Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సంసారాల్లో చిచ్చు లేపిన నక్సలిజం - About Charla Muttha Reddy Death

ఓ మూలన ఉన్న ఆశోక చెట్టు దగ్గర ఒంటరిగా కూచున్న జగదీశ్వర్ ను రాజు చూశాడు, రమణి చూసింది, రత్నచూసింది, ప్యూనూశాడు, గుమాస్తా చూశాడు, ...

ఓ మూలన ఉన్న ఆశోక చెట్టు దగ్గర ఒంటరిగా కూచున్న జగదీశ్వర్ ను రాజు చూశాడు, రమణి చూసింది, రత్నచూసింది, ప్యూనూశాడు, గుమాస్తా చూశాడు, టీచర్ చూశాడు, ప్రధానాచార్యులు చూశాడు.

ఎక్కణ్నుంచి చూశారో అక్కణ్నుంచి వాళ్ళు కదలలేదు. చిత్రాల్లా నిలబడి కన్నార్పకుండా చూస్తున్నారు. ఆందరి కళ్ళల్లో జాలి కరుణ - స్నేహం - ప్రేమ తొణికిసలాడుతున్నాయి.

నలుగురలా నిలబడి జగదీశ్వర్ ను చూస్తోంటే, ఆడుతోన్న బాల బాలికలందరు ఎక్కడివారక్కడే నిలబడ్డారు. కొన్ని క్షణాలపాటు ఎవరిలోనూ చలనం లేదు. వారూ బొమ్మల్లా ఉన్నారు.

గత నెలరోజులుగా జబ్బుపడి బడికిరాని రాజశేఖర్ కు ఏ సంగతీ అర్థం కాలేదు. తన పక్కవాణ్ని ఏంట్రా అని కదిలించాడు. కదలిక మొదలయ్యింది. శబ్దాలు ధ్వనించాయి. గుసగుసలు శ్వాసించాయి. ప్రశ్నలు, సమాధానాలు, నిశ్శబ్ధం, నిగూఢం. నిర్శబ్ద హృదయాల్లో నినాదాలు నిగూఢ శబ్దాల్లో పోరాటాలు, అంతరంగాల్లో ఆర్థత్రా, అమాయకతా, అన్నీ కలగాపులగం, పిండీకృతార్థం మాత్రం ఇది.

గత నెలరోజులుగా జగదీశ్వర్ బడికి రాలేదు. జ్వరం వచ్చినా బడికి వచ్చే తత్వం జగదీశ్వర్ ది. ఆ సంవత్సరం పదవతరగతి కాబట్టి మరీ జాగ్రత్తగా చదువుతున్నాడు.

జగదీశ్వర్ వాళ్ల నాన్న ఆ గ్రామం దేవన్న పేటకు సర్పంచ్, పేరు చర్ల ముత్తారెడ్డి. 1981లో ఎన్నికైనప్పటినుండి గ్రామానికెంతో సేవచేశాడు. నీతీ నిజాయితీలున్న వ్యక్తిగా పేరువచ్చింది. అసలతని స్వగ్రామం ధర్మారం, తండ్రి నర్సిరెడ్డి దేవన్న పేట గ్రామవాసి. సూరం తిరుపతిరెడ్డి ఇంటికి ముత్తారెడ్డి ఇల్లరికం వచ్చాడు, భార్య రాజేశ్వరి అనుకూలవతి, సుగుణవతి, ఒడిదొడుకుల్లేని సంసారం, సాఫీగా సాగిపోతున్న కాలం, చక్కటి వ్యవసాయం కన్నతల్లి ప్రేమలా సంపదల్ని కురిపిస్తున్న నేలతల్లి, సంవత్సరాలకు సంవత్సరాలే దొరలాయి. ముత్తారెడ్డికి 40 సం॥లు,

వారి సంసార వృక్షం ఫలించింది. 15 సం||ల కొడుకు జగదీశ్వర్ రెడ్డి ఇప్పుడు పదోతరగతి చదువుతున్నాడు. 12 సంవత్సరాల రత్నమాల 7వ తరగతి చదువుతోంది. 9 సంవత్సరాల జయంతి 4వ తరగతిలో ఉంది. 7 సంవత్సరాల మల్లారెడ్డి 2వ తరగతిలో ఉన్నాడు.

కలకల్లాడే ఆ సంసారవృక్షం "మోడువారింది, ఎండిపోయింది, ఆ పిల్లల దిక్కు కొందరు దీనాతిదీనంగా, కొందరు భయంభయంగా చూడ్డం మొదలెట్టారు.

మంచిపనులు చేసిన ముత్తారెడ్డికి ఆ గ్రామంలో మంచి పేరు వచ్చింది. అయితే ఆ గ్రామంలో ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఓ దోపిడీ ముఠా లేచి కూచుంది. ఇది సమసమాజం సిద్ధాంతం ముసుగును కప్పుకున్న నక్సలైట్ల ముఠా.

కొండపల్లి సీతారాంరెడ్డి తన భార్యను కాజీపేట క్రిస్టియన్ హైస్కూల్లో టీచర్గా చేర్చిన తర్వాత కొన్నాళ్ళకు ఈ నక్సలైటు ముఠా ఒకటి తయారైంది, పూర్వరంగంలో చారుమజుందార్ పోరాట సిద్ధాంతాలుగా గోడల కెక్కాయి, గోడకాగితాలకెక్కాయి, కరపత్రాలు పంచి పెట్టబడ్డాయి. బుక్లెట్లు ప్రచురింపబడ్డాయి; సమసమాజ నిర్మాణానికి భూస్వాముల్నీ, ధనవంతుల్నీ చంపడం ఏకైక మార్గమంటూ సృజన మొదలైన పత్రికలు ప్రచారం మొదలెట్టాయి. మార్క్స్ - లెనిన్-మావోల్ని కీర్తిస్తూ ఆరాధిస్తూ రచనలు వచ్చాయి. భరతమాతనూ, భారతీయ సంస్కృతిని హీనాతీ హీనంగా చిత్రీకరిస్తు రచనల వచ్చాయి. చైర్మన్ మావో మాకూచైర్మన్, మా చైర్మన్ భారత్ కంతా చైర్మన్ అన్న స్థితికి దిగజారాయి వారి రచనలు.

వేదాల్నీ, భారతీయ మతాల్నీ, విభిన్న సంప్రదాయాల్లో వచ్చిన విగ్ర హాల్నీ, చివరికి భారతీయుల కట్టుబొట్టుల్ని కూడా తిట్టాయి ఈ పత్రికలూ, ఈ సాహిత్యం, మానవజాతికి ధనిక దరిద్ర వర్గాలుగా చీల్చిచూపిన మార్క్సు సిద్ధాంతం. ఈ చారుమజుందర్ అనుయాయులకు మార్గదర్శకమయింది, ధనికుల్ని చంపాల్సిందిగా వీరుకొట్టిన ఊదర ఊరకేపోలేదు. ఉన్నత విద్యలు చదవడానికి వరంగల్ కు వచ్చిన ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులు కొంత మంది ఈ నినాదాల ఉచ్చుల్లో చిక్కుకొన్నారు. హత్యాకాండ మొదలెట్టారు.

ఇరవై ఎకరాలుండి తమకు చందాలిచ్చిన రైతుల కోరిక మేరకు రెండు ఎకరాలున్న చిన్నరైతును చంపేశారు. చందాలివ్వని పేదవాళ్ళను, వేలకువేలు విరాళాలివ్వని వ్యాపారుల్నీ, వ్యవసాయదారుల్ని ఖతంచేయడం మొదలెట్టారు ఈ నక్సలైట్లు. రాడికల్స్ కు ధనంతోపాటు స్త్రీలు కూడా కావాల్సివచ్చారు. సిద్ధాంతాన్ని నమ్మివచ్చిన అమ్మాయిల్ని ఉమ్మడిగా వాడుకోవడం మొదలెట్టారు. తమ తోటి నక్సలైటుకు ఆదివరకే పెళ్ళయితే అతని భార్యను కూడా ఈ ఊబిలోకి లాగారు.

సిద్ధాంతం గంగలో కొట్టుకుపోయింది. కాంక్షలూ, వ్యక్తిగత కక్షలూ జెడల విరబోసుకొని పైశాచిక తాండవం చేయసాగాయి. తుపాకి చూపించి గ్రామాలకు గ్రామాలే తమగుప్పిట్లో ఉంచుకొని, తమ కోరికలు తీర్చుకుంటూ పచ్చి కిరాతక నియంతల్ని మించిపోయారు నక్సలైట్లు,

"భూస్వామి-బూర్జువా" శబ్దాల్ని తిట్లుగా విపరీత ప్రచారం చేశారు. వీరి సాహిత్య ప్రవక్తలు-వక్తలు. భూస్వామి శబ్దానికి సరియైన అర్థం చెప్పలేక వీళ్ల అయ్య మార్క్సే ఆ రోజుల్లో తబ్బిబ్బయి పోతే, ఆ కాలదోషం పట్టిన సిద్ధాంతాన్నే తీవ్రాతితీవ్ర ఆవేశంతో నిప్పులు కక్కుతూ ప్రచారం చేశారు.

దోపిడీలవల్ల, హత్యలవల్ల, రక్తపాతంవల్ల నిండిన జేబులతో మేడ కట్టుకొన్నారు, తమ బంధువులకు కట్టించారు. 'ఈ ' సిద్ధాంతాలు నచ్చక తమను వీడిపోయిన వారిని, మొదటి నుండి సిద్ధాంతాల్ని పూర్తిగా వ్యతిరేకించిన వారిని అక్కడక్కడ చంపేసి మిగతావారి నోళ్ళు మూయించారీ రాడికల్ రాస్కెల్స్.

చర్ల ముత్తారెడ్డి దేవన్నపేట గ్రామ సర్పంచయినప్పటి నుండి, ఆ గ్రామంలో తమ పలుకుబడి తగ్గిపోతుందనుకున్నారు నక్సలైట్లు. అందుకే ఆ గ్రామంలోని కొంతమందికి తమ నక్సలైటు సిద్ధాంతాల విషాన్ని బాగా ఇంజెక్టు చేశారు. "దాంతో గ్రామంలో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. నన్ను నీవు తిట్టావనీ, మా అబ్బాయిని మీ అబ్బాయి కొట్టాడని, ఆ అమ్మాయిని కుర్రాడు హేళన చేశాడని, నీవిచ్చిన రూ॥లు మళ్ళీ నీకివ్వను ఏంజేస్తావని. మా చేలో మీయెద్దు పడిందని, తన పొలంగట్టు వాడు పగలదున్నాడని - ఇట్లాంటివే అన్నీ చిల్లర పంచాయితీలు చిలికి చిలికి గాలివానై గ్రామంలో కొట్లాటలు మొదలయ్యాయి. సామరస్యంతో సమాధాన పడేస్థితితో కూడా కత్తులు, గొడ్డళ్ళూ రంగంలోకి ప్రత్యక్ష మవుతున్నాయి.

గ్రామం అశాంతికి నిలయమయింది. తప్పనిసరి పరిస్థితిలో కొంత మంది పోలీసుల రక్షణ కోరారు. దేవన్నపేటలో పోలీసు క్యాంపుదిగింది. నక్సలైట్ల ఆటలు తగ్గుముఖం పట్టాయి.

వారు సర్పంచ్ ముత్తారెడ్డి దగ్గరకి రాయభారం సాగించారు. గ్రామం నుంచి పోలీసు క్యాంపు ఎత్తివేయించమన్నారు. మా గ్రామంలో మేమే శాంతి, నెలకొల్పుకుంటామని సర్పంచ్ ని రాసివ్వుమన్నారు. ప్రజలు తెచ్చిపెట్టు కొన్న పోలీసు క్యాంపు విషయంలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలనీ, తాను నిర్ణయం తీసుకోలేనని, ఒకవేళ తీసుకుంటే రేపటినాడు అనుకోని సంఘటన ఏదైనా జరిగితే అప్పుడు తనమీదకే వస్తుందని, పైగా ప్రజలు తనను ఆడి పోసుకుంటారనీ, ప్రజల ఇష్టాన్నిబట్టి ఇంకా కొన్నిరోజులు పోలీసుక్యాంప్ ఉంటుందని ముత్తారెడ్డి చెప్పాడు. అప్పటికి వెళ్ళిపోయినా ఆ తర్వాత ముత్తా రెడ్డిని చంపుతామంటూ బెదిరించారు.

ముత్తారెడ్డి ఈ బెదిరింపుల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఓనాడు దొంగ చాటుగా ముత్తారెడ్డి మీద దాడిచేశారు నకలైట్లు, వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లు కత్తులూ, గొడ్డళ్ళూ మనిషి ప్రాణం తీయడానికి ఉపయోగపడుతున్నాయి, డాక్టరు ఆపరేషన్ చేసే కత్తే మనిషి గొంతును కత్తిరించినట్లు ఆ రోజు బుధవారం, 1984 జూన్ 6వ తేదీ ముత్తారెడ్డిని నరికి చంపారు నక్సలైట్లు. ఈ హత్యాకాండలో పాల్గొన్న జంపయ్య, యాదగిరి, మొగిలిగౌడు, మల్లయ్య ఆ తర్వాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు.

తమ మామూళ్లు ఆగిపోయినందుకూ, తమ ఇష్టారాజ్యం దేవన్న పేటలో నడవనందుకు కారణం ముత్తారెడ్డి అనుకున్నారు జిల్లా నాయకులు. అందువల్ల అతణ్ని హిట్ లిస్టులో చేర్చేశారు. సిద్ధాంతాల అగ్నికి శలభాల్లాగా పరుగెత్తుకువచ్చిన జంపయ్య, తదితరుల మీద కేసు మోపారు. అలా ముత్తారెడ్డి కథ ముగిసింది.

అది అంతం, కాని భార్య రాజేశ్వరి. పిల్లలు జగదీశ్వర్, రత్న మాల, జయంతి, మల్లారెడ్డి విషాద కథలకు ఇది ఆరంభం..

బళ్ళలో దీర్ఘంగా జాలిగా భయం భయంగా ఆ పసిపిల్లల దిక్కు చూసే పిల్లలు. పిల్లలతల్లులూ-తండ్రులూ నాటినుండి నేటివరకు ఈ జాలిచూపులు ఎందరో దేశభక్తుల పిల్లల్ని వెంటాడుతూనే ఉన్నాయి. వందేళ్ల కమ్యునిజం.(నన్నపనేని రాజశేఖర్)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments