Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఛత్రపతి శివాజీ మహా రాజ్ 350 వ పట్టాభిషేకం - చరిత్ర నేర్పిన పాఠాలు - శివాజీ పోరాట వ్యూహం

ఛత్రపతి శివాజీ మహా రాజ్ 350 వ పట్టాభిషేకం ప్రత్యేక వ్యాసం: చరిత్ర గతిని మార్చిన - హైందవీ స్వరాజ్యలక్ష్యం:  శివాజీ హిందూ పద పాదు షాహిగా పట్టా...

hindu samrajya diwas


ఛత్రపతి శివాజీ మహా రాజ్ 350 వ పట్టాభిషేకం ప్రత్యేక వ్యాసం:

చరిత్ర గతిని మార్చిన - హైందవీ స్వరాజ్యలక్ష్యం: శివాజీ హిందూ పద పాదు షాహిగా పట్టాభిషేకం జరిగి 349 సంవత్సరాలు గడిచి 350 వ సంవత్సరం లో ప్రవేశిస్తున్నది, సందర్భం ఈ రోజుకి హిందూ సమాజానికి ఎంతోప్రేరణ కలిగిస్తున్నది. ఆవిషయాలు  మనకు తెలిసినప్పటికీ ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆ నేపథ్యం లో ఈ  ప్రత్యేక వ్యాసం.

భారతదేశం మీద క్రీస్తుకు పూర్వం నుండే విదేశీయుల దాడులు అనేకం జరుగుతుండేవి. అట్లా దాడి  చేసిన వారిలో  గ్రీకులు, హుణులు, కుషాణులు, శకులు పార్థియన్లు సిథియన్లు, పహ్లవులు, క్షాత్రవులు  మొదలైనవారుఉన్నారు. కాలక్రమంలో గ్రీకులు మినహా మిగిలిన వాళ్లు అందరూ  ఇక్కడే  మన  సంస్కృతిలో  పూర్తిగా కలిసిపోయారు. ప్రపంచంలో రాజకీయ అధికారం కోసం క్రూసేడ్ దాడులు జరిగాయి, మతయుద్ధాలు జరిగాయి, ధర్మరక్షణకు భారత దేశంలో మినహా ఎక్కడ యుద్ధాలు జరగలేదు. ముస్లింల కంటే ముందు దాడులు చేసిన వారికి ముస్లిం దాడులకు ఒక తేడా ఉంది. ముస్లింల కంటే ముందు దాడులు చేసిన వారు కేవలం రాజ్యాలు ఆక్రమించుకుని పరిపాలన చేశారు, కానీ ఇస్లాం రాజ్యాలను ఆక్రమించి పాలించటమే కాదు ఇక్కడ దేవాలయాలను ధ్వంసం చేయటం, ప్రజలను ఇస్లాం మతం లోకి మార్చడం స్త్రీలను ఎత్తుకుపోవటం సంపదలు దోచుకోవటం వంటి అనేక దుర్మార్గాలు జరిగేవి, దానితో దేశం ఇస్లాం పాలనలోకి వెళ్ళటమే కాకుండా దేశంలో ఇస్లాం జనాభాపెరిగి ఇస్లాం ఆధిపత్యం  స్థిరపడింది.

ఇస్లాం సామ్రాజ్య వాదుల దాడుల నేపథ్యం: ఇస్లాం మతం పుట్టిన తర్వాత ప్రపంచం మొత్తాన్ని ఇస్లామీకరణ చేయటానికి భయంకరమైన యుద్ధాలు జరిగాయి. 8వ శతాబ్దం నుండి ఇస్లాం దాడులు  మన దేశంపైన కూడా  ప్రారంభమైనాయి. ప్రారంభంలో గజనీ మహమ్మద్ సింధు రాజ్యంపై దాడి చేశాడు, పఠానులు  పంజాబ్ పై దాడి చేశారు. 11వ శతాబ్దంలో ఉత్తర భారతంలో ఎక్కువ భాగం ఇస్లాం ఆక్రమణ లోకి వెళ్ళిపోయింది. 13వ శతాబ్దం చివరిలో దక్షిణ భారతం మహ్మదీయ ముష్కరుల దండయాత్రలకు గురి అయింది. ఆ సమయంలో దక్షిణ భారతంలోని వివేక హీనులైన  హిందూ రాజుల పరస్పర కలహాల కారణంగా ముస్లింలకు విజయం సునాయాసమైపోయింది. ఆ రోజుల్లో దక్షిణాపథం లో ఆరు శక్తివంతమైన హిందూ రాజ్యాలు  ఉండేవి.  అందులో 1) దేవగిరి యాదవ రాజ్యం 2) ఓరుగల్లులో  కాకతీయ రాజ్యం 3) హొయసల రాజ్యం 4) మధురలో పాండ్య రాజ్యం 5) కంపిలి  రాజ్యం 6)విజయనగర సామ్రాజ్యం. ఢిల్లీలోని ఖిల్జీ సైన్యాధిపతి  1293 దేవగిరి పై దాడి చేసి ధ్వంసంచేసాడు, 1309 నుండిమాలిక్ కాఫర్ నాయకత్వంలో ఓరుగల్లు రాజ్యం పైన దాడి ప్రారంభమైనది 1323 సంవత్సరంలో ఓరుగల్లు రాజ్యం పూర్తిగా ధ్వంసమైంది, మళ్లీ తిరిగి ఆ రాజ్యం ఎప్పుడూ కోలు కోలేదు. 1311 లో ద్వారా సముద్రం ముస్లిం ల చేతులలోకి వెళ్ళిపోయింది  1310లో మధురలోనిపాండ్య రాజ్యం పతనమైనది  అక్కడ నుండి రామేశ్వరం వరకు ముస్లింల జైత్ర  యాత్ర కొనసాగింది .  1327 కంపిలి  రాజ్యం ధ్వంసం అయింది.  ధర్మ సంరక్షణకు1336 లో హంపీ  లో ఏర్పడిన విజయనగర సామ్రాజ్యం 1646 లో  పడిపోయింది  ఇట్లా  దక్షిణాపథం లోని శక్తివంతమైన  హిందూ  రాజ్యాలు పతనమైనాయి.ఈ పరిస్థితుల్లో దక్షిణాపథం లో  ఒక శక్తివంతమైన  హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించవలసిన ఒక చారిత్రక  ఆవశ్యకత ఏర్పడింది.  ఆ ఆవశ్యకతను పూరించటానికా అన్నట్లు  శివాజీ 1630 సంవత్సరం ఫిబ్రవరి 19 న అంటే శాలివాహన శకం 1551 శుక్ల నామ సంవత్సరం ఫాల్గుణ  మాసంలో జీజియాబాయి ,శహాజీ   దంపతులకు శివనేరి దుర్గం లో జన్మించాడు.శివాజీ జన్మించిన15 సంవత్సరాలకు  300 సంవత్సరాల పాటు నిరంతరం కొనసాగిన విజయనగర సామ్రాజ్యం పడిపోయింది.

14 సంవత్సరాల వయస్సులో శివాజీ ధర్మ సంరక్షణకు పోరాటం చేయటం పారంభించాడు, అప్పటివరకు హిమాలయాల నుండి హిందూ మహాసముద్రం వరకు ఇస్లాం రాజులతో జరిగిన యుద్ధాలలో హిందూరాజులు అనేక కారణాలతో పరాజయాల పాలైనారు. దానికి   సాక్ష్యం గా రాజదాహిర్ ,జయపాలుడు ,అనంగపాలుడు ,పృథ్వీరాజు ,సిక్రి ,దేవగిరి ,తల్లికోట చరిత్రలో మనకు కనబడతాయి. శాపగ్రస్తమైన భారత చరిత్రను విజయాలవైపు మళ్లించటానికా అన్నట్లు శివాజీపోరాటంప్రారంభమైనది.  అప్పటినుండి  హిందూ పతాకం చంద్రవంక ముందు ఎప్పుడు  అవనతం కాలేదు.

శివాజీ స్వరాజ్య ఉద్యమానికి స్ఫూర్తి:

1)విజయనగర సామ్రాజ్యం 2) మైసూరు రాజైన  కంఠీరవ నర్సరాజు. 

విజయనగర సామ్రాజ్యం ధర్మం, సంస్కృతి , కళలు సాహిత్యం,  ఆర్థికంగా,  సంపద కలిగి దేశంలో ప్రపంచంలో  ప్రసిద్ధి పొందింది. ఈ విషయాలు పాశ్చాత్య చరిత్రకారులు  కూడా తమ గ్రంధాలలో వ్రాసుకున్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా హిందువులు అటువంటి వైభవ స్థితినిసాధించగలరని విజయనగర సామ్రాజ్యం నిరూపించింది. హైందవీ  స్వాతంత్రానికి విజయనగర సామ్రాజ్యం  ఒక రాజ బాటని చెప్పవచ్చు.  అదే శివాజీకి  ప్రేరణ కలిగించింది.

బీజాపూర్ సుల్తాన్లు కంఠీరవనరసరాజు ను జయించాలని అనేక సార్లు ప్రయత్నించారు  కానీ  జయించలేకపోయారు.  ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలతో కంఠీరవ నరసరాజుబీజపూర్ సుల్తాలను కట్టడి చేశాడు. అదే శివాజీకి పోరాట ఎత్తుగడలను నేర్పించింది. అట్లాగే కంఠీరవ నరసరాజు స్వతంత్ర పాలనా వ్యవస్థను   పటిష్టంగా ఏర్పాటు చేసాడు ,  ఆ పాలన వ్యవస్థ కూడా శివాజీకి స్ఫూర్తినిచ్చింది.

చరిత్ర నేర్పిన పాఠాలు - శివాజీ పోరాట వ్యూహం: శివాజీ కి ముందు రాజస్థాన్ ప్రాంతంలో రాజపుత్రులు  అందులో ముఖ్యంగా రాణాప్రతాప్ పోరాట పటిమ ,  యుద్ధవ్యూహాలు దేశానికి ఒక ప్రేరణ,  మరియు ఒక గుణపాఠం.హల్దీఘాటీ యుద్ధం తరువాత  రాణాప్రతాప్ తన  రణనీతిని మార్చుకొని  తాను కోల్పోయిన ఒక కోటమినహ  మిగిలిన కోటలన్నిటిని తిరిగిస్వాధీనం చేసుకున్నాడు.  హల్దీ ఘాటి యుద్ధం తర్వాత అక్బర్ సైన్యం  కూడా రాణా ప్రతాప్ తో ఎప్పుడు  ప్రత్యక్ష యుద్ధానికి దిగలేదు.  అట్లాగే పంజాబ్ లో గురు గోవింద్ సింగ్ యుద్ధాలు,  బందాబైరాగి బలిదానం,  అన్ని ఈ దేశానికి ఒక పెద్ద గుణపాఠం,  అట్లాగే 1336 నుండి 1646 వరకు సనాతన ధర్మం ఆధారంగా వైభవోపేతంగా ఒక వెలుగు వెలిగిన విజయనగర సామ్రాజ్యం  1646 లో  చరిత్రపుటలలోకి వెళ్లి పోయింది.శివాజీ ఈ మూడు సామ్రాజ్యాలనుండి అనేక విషయాలు నేర్చుకున్నాడు,  ఆ పాఠం యొక్క సారాంశం శత్రువుతో ముఖాముఖి యుద్ధం నివారించడం,  శత్రువుపై అదను చూసి  దాడి చేయడం.హిందూ ధర్మ రక్షణకు దేశ చరిత్రలో గతం లో ఎవ్వరు ఇవ్వని'' హైందవీ స్వరాజ్య''లక్ష్యం శివాజీ   తన సైన్యం ముందు ప్రజల ముందు ఉంచాడు, ఆ లక్ష్యం సుమారు 100 సంవత్సరాల పాటు మహారాష్ట్ర ప్రజల యొక్క జీవిత లక్ష్యాముగా మారి  ఎంతో   ప్రేరణ కలిగించింది.

సవాళ్లకు దీటుగా సమాధానం చెప్పిన శివాజీ: శివాజీ జన్మించే నాటి కే ఢిల్లీలో 145 సంవత్సరాలుగా  మొగల్ సామ్రాజ్యం  కోనసాగుతున్నది.  అప్పటికే డక్కన్ లో శక్తి వంతంగా ఉన్న   బహమనీ రాజ్యం మూడు ముక్కలైంది. 1) అహ్మద్ నగర్ నిజాంషాహి2) గోల్కొండ కుతుబ్షాహీ 3) బీజపూర్ ఆదిల్షాహీ ల చేతులలోకి వెళ్లిపోయాయి. ఆ సమయంలో మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి బీజాపూర్ సుల్తాన్ లతో పాటు  మొగలలు  కూడా యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు.ఆధిపత్య పోరు సాగుతూ ఉండేది.దానితో   శివాజీ జీవితకాలమంతా ముగ్గురు శత్రువులను దీటుగా  ఎదుర్కొవలసి వచ్చింది . 1) మొగలులు 2) కుతుబ్షాహీలు 3) ఆదిల్షాహీలు. మహ్మదీయ పాలకులు వాళ్ళు బీజాపూర్ వాళ్ళు కావచ్చు, మొగలులు కావచ్చు వాళ్ళ  లక్ష్యం కేవలం ఈ దేశం పైన రాజకీయ సార్వభౌమత్వం సాధించటం మాత్రమే కాదు ఈ దేశాన్ని ఇస్లాం సంఖ్యాధిక్య  దేశంగా నిర్మాణం చేయటం,  దానికోసం హిందూ సంస్కృతిని,  హిందూ పరంపరలను కూకటి వేళ్లతో పెకలించి  హిందూ స్వాభిమానం  పైన దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు నిరంతరం సాగుతూఉండేవి.  ఇటువంటి పరిస్థితుల్లో హిందూ సంస్కృతిని రక్షిస్తూ హిందువులలో స్వాభిమానం నిర్మాణం చేయటానికా అన్నట్లు శివాజీ ,సమర్ధరామదాసస్వామి పనిచేసారు. 

ఔరంగజేబు శివాజీని కట్టడి చేయడానికి జయసింగ్ ని పంపాడు శివాజీ  జయసింగ్ కు  ఒక ఉత్తరం రాశాడు.  దానిలో నీవు నేను కలిస్తే భారతదేశం ఇస్లాం పాలన నుండి స్వరాజ్యం సంపాదించుకుంటుంది అట్లా కలిస్తే నీ గుర్రపు కళ్లన్నిఒక త్రాటిమీద నడిపించడానికి నీకు నేను  సహకరిస్తానని చెప్పాడు. కానీ జయసింగ్ అంగీకరించలేదు. జయసింగ్ తో  యుద్ధం చేయవద్దని నిర్ణయించుకొన్న శివాజీ.జయసింగ్ తో సంధి చేసుకొన్నాడు    ఔరంగాజేబుకు దక్షిణాన ఉన్న బీజపూర్ రాజ్యం కొరుకుడు పడని స్థితి దానికి తోడు బీజపూర్ ఆదిల్ షాహి గోల్కొండ కుతుబ్షాహీ  ఇద్దరు కలిశారు.  ఈ సమయంలోతమకు కుదిరిన ఒప్పందం ప్రకారం బీజపూర్ పైన మొగలు సైన్యం చేస్తున్న యుద్ధం లోశివాజీ  సహకరించాడు   కానీ ఆ యుద్ధం లో మొగలు గెలవలేదు. శివాజీ దగ్గర గుర్రపు దళ   అధికారిగా ఉన్న  నేతాజీ పాల్కర్ అదుల్ షాహి కొలువులో చేరిపోయాడనే  సమాచారం తెలిసిన జయసింగ్ కు అనిపించింది ఒకవేళ శివాజీ బీజాపూర్ సుల్తాన్ లతో కలిస్తే  మొగలాయులకు దక్షిణాదిలో  పుట్టగతులు ఉండవు.  అందుకే శివాజీని తనకు అనుకూలంగా మార్చుకోవాలనే  ఎత్తుగడలో ఢిల్లీకి ఆహ్వానించమని ఔరంగజేబుకు సూచించాడు.  శివాజీ ఢిల్లీకి వెళ్ళటం శివాజీని నిర్బంధించి దాడి చేయాలని పథకం తయారు చేసిన ఔరంగజేబుకు గుణపాఠం చెప్పి శివాజీ సమయస్ఫూర్తితో అక్కడి నుండి తప్పించుకుని తన కోటకు చేరుకున్నాడు. ఆ తదుపరి కొంతకాలం తర్వాత శివాజీ హిందూ -పద -  పాద షాహీ గ  పట్టాభిషిక్తుడైనాడు.

హిందూపద పాద షాహీ గ పట్టాభిషక్తుడైన శివాజీ: శివాజీ శాలివాహన శకం 1596 ఆనంద నామ సంవత్సరం జేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం నాడు అంటే సాధారణ శకం 1674 సంవత్సరం జూన్ 6న రాయుఘడ్ లో చత్రపతి శివాజీ మహారాజ్ సార్వభౌముడిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. శివాజీ పట్టాభిషేకంతో రాజకీయంగా హిందూ రాజ్య ప్రతిష్టాపన జరిగిందని దేశమంతా గర్వించింది .శివాజీ ఇక మొగలాయి సేవకుడు కాదని అందరూ గుర్తించారు.  శివాజీ రాజ్యం ఎల్లలు ఆ సమయానికి  గోల్కొండ , బీజాపూర్ లను ఒరుసుకొని  వ్యాపించి ఉంది.  శివాజీ తన సామ్రాజ్య ప్రభావాన్ని పెంచుకోవడానికి కర్ణాటకను తన రాజ్యంలో  కలుపుకోవాలని లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభించినాడు దానికోసం  దక్షిణాన మొగలుల గవర్నర్ గా ఉన్న బహదూర్ ఖాన్ ను తటస్థంగా ఉంచేందుకు   తన ప్రముఖ న్యాయాధిశుడు  నీరజ్ రావుని పంపి బహుమతులు అందచేసాడు.  ఆ తదుప రి 1677లో శివాజీ గోల్కొండకు వచ్చాడు .  గోల్కొండలో కొద్ది రోజులు ఉండి అర్ధబలం,   అంగ బలం  సమకూర్చుకొని  దక్షిణాన తన యాత్ర ప్రారంభించాడు.  దానిలో భాగంగా కర్నూలు ముట్టడించి  దానిని లోబరుచుకుని కృష్ణా నది దాటి శ్రీశైలం వెళ్ళాడు.  నెల్లూరు మీద దాడి చేశాడు,  దక్షిణ  కర్నాటక లోని బీజపూర్ స్థావరాలను రక్షిస్తున్న షేర్ ఖాన్ పై దాడికి దిగడం తో  షేర్ ఖాన్ శివాజీ తో సంధి చేసుకొన్నాడు ,  మధుర నాయకులు శివాజీ ఆధిపత్యాన్ని అంగీకరించారు.  అట్లా కర్ణాటక తమిళనాడులో తన ప్రభావాన్ని చూపించి  తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు.

దేశంలో ఇస్లాం సామ్రాజ్యం కుప్పకూల్చటానికి  ప్రేరణ హైందవీ స్వరాజ్: శివాజీ బ్రతికుండగా ఔరంగజేబు దక్షిణాపథం  వైపు యుద్ధాలకు దిగలేదు.  1680లో శివాజీ ఇహ లోకాన్ని వదిలాడు. ఆతదుపరి  దక్షిణాపథం పైన పూర్తిగా తన ఆధిపత్యం సంపాదించుకోవాలని 1681లో నర్మదా నదిని దాటి దక్షిణాపథం పైపు సాగాడు.   శివాజీకి ఆతిథ్యం ఇచ్చాడని గోల్కొండ రాజ్యాన్ని సర్వనాశనం చేసేందుకు 1687 లో గోల్కొండ కోట  పై దాడి చేశాడు, శివాజీ   మరణించిన తరువాతే ఆ దాడి చేయడం జరిగింది.  1681 నుండి  1707 వరకు అంటే 26 సంవత్సరాలు ఢిల్లీ ముఖం చూడలేదు.  హైందవీ స్వరాజ్య సైన్యం తరుముతూ ఉంటే వెన్ను చూపి పారిపోతూ పారిపోతూ 1707 లోఇప్పటి శంభాజీ నగర్ లో చనిపోయాడు , అతని శవాన్నిఅక్కడే పూడ్చిపెట్టారు. అదే దేశంలో ఇస్లాం సామ్రాజ్యం కుప్పకూలటానికి దారితీసింది.

చారిత్రక తప్పిదాలను సరి చేసుకోవాలి: మహమ్మదీయుల దాడుల సమయంలో దక్షిణాపథం లో  ఉన్న కాకతీయ సామ్రాజ్యం,  విజయనగర సామ్రాజ్యం,  శివాజీ సామ్రాజ్యం ఈ మూడింటిని కలిపి అధ్యయనం చేయవలసిన అవసరం నేడు ఉన్నది , ఎందుకంటే సనాతన ధర్మ సంరక్షణకు ఈ మూడు సామ్రాజ్యాలు తీవ్ర ప్రయత్నం చేసాయి అట్లాగే ఈ మూడు సామ్రాజ్యాల యొక్క పాలన  కూడా మన శాస్త్రాలలో చెప్పినట్టుగా సాగింది .  సనాతన ధర్మ రక్షణతో రాజ్య వ్యవస్థను నిర్మాణం చేశారు ప్రజలను రంజిపచేసే విధంగా పరిపాలన కూడా  సాగించారు.  దేశమంతా ఇస్లాం సామ్రాజ్య పదఘట్టనల  కింద నలుగుతుంటే దక్షిణాపథంలో ఈ మూడు సామ్రాజ్యాలు ఒక వెలుగు వెలిగాయి.

సనాతన ధర్మం పాటించేవారు హిందువులు,  హిందువులలో  స్వాభిమానం  నిర్మాణం చేయవలసిన ఒక చారిత్రక ఆవశ్యకత ఏర్పడింది.  ఒకరి తర్వాత ఒకరు ఆ పనిని చేసుకుంటూ వచ్చారు.  చివరకు శివాజీ నాటికి హైందవి స్వరాజ్ లక్ష్యంగా మారింది.  ఆ సమయంలో ఆర్థిక శక్తి ధార్మిక శక్తి కళలు  సాహిత్యం ఉన్నత శిఖరాలకు తీసుకుని పోవడం జరిగింది. అది దేశమంతటికి ప్రేరణ కలిగించింది.

దేశం  ఇస్లాం సామ్రాజ్యంతో భయంకరమైన పోరాటం చేసింది కానీ మన దూర దృష్టి లోపించిన కారణంగా దేశానికీ క్రొత్త సమస్యను కొనితెచ్చుకొన్నాం.  దేశంలో ఇస్లాం సామ్రాజ్యాలు కుప్ప  కూలిపోయిన దేశంపై ఇస్లాం ఆధిపత్యం సాగిపోతున్నది.  ఈరోజుకు కొనసాగుతున్నది.  దానికి ప్రధాన కారణం మతం మార్పిడులు.మతం మారిన  వారిని వెనుకకు  తీసుకుని రావడానికి చేయవలసిన ప్రయత్నాలు చేయకపోవడం ఒక భయంకరమైన చారిత్రక తప్పిదం..  దేశంలోని సామాజిక నాయకత్వం ధార్మిక నాయకత్వం ఆ పని చేయలేకపోయింది.  దాని పర్యవసానం  దేశ స్వతంత్ర పోరాటం సమయంలో ఇస్లాం పేరుతో స్వతంత్ర దేశం ఏర్పాటు కావడం మన కండ్ల ముందు కనపడింది.  అరకంగా దేశమంతా తమఆధిపత్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.  ఈ దేశం ఒక తిరుగులేని శక్తిగా రూపొందాలంటే మతం మార్పిడులను  అరికట్టాలి,  మారిన వారిని వెనుక తీసుకొచ్చే ప్రయత్నం చేయటం ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి మనందరి కర్తవ్యం.  ఆ కర్తవ్యం నెరవేరినప్పుడే భారతదేశం శక్తివంతంగా ప్రపంచమంతటికి మార్గదర్శనం చేయగలుగుతుంది.  శివాజీ జీవితంలో ఈ విషయం కూడా మనకు రేఖామాత్రంగా కనపడుతుంది అట్లా శివాజీ హిందూ సామ్రాజ్య నిర్మాణం ఒక నిరంతర ప్రేరణ.

అదే ప్రేరణతో  స్వాతంత్ర పోరాట సమయంలో 1925 సంవత్సరంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభించబడింది, సంఘ  నిర్మాత డాక్టర్ జి '' హిందూ సంఘటన'' లక్ష్యంగా సమాజం ముందు ఉంచారు.  98 సంవత్సరాలుగా ఆ  లక్ష్యంతో దేశవ్యాప్తంగా పని నడుస్తున్నది వ్యవస్థ కూడా నిర్మాణంచేస్తున్నది.

Source: Jargiti Weekly


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments