Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

1952లో డా బి ఆర్ అంబేడ్కర్ రెండుసార్లూ ఓడిపోయారు, ఎలా? - Why Ambekar lost 1952 Election

1952లో డా బి ఆర్ అంబేడ్కర్ రెండుసార్లూ ఓడిపోయారు, ఎలా? ఒక్కమాటలో చెప్పాలంటే, డా. అంబేడ్కర్ వంటి ప్రతిభావంతుడు లోకసభకు ఎన్నిక కార...

1952లో డా బి ఆర్ అంబేడ్కర్ రెండుసార్లూ ఓడిపోయారు, ఎలా?

ఒక్కమాటలో చెప్పాలంటే, డా. అంబేడ్కర్ వంటి ప్రతిభావంతుడు లోకసభకు ఎన్నిక కారాదని నాటి ప్రధానమంత్రి నెహ్రూ అనుకొన్నందునే.. 

ఇంకొంచెం చెప్పాలంటే కమ్యూనిస్టు అగ్రనేత శ్రీ పాద అమృత డాంగే స్వయంగా విషం చిమ్ముతూ ప్రచారం చేసీనందునే. 

బొంబాయి బాస్ అనిపించుకొనే ఎస్ కె పాటిల్  
పై ఇద్దరికీ సహకరించినందుననే. 

కొంచెం విపులంగా చెప్పుకొందాం. 

ఆరోజుల్లో ఎస్ సి, ఎస్ టీ అభ్యర్థులు ద్విసభ్య నియోజక వర్గాల నుండి ఎన్నిక కావలసి ఉండింది. ఆనాడు లోకసభలోని సుమారు 470 నియోజకవర్గాలలో దాదాపు 70 నియోజకవర్గాలను షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డ్ జనజాతుల అభ్యర్థులు పోటీ చేయడానికి వీలుగా కేటాయించారు. అయితే ఇక్కడున్న ఒక మెలిక ఏమిటంటే అవన్నీ ద్విసభ్య నియోజకవర్గాలు.. 

ఆ నియోజక వర్గాలలో ఓటర్లకు రెండు బ్యాలట్ కాగితాలు ఇచ్చేవారు. వాటిని ఎవరో ఇద్దరు అభ్యర్థులకు వేర్వేరు పెట్టెలలో వేయాలి. రెండింటిని ఒకరికే వేయటం కుదరదు. 

పోలింగ్ ముగిసిన తర్వాత  వోట్లు లెక్కించే వారు. అది గనుక ఎస్.సి.లకు కేటాయింపబడినదైతే, ఎస్ సి అభ్యర్థుల్లో ఎక్కువ వోట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచిన అభ్యర్థిగా ముందుగా ప్రకటించే వారు.(అందరిలోకి ఎక్కువ వోట్లు రాకపోయినా, మొత్తం అభ్యర్థులలో రెండవస్థానంలోనో, మూడవ స్థానంలోనో ఉన్నా సరే)

 ఆతర్వాత మిగిలిన అభ్యర్థుల్లో ఎక్కువ వోట్లు వచ్చిన అభ్యర్థిని జనరల్ స్థానంలో విజేతగా ప్రకటించే వారు. ఇతడు సాధారణంగా మొదటిస్థానంలో, కొన్ని సందర్భాల్లో అపవాదంగా రెండవ స్థానంలో ఉండేవాడు. మూడవ స్థానంలో వచ్చిన అభ్యర్థి గెలిచే అవకాశం లేనేలేదు. ఉన్న స్థానాలు రెండే కదా! 

ఒకవేళ రెండవ స్థానంలో కూడా షెడ్యూల్డు కులాల అభ్యర్థి వచ్చినట్లయితే అతడు జనరల్ స్థానంలో విజేతగా ప్రకటింపబడుతాడు. అదీ ఆనాడు అనుసరించిన విధానం. 

సాధారణంగా జనరల్ స్థానంలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తారు. షెడ్యూల్డు కులాల రిజర్వుడు స్థానానికి తక్కువమంది పోటీ చేస్తారు. వోటర్లు అందరూ ఇరు స్థానాల్లో అభ్యర్థులకు వోట్లు చేసినట్లయితే, రెండు స్థానాల్లోనూ షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులే గెలిచినా ఆశ్చర్యం ఉండబోదు. జనరల్ సీటులో ఉన్న నలుగురు అభ్యర్థులు మధ్య వోట్లు చీలినప్పుడు మొదటిస్థానంలో ఉన్నవాడు 35 శాతం వోట్లు తెచ్చుకోవటంకూడా కష్టమే. షెడ్యూల్డు కులాల అభ్యర్థులు ఇద్దరే ఉంటే మొదటి అభ్యర్థి 55 శాతం తెచ్చుకొన్నా, రెండవ అభ్యర్థి 45 శాతం వోట్లు తెచ్చుకోగల అవకాశం ఉంటుంది. అప్పుడు జనరల్ స్థానానికి ఆ 45 శాతం తెచ్చుకున్న షెడ్యూల్డు కులాల అభ్యర్థి ఎన్నికవుతాడు.  

ఈ ప్రక్రియలో దాగి ఉన్న మెలికను అడ్డం పెట్టుకొని కమ్యూనిస్టు నాయకుడు ఎస్ ఏ డాంగే డా. ఆంబేడ్కర్ కి వ్యతిరేకంగా పనిచేశాడు. రిజర్వుడు స్థానానికి కాంగ్రెసు అభ్యర్థిగా కజ్రొల్కర్ అనే ఆయనను నిలబెట్టారు. షెడ్యూల్డు కులాల ఫెడరేషన్ అభ్యర్థిగా డా.ఆంబేడ్కర్ రంగంలో దిగారు.సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా జనరల్ సీటుకు అశోక్ మెహతా పోటీచేశారు. ఈ ఇద్దరిమధ్య ఒప్పందం ఉంది. షెడ్యూల్డు కులాల ఫెడరేషన్ వారు జనరల్ స్థానంలో అశోక్ మెహతా గారికి వోటు వేయాలి. సోషలిస్టు పార్టీ అభిమానులు రిజర్వుడు స్థానంలో అంబేడ్కర్ గారికి వోటు వేయాలి.  

 కాని జరిగిందేమిటంటే, జనరల్ స్థానంలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవా లంటే, రిజర్వుడు సీటుకు వేసే వోట్ల సంఖ్యను తగ్గించాలి. కాబట్టి తమతమ పార్టీ అభిమానులు జనరల్ సీటుకు మాత్రమే వోటు వేయాలి, రిజర్వుడు సీటుకు వోటు వేయరాదని గుసగుసల ప్రచారం సాగించారు. 

కమ్యునిస్టు పార్టీ నాయకుడైన శ్రీపాదుల అమృత్ డాంగే గారయితే, ఆంబేడ్కర్ గారిని ఓడించటమే లక్ష్యంగా ప్రచారం చేశారు. ( ఈవిషయం డా. బి విజయభారతి గారు- బొజ్జా తారకం గారి సతీమణి- వ్రాసిన పుస్తకంలో స్పష్టంగా పేర్కొనబడింది) 

ఫలితంగా రిజర్వుడు స్థానంలో  కాంగ్రెసు అభ్యర్థి కజ్రోల్కర్ గెలిచారు. జనరల్ స్థానంలో మరెవరో గెలిచారు. అంబేడ్కర్, అశోక్ మెహతా ఇరువురూ ఓడిపోయారు.

బొంబాయి నార్త్ లో వచ్చిన అనుభవం ఆధారంగా భండారానుండి జరిగిన ఉపఎన్నికలో మళ్లీ అంబేడ్కర్ అశోక్ మెహతా ద్వయం పోటీచేసినపుడు తాము రిజర్వుడు స్థానంలో బాబాసాహబ్ కి మాత్రమే వోటు వేయాలని, జనరల్ స్థానంలో వోటు వేయకుండా దానిని మురగబెట్టాలని (కాల్చివేయాలని) షెడ్యూల్డు కులాల ఫెడరేషన్ కార్యకర్తలు అనుకున్నారు. కాని బాబాసాహబ్ వారిని మందలించి ఇరు పార్టీల మధ్య ఒప్పందాన్ని గౌరవిస్తూ అశోక్ మెహతా గారికి కూడా వోటు వేయాలని నొక్కిచెప్పారు. 

ఫలితంగా ఈ ద్వయం ఓడిపోయారు. రెండుస్థానాలూ కాంగ్రెసు వశమయ్యాయి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments