Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

స్వాతంత్ర్య దిక్ష అభినవ భారత్ అవతరణ - Abhinav Bharat Society - సావర్కర్ జీవిత చరిత్ర - 1

స్వాతంత్ర్య దిక్ష అభినవ భారత్ అవతరణ: ఒకే దేశం ఒకే లక్ష్యం ఒకే జాతి. (అభినవ భారత ప్రతిజ్ఞ) 1883 సంవత్సరం హిందూ దేశ చరిత్రలో మరువల...

స్వాతంత్ర్య దిక్ష అభినవ భారత్ అవతరణ:
ఒకే దేశం ఒకే లక్ష్యం ఒకే జాతి. (అభినవ భారత ప్రతిజ్ఞ)

1883 సంవత్సరం హిందూ దేశ చరిత్రలో మరువలేని సంవత్సరం. 1857లో ప్రథమ స్వాతంత్ర్య సమరం విఫలమైన 25 సంవత్సరాలకే వాసుదేవ బల్వంత ఫడ్కే మరలా విప్లవ పతాకాన్ని ఎగుర వేశాడు. ఈయన ఏడెన్లో 1883 వ సంవత్సరంలో మరణించాడు. రాజకీయ స్వాతంత్ర్యమును కోల్పోయిన హిందూ జాతిపై విదేశ పాలకుల ప్రోత్సాహంతో జరుగుతున్న ముస్లిం క్రైస్తవ దాడులను త్రిప్పి కొట్టి శుద్ధి ఉద్యమంతో హిందువులకు పునరుజ్జీవనం కలిగించిన ఆర్యపమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి అదే సంవత్సరంలో మరణించాడు. వారిద్దరి అసంపూర్ణ లక్ష్యాలైన స్వరాజ్య స్వధర్మములను సాధించడానికా అన్నట్లు వినాయక దామోదర సావర్కర్ నాసిక్ నగర సమీపం లోని భగూరు గ్రామంలో 1883 సంవత్సరం మే నెల 28 వ తేదీన జన్మించాడు.

బాల్యము: వినాయక 
సావర్కర్ తండ్రి దామోదర పంత్ సావర్కర్ 1857 సంవత్సరపు ప్రథమ స్వాతంత్ర్య సమరంలో ప్రసిద్ధి కెక్కిన నానాసాహెబ్ ప్రథమ విప్లవ వీరుడు బల్వంత ఫడ్కే, లోకమాన్య బాలగంగాధర తిలక్ జన్మించిన చిత్పవన వంశంలో జన్మించాడు.

వారి పూర్వీకులు పీష్వాలచే గౌరవింపబడి రాహూరి గ్రామానికి జాగీర్దారులుగా ఉండేవారు. సంస్కృతంలో పండితులుగా పల్లకి గౌరవం పొందారు. దామోదర పంత్ రాధాబాయి దంపతుల సంతానమే గణేశ సావర్కర్, వినాయక పావర్కర్, మైనాబాయి (కుమార్తె), నారాయణ సావర్కర్లు. వినాయక సావర్కర్ ఏడవ యేట ఉపనయన సంస్కారం పొంది వేదాలు ఆరణ్యకాలులు ఉపనిషత్తులు పఠించి పదవ యేటనే వీరగాథలను కావ్యాలుగా రచించ వారంభించాడు. వినాయక 
సావర్కరు పదవ యేటనే తల్లి రాధాబాయి మరణించింది. భగూరు గ్రామములో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత అన్న గణేశ సావర్కరుతో బాటు నాసిక్ లో ఉన్నత పాఠశాలలో చేరాడు.

చాపేకర్ సోదరుల బలిదానం - సావర్కరులో విప్లవ భావాల జాగృతి: 1896-97 సంవత్సరాల్లో మహారాష్ట్ర ప్రాంతం క్లిష్ట పరిస్థితులలో ఉండేది, ఒక వైపు క్షామం మరొక వైపు ప్లేగు వ్యాధుల నడుమ ప్రజలు 
లిగి పోయారు. అనేక వేల మంది మరణించారు. దీనికి తోడు సైనికులు ప్లేగు వివారణ పేరుతో స్వేచ్ఛగా విహారం చేసి అమిత క్రూరంగా ప్రవర్తించారు. ప్లేగు కమీషనరు ర్యాండ్ ఇంకొక బ్రిటిష్ ఉద్యోగి అమెరస్థ విరంకుశ చర్యలు మితిమీరినవి. స్వాతంత్ర్య పోరాటానికి ఆటపట్టయిన పూణె నగరం అట్టుడికి పోయింది. ప్లేగు క్షామాలను లెక్కచేయక 1897 జూన్ లో విక్టోరియా రాణి వజ్రోత్సవ దినాన్ని అట్టహాసముగా జరుపుతుండగా ర్యాండ్ ఆమెరస్దను చాపేకర్ పోదరులు కాల్చి చంపారు. ద్రావిడ సోదరుల విద్రోహం వలన దామోదర పంత్ చాపేకర్ పట్టు బడినాడు. ఆయన 1898 ఏప్రిల్ 8 తేదీన భగవద్గీత చేతబూని ఉరికంబమునెక్కి మరణించాడు. దేశ ద్రోహులైన ద్రావిడ సోదరులను బాలుడైన వాసుదేవ చాపేకరు అతని స్నేహితుడు రాణడే కాల్చి చంపారు. వాసుదేవ చాపేకర్ రాణడే ఇంకొక సోదరుడు బాలకృష్ణ చాపేకర్ 1899 మే నెలలో ఉరి తీయబడ్డారు.

