Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వ్యతిరేకించే పరిస్థితి నుండి గ్లోరిఫై చేసే దాకా వచ్చామా?

వ్యతిరేకించే పరిస్థితి నుండి గ్లోరిఫై చేసే దాకా వచ్చామా?:  ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు ఎన్నో విషయాలపై మెగామైండ్స్ ద్వారా అవగాహన పొ...


వ్యతిరేకించే పరిస్థితి నుండి గ్లోరిఫై చేసే దాకా వచ్చామా?: ఫ్రెండ్స్ మనం ఇప్పటి వరకు ఎన్నో విషయాలపై మెగామైండ్స్ ద్వారా అవగాహన పొంది ఉన్నాము. ఈ విషయం కూడా అలాంటిదే కానీ మీరు గ్లోరిఫై చేయరని ఆశిస్తున్నాము. సమాజం మారిందని ఒకరు, గ్లోబలైజేషన్ లో ఇవన్నీ సహజం అని మరొకరు, ఈ రోజుల్లో నిజాయితీగా ఎవరున్నారు అని మరికొంతమంది సుద్దులు చెబుతుంటారు. కాబట్టి మనమూ మారాలి అంటుంటారు. అయితే మనం మారాలా? మన విలువల్ని చంపుకోవాలా? మనకంటూ ఒక సిద్ధాంతం లేదా?

సమాజంలో కొత్త పుంతలు తొక్కుతున్న కొన్ని విషయాలపై మనం ఆలోచిద్దాం:

  • అవినీతి
ఒకప్పుడు ఈ దేశంలో అవినీతి జరగలేదా అంటే జరిగింది, ఎక్కడొ ఒకటి అసలు అవినీతి జరిగినట్లు కూడా తెలిసేది కాదు, కానీ ఆరోజున వెంటనే శిక్షలు కూడా పడేవి. అవినీతి లో ప్రజల దగ్గర నుండి రాజకీయ నాయకుల వరకు అందరూ భాగస్వాములే. ఒకప్పుడు ఒక రూపాయి కూడా అవినీతి చేయని రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని చూసేవాళ్ళం. అలాంటి వారి గురించి ఈ రోజు వరకూ మాట్లాడుకుంటున్నాము.  అక్కడి నుండి ఎవరైనా ఒకరిద్దరు రాజకీయ నాయకులు, లేదా అధికారులు ఎవరైనా అవీతి చేశారని తెలిస్తే వెంటనే సమాజం, పత్రికలు కోడైకూసేవి, ఎవరైనా అవినీతి చేసేముందు ఆలోచించేవారు. నిదానంగా వ్యతిరేకించడం మానేసి ప్రజలకున్న అవసరాన్ని బట్టి వాటిని టోలరేట్ చేసేవాళ్ళు. ఆ తరువాత నిదానంగా ఈ పనిచేసి పెడితే ఇంతవుతుంది, కావలంటే చేసుకోండి లేదంటే లేదు అంటే యాక్సెప్ట్ చేయడం ప్రారంభించారు. ఇక ఇప్పుడు ఏకంగా గ్లోరిఫై చేస్తున్నారు ఎవరు అవినీతి చేయడం లేదు అందరూ అందరే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంతే అంటున్నారు. సమాజం, పత్రికలు వంత పాడుతున్నాయి. మా వాడికి బెయిల్ వచ్చిందంటే మా వాడికి బెయిల్ వచ్చిందని ఫోజులుకొట్టే సమాజం కూడా తయారయ్యింది. గమనించారో లేదో!  అవినీతి అంటే అవినీతే వ్యతిరేకించాల్సిందే డబ్బులొస్తున్నాయి కదా అని అశుద్ధం తినలేముగా. అలాగే అవినీతి చేయని రాజకీయ నాయకులు, అధికారులు, లంచం ఇవ్వని ప్రజలు ఇప్పటికీ ఉన్నారు. మనం వాళ్ళని కాపాడుకోవాలి.
  • ఓటుకు నోటు
కొన్ని లక్షలమంది ప్రాణత్యాగాల వలన ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కొన్ని లక్షల కుటుంబాలు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం వీధిన పడ్డాయి. అలా వచ్చిన స్వాతంత్ర్యం ద్వారా ఒక చక్కటి రాజ్యాంగాన్ని వ్రాసుకున్నాము, ఆ రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు ఓటు హక్కు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో మహిళలకు, పేదవాళ్ళకి ఓటు హక్కు లేదంటే నమ్మగలరా.. కానీ ఏంజరుగుతుంది? ఎన్నికలు ఒస్తున్నాయంటే భయమేస్తుంది, ప్రజా ధనాన్ని ఎంతలా వృథా చేస్తున్నారో మీరూ చూస్తున్నారు, నిజంగా చెప్పాలంటే లూటీ చేస్తున్నారు. ప్రభుత్వాల మెడలు ఒంచి పనిచేయించుకోవాల్సిన సమాజం నేడు ఎలగయ్యిందంటే సిగ్గేస్తుంది ఆ పార్టీ వాడు ఇంత ఇస్తానన్నాడు మీరెంత ఇస్తారు అని ఓటరుని దిగజార్చే పరిస్థితికి తీసుకు వచ్చారు. వ్యతిరేకించే పరిస్థితి నుండి ఏ రాజకీయ నాయకుడు డబ్బులు పంచడంలేదు అందరూ పంచుతున్నారు ఇక మా నాయకుడు పంచితే తప్పేంటి. ఇక కొంతమంది అంటారు ఆ పార్టీ వాళ్ళు డబ్బులిస్తే తీసుకోండి కానీ మాకు ఓటేయండి ఏంటండీ ఇదా దేశ స్వాతంత్ర్యం కోసం బలిదానమైన వారు కోరుకున్నది. అసలు డబ్బులు పంచకుండా గెలవకుండా ఒక్క రాజకీయ నాయకుడైనా గెలుస్తున్నాడా అంటూ బడాయి పోతున్నారు. ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు ఓటు కి నోటు తీసుకోకుండా ఓటు వేసేవాళ్ళు కాకపోతే మనదృష్టి మారాలి. ఇలా ఓటుకి నోటు ఇచ్చే రాజకీయ నాయకుల్ని వ్యతిరేకించాలి, తీసుకోనే వారిలో చైతన్యం తీసుకురావాలి.
  • అక్రమ సంబంధాలు, సహజీవనం, ఎల్.జి.బి.టి.
ఓ చెప్పొచ్చాడండీ అసలు ఈ దేశం లో అక్రమ సంబంధాలే లేవన్నట్టు, సహజీవనమే ఎవరూ చేయలేదన్నట్టు, పూర్వం గే లు లేరా అంటూ ఇక మొదలుపెడతారు. ఏవి ఉన్నా ఈ సమాజానికి ఒక చక్కటి కుటుంబ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ అన్నిటినీ సరిదిద్దేది, కానీ ఏంజరుగుతుంది కుటుంబ వ్యవస్థని చిన్నాభిన్నాం చేసే ప్రయత్నం జరుగుతుంది. సినిమాలు, ఓ.టి.టి లు, సీరియళ్ళు, పబ్ లు, రేవ్ పార్టీ లు ఒకటేమిటి మొత్తం అన్నీ కలగలపి ఈ కుటుంబ వ్యవస్థని నాశనం చేస్తున్నాయి. వాటిని బ్యాన్ చేయమని నా ఉద్దేశం కూడా కాదు అసలు తల్లి, తండ్రులు పిల్లల్ని గారాబంగా పెంచడం, అడిగిందల్లా కొనివ్వడం, ఇవన్నీ కలిపి మన కుటుంబ వ్యవస్థని నాశనం చేస్తున్నాయి. ఎలా అయ్యిందంటే పాపం ఒక మిత్రుడంటున్నాడు పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పర్లేదు పెళ్ళయ్యాక బావుంటే చాలు అని, అంటే ఏంటి ఇవన్నీ సహజం అనే ధోరణిలోకి వెళ్ళిపోయింది సమాజం. ఇక పెళ్ళికి ముందే సహజీవనం చూస్తూనే ఉన్నాం  ఢిల్లీ లో శ్రద్ధ తో సహజీవనం చేసినవాడు ఏంచేశాడు ముక్కలు ముక్కలుగా నరికాడు, ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ఇక ఒక అబ్బాయి మరొక అబ్బాయిని పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకురావడం ఇదయితే ఇక మనదేశానికే పెను ప్రమాదం ఇదే పెరిగితే ఏముంది సరిహాద్దుల్లో ఓటమి కావడం కాదు ఈ దేశపు వీధుల్లో మనం ఓడిపోతాం. మన జనాభా తగ్గిపోతుంది. ఇప్పటికే ఒక్కరిని కనే సంప్రదాయం వచ్చేసింది, మన జనాభా తగ్గితే తురక కత్తులు కుత్తుకలు కోస్తాయి. కనుక వీటన్నిటిని వ్యతిరేకించాల్సిందే, మన జనాభాని పెంచుకుని కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాల్సిందే..
  • మధ్యపానం, గాంజా, డ్రగ్స్
మధ్యపానం ఒకప్పుడు లేదా తాగితే తప్పేంటి అంటూ వాదించకండి. తాగుడుని కూడా వ్యతిరేకించే పరిస్థితి నుండి ఇంటికొస్తే మందుపోసే పరిస్థితి తయారాయ్యింది. మధ్యపానం, గాంజ, డ్రగ్స్ ఇవన్నీ సమాజంలో చెడుని పెంచుతున్నాయి, చిన్నపిల్లల్ని కూడా ఇవి తాగిన మత్తులో అత్యాచారం చేస్తున్నారు. రోడ్ యాక్సిడెంట్ లు 90 శాతం వీటి కారణంగానే జరుగుతున్నాయి. అసలు ఆడ మగ కలిసి పబ్లిక్ లో కూడా తాగే పరిస్థితి. ప్రభుత్వాలే చాలా గొప్పగా చెప్పుకుంటున్నాయి మాకు ఈ నెలలో ఇంత రాబడి వచ్చిందని, సిగ్గుండాలి ప్రభుత్వాలు నడుపున్నారా, లేక సారా దుకాణాలు నడుపున్నారా? డిసెంబర్ 31 నైట్ పేరుతో ఈ దేశంలో మొదటగా మందు తాగిస్తున్నారు, ఇక ఎన్నికల సమయంలో కూడా కొత్తగా మందు తాగించే అలవాటు చేయిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా తాగకపోతే చిన్నచూపు చూసే పరిస్థితి కూడా తయారయ్యింది. యువత మధ్యం, గాంజా, డ్రగ్స్ లో మునగడం ఈ దేశానికి ప్రమాదం కాబట్టి వ్యతిరేకించాల్సిందే రాజీపడాల్సిన అవసరం లేదు.

మనం చెప్పుకున్న ఈ విషయాలన్నీ ప్రస్తుతం దేశం, సమాజంలో కేవలం 10 శాతం ఉండొచ్చు. పది శాతం ఉంటేనే సమాజం ఇలా ఉంది, ఇవి కనుక సమాజం మొత్తం సమర్ధిస్తే ఇక దేశం ఒక్కటిగా అస్సలు ఉండటం సాధ్యం కాదు. కాబట్టి వీటిని వ్యతిరేకించాల్సిందే అవతలవాడు ఏమైనా అనుకోనివ్వు నీ సిద్ధాంతం నువ్ మాట్లాడాల్సిందే, దానికోసం జైలు కెళ్ళు , అవసరం అనిపిస్తే చావు. లక్షలాది మందికి ప్రేరణవ్వు కానీ వీటికి తలవంచకు. జై హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని. MegaMinds

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment