Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సమాజమే మన ఏకైక శ్రద్ధా కేంద్రము

సమాజమే మన ఏకైక శ్రద్ధా కేంద్రము:  ఈ భూమిలో అతి ప్రాచీన కాలం నుండి రాష్ట్ర జీవనం యొక్క స్పృహ ఉన్నది. దేశం అనేది కేవలం భౌగోళిక సరిహద్దులు కలిగ...

Society is our only focus - megaminds



సమాజమే మన ఏకైక శ్రద్ధా కేంద్రము: ఈ భూమిలో అతి ప్రాచీన కాలం నుండి రాష్ట్ర జీవనం యొక్క స్పృహ ఉన్నది. దేశం అనేది కేవలం భౌగోళిక సరిహద్దులు కలిగిన భూమి. రాష్ట్రమంటే దేశము, ప్రజలు మరియు వారి సంస్కృతి. రాష్ట్రాన్ని ఒక పురుషుడిగా మనం భావన చేసినప్పుడు, రాష్ట్రానికి భూమి, శరీరము. మనసు దాని సంస్కృతి. ఆత్మ ఇక్కడ నివసించే ప్రజలు. అటువంటి రాష్ట్ర జీవనానికి కావలసిన గుణాలన్నీ ఈ భూమిలో విలసిల్లినాయి. పరిపూర్ణమైన ఈ సమాజము అనేక స్వతంత్ర సార్వభౌమ రాజ్యాలను, చక్రవర్తులను తయారు చేసింది. ఈ భూమిలో ఇక్కడి ప్రజలు తప్ప వేరే ఎవరు రాష్ట్రీయులు కాలేరు. కానీ కొంతమంది అడుగుతారు, వేరే దేశాల్లో ఉండే ప్రజల గురించి ఆలోచించరా? దానికి మన మన సమాధానం, ముందు మన ఇల్లు సరి చేసుకోవాలి, మన శక్తిని పెంచుకోవాలి. మన భూమిలో మన సార్వభౌమత్వాన్ని స్థాపించాలి. మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. ఇతరుల గురించి తర్వాత ఆలోచించవచ్చు. 

సంపూర్ణ హిందూ సమాజం మనందరి యొక్క రాష్ట్ర భక్తికి కేంద్ర బిందువు కావాలి. ఈ భావనలో జాతి, మత వర్గ వర్ణ భాషా భేదాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. అప్పుడే అది నిజమైన భక్తి అవుతుంది. మీరాబాయి జీవితంలో ఒక ప్రసిద్ధమైన ఘట్టం ఉంది. కృష్ణ భక్తిలో పరవశించిపోయే ఆమెకు తన బంధువుల ద్వారా బాధ కలిగినందుకు గోస్వామి తులసీదాసుకు ఈ విషయాన్ని వివరిస్తూ తగు ఉపదేశాన్ని కోరుతూ లేఖ రాసింది. ఆయన దానికి అద్భుతమైన కవిత రూపంలో పరిష్కారం చూపించారు.

జాకే ప్రియ న రామ్ వైదేహి
తజియే తాహి కోటి వైరి సమ, యద్యపి పరమ సనేహి

దీని అర్థము, శ్రీరాముడు,సీతాదేవిని ఇష్టపడని వారు ఎంతటి దగ్గరి బంధువులు, ఇష్టులు అయినప్పటికీ వారిని కోటి శత్రువులతో సమానంగా వదిలేయాలి. ప్రహ్లాదుడు శ్రీహరి మీద భక్తితో కన్నతండ్రినే ఎదిరించాడు. గోపికలు శ్రీకృష్ణుని మీద భక్తితో తమ భర్తలను త్యజించారు. ఈరోజు మనం మన ప్రత్యక్ష దైవం అయిన హిందూ సమాజాన్ని భక్తితో ఆరాధిస్తున్నము. ఈ క్రమంలో విఘ్నాలు కలుగజేసే అనేక శక్తులు పనిచేస్తున్నాయి. అందులో మనకి ఇష్టులు కూడా ఉండొచ్చు. సమాజంలో ఏకాత్మతకు విఘాతం కలిగించి, సమాజాన్ని సశక్తం చేయాలనుకునే వారికి బాధ కలిగించే వారు ఎవరైనాప్పటికీ మనం వారిని దూరం పెట్టాలి.

మనం సమస్త విఘ్నాలను, బాధలను అధిగమించి మన ఏకాత్మతా సందేశమును ప్రతి ఒక్క హిందువు గృహద్వారం వరకు చేరవేసే ప్రయత్నంలో ఉన్నాము. ప్రతి హిందువు హృదయంలో సజీవ సమాజ దేవతను ప్రతిష్టించి, జ్ఞాన జ్యోతులు వెలిగించి దివ్య అనుభూతిని కలిగించే కార్యంలో నిమగ్నమయ్యాము.

(ఏకాత్మత జీవధార ఎద ఎదను తడిపింది,
ప్రాంత భాష కులమతాల కలతలను చెరిపింది)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments