Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

రాష్ట్ర జీవనానికి మూలస్తంభం - సమర్థవంతమైన సమాజం

రాష్ట్ర జీవనానికి మూలస్తంభం - సమర్థవంతమైన సమాజం: ఈ మహోన్నత ప్రాచీన రాష్ట్రం యొక్క పుత్రులుగా, మన రాష్ట్రం సమృద్ధిగా, వైభవోపేతంగా, విశ్వంలో న...

samarth_bharat_megaminds


రాష్ట్ర జీవనానికి మూలస్తంభం - సమర్థవంతమైన సమాజం: ఈ మహోన్నత ప్రాచీన రాష్ట్రం యొక్క పుత్రులుగా, మన రాష్ట్రం సమృద్ధిగా, వైభవోపేతంగా, విశ్వంలో నూతనమైన కీర్తి శిఖరాలను అధిరోహించాలనేది మన స్వాభావికమైన ఆకాంక్ష. ఇది సముచితమే, దీనిని ఎవరు కాదనలేరు. కానీ ఈ సంసార సాగరంలో జీవనం ఎప్పుడూ సుగమంగా, నిర్విఘ్నంగా సాగదు. మన దేశం బాగుండాలనే మన ఆకాంక్ష న్యాయమైనది అయినప్పటికీ దాన్ని సాకారం చేసుకోవడానికి బాహ్య ప్రపంచం నుంచి ఎదురయ్యే అనేక ఇబ్బందులను విరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మన చిరకాల స్వప్నమైన రాష్ట్ర పునర్వైభవాన్ని సాకారం చేసుకోవాలి. అయితే దీనికోసం మన లక్ష్యం యొక్క స్వరూపాన్ని లోతుగా విశ్లేషించుకొని, మన సాధనాలను మూల్యాంకనం చేసుకొని మన కార్యం సఫలం అవ్వడానికి అన్ని విధాలుగా తయరీ చేసుకోవాలి.

ఈ రోజుల్లో మనం ఏదైతే రాష్ట్రం అని అంటున్నామో అది వివిధ వ్యక్తుల ద్వారా సమూహాలుగా విడిపోయింది. దేశంలోని ప్రతిచోట తమ యొక్క జెండా పాతి తమ ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం కొన్ని వర్గాలు పరస్పరం పోరాకుంటున్నారు. అనాదికాలం నుండి ప్రస్తుత సమయం వరకు ఈ రాజ్యకాంక్ష, విస్తరణ వాదం మానవుని యొక్క నిశ్చితమైన లక్షణంగా కనిపిస్తుందనేది వాస్తవము.

పూర్వకాలంలో సామ్రాజ్యవాదం ప్రబలంగా విస్తరించి, వ్యాపారంతో మొదలుపెట్టి, రాజకీయ వ్యూహాలు పన్ని దేశాలని ఆక్రమించి ఆధిపత్యం చెలాయించే దుఃస్సంస్కృతికి పునాదులు వేసింది. ఈరోజున ఈ ఆధిపత్య భావన మరింత భయానకంగా మారింది. కొన్ని దేశాలు తమ ఆర్థిక విధానాల ద్వారా ప్రపంచంలో ఆధిపత్యం చెలాయిస్తుంటే, మరికొన్ని మత సైద్ధాంతికత ఆధారంగా ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్నాయి. ఏదో ఒక రకంగా ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలనే భావన మునుపటి కంటే ప్రబలంగా ఉంది. ఒక దేశం ఇంకొక దేశాన్ని ఆక్రమించాలనుకున్నప్పుడు యుద్ధం అనివార్యమవుతుంది. అందుకే ఈ విశాలమైన ప్రపంచంలో మనం ప్రశాంతంగా బతకలేక పోతున్నాము. వాస్తవం ఏమిటంటే భవిష్యత్తులో ప్రపంచంలో ఒకటి తర్వాత ఇంకొక యుద్ధం వస్తూనే ఉంటుంది. శాంతి అనేది రెండు యుద్ధాల మధ్య ఉండే కాలం వరకే పరిమితమవుతుంది. ఈ రకంగా సంఘర్షణ అనేది మానవజాతి యొక్క ప్రకృతిగా మారిపోయింది.

మహా పురుషుడైన శ్రీకృష్ణుడు సైతం కౌరవులు పాండవులు మధ్య సమస్యను శాంతిపూర్వకంగా, న్యాయోచితంగా పరిష్కరించడానికి సర్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. యుద్ధం అనివార్యమైప్పుడు అర్జునుడితో ఇలా చెప్పాడు

కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో లోకాన్సమాహతృమిహ ప్రవృత్తః|
ఋతోపి త్వాం న భవిష్యంతి సర్వే యేవస్థితాః ప్రత్యనీకేషు యోధాః|| 
(భగవద్గీత, 11-32)


(ఈ జనులందరినీ సంహారం చేయడానికి వచ్చిన వినాశక శక్తిని నేనే. నువ్వు లేకున్నప్పటికీ పరస్పర విరోధులైన ఈ యోధులందరూ మరణించే వారే)

దీని యొక్క అర్థం ఏమిటంటే మృత్యువు మరియు వినాశనము జగత్తులో సహజంగా ఉన్నవి. మానవ జీవితంలో తెలుసుకోవలసిన పరమ సత్యం ఇది. మన సమాజం యొక్క ప్రయాణాన్ని సంఘర్షణ నుంచి సంఘటన వైపు మరలించి, సమర్థవంతంగా తయారు చేసుకోవడం ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం అనే మన కార్యం వేగవంతమవుతుంది.

(సంకటములు చీల్చుకుంటూ దారులు ఏర్పరుచుకుంటూ ముందు ముందుకేగుదాం
అసురుల పరిమార్చుకుంటూ దివ్యత్వం పెంచుకుంటూ కీర్తి శిఖరం చేరుదాం)


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments