ఆధ్యాత్మికంగా పౌర్ణమికి విశిష్ట ప్రాధాన్యం ఉంది. ఏడాదికి పన్నెండు పౌర్ణములు వస్తాయి. దేనికదే ప్రత్యేకం. 'కృత్తిక' నక్షత్...
ఆధ్యాత్మికంగా పౌర్ణమికి విశిష్ట ప్రాధాన్యం ఉంది. ఏడాదికి పన్నెండు పౌర్ణములు వస్తాయి. దేనికదే ప్రత్యేకం. 'కృత్తిక' నక్షత్రం ఉన్న మాస పౌర్ణమిని ' కార్తీక మాసం ' అని పిలుస్తారు. కృత్తికా నక్షత్రం ' అగ్ని' నక్షత్రం. " అగ్ని మీళే పురోహితం " అనే మంత్రముతో ఋగ్వేదం ప్రారంభమౌతుంది. మనము హిందువులము అగ్ని ఆరాధకులం. యజ్ఞ సాధనలో ప్రధానంగా అగ్ని ఆరాధనే వుంటుంది. యజ్ఞకుండంలో వివిధ పదార్థములను స్వాహాకారం చేస్తూ వివిధ దేవతలకు హవిస్సులు అగ్ని దేవుని ద్వారానే అందజేస్తాము. అగ్నికి ప్రతిరూపంగా " దీపం " వెలిగించటం సాంప్రదాయం. అందుకని కార్తిక మాసంలో దీపాలు వెలిగిస్తాము. దీపాలను వెలిగించి " దీపావళి " పండుగను జరుపుకుని కార్తీక మాసానికి స్వాగతం పలుకుతాము. కార్తీక దీపం వెలుతురు కోసం ఈ సృష్ఠిలోని అనేక చరాచర జీవులు ఎదురు చూస్తాయి. కార్తీక పౌర్ణమి రోజున జ్వాలతోరణం, ఆకాశదీపం వెలిగిస్తారు.
ఇంకో విశేషమేమిటంటే కార్తీక పౌర్ణమి వెన్నెలకిరణాలలో చంద్రుడు "అమృతాన్ని" వర్షిస్తాడు అందుకే రాత్తి ఆరుబయట పండువెన్నెల కిరణాలలో పాలను కాచి అమ్మకు నివేదన చేసి లలితా పారాయణం చేసి ప్రవచనాలను విని ఆటలు పాటలు పాడి " కోజాగరి " కార్యక్రమాన్ని జరుపుకునే సాంప్రదాయం వున్నది. అంతే కాకుండా పూర్వం విదేశీ దండయాత్రలు, ముస్లిం మూకల దాడుల సమయంలో గ్రామాలలోని యువకులు వంతులవారీగా మేల్కొని గ్రామానికి కాపలా కాసేవారు. ఎవరైనా ముష్కరులు ఊర్లోకి వస్తున్నారంటే వారితో కలబడేవారు. ఊరిలోని వారిని మేల్కొల్పే వారు. ఇలా కోజాగిరి – కోన్ జాగిరి – ఎవరు మేల్కొంటారు? అనేది మొదలయ్యింది.
ఆ తరువాత కోజాగిరి ఉత్సవాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తుంది. కార్తీక పున్నమి నాడు ఆ పున్నమి వెన్నెల వెలుగులో భారత్ మాతాకీ జై నినాదాలతో స్వయంసేవకులందరూ అలసే దాకా ఆటలాడి, పాటలు పాడి ఆ తరువాత వెన్నెలలో పాలు కాచుకుని, కార్తీక చంద్రుని కిరణాలు తాకిన ఆ పాలని సేవిస్తారు. ఆ ఆటపాటలలో వారి చదువుల, పదవుల, ఆర్ధిక స్థితిగతుల, కుల, వర్గ అంతరాలేవీ కానరావు. అసలవేవీ వారికి గుర్తు రావు. అసలవేవీ వారిలో లేవు. ఉన్నదొక్కటే మనమంతా తల్లి భారతి సంతానం. మనమంతా అన్నదమ్ములం. అదే సంఘం చేసే వ్యక్తి నిర్మాణం. అదే సంఘం వ్యక్తులలో నింపే సంస్కారం. అదే సామాన్యుణ్ణి సైతం అసామాన్యుడిగా తీర్చిదిద్దే సంఘ తంత్రం.
సమాజ రక్షణ కోసం అందరం జాగరూకులై ఉండాలన్న సందేశాన్ని ఇస్తుంది కోజాగిరి. అందుకే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ సామాజిక ఉత్సవాన్ని స్వీకరించింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, చైనా లాంటి పొరుగు దేశాలు అదను కోసం కాచుక్కూర్చున్నాయ్. సరిహద్దుల ఆవల నుంచే కాదు మన సరిహద్దుల లోపల కూడా అశాంతిని రగిలిస్తున్నాయి. నిరంతరం కంటికి కనిపించని యుద్ధం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ రోహింగ్యాలు, అక్రమ చొరబాటుదారుల ముసుగులో మన దేశంలోకి తీవ్రవాదులను చొప్పిస్తోంది. చొరబాట్ల ద్వారా అయితేనేమి, అధిక సంతానం ద్వారా అయితేనేమి తమ ప్రాబల్యాన్ని, సంఖ్యను పెంచుకోవడం, అనంతరం స్థానికులపై దాడులు చేయడం, భయ బ్రాంతులకు గురి చేయడం, వారి ఆస్తులను ఆక్రమించడం వారికి రివాజు.
అనేక పాశ్చాత్య దేశాలు కూడా ప్రస్తుతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మనదేశంలో కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ ఇలా అనేక రాష్ట్రాలలో ముస్లిములు అధిక సంఖ్యాకులైన చోట్ల హిందువులు ఈ సమస్యను అనుభవిస్తున్నారు. మన దేశంలోని వారికి డబ్బులు ఇచ్చి మన దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించడం, అయిన దానికీ కాని దానికీ ఉద్యమాలు చేయించడం. ఏడాదికొకసారి మన పండగొస్తుంది. మీ పండగ వల్లే పర్యావరణం నాశనమైపోతోందంటూ రోదన మొదలు. అరె ఏడాది పొడవునా పరిశ్రమల ద్వారా, వాహనాల ద్వారా, మన ఇళ్ళ నుంచి వచ్చే వ్యర్ధాల వల్ల జరిగే కాలుష్యం మాటేమిటి? ప్రకృతి హితాన్ని మరచి మనం విచ్చలవిడిగా పోగేస్తున్న వ్యర్ధాల మాటేమిటి? మన పండుగ నాడే ప్రకృతి హితం గుర్తుకొస్తుంది కొందరికి. అలాగే పర్యావరణ పరిరక్షణ ముసుగులోనో, మూఢాచారాల ముసుగులోనో, ఆధునీకరణ, స్త్రీల హక్కుల పరిరక్షణ తదితర పేర్లతో హిందూ సంస్కృతి, ఆచారాలపై, హిందూ కుటుంబ వ్యవస్థపై, సమాజంపై జరుగుతున్న నిరంతర విష ప్రచారం, దాడి ఇంకో ఎత్తు.
కోళ్ళ పందాలు, ఎడ్ల పందాలు, జల్లి కట్టు ఇవన్నీ హైందవ సంస్కృతిలో భాగాలు. వీటిపై జంతు ప్రేమికులకి ఎన్నో అభ్యంతరాలు. కానీ వందల, వేల సంఖ్యలో కసాయి అంగళ్ళలో హతమైపోతున్న మూగజీవాల గురించి ఎవరికీ ఆందోళన లేదు. ఎవరూ దాని గూర్చి పల్లెత్తు మాటనరు. అదే కోళ్ళ పందాలు, ఎడ్ల పందాలు, జల్లి కట్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. సినిమాల్లో, టీవీల్లో ఇదంతా అనాగరికమని పని గట్టుకుని ప్రచారం చేస్తారు. మళ్ళీ కోర్టుల ప్రవేశం. న్యాయమూర్తుల ఏకపక్ష తీర్పులు. దీని వెనుక హిందూత్వాన్ని క్షీణింపజేసి, క్రైస్తవాన్ని బలోపేతం చేసే అంతర్జాతీయ కుట్ర దాగివున్నది. ఇవి చాలదన్నట్టు వక్ఫ్ బోర్డ్ కబ్జాలు, Wokeism, LGBT, Liberation Theology, Deep state, Fake Narratives.
ఇలా ఇంటా బయటా హిందూత్వానికి, భారత దేశానికి పొంచి ఉన్న ప్రమాదాలెన్నో. ఇలాంటి విచ్చిన్నకర శక్తులను ఎదుర్కోవాలంటే హిందువు నిరంతరం జాగరూకుడై ఉండాలి. దేశ విద్రోహ శక్తుల పన్నాగాలను చిత్తు చెయ్యాలి. మనలోని కుల, వర్గ, ప్రాంత, భాషా భేదాలను, వైషమ్యాలను తొలగించుకుని గుండె గుండెలో భారతమాత గుడి కట్టాలి.
మన చరిత్రను వక్రీకరించారు. మన ఆచారాలను అపహాస్యం చేశారు. మనల్ని ఆత్మ న్యూనతలోకి నెట్టారు. మానసికంగా వారికి కట్టు బానిసలమయ్యేలా చేసుకున్నారు. మనం మేలుకోవాలి. మన చుట్టూ మన అంతం కోసం జరుగుతున్న కుట్రలను తెలుసుకోవాలి. మన నైపుణ్యంతో, విజ్ఞానంతో, సాహసంతో వాటిని ఛేదించాలి. మనం నిరంతరం ధ్యేయపూర్తి కంకితమవ్వాలి, హిందూ రాష్ట్ర సంఘటన, పున:నిర్మాణమే మన లక్ష్యం కావలి. -నన్నపనేని రాజశేఖర్.
No comments