చాపేకర్ సోదరుల మహత్తర త్యాగం సావర్కరులోని కవిత్వ వక్తృత్వ విప్లవ వీర భావాలను జాగృతం చేశాయి. 1899 సంవత్సరం లోనే సావర్కర్ సోదర త్రయం తమ ఇలవేల్పు అష్ట ప్రహరణ ధారణి భవాని విగ్రహం పాదతలంలో భారతమాత స్వాతంత్ర్యం కోసం తమ సర్వస్వమూ త్యాగం చేస్తామని ప్రతిన పూనారు. ఈ సమయం లోనే సావర్కర్ చాపేకర్ సోదరులపై ఒక్క రాత్రిలో ఒక వీర రసపూరిత గీతాన్ని వ్రాశాడు. అప్పటి నుండి పావర్కర్కు స్వాతంత్ర్య సాధన ప్రధమం లక్ష్యమై పాఠశాలలో చదువు దానికి ఒక మార్గంగానే మిగిలి పోయినది. 1899 లో తండ్రి దామోదర పంత్ ప్లేగువలన మరణించిన తర్వాత వదిన యశోదాబాయి, అన్న గణేశ సావర్కర్ వినాయక సావర్కర్కు తల్లి తండ్రులై ఆయన భవిష్యత్తుకు రూపు రేఖలు దిద్దసాగారు.

మొదటి విప్లవ బృందం - మిత్రమేలా: ఉన్నత పాఠశాలలో చదివేటప్పుడే సాపర్కర్ వీరగాథలను కావ్యాలుగా రచింపనారంభించాడు. రచయిత పదేళ్ళ బాలుడవి తెలియకనే ప్రసిద్ధ పత్రికలు ఆయన రచనలను ప్రచురించ సాగాయి. ఉన్నత పాఠశాలలో వ్యాస రచన పోటీకిగా అత్యుత్తమైన పీష్వా ఎవరు? అనే శీర్షికతో మొదటి మాధవరావు పీష్వాను గురించి ఆయన వ్రాసిన వ్యాసం ప్రధమ బహుమతిని పొందటమే గాక, నలభై సంవత్సరాల తర్వాత మెట్రిక్యులేషన్ పరీక్షలకు పాఠ్యభాగంగా బొంబాయి విశ్వ విద్యాలయం నిర్ణయించింది. నాసిక్లో విద్యార్థిగానే సావర్కర్ సంపూర్ణ స్వాతంత్ర్య సాధనకుగా విప్లవోద్యమమునకు బీజాలు నాటినాడు. 1899 సంవత్సరంలో మొట్టమొదలుగా మహస్కర్ సాగే అను ఇద్దరు మిత్రులనే రహస్య ప్రమాణం చేయించాడు. ఆ చిన్న బృందం 1900 సంవత్సరంలో మిత్రమేళా అని అతి జాగ్రత్తగా ఎన్నుకోబడిన శక్తి సామర్థ్యాలు గల యువకులతో కూడిన విప్లవకారుల బృందంగా ఏర్పడింది. ఇదే 1904 నాటికి ప్రపంచ విఖ్యాతి గాంచిన 'అభినవ భారత్' గా అవతరించి శాఖోపశాఖలుగా పశ్చిమ మధ్య భారతములలో విస్తరిల్లి తరువాత అనేక రూపాలలో ఐరోపా కెనడా ఇంగ్లండు జపాను దేశములలో భారత స్వాతంత్ర్య సాధనకు పని చేయసాగింది.

సావర్కర్కు మెట్రిక్యులేషన్ పూర్తి కాక పూర్వమే బావురావు విప్లంకరు కుమార్తె యమునా బాయితో వివాహం జరిగినది. అన్న బాబారావు (గణేశ సావర్కర్) తర్వాత 
సావర్కర్ను అంతగా ప్రేమించి ఆయనకు అండగా నిలచినవాడు బావురావు విప్లంకరు.

పూణేలో విప్లవోద్యమ వ్యాప్తి: సావర్కర్ 1901 లో వెంట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడైన తర్వాత ఉన్నత విద్యకై 1902లో పూణెలోని ఫెర్గూసన్ కాలేజిలో చేరాడు. ఆయన అక్కడ చేరిన కొద్ది కాలానికే ఒక విప్లవ బృందం ఏర్పడి కళాశాలలోని అన్ని తరగతులను తన ఆధిపత్యం లోనికి తీసుకొన్నది. ఈ బృందం ఆర్యన్ వీక్లీ అను లిఖిత పత్రికను కూడ ప్రారంభించింది. ఇప్పటికే సావర్కర్ కాళిదాసు భవభూతి నాటకాలు, రామాయణం ఇలియడ్ మిల్టన్ వ్రాసిన ఫ్యారడైస్ లాస్ట్ వంటి ఉద్గ్రంధాలను చదివి వాటిపై విమర్శనాత్మక వ్యాసాలను వ్రాయ సాగాడు. పరాధీన జాతులు పొంద వలసిన ఏడు విధములైన పరిణామాల గూర్చి ఆయన వ్రాసిన సప్తపది అను వ్యాసం ఆనాటి మేధావులలో సైతం ఉత్సుకతను రేకెత్తించింది. ఈ సమయంలోనే అభివన భారత్ పేరుతో ప్రసిద్ధమైన, పటిష్ఠమైన విప్లవోద్యమం ప్రారంభమైంది.

విదేశీ వస్త్ర దహనం: 
సావర్కర్ బృందం తము విప్లవోద్యమానికి కార్య రూప మివ్వడానికి మొదటగా విదేశీ వస్త్ర దహన ఉద్యమాన్ని చేబట్టింది. సావర్కర్ ఆనాటి పూణెలోని నాయకులు యవ్ సి కేల్కరు, యప్ యమ్ పరంజపే, లోకమాన్య బాలగంగాధర తిలక్ లను ఒప్పించి బ్రహ్మాండమైన ఒక ఊరేగింపును ఏర్పాటు చేశాడు. బండ్ల కొలది విదేశీ వస్త్రములను తీసుకుని ఊరేగింపుగా పూణెనగర డి బొడ్డునకు చేరాడు. అక్కడ గుట్టలుగ పోయబడిన విదేశీ వస్త్రములను తగుల బెట్టిన తర్వాత నాయకులు ఉపన్యాసాలు చేశారు. ఇది 1905 అక్టోబరు 7 వ తేదీన జరిగింది. దీనికి 17 సంవత్సరాల తర్వాతనే గాంధీజీ 1921 జూలై 11 తేదీన బొంబాయిలో బహిరంగ విదేశీ వస్త్ర దహనం ఏర్పాటు చేశాడు. ఈ ఉద్యమ ఫలితంగా కళాశాల అధికారులు సావర్కర్కు పది రూపాయలు జుర్మానా వేసి ఆయనను కాలేజి హాస్టలు నుండి పంపి వేశారు.

ఈ సమయం లోనే తానాజీ బాజీ ప్రభువులపై ఆయన వ్రాసిన పాటలను బ్రిటిష్ ప్రభుత్వం విషేధించింది. మూఢాచారాలను తీవ్రంగా ఖండిస్తూ, విధవా వివాహాలను సమర్థిస్తూ పపి బాలికలను వృద్ధులు వివాహం చేసుకొనడాన్ని ఖండిస్తూ అనేక వ్యాసాలను కూడ ఆయన వ్రాశారు, క్రమంగా అభినవ భారత్ లో సంఖ్య పెరుగ సాగింది.

బొంబాయి నగరానికి వ్యాపించిన ఉద్యమం: సావర్కర్ పట్టభద్రుడై న్యాయ శాస్త్రం చదివేందుకు 1905 లో బొంబాయి చేరాడు. ఇక్కడి నుండి విహారి పత్రిక ద్వారా విప్లవ జ్వాలలను మహారాష్ట్ర అంతటికి వ్యాపింపజేశాడు. ఈ సమయం లోనే తర్వాత బొంబాయి ముఖ్యమంత్రి అయిన బి జి ఖేర్, ఆచార్య కృపలానీలు అభినవ భారత్ లో చేరారు. ఈ సమయం లోనే లండను లో స్థిరపడిన శ్యాంజీకృష్ణవర్మ ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించని దేశభక్తులైన యువకులకు ఉన్నత విద్యకు అవకాశం కల్గించి స్వాతంత్ర్య సైనికులుగా తీర్చి దిద్దడానికి కొన్ని ఉపకార వేతనాలను ఏర్పాటు చేసి ఉన్నాడు. లోకమాన్య తిలక్ ప్రతిపాదనతో పావర్కర్ కు శివాజీ పేర ఏర్పరచిన ఉపకార వేతనం లభించింది. మామగారు, చిప్లంకర్ కూడా సావర్కర్ ను ప్రోత్సహించారు. బారిస్టరు పట్టా పొందే మిషతో సావర్కర్ 1906 జూన్ 9 వ తేదీన లండనుకు బయలు దేరాడు. అప్పటికే సావర్కర్కు ప్రభాకర్ అనే ఒక కుమారుడు కలిగాడు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments