Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దామగుండం పై దానవుల కుట్రలు - damagundam news

దామగుండం తోరువస్తే ఖబర్దార్ -తులసి చందు.  దామగుండం అడవుల వెనుక పెద్ద కుట్ర -నరసింహులు.  హైదరాబాద్ పక్కనే మహా విధ్వంసం -తులసి చంద...


దామగుండం తోరువస్తే ఖబర్దార్ -తులసి చందు. 

దామగుండం అడవుల వెనుక పెద్ద కుట్ర -నరసింహులు. 

హైదరాబాద్ పక్కనే మహా విధ్వంసం -తులసి చందు. 

దామగుండంపోతే యమగండం -స్వర్ణ కిలారి.

శ్వాస తెగిపోయాక ఇక ఏమి సుందరీకరణ -కే శ్రీనివాస్.

ఈ హెడ్డింగు లతో దేశ రక్షణకు సంబంధించిన నావికాదళం దామగుండంలో నెలకొల్పబోయే సమాచార కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ నలుగురు జర్నలిస్టులు రాసిన వ్యాసాలు, వీడియోలు వైరల్ చేస్తున్నారు. తెలంగాణ మొత్తం మీద నాలుగు వేల మంది జర్నలిస్టులు పైగా ఉన్నారు. అలాగే 400 మందికి పైగా కవులు రచయితలు ఉన్నారు. వారిలో కేవలం ఈ నలుగురైదుగురు ఇలా చెత్త హెడ్డింగు లతో నావికాదళ సమాచార కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయొద్దంటూ ఆరాటపడుతున్నారు. అంతేకాక దామగుండంలో బతుకమ్మ ఆడటానికి కూడా వెళ్లారు. ఇవన్నీ చేస్తే నిజంగా ప్రజలు నమ్ముతారా? నమ్మరు. నమ్మితే ఈపాటికి దామగుండం ఒక ఉగ్ర ఉండంగా మారేది. ఎందుకంటే దేశ ప్రజలకి ప్రత్యేకించి మన తెలంగాణ ప్రజలకి నావికాదళంపై, కోర్టులపై, రాష్ట్ర ప్రభుత్వంపై అపారమైన నమ్మకం ఉంది.

ఈ వీడియోలు, వ్యాసాలు రాసిన వాళ్ళు నాకు తెలిసి మొదటిసారి బతుకమ్మ ఆడారనిపిస్తుంది. తెలంగాణలో రజాకార్లు, నవాబులు మన ఆడపడుచుల్ని నగ్నంగా బతుకమ్మ  ఆడించారు‌ అనే విషయం తెలుసు, కానీ వీళ్లంతా ఆ రజాకారులకి, నవాబులు కి వంత పాడే వారే అని మనం గ్రహించాలి. వీళ్లంతా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, న్యూస్ కోసం వార్తలు రాసేవాళ్లే తప్ప దేశం గురించి, దేశ భద్రత గురించి పెద్దగా పట్టించుకోనటువంటి వ్యక్తులు.

అలాగే దేశంలో ఎంతోమంది పర్యావరణ వేత్తలు ఉన్నారు. వీళ్ళలాగా పార్ట్ టైం పర్యావరణవేత్తలు కాదు వాళ్లంతా పర్యావరణం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారు. అలాంటి వారిని ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరించింది. నాకు తెలిసి గత 10, 20 ఏళ్లలో ఈ పార్ట్ టైం పర్యావరణ ప్రేమికులు కనీసం సంవత్సరానికి ఒక్క మొక్క కూడా నాటి ఉండరు. అసలు నా దృష్టిలో వీళ్ళు మొక్కలే నాటి వుండరు ఇంతవరకు. వీళ్ళకి మోడీ గారిపై, దేశంపై విషం చిమ్మటానికే సమయం సరిపోవడం లేదు అలాంటిది వీళ్ళు మొక్కలు నాటుతారు అంటే అది మన పొరపాటే అవుతుంది.

అయినా ఈ హెడ్డింగ్ లతో రాతలు రాసిన వాళ్ళు దేశం కోసం కేంద్ర ప్రభుత్వం మరియు సైన్యం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ నే వీళ్ళు నమ్మలేదు. సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు రుజువులు అడిగారు. అది వీళ్ళ దేశభక్తి. భారత సరిహద్దుల్లో చైనా వాళ్ళని మన సైనికులు తరిమితే దానికి కూడా చైనా వాళ్ళే భారత సైనికులను తన్నారు అని హెడ్డింగ్ లు పెట్టి వ్రాశారు. వీళ్ళు మనం నమ్ముతామా? రఫేల్ యుద్ధ విమానాలు కొంటే యుద్ధ విమానాల టెండర్లలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేస్తారు వీళ్లే. అసలు దేశానికి ఏదన్న మంచి జరిగితే దాన్ని తట్టుకోలేనటువంటి వ్యక్తులు, ఇప్పుడు తూర్పునావికాదళం చేపట్టిన ఈ కమ్యూనికేషన్ సెంటర్ ని సమర్థిస్తారని మనం అనుకోవడం పెద్ద తప్పు!!!

దామగుండం తోరువస్తే ఖబర్దార్ అంటుంది తులసి చందు ఇదిగో తులసి చెల్లాయి అక్టోబర్ 15న దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారు అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నావికాదళ అధికారుల చేతులమీదుగా దామగుండంలో శంకుస్థాపన జరుగుతుంది. పొరపాటున అటువైపు వెళ్లి ఖబర్దార్ అనేరు. వారికి దేశమే ప్రధానం, ప్రధమం కూడా మీరు నేను కాదు.

దామగుండం వెనుక పెద్ద కుట్ర అంటూ నరసింహులు మల్లేపల్లి రాసుకొచ్చాడు అవును దామగుండం అడవుల్లో రాడార్ కమ్యూనికేషన్ సెంటర్ ని ఏర్పాటు చేస్తే అక్కడ జరుగుతున్న అసాంఘీక కార్యక్రమాలకి, కుట్రలకి ఆటంకం ఏర్పడుతుంది. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ బయటికి వస్తాయనే కదా మీ బాధ. ఇంతకు ముందు జిహాదీ కార్యక్రమాలు, నయీమ్ లాంటి వారు దామగుండాన్ని కేంద్రంగా చేసుకున్నారు. మీరు రాసే వ్యాసాలను, వీడియోలను చూసి జనాలు రెచ్చిపోయి మీకు మద్దతిస్తారని అనుకోకండి. తెలంగాణ ప్రజలు దేశభక్తి విషయంలో ఒక అడుగు ముందే ఉంటారు. అసలు మీకు సమాధానం చెప్పి ఈ వ్యాసం రాయటమే సమయం వృధా కానీ మీలాంటి వారిని నమ్మే ఒక సమూహానికి ఈ సమాచారాన్ని అందించడమే నా లక్ష్యం.

తులసి చెల్లాయ్ హైదరాబాదు పక్కనే మహా విధ్వంసం ఏంటి హైదరాబాదులో మొత్తం కాంక్రీట్ జంగిల్ గా మార్చేస్తే మాట్లాడలేదు నువ్వు, మూసీ నదిని ఆక్రమించి అక్రమ కట్టడాలు కడితే వారిని సమర్థిస్తున్నావు. మరి మూసినది ఎప్పుడు బాగుపడేది. చెల్లాయ్ ఏదో ఒకరోజు మనం అంతా సరోజినీ నాయుడు గారు రాసిన పాట మూసీ నది నీటిని దోసెళ్ళతో తాగేవారట అలా కావాలని మనం కోరుకుందాం కానీ మూసీ నదే ఉండదని మాట్లాడుమాకు చెల్లాయ్.

దామగుండంపోతే యమగుండం ఎలా స్వర్ణ కిలారి గారు? మీరు ఒక మంచి రచయితగా మేకపోతు పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేస్తే చాలా ముచ్చటేసింది. మీరు కూడా ఈ బ్యాచ్ తో కలిసి దామగుండం పోతే యమగండం అనేసరికి కొంచెం బాధేసింది. మీరు 2900 వందల ఎకరాల్లో అడవుల్ని నరికేస్తారంటూ రాశారు కేవలం 8.16 శాతం మాత్రమే చెట్లు నరుకుతారు, దానికి బదులుగా 11 లక్షల చెట్లను నాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే గుడి 400 ఏళ్ల రామలింగేశ్వర స్వామి దేవాలయం పాడైపోతుంది అనే బాధ నాకు అర్థమైంది. కానీ ఇదే గుడిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని నావికాదళం మాట ఇచ్చింది. ఒకవేళ గుడిని తీర్చిదిద్దకపోయినా పర్వాలేదు మాకు గుడి కన్నా దేశమే ముఖ్యం. మీ మీద సదాభిప్రాయంతో ఒక మాట 2027 లో ఈ కమ్యూనికేషన్ సెంటర్ పూర్తవుతుంది అప్పుడు వెళ్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకోండి.

చివరగా శ్వాస తెగిపోయాక ఇక ఏమి సుందరీ కరణ అంటూ కే శ్రీనివాస్ ఊగిపోయాడు. ధనవంతులకి పర్యావరణం పట్టదంటూ వారికి మనల్ని తిట్టడం కాలక్షేపం అంటూ రాశారు. ప్రకృతి ఉన్నంతవరకే పేదవాడైనా ధనవంతుడైనా. ప్రకృతికి  కూడా పేదవాడు ధనవంతుడు ఏంటి సార్? ఎంతమంది ధనికులు బాల్ సీడింగ్ పేరుతో అడవుల్లో, రోడ్లు పక్కన విత్తనాలు చల్లడం ఎన్నోసార్లు చూశాను. మీరు ఎప్పుడైనా మొక్క నాటారా? ఎప్పుడూ పేదలు, ధనికులు అంటూ వాళ్ళ మధ్య గొడవలు పెట్టడమేనా మీ పని. అలాగే మీరు అభివృద్ధికి మతం అంటూ మాట్లాడారు. అభివృద్ధి అనేదానికి మతం అడ్డుపడుతుంది అంటాను. పూడూరు గ్రామంలో 48 శాతం ముస్లిమ్స్ ఉన్నారు వాళ్లు చాలా మద్దతుగా ఉన్నారు. ఇక్కడ జరిగేది దేశ భద్రతకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ సెంటర్ అని వాళ్లకు తెలుసు. మీరే దీనికి మతం రంగు అద్ది గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. మీతో పాటు మాట్లాడిన నలుగురైదురు జర్నలిస్టులు ఉన్నారే వాళ్లంతా కమ్యూనిస్టులే. అభివృద్ధికి అడ్డుపడేది ముందుగా కమ్యూనిస్టులే. ఈ నావికాదళ కమ్యూనికేషన్ సెంటర్ కి అడ్డుగా ఏ ఒక్క నిజమైన ప్రకృతి ప్రేమికుడు రాలేదు. వారికి తెలుసు నావికాదళానికి దేశ భద్రత ఎంత ముఖ్యమో ప్రకృతి కూడా అంతే ముఖ్యమని అందుకే వాళ్లు మీకు వంత పాడలేదు. దేశ ప్రజలారా, ముఖ్యంగా తెలంగాణ ప్రజలారా ఈ కమ్యూనిస్టుల మాయలో పడకండి.

ఈ లొల్లాయి కబుర్లు చెప్పే వారందరినీ పక్కనపెట్టి అసలు వాస్తవం మనం తెలుసుకుందాం:

నావికాదళం అంటే దేశభక్తులు అందరికీ గుర్తొచ్చేది చత్రపతి శివాజీ. శివాజీ నావికాదళ పితామహుడు అని కూడా అంటారు. శివాజీ దగ్గర 80 యుద్ధ ఓడలు, 800 వ్యాపార ఓడలు కలిగి అత్యంత బలమైన నావికాదళాన్ని మనం 400 సంవత్సరాల ముందే కలిగి ఉన్నాము. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాయల్ ఇండియన్ నేవీ ని 1950లో ఇండియన్ నేవీగా మార్చుకునాం. మొదట 1968 లో రెండు విభాగాలుగా విభజించారు. ఒకటి పశ్చిమ నావికాదళం దీనికి కేంద్రం బొంబాయి. రెండవది తూర్పు నావికాదళం దీనికి కేంద్రం విశాఖపట్నం. ఆ తరువాత 1986లో మూడవ నావికా దళం దక్షిణ నావికాదాళం, కొచ్చి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

తూర్పు నావికాదాళంకు సమాచార వ్యవస్థలో భాగంగా 1990లో ఎంతో శ్రమకూర్చి తిరునల్వేలి, తమిళనాడులో విఎల్ఎఫ్ (Very Low Frequency) తో 3000 ఎకరాలలో నావికాదళ రాడార్ కమ్యూనికేషన్ సెంటర్ ను నిర్మించుకున్నాం. దీనికి ఐ ఎన్ ఎస్ కట్ట బొమ్మన్ ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు పేరు పెట్టుకున్నాం. దీని ద్వారా ఇప్పటి వరకు తూర్పు నావికాదళం కు సమాచారం అందించడం అలాగే సమాచారం పొందడం జరుగుతుంది. విఎల్ఎఫ్ మరియు ఈ ఎల్ ఎఫ్ టెక్నాలజీ రష్యా తో పాటు భారత్ కూడా కలిగి ఉంది.

1990లో ఈ కమ్యూనికేషన్ సెంటర్ ని నిర్మించిన తర్వాత కూడా ఇంకా మనకి చైనా జలంతర్గాముల కదలికలు తెలియడం లేదు. అప్పుడు అంటే 2000 సంవత్సరం లో ఇది గమనించిన నావికాదళం ఎన్నో ప్రయత్నాలకోర్చి అంధ్రప్రదేశ్ లోని దొనకొండ ప్రాంతాన్ని, అలాగే దామగుండం ప్రాంతాన్ని ఎంపిక చేశారు. చివరగా అత్యంత అనువైన స్థావరంగా దామ గుండాన్ని గుర్తించి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి 2010లో అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

అనేక అనుమతులు పొందిన తరువాత కూడా 2020 లో హైకోర్టు ఆపాలని చెప్పింది. కానీ నరికిన ప్రతి చెట్టుకు పది రెట్లు చెట్లు పెంచుతామని కోర్టుకి ప్రభుత్వానికి హామీ ఇచ్చి నావికాదళం మళ్లీ అనుమతి పొందింది. 2024 జనవరి లో రేవంత్ రెడ్డి గారు నావికా దళానికి భూమిని బదలాయిస్తూ అటవీ అధికారుల చేత సంతకాలు చేయించారు. 2024 మార్చి నుండి పనులు మొదలయ్యాయి.

1990 కి ముందు వి హెచ్ ఎఫ్ & యు హెచ్ ఎఫ్ ద్వారా సమాచారాన్ని అందించడం జరిగేది. కానీ ఇప్పుడు వి ఎల్ ఎఫ్ & ఈ ఎల్ ఎఫ్ వచ్చాక ప్రమాదం లేదు. ఒకవేళ మీకు పూర్తి సమాచారం కావాలంటే బాగా పాటాలు చెప్పే ఫిజిక్స్ మాస్టర్ ని అడగండి.

ఇక్కడ నావికాదళానికి 2009 వందలు ఎకరాల భూమిలో కేవలం 8. 16 % భూమిలో మాత్రమే ఈ కమ్యూనికేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో 50 శాతం భూమిలో ఒక్క చెట్టు కూడా నరకరు. అలాగే నావికా దళం 11 లక్షల మొక్కలు నాటి పెంచడానికి అటవీ శాఖకు 73 కోట్ల రూపాయలు ఇస్తుంది. ఈ రాడార్ కమ్యూనికేషన్ సెంటర్ త్రీ టవర్ రేడియో ట్రాన్స్మిషన్ వ్యవస్థను కలిగి ఉంది ఒక్కో టవర్ 500 మీటర్స్ ఎత్తులో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవ్వరికీ రేడియేషన్ ప్రభావం ఉండదు.

ఇక్కడ ఉన్న ప్రత్యేక వృక్ష సంపదకు, ఔషధ మొక్కలకు హాని జరగదు. అలాగే మూసి ఉద్గమ స్థానానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దామగుండం అటవీ ప్రాంతంలో 12 లక్షల చెట్లు ఉన్నవి. అందులో కేవలం ఒక లక్ష 93 వేల చెట్లు మాత్రమే నరుకుతారు వాటికి ప్రత్యామ్నాయంగా 11 లక్షల మొక్కలు నాటుతారు. నావికా అధికారి రావ్ మాట్లాడుతూ... Addressing potential concerns about radiation, Captain Rao assured that "VLF towers radiation is bare minimal and is contained within the facility near the antennas. It is less than a cell phone." అంటే మనం వాడే సెల్ ఫోన్ రేడియేషన్ కన్నా తక్కువ అనేది ఒక నావీ అధికారి చెప్పినా మేము నమ్మము అంటే నేను మాత్రం ఏమిచేయగలను.

అలాగే ఇక్కడ నేవీ స్టేషన్ తో పాటు ఏర్పడే టౌన్‌షిప్‌లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్ లో దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది ఈ టౌన్‌షిప్‌లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడుతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్ పూర్తవనుంది.

ఈ తులసి చందు, నరసింహులు, నాగేశ్వరులు, విమలక్కలు 12 లక్షల చెట్లను నరుకుతారని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. నిజంగా 12 లక్షల చెట్లు కనుక నావికాదళం ఈ సమాచార కేంద్రం కోసం నరికితే నేను సమాచార కేంద్రం ముందు మొదటగా బలిదానం అవుతానని వ్రాత పూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇలా జరగకుండా మన రక్షణ వ్యవస్థ బలోపేతమై, దామగుండం, వికారాబాద్ అభివృద్ధి చెందితే మరి మీరు ఏం చేస్తారో చెప్పండి? దేశభద్రత, పర్యావరణం, ప్రజల రక్షణ నావికాదళం కన్నా ఎవరూ గొప్పగా ఆలోచించరు. దేశభక్తులుగా మనం చేయాల్సిన పని ఏమిటంటే కొమురం భీమ్, లేదా ఆల్వాల్ బాలిరెడ్డి గారి లాంటి స్వాతంత్ర్య సమరయోధుల పేరుని ఈ రాడార్ కమ్యునికేషన్ సెంటర్ కి పెట్టవలసిందిగా కోరుదాం... జైహింద్. -నన్నపనేని రాజశేఖర్. 8500581928.

#damagundam live news

No comments