విశ్వహిందూ పరిషత్ శ్రీకృష్ణ జన్మాష్టమికి 59 సం.లు పూర్తయి 60వ సం.లో అడుగిడుతున్న సందర్భంగా అవలోకనం. ప్రారంభానికి దారి తీసిన పరిస...
విశ్వహిందూ పరిషత్ శ్రీకృష్ణ జన్మాష్టమికి 59 సం.లు పూర్తయి 60వ సం.లో అడుగిడుతున్న సందర్భంగా అవలోకనం.
ప్రారంభానికి దారి తీసిన పరిస్థితి:స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశ నాయకత్వం 'స్యూడో లౌకిక భావజాలం' తో హిందూ, క్రైస్తవ, ముస్లింలంటూ అధికారం చేతిలో పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్న సమయం అది, విదేశీ మతాలు హిందువులను టార్గెట్ చేసి మభ్యపెట్టి వారిని మతం మార్చుకుంటూ తమ సంఖ్యను పెంచుకుంటూ సమాజానికి అన్యాయం చేస్తుండగా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి తమ ఇంట్లోని వారే మతం మారి తమకు శత్రువులుగా మారిపోతే ఏడవడానికీ, గొడవ పడడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. ఈ విధంగా మతం మార్పిడిలు జరుగుతున్న అంతర్గతమైన ఆందోళనా పరిస్థితులను గమనించి ఆనాటి పెద్దలు ఒత్తిడి తీసుకురాగా
• జస్టిస్ నియోగి కమిషన్ ను నియమించడం జరిగింది కొన్ని రోజుల్లోనే ఆ నివేదిక క్రైస్తవుల మతమార్పిడి కార్యకలాపాలను నిలిపివేయమంటూ వచ్చింది, కానీ ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికను పట్టించుకోలేదు.
• యుగయుగాలుగా పవిత్రంగా చూసుకుని గోవులను చంపడం, మాంసంగా ఉపయోగిస్తుండడం ఆపివేయాలని గోరక్షణ అత్యవసరమని అనేకమంది సాధువులు మాత్రమే కాక గాంధీజీ, వినోబాభావే వంటి వారితో సహా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న ప్రతివారు చెప్పేవారు, కానీ స్వాతంత్ర్య అనంతరం గోసంరక్షణను నిర్లక్ష్యం చేశారు.
• అదే సమయంలో, రాజకీయ లబ్ధికోసం నేతల యొక్క కుట్రల కారణంగా హిందూ సమాజంలో భాష, ప్రాంతం, కుల వైరుధ్యాల వంటి విభేదాలు కూడా ఉద్భవించాయి
• దీని కారణంగా సాధువులు మరియు హిందూ ధార్మిక నాయకులు ఆందోళన చెందారు. హిందూ సమాజం యొక్క రక్షణకు మరియు జాగృతికై ఏదో ఒకటి చేయాలని ప్రతి ఒక్కరి మనస్సులో ఉంది.
• ఆ సమయంలోనే ప్రపంచలో అనేక దేశాలు స్వతంత్ర్యంగా మారాయి. ఆ దేశాల్లో నివసిస్తున్న హిందువులు స్వాతంత్ర్య భారతదేశం వైపు ఆశతో మరియు విశ్వాసంతో చూశారు, కానీ నకిలీ లౌకికవాద మనస్తత్వం కారణంగా, మన ప్రభుత్వం విదేశాలలో ఉన్న హిందువుల సమస్యలపై ఉదాసీనంగా ఉండేది.
• ట్రినిడాడియన్ ఎంపీ మరియు వ్యాపారవేత్త శ్రీశంభునాథ్ కపిల్‌దేవ్ అక్కడి హిందువుల సమస్యలపై ఒక బృందముగా భారతదేశానికి వచ్చి అప్పటి ప్రధాని నెహ్రూ మరియు కేంద్ర ప్రభుత్వ మంత్రులు,అధికారులను సంప్రదించగా వారికి నిరాశే ఎదురయింది వారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సరసంఘచాలకులు శ్రీ గురూజీ గోల్వాల్కర్ ని కలుసుకున్నారు.
• ఆ రోజులలో స్వామి చిన్మయానంద్ జీ ప్రవచనాలు ఇవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటించేవారు. విదేశాల్లోని హిందువుల చైతన్యం కోసం ఆయన తన పత్రిక తపోవన్ ప్రసాద్ (నవంబర్, 1963)లో ఒక వ్యాసం వ్రాసారు. తర్వాత హిందూ మహాసభ కూడా ప్రపంచ హిందూ సదస్సును సూచించింది.
• సంఘ ప్రచారక్ మరియు హిందూస్థాన్ సమాచార్ వ్యవస్థాపకులు, పాత్రికేయుడు ముంబై హైకోర్టు న్యాయవాది యిన శ్రీ దాదాసాహెబ్ ఆప్టే ఈ పనికై విదేశాలకు వెళ్లేవారు. విదేశాల్లోని హిందువుల సమస్యలు, వాటి పరిష్కారాలు మొదలైన వాటిపై పూణేలోని కేసరి అనే వార్తాపత్రికలో కథనాలు రాశారు.
• ఈ నేపథ్యంలో, పూజ్య శ్రీగురూజీ గోల్వాల్కర్ కూడా పూజ్య స్వామి చిన్మయానంద మరియు కొంతమంది ముఖ్య వ్యక్తులతో చర్చలు జరిపారు.
విశ్వహిందూ పరిషత్ ప్రారంభం:
• శ్రీ గురూజీ కోరిక మేరకు, దాదాసాహెబ్ ఆప్టే జీ దేశ విదేశాలలో అనుభవం కలిగిన కార్యకర్తలతో సంప్రదించిన తర్వాత 29-30 ఆగస్టు, 1964న శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున ముంబైలోని 'పోవై' లోని పూజ్య స్వామి చిన్మయానందగారి సాందీపని సాధనాలయంలో సమావేశం జరిపారు. (2023 శ్రీకృష్ణ జన్మాష్టమికి 59 సం.లు పూర్తయి 60వ సం.లో అడుగిడుతున్నది.)
భారతీయ మరియు విదేశాలలో ఉంటున్న హిందువుల సమస్యలు - ప్రభుత్వ విధానం వల్ల హిందువులకు జరుగుతున్న అన్యాయాలు మొదలైన సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి విశ్వహిందూ పరిషత్‌ను ఏర్పాటు చేశారు.
స్వామి చిన్మయానంద జీ అధ్యక్షతన జరిగిన ఈ ప్రథమ సమావేశంలో వివిధ సాంప్రదాయాలకు చెందిన సాధువులు, ప్రముఖ హిందూ సమాజంలోని ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వారిలో పూజ్య రాష్ట్రసంత్ తుకడోజీ మహారాజ్, పూజ్య మాస్టర్ తారాసింగ్ జీ (సిక్కు), పూజ్య సుశీల్ మునీ జీ (జైన్), శ్రీ కన్హయ్యలాల్ మాణిక్లాల్ మున్షీ జీ ( నెహ్రూ కాలంలో కేంద్ర క్యాబినెట్ మంత్రి) దివంగత శ్రీ గోల్వాల్కర్ గురూజీ మరియు ఇతరులు 40-45 సభకు ప్రముఖులు హాజరయ్యారు.
ఆ సమావేశంలో కింది ప్రధాన లక్ష్యాలు (1) హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం మరియు జాగృతం చేయడం (2) హిందూ సమాజం యొక్క విలువలు, జీవన మూల్యాలు, హిందూ 'మాన హిందువులను' రక్షించడం మరియు ప్రోత్సహించడం (3) విదేశాలలో ఉన్న హిందువులతో సంబంధాలు పెంచుకోవడం మరియు వారికి ధార్మిక ఆధ్యాత్మిక సహాయం అందించడం,
సమ్మేళనాలు - ఉద్యమాలు:
• ఈ సమావేశ నిర్ణయం ప్రకారం, కుంభమేళా సందర్భంగా 1966 జనవరి 22, 23, 24 తేదీలలో ప్రయాగరాజ్ లో మొదటి ప్రపంచ హిందూ సమ్మేళనం జరిగింది, ఇందులో 12 దేశాల నుండి 25 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు, మూడు వందల మంది ప్రముఖ సాధువులు పాల్గొన్నారు. తొలిసారిగా ప్రముఖ శంకరాచార్యులందరూ ఒకే వేదికపైకి వచ్చారు.
• విశ్వహిందూ పరిషత్ కమిటీని ప్రకటించారు. మైసూర్ మహారాజ శ్రీ జయచామ చంద్ర వడయార్ అధ్యక్షుడయ్యారు. వారు మద్రాసు ప్రావిన్స్ కు గవర్నర్ గా ఉండేవారు, మరియు శ్రీదాదాసాహెబ్ ఆప్టే ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఈ సమావేశంలోనే,,,, అనేక కారణాల వలన హిందుత్వాన్ని వదిలి అన్య విదేశీ మతాలలోకి వెళ్ళినవారు తిరిగి తమ పూర్వ ధర్మంలోకి రావచ్చునని చారిత్రాత్మక నిర్ణయించడం జరిగింది.
