Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

చెంచారపు రవీంద్రరెడ్డిని బలిగొన్న నక్సలిజం - About Chencarapu Ravindra Reddy Death

ప్రశాంత నిశీధి సమయం. భూమ్మీద గ్రీష్మరుతువు ప్రథమ పాదం మోపింది. రైతన్నల ఇంటికి పంటలు పంపించిన భూమాత ఆదమరచి నిద్రపోతోంది.పక్షి- పశ...


ప్రశాంత నిశీధి సమయం. భూమ్మీద గ్రీష్మరుతువు ప్రథమ పాదం మోపింది. రైతన్నల ఇంటికి పంటలు పంపించిన భూమాత ఆదమరచి నిద్రపోతోంది.పక్షి- పశువూ, బీదా - బిక్కీ, దొంగా - దొరా తమ తమ వంతులు పంచు కోగా చేతికొచ్చిన ధాన్యంతో రైతన్న తృప్తిగానే పడుకొన్నాడు. అలాంటి రై తన్నల్లో ఒక డై న క్రిష్ణారెడ్డికూడా ఆదమరచే నిద్రపోయాడు .

చేతికందివచ్చిన పెద్దకొడుకు సత్యనారాయణరెడ్డి తండ్రికి తోడ్పడుతున్నాడు. ప్రేమలత, సుజాత, శోభ, శుభ నలుగురు కూతుళ్ళ పెళ్ళిళ్ళయ్యాయి. ఇంటర్వరకు చదివి ఆపేసిన చిన్నకొడుకు చెంచారపు రవీంద్రరెడ్డి అఖిల భారతీయ విద్యార్థిపరిషత్ (ABVP) ఆశయాదర్శాలకు కట్టుబడి పనిచేస్తున్నాడు. జీవితం సాఫీగా సాగిపోతోంది, కాని ఆ రోజు ....

క్రిష్ణారెడ్డి ఆదమరచి నిద్రపోతున్న ఆ రోజు 6 ఫిబ్రవరి 1984. రవీంద్రరెడ్డి ఆ మధ్యరాత్రి హైదరాబాదు నుండి వస్తున్న నర్సాపూర్ ఎక్స్ ప్రెస్లో దిగాడు. ఇల్లు బస్టాండుకు కొంత దూరంలో ఉంది. ఆ రోజు హైదరాబాదులో ఆటూ ఇటూ తిరగడంవల్ల ప్రయాణం చేయడంవల్ల బాగా అలసిపోయాడు. అందుకని ఒక రిక్షా మాట్లాడుకొని యెక్కాడు.

రిక్షా మెల్లగా కదిలింది. 'బస్ స్టాండ్ - రైల్వేస్టేషన్ రెండూ దగ్గరే వున్నాయి. రిక్షా స్టేషన్ దగ్గరున్న గేటు దాటింది.

ఈ సమయం కొరకే యెదురు దారికా ఉన్న నక్సలైట్లు రిక్షామీద దూకి దాడి చేశారు. మొట్టమొదట చెంచారపు రవీంద్రరెడ్డి ముఖం మీద కళ్ళల్లో యాసిడ్ కుమ్మరించారు. యాసిడ్ పడడంవల్ల కళ్ళు భగ్గునమండాయి. చుట్టూ కనిపించని పరిస్థితి ఏర్పడింది. అయినా రవీంద్ర రిక్షాలో నుండి కిందికి దూకాడు అతనిపై నక్సలైట్ల చేతుల్లోని గొడ్డళ్ళూ, కత్తులూ స్వైరవిహారం చేశాయి. ఇరవై రెండేళ్ళ రవీంద్రకు నూరేండ్లు నిండాయి. అతని ప్రాణవాయువులు అనంతవిశ్వంలో కలిసిపోయాయి.

చిటికెలో దారుణ హత్య. చీకటిలో నక్సలైటు హింసాపిశాచి కరాళ నృత్యం. ఎందుకీ హింస !

పీపుల్స్ వార్ గ్రూపు ఎందుకింత పేట్రేగిపోయింది. వాళ్ళ నాయకుడైన కొండపల్లి సీతారామయ్యకు భూమి కావల్సినంత ఉంది. భార్య ఉద్యోగంచేసి సంపాదిస్తుంది, కూతురు మెడిసిన్ చదివి సంపాదిస్తోంది. ఈ సంపాదన సరిపోని పీపుల్స్ వార్ గ్రూపు నాయకుడు తన ముఠాచేత లక్షలకొలది ధనాన్ని వసూలు చేయించారు. తమకు డబ్బు ఇవ్వనివారి నెందరినో ఖతం చేయించాడు.

ఆ పీపుల్స్ వార్ గ్రూపు వరంగల్ జిల్లా కార్యదర్శి అంజయ్య నాయకత్వంలో, రవీంద్రరెడ్డిని చంపి ఏమన్నా దోచుకున్నారా అంటే అదీ లేదు. అంజయ్య దళంలో పనిచేసిన పురుషోత్తం రెడ్డి గాని, దొంగరాముడు గాని, అజీజ్ ఖాన్ గాని రవీంద్రరెడ్డిని బెదిరించి డబ్బు ఇమ్మని అడిగారా అంటే అదీలేదు.

మరెందుకు జరిగింది ఈ హత్య. యాసిడ్ చల్లి, అతి క్రూరాతి క్రూరంగా ఎందుకు చంపాల్సి వచ్చింది.

చెంచారపు రవీంద్రరెడ్డి ఎబివిపి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఎ బి వి పి ఎదగడం ఈ నక్సలైట్లకు ఇష్టంలేదు. ఎబివిపి ప్రచారం చేస్తున్న దేశభక్తి, జాతీయత, భారతీయత, జ్ఞానశీలఏకతలకు యువకులెందరో ఆకర్షితులవుతున్నారు.

ఇది ఎంత వైజ్ఞానిక యుగమని చెప్పుకొంటున్నా "జాతీయత-ఏకత-దేశభక్తి" లేనిది దేశం పురోగమించలేదని అందరూ అంగీకరిస్తున్నారు. ఆ కారణాన్నే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ను అర్థంచేసుకొని విద్యార్థులు అతిసన్నిహితులవుతున్నారు.

తమ గుప్పిట్లోకి వచ్చిందనుకొన్న ఎర్ర రాజ్యం మరొకరి చేతుల్లోకి పోతున్నదనుకొన్నారు నక్సలైట్లు. తాము లాల్ ఖిల్లా మీద ఎగరేయబోయే లాల్ జెండా కలలోనే మిగిలిపోతుందనుకున్నారు. తమ తుపాకీ గొట్టపు నినాదం, ధనిక, దరిద్ర, వర్గభేద, ద్వేష సిద్ధాంతం, హింసాపోరాటాల కేకలు, శాడిస్టుల ఆరుపుల్లాగానే మిగిలిపోతాయని భయబడ్డారు నక్సలైట్లు.

అందుకే తమ కేంద్ర దళాల లీడర్తో చర్చించి "జాతీయత - దేశభక్తి - భారతీయత'' మొదలైన సిద్ధాంతాలతో యువతను మేల్కొల్పుతున్న పరిషత్ కార్యకర్త చెంచారపు రవీంద్రరెడ్డిని మట్టుబెట్టాలనుకున్నారు. మనిషిని మట్టుపెట్టే పనిలో రాడికల్స్ తాత్కాలిక విజయాన్ని సాధించొచ్చు !

ఆయుధంలేక ఏమరుపాటుగా ఉన్న ఎంత పహిల్వాన్ మీదనైన, గడ్డిపోచ లాంటి వాడు ఆయుధంతో దాడిచేసి ఖతం చెయ్యెచ్చు, చంపడం ఓ పెద్దపనికాదు. సిద్ధాంతం నచ్చకుంటే సిద్ధాంతంతో ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడాలిగాని వ్యక్తులను చంపడం అమానుషం, మానవత్వానికే తీరని కళంకం.

తమ కొడుకుమీద ఎన్నో ఆశలుపెట్టుకున్న ఆ తల్లి ఆండాలమ్మ, ఆ తండ్రి క్రిష్ణారెడ్డి కడుపున చిచ్చు పెట్టి నక్సలైట్లు సాధించిందేంటి?

భారతీయ సమాజంలోని అసమానతల్ని జాతీయతా దృక్పధంతో దూరం చేయాలనీ, విద్యార్థిలోకంలో జ్ఞాన శీల ఏకతల్ని నింపాలనీ, యువతకు భారతీయ సంస్కృతి యెడల సదవగాహన కలిగించాలనీ, విదేశీయుల కుతంత్రాలకు ఈ దేశమాత బలికాకుండా చూడాలనీ, తమ కణకణాన్ని భరతమాతకే సమర్పణం చేయాలనీ, గుండె గుండెలో వందేమాతరం నినాదం మారుమ్రోగాలనీ, అందరూ దేశ సేవయే దేవుని సేవగా భావించాలనీ, కాలచక్ర పరిభ్రమణంలో అనేకకారణాల వల్ల సమాజంలో నాటుకొన్న దురాచారాలు దూరం కావాలనీ నిరంతరం చైతన్య శీలంతో ముందుకు పోతున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తుకు ఇది విషాదమే ఆ తల్లితండ్రులకు, బంధువర్గానికి ఇది విషాదయోగమే.

కానీ, భరతమాత భాష్పబిందువుల్ని తుడిచే పుత్రుణ్ని పోగొట్టుకుంది - జాతీయ వీరుణ్ని పోగొట్టుకుంది.

చర్చలు పల్లవించాల్సిన ప్రాంగణంలో కుర్చీలు విరగడం, తలలో జ్ఞానం నింపాల్సిన మందిరంలో తలల్నే మార్చడం ఇది యే నాగరికతకు గుర్తో ! ఏ మానవతకు ప్రతీకో ! మరి నక్సలైట్లే చెప్పాలి. లేదా రకరకాల ఉద్యోగాలు చేస్తూ రెండుచేతులా సంపాదిస్తూ తమ పిల్లాపాపలు కూడా తిని పారేసేంత కూడబెట్టుకొంటున్న వారి సిద్ధాంత ప్రవక్తలైనా చెప్పాలి!. వందేళ్ల కమ్యునిజం (నన్నపనేని రాజశేఖర్).

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments