Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ప్రార్థన - ఓం సహనావవతు - Prarthana Prayer om sahana vavatu mantra meaning

ప్రార్థన ఓం సహనావవతు సహనౌభునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్తు మావిద్విషా వహై ఓం శాంతిః శాంతిః శాంతిః భావము :  ఈశ్వరుడు ...

ప్రార్థన

ఓం సహనావవతు సహనౌభునక్తు
సహ వీర్యం కరవావహై
తేజస్వినా వధీతమస్తు మావిద్విషా వహై
ఓం శాంతిః శాంతిః శాంతిః


భావము : ఈశ్వరుడు మనల నిరువురుని రక్షించుగాక. అతడు మనల నిరువురను పోషించుగాక. మనము గొప్ప శక్తి తో(దివ్య బలముతో) కలసి పని చేయుదుముగాక. అధ్యయనము చే మనమిరువురమును మేథా సంపదను పొందుదుము గాక! మనమితరులను ద్వేషింపకుందుము గాక. శాంతి, శాంతి, శాంతి సర్వత్ర ఉండుగాక. (ఈ వైదిక ప్రార్థన ప్రేమ సౌభ్రాబ్రత్వము, పరస్పరావగాహన ,శాంతి సామరస్యము అను ఉదారములైన ఆశయములను ప్రకటించును. )

​వివరణ: ఇది గురు, శిష్యులు ఇద్దరికి సంబందించిన శాంతి మంత్రం. ఈ శ్లోకం చదివితే చదువు, తెలివి తేటలు పెరుగుతాయి. ఆ తెలివితో శాంతిని పెంచాలి. శిష్యులందరు గురువు గారితో సహా "ఒక్కరితో ఒక్కరు ప్రేమగా, స్నేహంగా ఉండాలి. ఏ ఒక్కరికి ద్వేషం, కోపం, ఉండకూడదు శాంతిని కలిగి ఉండాలి. ఇవన్నీ మనకు పరమేశ్వరుడు ఇవ్వాలి." అని దేవుడిని ప్రార్థన చేస్తున్నారు.
కలసి వుంటాము, కలసి భుజిస్తాము కలసి పనిచేసి శక్తిని - ధైర్యాన్ని సృష్టిద్దాము. కలసి ధ్యానము చేసి తేజస్సును అంటే వెలుగును సృష్టించు కుందాము. వీటి ద్వారా అందరు శాంతి పొందుదాము. కలసి ఉండడం అది ఇంట్లో అయితే ఉమ్మడి కుటుంబము పెద్దలు, పిల్లలు అందరు కలసి ఉంటే ఎంతో ధైర్యము, ఉత్సాహాలు ఉంటాయి. ఇంట్లో పెద్దలు పిల్లలకు అనుభవంతో ఎన్నో తెలియని విషయములను చెపుతారు. దాని వల్ల ఎన్నో ప్రయోజనములు. అదే సమాజములో అందరు కలసి ఉంటే శాంతి ఉంటుంది. లేకుంటే కులమత ద్వేషముల వల్ల దేశానికి ప్రాణ, ధన, నష్టము జరుగుతుంది. కలసి భుజించడం వల్ల ఎన్నో రకాలు ఆనందముతో తినవచ్చును.

ఉదా:
నీ క్యారేజీ నీ ఒక్కడివే తింటే ఒకే రకం తింటావు. అదే నలుగురితో కలసి తింటే నాలుగు రకాలు తింటావు. ఒకవేళ అమ్మ నీ కిష్టము లేనిది క్యారేజీలో పెడితే అది తినకుండా వెనక్కు తెస్తావు, ఆకలితో అలాగే వుంటావు. అదే నలుగురితో తింటే దానిలో ఎదో ఒక రకం నచ్చి తింటావు.
ఇక కలసి పని చేస్తే, ఆ పని చాలా సులభంగా అయిపోతుంది. అలసట ఉండదు, బోర్ కొట్టదు, తొందరగా అయిపోతుంది, ఫలితం ఎక్కువ వుంటుంది.ఇంట్లో ఫంక్షన్ అయితే అందరు కలసి ఆనందముగా,సులభముగా టెన్షన్ లేకుండా అయిపోతుంది.
 
గురు గోవింద్ సింగ్ తానొక్కడే వందల మందికి యుద్ధంలో తర్ఫీదు ఇచ్చి పెద్ద సైన్యాన్ని తయారు చేసి వేల మందితో యుద్ధం చేసేవారు.

ఇక ధ్యానం కాని, భజన కాని సామూహికంగా చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. గురునానక్ సామూహిక భజనలు చేయించేవారు. ఇప్పటికి చాలా మంది సామూహికంగా ప్రేయర్ చేస్తున్నారు, దాని వల్ల ప్రకృతిలో కాలుష్యం తగ్గి మనకు మంచి జరుగుతుంది. విశ్వాన్ని రక్షిస్తుంది. శాంతి కలుగుతుంది. మనుషులలో మంచి మార్పు వస్తుంది.

unity leads to purity, purity leads to divinity. ఎక్కడ ఐకమత్యముందో అక్కడ దైవత్వం ఉంటుంది. ఐకమత్యము లేకపోతే చేతి వేళ్ళు ఒక్కొక్కటి ఏమి చేయవు. చలి చీమలు కలసికట్టుగా పామునైనా చంపగలవు. గడ్డి పూచలు కలసి తాడు చేస్తే ఏనుగునయినా బందించగలవు. ఐక్యమత్యం మహాబలం, కలసి ఉండడం వలన ప్రేమ సౌభ్రాత్రత్వం, శాంతి,సామరస్యము కలుగును. "కలసి ఉంటే కలదు సుఖం" అని పెద్దలు కూడా అంటారు. మనమందరము కలసి ఉంటే "Brotherhood of man & fatherhood of God" ఈ సమాజములో అనుభవించవచ్చును.

పులి నాలుగు ఆవుల కథ

4 మంచి ఆవులు చాలా కాలముగా కలసి తిరుగుతుండేవి. అడవిలో మంచి గడ్డి తినడం వలన చాలా ఆరోగ్యముగా ఆనందముగా ఉండేవి. అడవిలో ఏ జంతువులు వీటి జోలికి రావు. ఏదైనా జంతువు ఎదురిస్తే దానితో కలసి పోరాడి అడవిలో పారిపోయెలా చేస్తాయి. ఒకసారి సింహమును ఎదురించి పారిపోయేలా చేశాయి. ఆ రోజు నుండి సింహము వాటిని తినడానికి ఎదురుచూస్తూ అవి కలసివుంటే ఏమీ చేయలేను అనుకొని వాటి మధ్య తగువును సృష్టించినది. ఆవులు తమలో తాము కలహించుకొని విడిపోయాయి. అడవిలో ఒక్కొక్కటి ఒక్కోక్క వైపు వెళ్ళి గడ్డి తినసాగాయి. ఎదురు చూస్తున్న సింహము ఒక్కొక్క దాన్ని చంపి తినేసింది. కలసి ఉంటె ధైర్యము, శక్తి, ఉత్సాహము, ఆనందము, పెరుగుతాయి. దేనినైనా సాధించవచ్చు.

#Prayer #Prarthana

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments