Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భారత రక్షణ కవచంగా మారనున్న దామగుండం - Navy radar station in telangana

భారత దేశ రక్షణ పూర్తిగా త్రివిధ దళాల చేతుల్లోనే వుంది. మనదేశానికి మూడు వైపులా సముద్రం ఉండటం మూలానా నావికాదళం భారత రక్షణలో ముఖ్యప...


భారత దేశ రక్షణ పూర్తిగా త్రివిధ దళాల చేతుల్లోనే వుంది. మనదేశానికి మూడు వైపులా సముద్రం ఉండటం మూలానా నావికాదళం భారత రక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుందనడం లో ఎటువంటి సందేహం లేదు. 21 వ శతాబ్దంలో అడుగుపెట్టాక భారత అభివృద్ధి అంచలెంచలుగా జరుగుతూనే వుంది. ప్రపంచంలో మనం ఆర్ధికంగా ఐదో స్థానానికి చేరాము. ఇటువంటి సమయంలో అమెరికా, చైనా, రష్యా ల మాదిరిగానే మనమూ దేశ భద్రత దృష్ట్యా ఎన్నో మార్పులతో ఆధునిక ఆయుధ సంపత్తితో, నూతన విధానలతో ముందుకెళ్లడం జరుగుతుంది. ఇందులో భాగంగానే నావికా దళం తెలంగాణ లోని వికారాబాద్ మండలం దామగుండం అటవీ ప్రాంతాన్ని కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీ.ఎల్.ఎఫ్ (VLF) కమ్యూనికేషన్ స్టేషన్ ను నెలకొల్పుతోంది.

నౌకలు, జలాంతర్గాములకు సమాచారంను అందజేయడం, సమాచారాన్ని పొందడం కోసం నావికా దళం వీ.ఎల్.ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ ను ఉపయోగిస్తుంది. ఈ సమాచార కేంద్రం ప్రస్తుత పరిస్థితులలో చాలా అవసరం. ఎందుకంటే చైనాకు చెందిన నౌకలు, జలాంతర్గాములు (Submarine) లు మన సముద్రపు సరిహద్దులోకి వచ్చి కవ్వింపు చర్యలు చేస్తూ మన కళ్ళు కప్పే ప్రయత్నం చేస్తున్నాయి. 1990 లోనే తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐ.ఎన్.ఎస్ కట్టబొమ్మన్ రాడార్ సమాచార కేంద్రం ఉన్నప్పటికీ దాని సేవలు సరిపోవడం లేదు. అయితే రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం 2008 లోనే గుర్తించింది.

2008 లో నావికాదళం అప్పటి కేంద్ర ప్రభుత్వానికి రెండో రాడార్ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పగా 2010  లో నావికా దళం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది అయినప్పటికీ కొంత సమయం పట్టింది. 2014లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లను నేవీ చెల్లించింది. 

ఆ తరువాత పర్యావరణ అనుమతులు, క్లియరెన్స్ లన్నీ వచ్చినప్పటికీ తెలంగాణ విభజన తరువాత వచ్చిన ప్రభుత్వం సహకరించని కారణంగా భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. 

ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ దామగుండం ఫారెస్ట్ ప్రోటెక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2020 మార్చిలో  తెలంగాణ హైకోర్టు చెట్లు నరకడానికి వీలు లేదని VLF Radar Station ని ఆపాలని చెప్పింది.

2023 ఎన్నికల తరువాత ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది. దీనికి ఇబ్బంది తలెత్తకుండా చూడటం, ఇతరులను అనుమతించేందుకు నేవీ అంగీకరించింది. నావికా దళం నరికిన ప్రతి చెట్టుకూ 5 మొక్కలు నాటి పెంచే బాధ్యత తమదని చెప్పగా‌ జనవరి 2024 సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయి. కమాండర్ శ్రీ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో శ్రీ రోహిత్ భూపతి, కెప్టెన్ శ్రీ సందీప్ దాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి వివరించిన తరువాత వికారాబాద్ డీ.ఎఫ్.వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు.

ఇక్కడ నేవీ స్టేషన్ తో పాటు ఏర్పడే టౌన్‌షిప్‌లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్ లో దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది ఈ టౌన్‌షిప్‌లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడుతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్ పూర్తవనుంది. మన తెలంగాణ రాష్ట్రం దామగుండం అటవీ ప్రాంతం వలన ఒక రక్షణ కవచం లా మారింది. -నన్నపనేని రాజశేఖర్. 8500581928.

No comments