Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మన మాతృభూమి సరిహద్దులు

మన మాతృభూమి సరిహద్దులు: ఒకప్పుడు మన భూభాగం నలుదిక్కులు విస్తరించిన హిమాలయాల యొక్క శాఖోపశాఖలతో కూడి ఉండేది. సాధారణంగా ఒక శక్తివం...

మన మాతృభూమి సరిహద్దులు: ఒకప్పుడు మన భూభాగం నలుదిక్కులు విస్తరించిన హిమాలయాల యొక్క శాఖోపశాఖలతో కూడి ఉండేది. సాధారణంగా ఒక శక్తివంతమైన దేశం పర్వత శిఖరాలను తన సరిహద్దుగా చేసుకోదు. అది ఆత్మహత్యా సదృశం. మన  పూర్వీకులు ఈ హిమాలయ ప్రాంతంలో అనేక తీర్థ స్థలాలను పూజనీయ స్థలాలను గుర్తించి ఈ హిమసీమకు జాగృత  స్వరూపాన్ని అందించారు. టిబెట్ లేదా త్రివిష్టపము అనే ప్రాంతాన్ని ఇప్పుడు మన నాయకులు చైనా ఆక్రమిత  భూభాగంగా పిలుస్తున్నారు. నిజానికి అది దేవతల స్థానము. కైలాస పర్వతం సాక్షాత్తు పరమేశ్వరుని నిలయము. గంగా సింధూ బ్రహ్మపుత్ర వంటి పవిత్ర నదుల యొక్క జన్మస్థలమైన మానస సరోవరం ప్రవహించే ప్రాంతము.

మహాకవి కాళిదాసు హిమాలయాలను ఈ విధంగా వర్ణించారు:
అస్త్యుత్తరశ్యాం దిశి దేవతాత్మ హిమాలయ నామ నాగాధిరాజః|
పూర్వాపరౌ తోయనిధి వగాహ్య స్థితః పృధివ్యా ఇవ మానదండః ||

(కుమార సంభవం, ప్రథమ సర్గ-1) ఉత్తర దిశలో దేవతాత్మ వంటి హిమాలయమనే నామంతో కూడిన పర్వతరాజం ఉన్నది. దాని యొక్క భుజాలు తూర్పు నుంచి పశ్చిమం దాకా సముద్ర పర్యంతము వ్యాపించి ఉన్నాయి. ఆ పర్వతాలు భూమికి వెన్నెముకలా ఉన్నాయి.

రాజనీతి కోవిదుడైన చాణుక్యుడు ఈ విధంగా పేర్కొన్నాడు:
హిమావత్సముద్రాంతరముదీచీనం యోజన సహస్ర పరిమాణం సముద్రం నుంచి హిమాలయ పర్యంతం ఈ భూమి యొక్క విస్తీర్ణం సహస్ర యోజనములు. దీనిని బట్టి కాళిదాసు మరియు చాణక్యుని వర్ణన లో సారూప్యత కనిపిస్తుంది. మన మాతృభూమి వైశాల్యం యొక్క వాస్తవిక చిత్రం అర్థమవుతున్నది.

పాశ్చాత్యులు పచ్చి మాంసం తినే స్థాయి నుంచి కాల్చిన మాంసాన్ని తినాలి అని తెలుసుకున్నారో అప్పటికే మనం ఒక రాష్ట్రంగా (జాతి, దేశం) ఉన్నాము. ఎప్పటికీ ఉంటాము. ఈ సముద్ర పర్యంతం ఉన్న భూమిపై వెలసిల్లిన రాష్ట్రము మనది.

పృధివ్యావ్యైః సముద్రపర్యంతాయా ఏకరాష్ట్ర అని వేదాలలో చెప్పబడింది. అనాదిగా మన మాతృభూమి యొక్క స్వరూపం ఆసేతుహిమాలయం అని స్పష్టంగా చెప్పబడినది.

ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రిశ్చైవదక్షిణం|
వర్షం తత్భారతం నామ భారతీ యత్ర సంతతిః||


(విష్ణు పురాణం 2-3-9, బ్రహ్మపురాణం 19-1) సముద్రానికి ఉత్తరాన ఉన్న భూమి హిమాలయాలకు దక్షిణాన ఉన్న భూమిని భారత వర్షం అంటారు. ఇక్కడ నివసించే ప్రజలను భారతీయులు అంటారు. 

పైన చిత్రాన్ని చూస్తే మీకు స్పష్టంగా భారతదేశం యొక్క సరిహద్దులు అర్దమవుతాయి. హిమాలయాలంటే కేవలం నేపాల్ పై భాగాన ఉన్నవి మాత్రమే కాదు. తూర్పున మయన్మార్ దేశం నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించి ఉన్నవి. గంగానది కలిసేది గంగాసాగర్ అలాగే సిందూనది కలిసేది సిందుసాగర్. ప్రతి భారతీయుడికి ఎప్పుడు ఈ సరిహద్దుల వరకు నాదేశం అనేది గుర్తుండాలి, బ్రిటీష్ వాళ్ళచే విడగొట్టబడిన, ముస్లింలచేత ఆక్రమింపబడిన మనదేశాలు మనం తిరిగి స్వాదీనం చేసుకోవాలి. ఈ యొక్క చిత్రం ని మనం కళ్ళారా చూడాలి. అప్పుడే మనదేశం అఖండంగా నిలుస్తుంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments