Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఒక అనాథని ఇంటికి తీసుకొచ్చే అంత ప్రేమ ఎలా వచ్చింది?

"సంఘం (RSS) రామమందిరాన్నీ నిర్మిస్తుంది, రాముడంతటి లక్ష్మణదాసులనూ తయారుచేస్తుంది" ఫోటోలోని అవ్వ పేరు సంకమ్మ శేడ్తి. వయ...

"సంఘం (RSS) రామమందిరాన్నీ నిర్మిస్తుంది, రాముడంతటి లక్ష్మణదాసులనూ తయారుచేస్తుంది"
ఫోటోలోని అవ్వ పేరు సంకమ్మ శేడ్తి. వయస్సు 80+. చిన్న వయసులోనే పెళ్ళైనా దాంపత్య జీవనం ఎక్కువరోజులు సాగలేదు. పిల్లలు లేని ఆమె పుట్టినిల్లు చేరుకుంది. అక్కడ ఇంకేమి కారణాలుండినాయో తెలీదు అక్కడ నుండీ బయటపడాల్సి వచ్చింది. బాల్యం నుండి దైవభక్తితో కూడిన పాటలు నేర్చుకున్న ఆమె భక్తురాలు అయింది. అనేక ఇళ్ళలో పనిచేసింది. చివరకు బెళ్తంగడి దగ్గరలోని పుంజాలకట్టె లోని క్రైస్తవుల ఇంట్లో పనిమనిషిగా చేరింది. దాదాపు 35 ఏళ్ళపాటు ఆ ఇంట్లో పనిచేసింది. వయసుతో బాటు అనారోగ్యమూ పెరిగింది. అదీగాక ఆ ఇంటి యజమాని మతం మారమని ఒత్తిడి పెంచారు. అయితే ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. చూపు పోయింది. ఇంటి యజమాని ఆమెను ఔట్ హౌస్ లో ఉంచేశాడు. ఒకరోజు ఆమె చనిపోయిందని భావించిన ఆతడు హిందూ సంస్థ కార్యకర్తలకు ఫోన్ చేశాడు.
 
గోడౌన్ లాంటి ఔట్ హౌస్ కు వచ్చిన కార్యకర్తలకు ఎముకల గూడులా మారిన సంకమ్మ శేడ్తి కనబడింది. అయితే ఆమె దేహంలో ఇంకా ప్రాణముంది అని గ్రహించిన కార్యకర్తలు బెళ్తంగడి ఆస్పత్రికి చేర్చారు. శరీరం కాస్త బలం అయింది. అయితే దృష్టి రాలేదు. బెళ్తంగడి లోని సంఘ కుటుంబానికి చెందిన ఒక డాక్టర్ ఆమెను మంగళూరులోని వెన్ లాక్ ఆస్పత్రికి చేర్పించాడు. ఆమె మరింతగా కోలుకుంది. కోలుకున్న అవ్వను ఎక్కడికి తీసుకెళ్ళాలనే చింత హిందూ కార్యకర్తలకు మొదలైంది. అపుడు లక్ష్మణదాసు అనే సంఘ స్వయంసేవక్ ముందుకొచ్చాడు. మా ఇంట్లో నా భార్య, కూతురు తప్ప ఎవరూలేరు. మేం తినేదాంట్లోనే ఒక ముద్ద అవ్వకూ పెడతాను. ఆమె ద్వారా నాకు ఏదో వస్తుందనే ఆశ లేదు. నా కూతురికి అవ్వ దొరుకుతుందిగదా, అంతే చాలు అన్నాడు. అదివిన్న కార్యకర్తలకు ఆశ్చర్యం. లక్ష్మణదాసు శ్రీమంతుడేమీ కాదు. కాసింత భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నాడు. పదహైదు ఏళ్ళు ఆరెస్సెస్ ప్రచారక్ గా పనిచేసిన లక్ష్మణదాసు యుక్తవయస్సు నంతా సమాజకార్యానికి వినియోగించాడు. సంకమ్మ శేడ్తిని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆమె లక్ష్మణదాసు ఇంటి సభ్యురాలైంది.
 
ఈ సంఘటన వెనుక ఆలోచించాల్సిన అనేక ప్రముఖ విషయాలున్నాయి. తానే కష్టాలతో బ్రతుకుబండి ఈడుస్తున్న లక్ష్మణదాసుకు అవ్వ తనకు భారం కాదని అన్పించిందెందుకు ? ఆర్థిక భారం కాదనుకున్నా అనాథ అయిన అవ్వను ఇంట్లో ఉంచుకునే ఉదారత్వం ఆయనకు ఎలా వచ్చింది? ఇవన్నీ సమాజానికి ఆశ్చర్యం కలిగించే విషయాలే కానీ సంఘ స్వయంసేవకత్వాన్ని తెలుసుకున్న వారికి , ఆదర్శాలు తెలిసినవారికి , సంఘ వ్యక్తినిర్మాణాన్ని దగ్గరనుండి చూసినవారికి ఇందులో ఆశ్చర్యం కనబడదు. ఎందుకంటే లక్ష్మణదాసులాంటి వారిని తయారుచేయడమే సంఘం పని. సంఘం ఏం చేస్తుంది? రాజకీయ ,అధికార ఆకాంక్షలతో ప్రజలు ఆరెస్సెస్ లో చేరుతారు అనే ఆరోపణలకు లక్ష్మణదాసు జవాబుగా నిలబడతాడు. చివరగా చెప్పేదేమిటంటే, సంఘం (RSS) రామమందిరాన్నీ నిర్మిస్తుంది, లక్ష్మణదాసు లాంటి రాముళ్ళనూ తయారుచేస్తుంది.

ఈ విషయాన్ని శ్రీ బ్రహ్మానంద రెడ్డి సింగారెడ్డి గారు వారి ఫేస్ బుక్ లో పంచుకున్నారు. జయ్ శ్రీరాం...

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments