Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సామర్థ్యమే పుణ్యం, దౌర్భల్యమే పాపం

సామర్థ్యమే పుణ్యం, దౌర్భల్యమే పాపం:  ఎట్టి పరిస్థితుల్లో బలహీనులు కష్టాలు అనుభవించవలసిందే. వారిని ఎవరు రక్షించలేరు. దుర్భలురుగా ఉండడం ప్రపంచ...

megaminds


సామర్థ్యమే పుణ్యం, దౌర్భల్యమే పాపం: ఎట్టి పరిస్థితుల్లో బలహీనులు కష్టాలు అనుభవించవలసిందే. వారిని ఎవరు రక్షించలేరు. దుర్భలురుగా ఉండడం ప్రపంచంలో అన్నిటికంటే సహించరాని పాపము, ఎందుకంటే దీనివల్ల మన వినాశనం జరుగుతుంది పైగా ఇతరులకు హింసా ప్రవృత్తి పట్ల మక్కువ పెరుగుతుంది. మన శరీరం క్షీణించకుండా దానిని రక్షించుకోవడం కూడా ఉత్తమ ధర్మం అని పెద్దలు చెప్పారు. శారీరిక సంరక్షణకు ఏకైక ఆధారం శక్తి. ఒకసారి తీవ్ర కరువు తో లోకం బాధపడుతున్నప్పుడు విశ్వామిత్రుడికి కొన్ని రోజులపాటు ఆహారం దొరకలేదు. ఒకరోజు కాటికాపరి ఇంటిదగ్గర చనిపోయిన కుక్క ఆయనకు కనపడితే దానినే భగవంతుడికి నివేదించి భుజించాడు. ఆ కాటి కాపరి ఆశ్చర్యంతో ఓ ఋషి వర్యా! మీరు కుక్క యొక్క కాళ్ళను ఎలా తినగలిగారు? విశ్వామిత్రుడు సమాధానం ఇచ్చాడు  ఈ లోకంలో తపస్సు, సత్కర్మలు చేయడానికి నేను జీవించి ఉండటం అదేవిధంగా శక్తివంతుడిగా ఉండటం అత్యంత అవసరము.

అహింసా వాదాన్ని అపార్థం చేసుకున్న కారణంగా రాష్ట్రము యొక్క మస్తిష్కంలో వివేచన శక్తి క్షీణించిపోయింది. గత  కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో శక్తి ఉపాసనను చేయకూడని పనిగా, పాపం గా భావించి గర్హిస్తున్నారు. శక్తి  సముపర్జనను హింస గా చిత్రీకరించి మన దౌర్భాల్యాన్ని గౌరవప్రదంగా అంగీకరిస్తున్నాము.

అసలు అహింస అనే శబ్దమే హింస అనే అస్తివాచకం నుండి ఉద్భవించిన నకారాత్మక భావన అనిఒక సాధువు అన్నారు. సదరు వ్యక్తి హింసించేంతటి సమర్ధుడైనప్పటికీ, సంయమనంతో ప్రాణుల పట్ల దయచూపి హింసించకుండా ఉండటం వల్ల ఆ వ్యక్తి వరకు అహింసను పాటిస్తున్నాడు అనవచ్చు. ఒక ఆరడుగుల ఆజానుబాహుడు రహదారిపై  నడుస్తున్నాడు అనుకుందాము. అతనిని ఒక వాహనదారుడు ఢీకొన్నాడు. ఒకవేళ ఆ బలవంతుడైన వ్యక్తి అతని దగ్గరకు వచ్చి సరే! జరిగిందేదో జరిగింది. నీవల్ల జరిగిన తప్పుని నేను క్షమించి నిన్ను వదిలేస్తున్నాను అని అంటే  అప్పుడు మనం ఆ వ్యక్తి అహింసను పాటించాడు అనవచ్చు. అతను ఎదురుదాడి చేసేంత సమర్ధుడు అయినప్పటికీ  స్వయం నియంత్రణతో వాహనదారుడిని వదిలేశాడు.

అదేవిధంగా ఒక బక్క పలుచని వ్యక్తి అదే రహదారిపై వెళ్తున్నాడు అనుకుందాం, ఎవరో వెనుక నుంచి వచ్చి అతని చెవు మెలేశేసరికి, పైనుంచి కింద దాకా వణుకుతూ ఆ వ్యక్తి బాబు నన్ను క్షమించి వదిలేయండి అని అన్నాడు. ఇప్పుడు అతను అహింసను పాటిస్తున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా? అందుకే మంచివాడు బలంగా ఉండాలి,  బలవంతుడు మంచి మార్గంలో ఉండాలి.

(గుండెలో సముద్రమంత ప్రేమ, భుజాల్లొ కొండంత బలం
ఇదే మన సఫలత మంత్రం, ఇదే మన సాధన మార్గం)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment

  1. చక్కని అంశాలు...... గురూజీ భావ తరంగిణి యా???

    ReplyDelete