సామ్యవాదానికి సరైన సమాధానం హిందుత్వమే: పాశ్చాత్య దేశాలకు వారి అంతర్గత సమస్యలపైనే సరైన అవగాహన లేదు, మన దేశంలో సమస్యలపై అసలే లేద...
సామ్యవాదానికి సరైన సమాధానం హిందుత్వమే: పాశ్చాత్య దేశాలకు వారి అంతర్గత సమస్యలపైనే సరైన అవగాహన లేదు, మన దేశంలో సమస్యలపై అసలే లేదు. సమస్య యొక్క మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం వారు చేయరు. హిందుత్వం సామ్యవాదాన్ని ఢీకొనలేదని చెప్పడం నిరర్థకం. ఈరోజు ఇంతగా ఈ భావజాల వ్యాప్తి జరగడానికి, దాని పట్ల ప్రజలు ఆకర్షితులు కావడానికి ప్రభుత్వమే కారణం. కమ్యూనిస్టులు జరిపే కార్యక్రమాలు, ఆందోళనలు వారి ఆలోచన విధానం, అనర్గళంగా సాగే ఉపన్యాసాలు ప్రజలను ప్రభావితం చేశాయి. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు ఉద్యమాన్ని అణిచివేసి దాన్ని నియంత్రించాలనుకున్నది. కానీ కాంగ్రెస్ ఎంచుకున్న విధానం సరైనది కాదు. ఈ విధానాల వల్లనే కేరళలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. ఆరు సంవత్సరాల ముందు వరకు ఇటువంటి పరిస్థితి వస్తుందని మనం ఊహించనే లేదు. సామ్యవాద విస్తరణకు కాంగ్రెస్ పార్టీ బాటలు వేస్తున్నదని మనకు దీనిని బట్టి అర్థమవుతుంది.
సామ్యవాదం వైపు ప్రజలు ఆకర్షితులు కావడానికి కాంగ్రెస్ పార్టీ నే ప్రధాన కారణం అని నేను భావిస్తాను. జాతీయ శీలము, స్వాభిమాన నిర్మాణము, ఆరోగ్యం, సంస్కృతి, నైతిక విలువలు మొదలైన విషయాలను పక్కకి పెట్టి కేవలం సోషలిస్టు ఆర్థిక విధానాలకు అవసరం కన్నా అధిక ప్రచారాన్ని కల్పించారు. దీనివల్ల ప్రజలలో నైరస్యం వ్యాపించి, అదే సామ్యవాద విస్తరణకు ఆధారం అయింది.
ఒకప్పుడు కరుడుగట్టిన క్రైస్తవ దేశమైన రష్యా, ఈరోజు ఎందుకు ఆ మతాన్ని పూర్తిగా తిరస్కరించింది? క్రైస్తవ్యాన్ని కూకటి వేళ్ళతో పికలించింది. మరి క్రైస్తవం మాత్రమే ఈ అడవి మనుషుల్లాంటి భారతీయులను ఉద్ధరిస్తుందని నమ్మేవారు ఈ విషయం గురించి గంభీరంగా ఆలోచించాలి.
మనము అమ్ముడు పోయే వాళ్ళం కాదు. కమ్యూనిజన్ని స్వీకరించడమూ, తిరస్కరించడమూ మనకు లభించే విదేశీ నిధుల సహకారం పై ఆధారపడి ఉండకూడదు.
కమ్యూనిజం నుండి బయట పడాలంటే మనకు ఉన్న ఏకైక మార్గం ఆర్థిక వికాసం మాత్రమే అని పండిట్ నెహ్రూ గ్రహించాడు. ఒకరకంగా అమెరికా కూడా సామ్యవాదుల ఆటే ఆడుతోంది. ఉన్నతమైన జీవన ప్రమాణాలతో విలాసవంతంగా జీవించాలనే కోరిక ప్రజలలో పెరుగుతుంది, కానీ అనతి కాలంలో అది సాధించడం అసంభవం. ప్రజల అంచనాలు వాటి యొక్క పరిపూర్తి మధ్య ఉండే వ్యవధిలో విప్లవాలు పుట్టుకొచ్చి అనేక సమస్యలు సృష్టిస్తాయి. వీటి వల్ల సామ్యవాదం ప్రవేశిస్తుంది. విప్లవాలు పేదరికం కారణంగా జరగవు, పేదరికం అనే భావన కారణంగా జరుగుతాయనే విషయం మనం మర్చిపోకూడదు. 1789లో ఫ్రాన్స్ విప్లవం జరిగింది. ఆ సమయానికి ఫ్రాన్స్ సంపన్న దేశమైనప్పటికీ విప్లవం జరగడానికి కారణం వారు అనుకున్నంత వేగంగా ఆర్థిక ప్రగతి జరగకపోవడమే. అదేవిధంగా మనదేశంలో కూడా ఉన్నతమైన విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశలు ప్రజల మనసులలో నాటుకునే విధంగా కాంగ్రెస్ మరియు అమెరికా ప్రయత్నం చేస్తున్నాయి. #hinduism #megaminds
(విలాసాలపై మోజుని వదిలి మన కష్టముతో భాగ్యం కలిగే
హిందుత్వముపై నమ్మిక పెరిగి భారతి కళ్యాణము జరిగే)
No comments