాకారం చేసుకుని మూర్తి రూపంలో ఆమెను దర్శించి పూజించే భాగ్యాన్ని మనకు కలిగించారు.
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, ఈ భూమిని దేవీ భువనమనమోహిని నీలసింధు జలదధౌత చరణతల అని వర్ణించారు. అనేకమంది స్వాతంత్ర వీరులకు తారక మంత్రమై, బ్రిటిష్ పాలిట రణ నినాదమైన వందేమాతరంలో త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీం అంటూ బంకించంద్ర చటర్జీ భారతమాతను స్తుతించారు.
ఈ భూమిని మాతృభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమిగా అనేకమంది సాధుసంతులు మహాత్ములు పూజించారు. నిజానికి ఇది దేవ భూమి. మోక్ష భూమి.
భారతమాత నామ స్మరణ మాత్రం చేత మన హృదయాంతరాళలో ఉన్న శుద్ధ సాత్విక భక్తి తరంగాలు ఉప్పొంగుతాయి. ఇది అనాదిగా మనం కొలుస్తున్న ప్రియ భారత భూమి. తేజోవంతమైనది మన మాతృభూమి. ఆహా! ఇదియే మనందరికి తల్లి.
భరత్వ రమణత్వాత్ ఇతి భారత
జీవులను భరించి పోషించి రమణింప చేయువాడు భరతుడు. వేదం లో భరత అనే శబ్దం సూర్యుడిని పరమేశ్వరుడిని సూచిస్తుంది. అటువంటి భరతుడైన పరమేశ్వరుడిని ఆరాధించే వారిని భారతీయులు అంటారు.
జీవులను భరించి పోషించి రమణింప చేయువాడు భరతుడు. వేదం లో భరత అనే శబ్దం సూర్యుడిని పరమేశ్వరుడిని సూచిస్తుంది. అటువంటి భరతుడైన పరమేశ్వరుడిని ఆరాధించే వారిని భారతీయులు అంటారు.
అగ్నిమిచ్ఛధ్వం భరతాః
భారతీయులారా! మనం అగ్నిని ఆశ్రయిద్దాం. యజ్ఞం ద్వారా అగ్నిని ఆరాధించేవారిని భారతీయులు అంటారు. భరత అంటే జ్ఞానానుసంధానం యో రతః. భ అంటే కాంతి. రత అంటే కోరుకునేవారు లేదా పయనించువారు. అజ్ఞానము అనే చీకటి నుండి కాంతి అనే జ్ఞానం వైపు పయనించు వారు భారతీయులు.
మన సాంస్కృతిక పరంపరలో భాగంగా ఒక మహిళను గౌరవప్రదంగా సంబోధించాలంటే తన పిల్లల పేరుతో సంబోధిస్తారు. ఉదాహరణకి ఫలానా రాము యొక్క అమ్మగారు. అలాకాకుండా రావు గారి భార్య, రాజు గారి సతీమణి అని సంబోధించడం విదేశీయుల పద్ధతి. భరతుడు మన అందరికీ జేష్ట సోదరుడు. వేల సంవత్సరాల క్రితం ఈ భూమిపై జన్మించాడు. గుణ సంపన్నుడు, గొప్ప మహారాజు. ఒక మహిళకు ఒకరు కన్నా అధిక సంతానం ఉంటే, ఆమెను తన జేష్ఠ సంతానం యొక్క నామంతో సంబోధిస్తారు లేదా అత్యంత కీర్తిమంతుడైన సంతానంతో పిలుస్తారు. ఆ రకంగా భరతుడు పరిపాలించడం వలన దీనిని భారతదేశం అన్నారు. భారతీయుల యొక్క తల్లి కావున భారతమాత అన్నారు.

(నా మాతృభూమి మందిరం, సాధుసంతులకు నిలయంఅణువణువు తేజోవంతం, నా మాతృభూమి మందిరం)
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments