భారతదేశంలోని కమ్యూనిస్టులు పేదలకు మాత్రమే అనుకూలం అని, వారి సిద్ధాంతం సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంకితమైన ఏకైక సిద్...
భారతదేశంలోని కమ్యూనిస్టులు పేదలకు మాత్రమే అనుకూలం అని, వారి సిద్ధాంతం సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అంకితమైన ఏకైక సిద్ధాంతమని పేర్కొంటారు. ఇలాంటి కబుర్లతో వారు తూర్పు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్ మరియు త్రిపురలలో ఎక్కువ కాలం పరిపాలించారు. పశ్చిమ బెంగాల్‌లో 34 సంవత్సరాలు (1977-2011) అధికారంలో ఉన్నారు. ఇప్పటికీ వారి భావజాలం అక్కడ మమత రూపంలో కొనసాగుతుంది. కమ్యూనిస్టులు వైపు మొగ్గు చూపే బెంగాలీల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నప్పటికీ. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రమైన కేరళలో వారు ఇప్పటికీ అధికారంలో ఉన్నారు. కానీ వారు పైన పేర్కొన్న మూడు రాష్ట్రాలలో దేనినైనా పరిపాలిస్తున్నప్పుడు, పేదలు మరియు అణగారిన వర్గాలే లక్ష్యంగా వాగ్దానాలు చేసి వారి ద్వారా ప్రభుత్వంలోకి వచ్చాక వారిని గాలికొదిలేశారు అందుకే అంతరించిపోతున్నారనే చెప్పాలి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ పాలనలో తమ విరోధులు, రాజకీయ ప్రత్యర్థులపై క్రూరత్వంతో సామూహిక హత్యలకు అనేక మార్లు పాల్పడ్డారు. చైనా యొక్క మావో జెడాంగ్ ఇప్పటి వరకు అత్యంత క్రూరమైన పాలకుడిగా ఖ్యాతిని కలిగి ఉన్నాడు, అతని పాలనలో అత్యధిక సంఖ్యలో 60 లక్షల ప్రజలను చంపాడు. అతని తర్వాత 40 లక్షల ప్రజలను చంపిన జోసెఫ్ స్టాలిన్ ఉన్నారు. నియంత హిట్లర్ ఈ ఇద్దరు (మావో జెడాంగ్, జోసెఫ్ స్టాలిన్) క్రూరమైన కమ్యూనిస్ట్ పాలకుల తర్వాత 30 లక్షల మంది ప్రజలను చంపి మూడవ స్థానంలో నిలిచాడు. అందువల్ల, భారతదేశంలోని కమ్యూనిస్టులు వారి విదేశీ గురువుల బాటలోనే ప్రయాణించారనడంలో ఆశ్చర్యం లేదు.
కమ్యూనిస్ట్ క్రూరత్వం యొక్క అతిపెద్ద, అత్యంత భయంకరమైన మారణకాండ 1979 జనవరి 24 నుండి జనవరి 31 వరకు పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌లోని మరీచ్‌జాపి దీవులలో పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్ ఫ్రంట్ అధికారం చేపట్టిన రెండు సంవత్సరాల తరువాత జరిగింది. ఇది బెంగాల్ చరిత్రలో, స్వాతంత్య్రానంతర చరిత్రలో అతిపెద్ద మారణహోమానికి దారితీసింది. ఇప్పుడు మనం తెలుకోబోయేది కుటిల కమ్యూనిస్టుల మోసం మరియు నయవంచన..
1971లో బంగ్లాదేశ్ నుండి వచ్చిన పేద దళిత హిందూ శరణార్థులు సుందర్‌బన్స్‌లోని మరీచ్‌జాపి అనే చిన్న ద్వీపంలో స్థిరపడ్డారు. 1979 జనవరి 26న ద్వీపం యొక్క దిగ్బంధనం ప్రారంభమైంది. జనవరి 31, 1979న మూడు వేల మందికి పైగా హత్య చేయబడ్డారు. ఈ మారణకాండ చేసింది 20 ఏళ్ళ పాటు పశ్చిమ బెంగాల్ ని పరిపాలిచిన వ్యక్తి ఆయనెవరో కాదు సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జ్యోతి బసు నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం. దళిత హిందువులపై ప్రభుత్వం ప్రాయోజిత హత్యాకాండ చేసింది. అలాగే ఈ మారణహోమ వార్తలను బయటకు రాకుండా సంవత్సరాల తరబడి అణచివేయడంలో విజయం సాధించింది.
1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం (అప్పట్లో తూర్పు పాకిస్తాన్ అని పిలుస్తారు), శరణార్థులు బంగ్లాదేశ్ నుండి భారత్ వైపు పయనానికి దారితీసింది. ఇస్లామిస్టులతో కుమ్మక్కై పాకిస్తాన్ సైన్యం చేసిన హింస నుండి చాలా మంది శరణార్థులు భారత్ వైపు పారిపోయి వచ్చారు. పారిపోయి వచ్చిన ధనవంతులకి బెంగాల్లో ఆదరణ లభించింది కానీ పేదలు, దళిత హిందువుల కి మాత్రం బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ సైన్యం హింస మరియు పేదరికం రెంటిని ఎదుర్కోవలసి వచ్చింది.
సుమారు 40,000 మంది దళిత హిందూ శరణార్థులు పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్‌లోని ఒక చిన్న ద్వీపమైన మరీచ్‌జాపికి తరలివచ్చారు. తరువాత వారు స్వయం సమృద్ధి సాధించారు, ప్రధానంగా చేపలు పట్టడం వృత్తిగా, వ్యవసాయంలో కూడా నిమగ్నమై ఉన్నారు. తమ పిల్లలకు విద్యను ఇవ్వగలిగారు. కమ్యూనిస్ట్ పార్టీ సహాయం, మద్దతు వలన సుందర బన్స్ వనాలకి ‘నేతాజీ నగర్’ అని పేరు కూడా పెట్టారు. పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్ట్ ఉద్యమం ఊపందుకుంది మరియు పేద శరణార్థులు వారిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. 1977 జూన్‌లో బెంగాల్ రాష్ట్రంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రాగానే పేద శరణార్థులు కమ్యూనిస్టులు వాగ్దానం చేసినట్లుగా తమకు మంచి జీవితం లభిస్తుందని నమ్మబలికారు. కానీ వారి కోరిక నెరవేరకపోగా మారణహోమానికి బలయ్యారు. అధికారం పొందిన ఏడాదిన్నర తర్వాత, కమ్యూనిస్టులు మరీచ్‌జాపికి చెందిన ఈ హిందూ శరణార్థులను రాష్ట్రానికి భారంగా భావించి, వారిని జాతీయ సమస్యగా ప్రకటించి ఈ హిందూ శరణార్థులను భారతదేశం అంతటా చెదరగొట్టాలనుకొన్నది జ్యోతిబసు ప్రభుత్వం.
జనవరి 24, 1979న, మరీచ్‌జాపి ద్వీపానికి నిషేధ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ముప్పై పోలీసు లాంచీలు (మోటార్‌బోట్‌లు) ద్వీపంలో పెట్రోలింగ్ ప్రారంభించాయి, పేద దళిత హిందూ శరణార్థులు ద్వీపం వదిలి వెళ్ళకుండా నిరోధించారు. ఎక్కువగా చేపలు పట్టే శరణార్థులు బయటికి వెళ్ళారు. పోలీసులు పిల్లలను కూడా విడిచి పెట్టలేదు. ఐదు, పన్నెండేళ్ల మధ్య వయస్సు గల పదిహేను మంది పాఠశాల పిల్లలపైకి బయోనెట్‌లు విసిరారు వారి తలలు పగిలిపోయాయి. మరికొంతమంది పిల్లలు తమ పాఠశాల అయిన గడ్డి గుడిసెలో ఆశ్రయం పొందారు. పిల్లలు మరుసటి రోజు జరుపుకోవాల్సిన సరస్వతీ పూజకు ఏర్పాట్లు చేసుకున్నారు, పోలీసులు సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అతి కిరాతకంగా మహిళలను హింసించారు, ఎంతోమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు, మరికొంతమంది చెల్లాచెదురయ్యారు.
శరణార్థులపై బాష్పవాయువు ప్రయోగించారు, వారి గుడిసెలు, మత్స్య సంపద ధ్వంసమయ్యాయి. తాత్కాలిక పడవల్లో నది దాటేందుకు ప్రయత్నించిన వారిపై కాల్పులు జరిపారు. శరణార్థులు, వడ్రంగి పనిముట్లు మరియు తాత్కాలిక విల్లులు మరియు బాణాలతో పోరాడినప్పటికీ, ప్రభుత్వ దళాలకు సరిపోలలేదు. అంచనా ప్రకారం చనిపోయిన అనేక వందల మంది పురుషులు, మహిళలు మరియు పిల్లలు ఆకలితో మరణించారు లేదా కాల్చి చంపబడ్డారు, మృతదేహాలను రాయమంగల్ నదిలో విసిరారు. మరీచ్‌జాపి జర్నలిస్టులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, పోలీసు దౌర్జన్యాలపై విచారణకు వచ్చిన పార్లమెంటరీ కమిటీ కూడా అటవీ శాఖ అధికారుల చేతుల్లో వేధింపులను ఎదుర్కొన్నారు.
అంచనాల ప్రకారం సుమారు 3000 మంది మరణించారు. అధికారిక రికార్డుల ప్రకారం మృతుల సంఖ్య 10గా ఉంది. 2019లో, జర్నలిస్ట్ దీప్ హాల్డర్ 1979లో కమ్యూనిస్ట్ భుత్వంను ఎదుర్కొన్న శరణార్థుల బాధలను డాక్యుమెంట్ చేసి, తన పుస్తకాన్ని ప్రచురించాడు "బ్లడ్ ఐలాండ్: యాన్ ఓరల్ హిస్టరీ ఆఫ్ ది మారిచ్‌జాపి మాసాకేర్".
చదివారుగా మిత్రులారా ఈ కపటమోసగాళ్ళయిన కమ్యునిష్ట్ లు ఇలా మొదట నమ్మబలికి పేదలను దగ్గరకు తీసి అదే పేదలను తిండికి లేకుండా చేసి మారణ హోమం సృష్టిస్తారు, ఇది ఇప్పటిది కాదు ఎప్పటి నుండో సాగుతుంది మొదట్లో చెప్పినట్లు స్టాలిన్ ప్రాయోజిత కరువు ద్వారా సుమారు కోటి మంది ని చంపాడు. ఇప్పటికైన ఈ కమ్యునిష్ట్ లను ఆదరించకుండా ఉండటం ఉత్తమం... జై హింద్. -రాజశేఖర్ నన్నపనేని.
No comments