Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆర్.ఎస్.ఎస్ ప్రార్థన (సంఘ ప్రార్థన) - చరిత్ర - rss prayer in telugu - rss prayer history

నమస్తే, అనేక మంది మిత్రులు మెగామైండ్స్ నుండి ఆర్.ఎస్.ఎస్ ప్రార్థన చరిత్ర మరియు సంఘ ప్రార్థన వివరించగలరు అని అడిగినందున మీకందరికీ...

నమస్తే, అనేక మంది మిత్రులు మెగామైండ్స్ నుండి ఆర్.ఎస్.ఎస్ ప్రార్థన చరిత్ర మరియు సంఘ ప్రార్థన వివరించగలరు అని అడిగినందున మీకందరికీ సంఘ ప్రార్థన, చరిత్ర వివరాలు అందిస్తున్నాము...

ప్రార్థన - చరిత్ర (rss prayer history)

1. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రార్ధన ఏ భాషలో ఉంది?
    సంస్కృతం
2. ఇంకే భాష ఉన్నది?
   హిందీ
3. హిందీలో ఉన్న భాగం ఏమిటి?
   భారత్ మాతాకీ జయ్
4. ప్రార్థనలో ఎన్ని శ్లోకాలున్నాయి?
    మూడు
5. పంక్తులు ఎన్ని?
    3 శ్లోకాలు కాబట్టి 12 పంక్తులు.
6. మరి పలికేటప్పుడు ఎన్ని ఉన్నాయి?
    20
7. ఎందుకలా జరిగింది?
   మొదటి శ్లోకంలో 4 పంక్తులు పూర్తిగా, 2,3 కి శ్లోకాలలో సగం సగం పలుకుతారు.
8. ఎందుకు?
   మొదటి శ్లోకం (భుజంగ ప్రయాతం) లో పంక్తికి 12 అక్షరాలు, 2, 3 శ్లోకాల్లో (మేఘనిర్దోషం) పంక్తికి 23 అక్షరాలున్నాయి.
9. ప్రార్థన సారాంశం క్రొత్తదా?
    అవును, అయితే మరాఠీ సాహిత్యంలో ప్రచురితమైంది. ప్రార్థన రచయిత చేసిన నూతన ప్రయోగమిది.
10. సంఘం ప్రార్థన ఎప్పటి నుండి పాడుతున్నారు?
    23 ఏప్రిల్ 1940- పూనా సంఘ శిక్షావర్గ నుండి.
11. ప్రార్ధన స్వరం ఎవరు కట్టారు?
    మాననీయ (సంఘంలో అఖిలభారతీయ కార్యకర్తలకు వాడే గౌరవ వాచకం) యాదవరావ్ జీ  జోషీ
12. రచయిత ఎవరు?
     శ్రీ నరహరి నారాయణ భిఢే
13. ఈ ప్రార్థన ముందు సంఘ్ లో ప్రార్ధన ఉందా?
     ఉన్నది, మొదటి శ్లోకం మరాఠీలో 2వ శ్లోకం హిందీలో
14. మొదటి శ్లోకం
      నమో మాతృభూమి జిధే జన్మలోమీ
      నమో హిందుభూమీ, జిధే వాడలోమీ
      నమో ధర్మభూమీ జియేచ్ఛాచకామా
      పడో దేహమాఝా సదాతే నమామీ
15. రెండవ శ్లోకం
     ఆ రోజు ప్రాచుర్యంలో ఉన్న ఆర్యసమాజ్ ప్రార్థనలో ఒక శ్లోకం లోని సారాంశం..
హేగురో శ్రీరామ దూతా శీల హమ్కో దీజయే
శ్రీఘ్ర సారే సద్గుణోఁసే పూర్ణ హిందూ కీజయే
లీజియే హమకో శరణమే రామ పంధీ హమబనేఁ
బ్రహ్మచారీ ధర్మరక్షక వీరవ్రత ధారీ బనేఁ
16. శ్రీ బిడేజీ ప్రార్థన ఎప్పుడు రచించారు?
     1939 ఫిబ్రవరి 
17. ఫిబ్రవరి విశేషమేమిటి?
     పెరుగుతున్న సంఘకార్యాన్ని, సరియైన పద్ధతిలో నడిపించేందుకు సింధీలో 10 రోజుల పాటు జరిగిన బైఠక్లో యోజన చేశారు. అపుడే ఈ ప్రార్థన వ్రాసారు.
18. శ్రీ బిడేజీ కవీంద్రులా?
      అవును. అయితే వారు స్వయంగా ఇలా అన్నారు. "కవి క్రాంతదర్శి. మంత్ర ద్రష్ట, ఋషి" నేను ఇందులో ఏదీ కాను. ప్రార్థన యొక్క కవి, ద్రష్ట డాక్టర్జీనే. వారి ఆలోచనలను నా ముందుంచారు. నేను సదృశరూపంలో రచించాను కాబట్టి నేను కేవలం రచయితను. కవి డాక్టర్జీయే.

సంఘ ప్రార్థన (rss prayer in telugu)

1. నమస్తే సదా వత్సలే మాతృభూమే
త్వయా హిన్దుభూమే సుఖవ్ వర్ధితోహమ్
మహామఙ్గలే పుణ్యభూమే త్వదర్థే
పతత్వేష కాయో నమస్తే నమస్తే ||

2. ప్రభో శక్తిమన్‌ హిన్దు రాష్ట్రాఙ్గభూతా
ఇమే సాదరన్ త్వాన్ నమామో వయమ్
త్వదీయాయ కార్యాయ బధ్దా కటీయమ్
శుభామాశిషన్ దేహి తత్పూర్తయే
అజయ్యాఞచ విశ్వస్య దేహీశ శక్తిమ్
సుశీలన్ జగద్ యేన నమ్రమ్ భవేత్
శ్రుతఞ చైవ యత్ కణ్టకాకీర్ణ మార్గం
స్వయం స్వీకృతం నస్ సుగఙ కారయేత్

౩. సముత్కర్ష నిస్ శ్రేయ సస్యైక ముగ్రం
పరమ్ సాధనన్ నామ వీర వ్రతమ్
తదన్తస్ స్ఫురత్వక్షయా ధ్యేయనిష్ఠా
హృదన్తః ప్రజాగర్తు తీవ్రానిశమ్‌
విజేత్రీ చ నస్ సంహతా కార్యశక్తిర్
విధాయాస్య ధర్మస్య సంరక్షణమ్‌
పరవ్ వైభవన్ నేతు మేతత్‌ స్వరాష్ట్రమ్
సమర్థా భవత్వాశిశా తే భృశమ్
||భారత్ మాత కీ జయ్||

#ప్రార్థన #prarthana

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment

  1. మంచి సంప్రదాయాన్ని అందిస్తుంది

    ReplyDelete