Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారతీయులు ప్రపంచానికందించిన వరం 'యోగ' - International Yoga Day

తమ జీవన విధానం ద్వారా భారతీయులు ప్రపంచానికందించిన వరం 'యోగ'  1. 'యోగం' అంటే లయం చేయడం (కలపడం), శరీరాన్ని, మనస్సు...

తమ జీవన విధానం ద్వారా భారతీయులు ప్రపంచానికందించిన వరం 'యోగ' 

1. 'యోగం' అంటే లయం చేయడం (కలపడం), శరీరాన్ని, మనస్సుని లయం చేయడం, ఆత్మను, పరమాత్మను లయం చేయడమే యోగం.

2. శారీరిక మానసిక ఆరోగ్యానికి, అందానికి, వ్యక్తిత్వ వికాసానికి, విద్యాభ్యాసానికి, క్రీడా నైపుణ్య సాధనకు ఇలా ఏ రంగం తీసుకున్నా ప్రపంచానికి ప్రస్తుతం కనిపిస్తున్న ఏకైక పరిష్కారం 'యోగ'.

3. 'యోగ' మనిషి ఒత్తిడిని దూరం చేసి, శరీరానికి మనస్సుకు విశ్రాంతినిచ్చి, మనస్సును స్థిరం చేసే ఒక ప్రక్రియ.

4. 'యోగ' భారతీయులు తమ జీవన విధానం ద్వారా ప్రపంచానికందించిన వరం. పతంజలి యోగి భారతదేశంలో అంతకు ముందు నుంచే వున్న యోగ సూత్రాలను ఒక క్రమ పద్ధతిలో ఏర్చికూర్చి సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో ప్రపంచానికందించాడు.

5. 'యోగ' లో అష్టాంగ యోగమనే ఎనిమిది రకాల విభాగాలు, అభ్యాసాలు వున్నాయి. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. ఒక్కొక్క విభాగాన్ని దాటేకొద్దీ సాధకుని స్థాయి పెరుగుతూ చివరికి పరమ పథాన్ని చేరుకుంటారని చెబుతారు.

6. పూర్వం ఈ మహత్తర 'యోగ' విద్యను గురుకులాల ద్వారా ప్రతి విద్యార్థికీ, ప్రతి పౌరునికీ గురువులు నేర్పేవారు. ఏడవ శతాబ్దం తర్వాత విదేశీ దండయాత్రల వల్ల మన దేశంలో 'యోగ' కు ప్రాధాన్యం తగ్గింది.

7. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తిరిగి 'యోగ' కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ భారతీయుల మానస పుత్రిక ప్రస్తుతం యావత్ ప్రపంచానికి మార్గదర్శనం చేస్తోంది.

8. మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ సెప్టెంబరు 27, 2014 న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ 'యోగ' విశిష్ఠతను ప్రపంచానికి తెలిపి, అంతర్జాతీయ 'యోగ' దినోత్సవాన్ని జరుపుకోవా ల్సిన అవసరాన్ని విశదీకరించారు. తత్ఫలితంగా "జూన్ 21" ని " అంతర్జాతీయ యోగ దినోత్సవం" గా 170 దేశాలు ఆమోదించాయి.

9. " రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ " అఖిల భారతీయ కార్యకారీ మండలి కూడా యోగ విశిష్టతను ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా వుందని, ప్రపంచం నేడు 'యోగ' ని ఆమోదించ డం మన దేశానికి గర్వకారణమని, దేశంలోని అన్ని శాఖలలో 'యోగ' ని విధిగా సాధన చెయ్యాలని తీర్మానించింది.

10. ‘యోగ’ మానవ జాతికి ఒక వరం. ఆరోగ్యాన్ని సహజంగా కాపాడుకోవడమే కాకుండా కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందటానికి కూడా యోగ ఎంతగానో ఉపకరిస్తుంది. 'యోగ' మానవాళిని రోగాలు, మానసిక అశాంతి, దుర్వ్యసనాల నుంచి సహజంగా దూరం చేసే ఒక విరుగుడు మంత్రం.

No comments