• విశ్వహిందూ పరిషత్ యొక్క నినాదం "ధర్మో రక్షతి రక్షిత:" గా నిర్ణయించబడింది మరియు "వటవృక్షం" అధికార చిహ్నంగా నిర్ణయించబడింది.
• ఈ ప్రపంచ సదస్సు తర్వాత ఆనాటి వివిధ ప్రావిన్సులలో హిందూ సమ్మేళనాలు జరిగాయి. ఉడిపి (కర్ణాటక). పంఢరిపూర్ (మహారాష్ట్ర), జోర్హాట్ (అస్సాం), సిద్ధాపూర్ (గుజరాత్) మొదలైనవి.
• ఈ సమ్మేళనాలలో వివిధ తీర్మానాలు ఆమోదించబడ్డాయి.
|| హైందవ సోదరా సర్వే, న హిందూ పతితో భవేత్ మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్రం సమానత||
(హిందువులందరూ సోదరులు, ఏ హిందువు కూడా పతితుడు కాడు, మన యొక్క దీక్ష హిందూ సమాజం యొక్క రక్షణ, మన యొక్క మంత్రం మనమందరం సమానం.) అనే మంత్రాన్ని సాధువులు నిర్ణయించారు. సమాజానికి ఉపదేశించారు.
• రెండవ ప్రపంచ హిందూ సమ్మేళనం 1979 జనవరి 27, 28, 29 తేదీలలో ప్రయాగరాజ్ లో జరిగింది, ఇందులో 18 దేశాల నుండి 60 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
• ఈ సదస్సును బౌద్ధ గురువు పూజ్యులు దలైలామా ప్రారంభించారు. ఆయనకు పూజ్య జ్యోతిష్పీఠం శంకరాచార్య స్వాగతం పలికారు. ఇదొక చారిత్రక సంఘటన.
• 1980 నుండి మోరోపంత్ జీ పింగళే గారు పరిషత్‌కు మార్గదర్శకులుగా, 1982లో, శ్రీ అశోక్ జీ సింఘాల్ పరిషత్ కేంద్ర సమితిలో సభ్యులయ్యారు అప్పటినుండి విస్తృతంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
• 1982లో జన్-జాగరణ్ అభియాన్ (సంస్కృతి రక్షా యోజన) మరియు 1983లో ఏకాత్మత యాత్ర (గంగామాత, భారతమాత యాత్ర) వంటి పెద్ద పెద్ద ప్రభావవంతమైన కార్యక్రమాలు జరిగాయి. లక్షల గ్రామాలను కలిపిన ఈ 'ఏకాత్మత యాత్ర" లో 6 కోట్ల మంది పాల్గొన్నారు.
• మొదటి "ధర్మ సంసద్" ( హిందూ పార్లమెంట్ ) న్యూఢిల్లీలో ఏప్రిల్, 1984లో జరిగింది. గత 60 సంవత్సరాలలో అనేక సమావేశాలు జరిగాయి, ఇందులో హిందూధర్మం లోని సుమారు 125 శాఖలకు చెందిన 12 వేల మంది సాధువులు మరియు ఋషి, మునులు పాల్గొన్నారు.
• విశ్వహిందూ పరిషత్ తొలి సమావేశం 1964 లోనే అడవుల్లో కొండ కోనల్లో ఉన్న మన సోదరులైన పేదవారిని అక్కున చేర్చుకోవడం, షెడ్యూల్డ్ కులాల కాలనీల్లో పేదల బస్తీల్లో సేవాకార్యక్రమాలు ప్రారంభించాలని చర్చ జరిగింది. అందుకు తగ్గట్టుగానే సేవాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నేడు మొత్తం 7 వేల సేవా కార్యక్రమాలు ఉండగా అందులో 112 హాస్టళ్లు, 44 అనాథ శరణాలయాలు, 850 వైద్య కేంద్రాలు స్వావలంబన కేంద్రాలవంటివి ఉన్నాయి.
• దేశంలోని ఆలయాల అనుసంధానం, అర్చకులకు శిక్షణ, వేదపాఠశాల, సామాజిక సామరస్యం మొదలైన వివిధ పనులు క్రమంగా ప్రారంభమై వేగంగా 'పరిణామం వైపు' కొనసాగుతున్నాయి .
పరిషత్ చేసిన పనులు:
• సంస్థాగత కార్యక్రమాలతో పాటు పరిషత్ యొక్క రెండవ పని సమాజంలో చైతన్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని, వివిధ రక్షణ పనులకై బజరంగదళ్, దుర్గావాహిని వంటి సంస్థలు ప్రారంభించబడ్డాయి.
• గోసంరక్షణ మరియు గోసేవ పనులు, ఈ ఏడాది ప్రథమార్థంలోనే 1,25,000 కు పైన ఆవులు కాపాడగా, ఇప్పటివరకు కోటికి పైగా ఆవులను కసాయిల నుండి విముక్తి చేయడమైనది, 600 కంటే ఎక్కువ గౌశాలలతో అనుసంధానం. 175 పంచగవ్య మందుల తయారీ కేంద్రాలు నడుస్తున్నాయి.
• మనదేశంలో మతం మార్పిడి సమస్య చాలా పెద్దది. విశ్వహిందూ పరిషత్ కృషి వలన 40 లక్షల మందికి పైగా మతం మార్పిడి నుండి రక్షింపబడ్డారు, మరియు మతం మార్చబడిన వారు ఇప్పటి వరకు 10 లక్షల మందికి పైగా తమ పూర్వ ధర్మంలోకి తిరిగి వచ్చారు.
• శ్రీరామజన్మభూమి ఉద్యమం 1984లో ప్రారంభమైంది. శ్రీ రామజానకీ రథయాత్ర, శ్రీరామ శిలాపూజన్, శ్రీరామపాదుకా పూజ, మొదటి కరసేవ (1990) మరియు ఢిల్లీ బోట్ క్లబ్ (ఏప్రిల్ 4, 1991) చారిత్రక ర్యాలీ వంటి భారీ సంఖ్యతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరిగాయి. ఈ చైతన్యం ఫలితంగా, 6 డిసెంబర్ 1992న కరసేవ,. తదనంతరం కోర్టులు పూనుకొని హిందూ సమాజానికి న్యాయం చేయడం, శ్రీరామమందిరం నిర్మాణం ప్రారంభం కావడం తెలిసిందే
• ఈ చైతన్య కార్యక్రమాల వలన ప్రపంచానికి మేలు చేసే వారము మేము - 'మేము హిందువులమని గర్వంగా చెప్పండి' అనే ఈ నినాదం ప్రపంచమంతటా ప్రతిధ్వనించింది.
• 2007లో రామసేతు రక్షా ఆందోళన్ ప్రారంభమైంది. చక్కజాం, ఢిల్లీలో భారీ ర్యాలీ జరిగింది... ఇది చరిత్రలోనే పెద్ద ఆందోళనత్మక కార్యక్రమం.
సంస్థాగతం:
• నేడు దేశం మొత్తం 1132 కి గాను 1052 జిల్లాల్లో, 9938 తాలూకాలకు గాను 7299 తాలూకాల్లోనూ 50 వేల గ్రామ కమిటీలు కలుపుకొని మొత్తం 80 వేలకు పైగా కమిటీలు ఉన్నాయి.... ఇవికాక 28 వేల సత్సంగ సమితులు, 40 వేల బజరంగదళ్, 5 వేల దుర్గావాహిని యూనిట్లు, ఉండగా, గోరక్ష, సామాజిక సమరసత మంచ్, సంస్కృతం వంటివే మరో 20 విభాగాలలో వేలాది యూనిట్లు పనిచేస్తుండగా. 550 మంది జీవితకాలం పనిచేసే వారు, మరో వెయ్యి మంది నిశ్చిత సమయాన్నిచ్చే కార్యకర్తలు, 65 లక్షల మంది సభ్యులు పని చేస్తున్నారు. ప్రతి సంవత్సరం పదివేలకు తగ్గకుండా కార్యకర్తలకు కఠిన పరిస్థితుల్లో సైతం దేశ రక్షణకు ధర్మరక్షణకై పనిచేయగలిగే విధంగా ప్రశిక్షణనూ ఇవ్వడం జరుగుతున్నది.
విదేశాల్లో:
• 80 విదేశాలలో వివిధ కార్యక్రమాలు జరుపుతుండగా, 30 దేశాల్లో పరిషత్ కమిటీలున్నాయి. బాలసంస్కార కేంద్రాలు, నెలవారీ సత్సంగం, మహాత్ములు, సాధువుల ప్రవచనాలు, సదస్సులు మరియు అన్యాయానికి వ్యతిరేకంగా చైతన్య కార్యక్రమాలవంటి అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ~ ఆకారపు కేశవరాజు. విశ్వహిందూ పరిషత్ చెన్నై (దక్షిణ) క్షేత్ర సంఘటన మంత్రి. 5/9/2023.
No comments