ఈ భూమి మనకు తల్లి: మాతా భూమి: పుత్రోహం పృధివ్యా: (ఈ భూమి మనకు తల్లి, మనమంతా ఆమె సంతానం) అని వేదాలు ఘోషిస్తున్నాయి. మనదేశంలో కొంతమంది ప్రఖ...
ఈ రాళ్లు, మట్టి తో కూడి ఉన్న ఈ భూమి పట్ల మాతృభావన అనేది ఎలా వికసించింది? ఎటువంటి జడచేతనమైన పదార్థాల కైనా ఆది అంతం అనేవి ఉంటాయి. వాటి పరిణామ క్రమానికి కారణమైన పోషిణను అందించే వారి పట్ల మాతృత్వ భావన అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకి పాము, కప్ప వంటి జీవులకు ఇటువంటి భావన ఉండదు. వాటి సంతానం పట్ల ఇటువంటి మమకారము ఉండదు. పక్షి తన పిల్లలను ఎగర గలిగేవరకు సంరక్షిస్తుంది. ఎప్పుడైతే పక్షిపిల్ల స్వతంత్రంగా ఎగరగలుగుతుందో అప్పుడు అది తన తల్లి నుంచి తెలియకుండానే విడిపోతుంది. అలా సృష్టి క్రమంలో పిండం ద్వారా జన్మించిన మానవులకు తల్లిపాల ద్వారా పోషణ చేకూరుతుంది. ఈ జీవ పరిణామ క్రమంలో మానవుడే చరమాంకంలో ఉన్నాడు. అతను సంస్కారవంతుడైతే తల్లి పట్ల తనకున్న గౌరవాన్ని పూజ్య భావనను ఎప్పుడు ప్రకటిస్తూనే ఉంటాడు.
మనిషి యొక్క వ్యక్తిత్వం వికసించే కొద్దీ ఈ మాతృభావన ఉదాత్తమై మహోన్నతమైన రూపాన్ని సంతరించుకుంటుంది. బుద్ధిపూర్వకముగా చుట్టూ ఉన్న లోకాన్ని మనం గమనించినప్పుడు మనకి అన్ని ఇచ్చిన ఈ ప్రకృతికి జీవితాంతం ఋణపడి ఉన్నాము. దానిని కూడా మనం తల్లి స్వరూపం గానే చూస్తున్నాము. నదులు మనకు కావాల్సిన నీటిని, తద్వారా పంటలు పండడానికి సహకరిస్తున్నాయి కాబట్టి వాటిని తల్లిగా భావిస్తున్నాము. మనిషి తల్లిపాలు తాగే స్థాయి నుంచి ఎదిగినప్పుడు గోవులు అతనిని పోషిస్తున్నాయి కాబట్టి గోమాత అన్నాము. అలా మానవుని యొక్క ఆలోచన మరియు జ్ఞానము ఉచ్ఛ స్థితికి చేరినప్పుడు ఈ భూమి అంతా తల్లిగానే కనిపిస్తుంది. మనల్ని కని, భరించి, పోషించి, చివరకు మరణం తర్వాత కూడా తన గుండెలలో స్థానాన్ని ఇస్తుంది. కాబట్టి భూమాత సర్వ శ్రేష్టమైనదని తెలుస్తున్నది. ఇలా మనకు జన్మనిచ్చిన భూమిని తల్లిగా భావించడం మానవుని పరిణామ క్రమంలో ఉత్కృష్టమైన లక్షణం.
(ప్రఖరమైన మాతృభక్తి నరనరాన ఉప్పొంగే
నిదురించిన సమాజమున చైతన్యము కలిగించే)
No comments