Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందువు యొక్క నిర్వచనం - Definition of Hindu

“హిందువు” యొక్క నిర్వచనం: హిందువుని ఎలా నిర్వచిస్తారు? అనేది చాలామంది తరచుగా మనల్ని అడిగే ప్రశ్న. దీనికి సమాధానం చెప్పడం చాలా కఠ...

“హిందువు” యొక్క నిర్వచనం: హిందువుని ఎలా నిర్వచిస్తారు? అనేది చాలామంది తరచుగా మనల్ని అడిగే ప్రశ్న. దీనికి సమాధానం చెప్పడం చాలా కఠినమైన పని. ఒక వ్యక్తి అంటాడు “ నేను క్రైస్తవుడిని, మహమ్మదీయుడిని నిర్వచించగలను కానీ హిందువు అంటే ఎవరో చెప్పలేను. అతను అలా చెప్పడం సమంజసమే. మనం సూర్యచంద్రులని కూడా వర్ణించగలము, కానీ ఈ భౌతికమైన విషయాలన్నింటికీ మూలస్థానమైన బ్రహ్మం అనే పరమ సత్యాన్ని మాటల్లో వ్యక్తపరచలేము. అంతమాత్రాన ఆ బ్రహ్మం యొక్క అస్తిత్వం లేదని కాదు, అది భౌతిక విషయాలకి అందని అలౌకిక జ్ఞానానందము, భాషకి అందని భావము. “భగవంతుడిని ఎవరూ వర్ణించలేరు. అది పరిశుద్ధము మరియు నిష్కల్మషమైనదని” శ్రీ రామకృష్ణ పరమహంస అన్నారు. మనం అన్ని వస్తువులని నిర్వచించగలము కానీ సర్వవ్యాపకమైన ఆ సత్యం యొక్క పరిభాషని చెప్పలేము.

ఆ పరమాత్మనే హిందువులు తమ యొక్క సంపూర్ణ అస్థిత్వానికి ఆధారంగా భావించారు. ఈ కారణంగానే హిందూ
సమాజం యొక్క వికాసం సామూహిక పద్ధతిలో జరిగింది. అనేక ఆచారాలు సంప్రదాయాల యొక్క వివిధత ఇక్కడ
కనిపిస్తుంది. ఈ భిన్నత్వములో అంతర్గతంగా ఏకాత్మత అనే సూత్రం ఉన్నది. హిందూ సమాజంలోని అనేక మతాలు
మరియు వివిధ జాతుల యొక్క నిర్వచనం దొరుకుతుంది కానీ హిందువు యొక్క నిర్వచనం దొరకదు ఎందుకంటే అది ఆ సమస్త జాతుల యొక్క సమాగమం‌. కాలక్రమంలో దీనికి అనేకమైన నిర్వచనాలు ఇచ్చే ప్రయత్నం అనేకమంది చేశారు అయితే అవన్నీ అసంపూర్ణంగా ఉన్నాయని తేలింది. అవి సంపూర్ణమైన సత్యాన్ని వ్యక్తీకరించలేదు. అనేక శతాబ్దాల నుంచి వృద్ధి చెందుతున్న జాతి విషయంలో ఇటువంటి సందేహాలు, తర్కాలు ఉత్పన్నం కావడం స్వాభావికమే.

మన జీవన స్రవంతి ఎప్పుడు మొదలైందో, మన సమాజం ఎప్పుడు ఏర్పడిందో చరిత్రకారులు కూడా చెప్పలేకపోయారు. ఆ రకంగా మన జాతి అనాదిగా ఇక్కడ ఉన్నది. ఇటువంటి సమాజం గురించి వ్యాఖ్యానించడం అంటే బ్రహ్మ సత్యాన్ని తెలుసుకోవడం లాంటి అసంభవమైన కార్యమే అని చెప్పొచ్చు. ఒకప్పుడు మొత్తం ప్రపంచమంతా సనాతన ధర్మమే పాటించేవారు కాబట్టి ఒక ప్రత్యేకమైన గుర్తింపు మన జాతికి అవసరం లేకుండా పోయింది.

ప్రకృతిని ఆరాధించడం బ్రహ్మ సత్యం కోసం అన్వేషించడం ఆత్మానుభవాన్ని పొందడమే మన జాతి లక్షణం. భారతజాతి గొప్ప సభ్యత, సంస్కృతి మరియు అనుపమానమైన సామాజిక వ్యవస్థ కలిగి ఉంది. మానవుని జీవితానికి శ్రేయస్సుకి హితకరమైన వస్తువులన్నింటినీ మన పూర్వీకులు తెలుసుకొని సమకూర్చుకున్నారు‌. ఒకప్పుడు మనకు భిన్నమైన ఏ ఇతర జాతి లేదు కాబట్టి ఒక విశిష్టమైన పేరు అవసరం లేకుండా పోయింది. ఎలాగైతే గంగను వివిధ స్థానాల్లో గంగోత్రి, జాహ్నవి, భాగీరథి, హుగ్లీ అని పిలుస్తారో అలాగే “హిందూ” శబ్దం “సింధూ” నది నుండి తీసుకోబడింది. సనాతనమైన సంస్కృతికి వారసులైన మనల్ని ఈరోజు ప్రపంచమంతా ఎంతో గౌరవ భావంతో అనుసరిస్తున్నది.

(హిందూ మేలుకుంటే విశ్వం మేలుకుంటుంది
మానవుల విశ్వాసం మేలుకుంటుంది
భేద భావముల అంతరాలు తొలగి
సమరసత అనే అమృతము కురుస్తుంది)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments