ఆనాటి రాజకీయ నాయకుల్లో అధిక విద్యావంతుడై, చరిత్రను, సామ్రాజ్యవాద మతాలను సరిగా అవగాహన చేసుకొని గాంధీ గారి అభిప్రాయాలతో స్పష్టంగా ...
ఆనాటి రాజకీయ నాయకుల్లో అధిక విద్యావంతుడై, చరిత్రను, సామ్రాజ్యవాద మతాలను సరిగా అవగాహన చేసుకొని గాంధీ గారి అభిప్రాయాలతో స్పష్టంగా వ్యతిరేకించిన వ్యక్తి డా. అంబేడ్కర్ గారు. మహాత్మలాంటి నైతిక కిరీటాలు లేనందువల్ల ఇతని ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. చాలా నిశితమైన, శాస్త్రీయమైన చారిత్రక అవగాహనతో అన్ని విషయాలపై మాట్లాడారు అంబేద్కర్. ఈయన హిందూమతంపై చేసిన వ్యాఖ్యల్ని మాత్రమే ఇన్నాళ్ళూ మీడియా ప్రచారం చేసింది. కానీ సామ్రాజ్యవాద మతాలపై మరింత తీవ్రంగా వ్యాఖ్యానించిన మాటల్ని మీడియా దాచిపెట్టింది.
సామ్రాజ్య వాద మతాల గురించి రాస్తూ ఈ రెండూ మనుషుల్ని విడదీసేవే అనీ, ఈ రెంటిమూలాల్లో ద్వేషం (Hate) స్పష్టంగా ఉందని దళిత వర్గాలకు చెప్పారు. అలాగే దేశ విభజన సమయంలో 100% జనాభా మార్పిడి జరగాలని స్పష్టంగా చెప్పారు. మౌలానా ఆజాద్ ప్రేరణ వల్ల గాంధీ నెహ్రూలు తమ గొప్పదనాన్ని నిరూపించుకోవడానికి ముస్లిలు దేశాన్ని వదలాల్సిన అవసరం లేదంటూ ప్రచారం చేశారు. దానితో కొందరు మాత్రమే పాకిస్తాన్ వెళ్లడం జరిగింది. సౌదీ అరేబియాలో పెరిగిన మౌలానా గారికి జిహాద్ స్వరూపం తెలుసు. ఒక దేశంలో ఎలా ప్రవేశించాలి, ఎలా వృద్ధి చెందాలి, ఎలా క్రమక్రమంగా ఆక్రమించుకోవాలి అన్న విషయం అతనికి తెలుసు. గాంధీ నెహ్రూల డొల్లతనం కూడా అతనికి తెలుసు. తాము ప్రపంచ నాయకులయ్యామనే భ్రమలో వారు విహరించారు.
ఇతర నాయకులకు ఎలాంటి అవగాహన లేకపోవడం పొరుగు దేశాల్లోని మైనారిటీలు అత్యాచారాలకు, హింసలకు గురికావడానికి కారణమైంది. కులం విషయంలో కూడా అంబేడ్కర్ మాటలు ఆయన నిజాయితీని తెల్పుతాయి.
కులాన్ని నిర్మించే శక్తి బ్రాహ్మణులకు లేదని ఆయన చెప్పడం ఈనాడు వివిధ వర్గాలు చేస్తున్న అసత్యవాదాల్ని తిరస్కరిస్తుంది. అలాగే బౌద్ధమతం అంతరించడానికి బ్రాహ్మణులు కారణం కాదని, విదేశీ దండయాత్రలే కారణమని ఆయన చెప్పిన విషయాన్ని మనం గుర్తించాలి.
చరిత్రను వక్రీకరించడం స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వాలు చేసిన గొప్ప అన్యాయమని చెప్పవచ్చు. చరిత్రలోని ఘోర హింసను దాచిపెట్టి ఒకవర్గం వారిలో బెదిరింపు ధోరణిని, ధిక్కారభావాన్ని, మరొకవర్గంలో నిస్సహాయతను, సహింపు ధోరణిని పెంచే వాతావరణాన్ని నిర్మించడం భారతీయ సంస్కృతికి చేసిన అన్యాయమని చెప్పవచ్చు. దీనివల్ల చరిత్రలో జరిగిన దారుణాలు పునరావృత్తమవుతాయి. చరిత్రను ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటే అన్ని వర్గాలూ తమ తప్పుఒప్పుల్ని తెలుసుకొని సహకరించుకునే ప్రయత్నం చేస్తాయి. పొరుగుదేశాల్లో మైనారిటీలపై జరిగిన అత్యాచారాల్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు గమనించలేదు. ఆ దేశాల్లో దేశ విభజన సమయంలో మైనారిటీ జనాభా ఎంతశాతం ఉండేది ప్రస్తుతం ఏ స్థాయికి తగ్గింది అనే గణాంకాల్ని మొట్టమొదటిసారిగా ఇటీవలే ప్రభుత్వం ప్రజలకు తెలిపింది. లౌకికచట్టాల్ని, మతపరమైన చట్టాల్ని రెండింటిని అమలు చేస్తూ మన పొరుగుదేశాలు చేసిన హింసాకాండను ఇన్నేళ్లుగా మనం ప్రస్తావించనే లేదు.
అంబేద్కర్ చాలా స్పష్టంగా క్రైస్తవ, ముస్లిం మతాలను వ్యతిరేకిస్తూ హిందూ ధర్మం లో ఉన్న అంటరానితనాన్ని గట్టిగా ప్రశ్నించారు. అలాగే కమ్యునిష్ట్ లు ఈ దేశానికి ఎప్పటికీ దేశభక్తులుగా ఉండలేరని నొక్కి వక్కాణించారు. ఇలాంటి విషయాలు గురించి మరియు దేశ ఐక్యతకై అంబేద్కర్ పనిచేశారు. వారిని స్మరించుకోవడం మన బాధ్యతగా గుర్తిద్దాం... జయ్ భీమ్. - రాజశేఖర్ నన్నపనేని.
మీరు చెప్పే విషయాలకి references కూడా ఇస్తే authenticity వస్తుంది. Otherwise, it becomes just your understanding of the history.
ReplyDelete