Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దామగుండం దేశభద్రతకు వరం damagundam latest news

నావికాదళం అంటే దేశభక్తులు అందరికీ గుర్తొచ్చేది చత్రపతి శివాజీ. శివాజీ నావికాదళ పితామహుడు అని కూడా అంటారు. శివాజీ దగ్గర 80 యుద్ధ ఓడలు, 800 వ్...

damagundam

నావికాదళం అంటే దేశభక్తులు అందరికీ గుర్తొచ్చేది చత్రపతి శివాజీ. శివాజీ నావికాదళ పితామహుడు అని కూడా అంటారు. శివాజీ దగ్గర 80 యుద్ధ ఓడలు, 800 వ్యాపార ఓడలు కలిగి అత్యంత బలమైన నావికాదళాన్ని మనం 400 సంవత్సరాల ముందే కలిగి ఉన్నాము. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాయల్ ఇండియన్ నేవీ ని 1950లో ఇండియన్ నేవీగా మార్చుకునాం. మొదట 1968 లో రెండు విభాగాలుగా విభజించారు. ఒకటి పశ్చిమ నావికాదళం దీనికి కేంద్రం బొంబాయి. రెండవది తూర్పు నావికాదళం దీనికి కేంద్రం విశాఖపట్నం. ఆ తరువాత 1986లో మూడవ నావికా దళం దక్షిణ నావికాదాళం, కొచ్చి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

తూర్పు నావికాదాళంకు సమాచార వ్యవస్థలో భాగంగా 1990లో ఎంతో శ్రమకూర్చి తిరునల్వేలి, తమిళనాడులో విఎల్ఎఫ్ (Very Low Frequency) తో 3000 ఎకరాలలో నావికాదళ రాడార్ కమ్యూనికేషన్ సెంటర్ ను నిర్మించుకున్నాం. దీనికి ఐ ఎన్ ఎస్ కట్ట బొమ్మన్ ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు పేరు పెట్టుకున్నాం. దీని ద్వారా ఇప్పటి వరకు తూర్పు నావికాదళం కు సమాచారం అందించడం అలాగే సమాచారం పొందడం జరుగుతుంది. విఎల్ఎఫ్ మరియు ఈ ఎల్ ఎఫ్ టెక్నాలజీ రష్యా తో పాటు భారత్ కూడా కలిగి ఉంది.

1990లో ఈ కమ్యూనికేషన్ సెంటర్ ని నిర్మించిన తర్వాత కూడా ఇంకా మనకి చైనా జలంతర్గాముల కదలికలు తెలియడం లేదు. అప్పుడు అంటే 2000 సంవత్సరం లో ఇది గమనించిన నావికాదళం ఎన్నో ప్రయత్నాలకోర్చి అంధ్రప్రదేశ్ లోని దొనకొండ ప్రాంతాన్ని, అలాగే దామగుండం ప్రాంతాన్ని ఎంపిక చేశారు. చివరగా అత్యంత అనువైన స్థావరంగా దామ గుండాన్ని గుర్తించి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి 2010లో అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

అనేక అనుమతులు పొందిన తరువాత కూడా 2020 లో హైకోర్టు ఆపాలని చెప్పింది. కానీ నరికిన ప్రతి చెట్టుకు పది రెట్లు చెట్లు పెంచుతామని కోర్టుకి ప్రభుత్వానికి హామీ ఇచ్చి నావికాదళం మళ్లీ అనుమతి పొందింది. 2024 జనవరి లో రేవంత్ రెడ్డి గారు నావికా దళానికి భూమిని బదలాయిస్తూ అటవీ అధికారుల చేత సంతకాలు చేయించారు. 2024 మార్చి నుండి పనులు మొదలయ్యాయి.

1990 కి ముందు వి హెచ్ ఎఫ్ & యు హెచ్ ఎఫ్ ద్వారా సమాచారాన్ని అందించడం జరిగేది. కానీ ఇప్పుడు వి ఎల్ ఎఫ్ & ఈ ఎల్ ఎఫ్ వచ్చాక ప్రమాదం లేదు. ఒకవేళ మీకు పూర్తి సమాచారం కావాలంటే బాగా పాటాలు చెప్పే ఫిజిక్స్ మాస్టర్ ని అడగండి.

ఇక్కడ నావికాదళానికి 2009 వందలు ఎకరాల భూమిలో కేవలం 8. 16 % భూమిలో మాత్రమే ఈ కమ్యూనికేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో 50 శాతం భూమిలో ఒక్క చెట్టు కూడా నరకరు. అలాగే నావికా దళం 11 లక్షల మొక్కలు నాటి పెంచడానికి అటవీ శాఖకు 73 కోట్ల రూపాయలు ఇస్తుంది. ఈ రాడార్ కమ్యూనికేషన్ సెంటర్ త్రీ టవర్ రేడియో ట్రాన్స్మిషన్ వ్యవస్థను కలిగి ఉంది ఒక్కో టవర్ 500 మీటర్స్ ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవ్వరికీ రేడియేషన్ ప్రభావం ఉండదు.

ఇక్కడ ఉన్న ప్రత్యేక వృక్ష సంపదకు, ఔషధ మొక్కలకు హాని జరగదు. అలాగే మూసి ఉద్గమ స్థానానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దామగుండం అటవీ ప్రాంతంలో 12 లక్షల చెట్లు ఉన్నవి. అందులో కేవలం ఒక లక్ష 93 వేల చెట్లు మాత్రమే నరుకుతారు వాటికి ప్రత్యామ్నాయంగా 11 లక్షల మొక్కలు నాటుతారు. నావికా అధికారి రావ్ మాట్లాడుతూ... Addressing potential concerns about radiation, Captain Rao assured that "VLF towers radiation is bare minimal and is contained within the facility near the antennas. It is less than a cell phone." అంటే మనం వాడే సెల్ ఫోన్ రేడియేషన్ కన్నా తక్కువ అనేది ఒక నావీ అధికారి చెప్పినా మేము నమ్మము అంటే నేను మాత్రం ఏమిచేయగలను.

అలాగే ఇక్కడ నేవీ స్టేషన్ తో పాటు ఏర్పడే టౌన్‌షిప్‌లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్ లో దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది ఈ టౌన్‌షిప్‌లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడుతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్ పూర్తవనుంది.

ఈ తులసి చందు, నరసింహులు, నాగేశ్వరులు, విమలక్కలు 12 లక్షల చెట్లను నరుకుతారని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. దేశభద్రత, పర్యావరణం, ప్రజల రక్షణ నావికాదళం కన్నా ఎవరూ గొప్పగా ఆలోచించరు. దేశభక్తులుగా మనం చేయాల్సిన పని ఏమిటంటే కొమురం భీమ్, లేదా ఆల్వాల్ బాలిరెడ్డి గారి లాంటి స్వాతంత్ర్య సమరయోధుల పేరుని ఈ రాడార్ కమ్యునికేషన్ సెంటర్ కి పెట్టవలసిందిగా కోరుదాం... జైహింద్. -నన్నపనేని రాజశేఖర్. 8500581928.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments