భారతమాత జగన్మాత యొక్క దేవి స్వరూపం: మనందరికీ ఈ సంపూర్ణ భారతదేశం ఒక తపోభూమి. మన ప్రాచీన సాహిత్యంలో ఒక ప్రస్తావన వచ్చింది. ప్రతిఫ...
ప్రాచీన కాలం నుండి మన దేశం యొక్క స్వరూపము, స్వభావము వినూత్నమైనవి. అనేకమంది యోగులు, సిద్ధులు, ఋషులు, మునులు ఈ దేశంలో జన్మించి పరమాత్మను చేరుకున్నారు. ఆధునిక కాలంలో నరేంద్రుడు (స్వామి వివేకానంద) రామకృష్ణ పరమహంసను కలవడం ఒక చారిత్రాత్మక ఘట్టము. స్వామి వివేకానంద యవ్వన దశలో విద్యార్థిగా ఉన్నప్పుడు కళాశాలలో అనేక ఆధునిక మరియు పాశ్చాత్య సంబంధమైన విషయాలను అధ్యయనం చేశారు. కానీ ఆ చదువులు నరేంద్రుని జిజ్ఞాసను, తపనను తృప్తి పరచలేకపోయాయి.
ఆ కాలంలోని అనేక మంది పండితులను పుణ్యపురుషులను కలిశారు, ఎవరు కూడా అతని యొక్క ఆత్మ పిపాసను తీర్చలేకపోయారు. దక్షిణేశ్వర్ మందిరంలో ఒక పరమహంస ఉన్నారని ఎవరో చెబితే తెలుసుకొని వారి దర్శనం కోసం అక్కడికి వెళ్లి, అనేక సంవత్సరాలుగా అతని మనసులో ఉన్న ప్రశ్నను సూటిగా అడిగారు మహానుభావా! మీరు దేవుణ్ణి చూశారా? ఒక క్షణం కూడా తడుముకోకుండా రామకృష్ణ పరమహంస స్పష్టంగా బదులిచ్చారు. అవును. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా నేను దేవుణ్ణి చూడగలుగుతున్నాను. ఆయనని నీకు కూడా చూపించగలను. రామకృష్ణుల వారు, ఇచ్చిన మాటను నెరవేర్చి చూపించారు కూడా.
స్వామి వివేకానందుడు చురుకైన మేధస్సు కలిగి ఉండేవాడు. అతని ఇచ్ఛా శక్తి ప్రచండమైనది. అతను ఏదో మాయలకు, మంత్రాలకు, అంధవిశ్వాసాలకు తలొగ్గే వ్యక్తి కాదు. రామకృష్ణుల వారు పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని స్వామి వివేకానంద కి కలిగించిన తరువాత, పరమాత్మ యొక్క సత్య స్వరూపాన్ని దర్శించిన తర్వాత భగవంతుడిని నమ్మకుండా ఉండలేకపోయాడు. ఇటువంటి భగవద్భక్తుల పరంపర మనదేశంలో అనాదిగా కొనసాగుతూ వస్తోంది. ఈ మహా పురుషుల కారణంగా మన దేశం ఈశ్వరుని యొక్క అనుభూతిని కలిగించే దేశమని, ధర్మ భూమిగా, మోక్ష భూమిగా నిలిచింది.

ఈ దేశం యొక్క మట్టిలోని ప్రతి రేణువు దివ్యత్వం తో నిండి ఉన్నది. ఇది మనకు పరమ పవిత్రమైనది. ఈ భావన కేవలం దేశంలోని ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. సంపూర్ణ భారతదేశం పట్ల మనందరికీ ఈ దివ్య భావన, శ్రద్ధ కలిగి ఉన్నాయి. పరమేశ్వరుని పై భక్తి మనల్ని వారణాసి నుంచి రామేశ్వరం వరకు వ్యాపించిన ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేయిస్తుంది. మహావిష్ణువు పై భక్తి మనల్ని దేశంలో ఉన్న నలదిక్కులకి చేర్చుతుంది. చతుర్ధామాల యాత్ర చేయిస్తుంది. అద్వైతులకు జగద్గురు శంకరాచార్యులు నలుదిక్కుల స్థాపించిన ఆశ్రమాలు ఉన్నాయి. శంకరులు ఈ దేశాన్ని యజ్ఞగుండంగా భావన చేశారు. బదరి, పూరి, శృంగేరి, ద్వారక పుణ్యక్షేత్రాలలో చతుర్వేదాలకు ప్రతీకలుగా నాలుగు మఠాలను స్థాపించారు. శక్తి ఉపాసకులకు 51 దివ్య శక్తి పీఠాలు ఉన్నాయి. బలూచిస్థాన్ లోని హింగ్లాజ్ దేవి పీఠం నుండి అసోం లోని కామాఖ్య వరకు, హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి నుండి శ్రీలంకలోని శాంకరీ దేవి వరకు విస్తరించి ఉన్నాయి. మన భరతమాత, విశ్వాన్ని సృజించిన జగన్మాత యొక్క ప్రకటిత స్వరూపమే అని దీనిని బట్టి తెలుస్తున్నది.
(జయ జనని భారతి లోకపావని,
అమృత వర్షిణి శక్తి స్వరూపిణి జ్ఞాన తరంగిణి ముక్తి ప్రదాయిని,
జయ జనని భారతి లోకపావని)
No comments