Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ప్రార్థన - సరస్వతీ నమస్తుభ్యం - Prarthana Prayer namasthubyam lyrics in telugu

ప్రార్థన సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా! భావము: ఓ సరస్వతీదేవి ! కోరిన కోరికలు తీర్...

ప్రార్థన

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా!

భావము: ఓ సరస్వతీదేవి ! కోరిన కోరికలు తీర్చుదానా ! నీకు నమస్కరించు చూ విద్యను ప్రారంభించుచున్నాను. నాకు విద్య సిద్ధించునట్లు చేయుము.

వివరణ: త్రిమూర్తులలో ఒకరైన మరియు ఈ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని భార్య సరస్వతీ దేవి. జ్ఞానమునకు ప్రతీక సరస్వతీ దేవి. రోజు మనము చదువు మొదలు పెట్టె ముందు ఈ శ్లోకం చెప్పాలి. సరస్వతీ దేవి సర్వ విద్యలకు నిలయము. సరస్వతీ దేవి కరుణ వలననే మనకు అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది.
 
'భారతి' దేశం - భారతదేశం

జయంతి, ఋషభుడు అనే రాజదంతల కుమారుడు భరతుడు. తండ్రి తరువాత 'అజనాభము ' అని పిలవబడే రాజ్యాన్ని పాలించాడు. భరతుడు పాలించడం చేత ఆ దేశమే 'భరతవర్షము ' అని పిలువబడింది అని కొందరు చెప్తారు. దుష్యంతుని కుమారుడైన భరతుని వల్ల భారతదేశానికి ఆ పేరు వచ్చిందని కొదరు అంటారు. మరి స్వామి ఏమి చెప్తున్నారో చూడండి.

"ఈ భారతదేశానికి ఎవరి పేరు వచ్చిందంటే జడ భరతుని పేరు వచ్చిందని కొంతమంది , రాముని తమ్ముడైన భరతుని పేరు వచ్చిందని కొంతమంది అంటున్నారు. కాని ఇది ఎవరి పేరూ కాదు. సరస్వతి యొక్క పేరే. సరస్వతీ దేవినే 'సరస్వతి, భగవతి, భారతీ అని అంటారు కదా! కాబట్టి సరస్వతి పేరే భారతదేశానికి వచ్చింది."

#Prayer #Prarthana

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments