Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కాంగ్రెసు లొంగుబాటు రాజకీయాలు - తిరిగి మహమ్మదీయ రాజ్యస్థాపనకు సన్నాహాలు - Savarkar life History - సావర్కర్ జీవిత చరిత్ర - 10

కాంగ్రెసు లొంగుబాటు రాజకీయాలు - తిరిగి మహమ్మదీయ రాజ్యస్థాపనకు సన్నాహాలు "స్వాతంత్ర్య సంపాదనకు ముస్లింలీగు సహాయం చేసే యెడల ...


కాంగ్రెసు లొంగుబాటు రాజకీయాలు - తిరిగి మహమ్మదీయ రాజ్యస్థాపనకు సన్నాహాలు

"స్వాతంత్ర్య సంపాదనకు ముస్లింలీగు సహాయం చేసే యెడల భారత దేశానికంతటికీ ప్రతినిధిగా ముస్లిం లీగుకు సర్వాధికారాలు బ్రిటీషు వారు అప్పగించేటందుకు కాంగ్రెసుకు ఏలాంటి అభ్యంతరం ఉండదు." - ఎం కె గాంధి జిన్నాకు వ్రాసిన లేఖ నుండి

గాంధీ ఉద్యమాల విష పరిణామాలు: 1120లో గజనీ మహమ్మదు దాడి తర్వాత 1920 హిందూ దేశానికి అత్యంత దురదృష్టకరమైన సంవత్సరం మహమ్మదీయుల మనస్తత్వాన్నిగాని భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రముగాని, అవగాహన చేసుకోలేని గాంధీజీ ఈ సమయంలో పండు ఉద్యమాలు లేవదీశాడు. ఇవి - సహాయ విరాకరణోద్యమం, ఖిలాఫత్ ఉద్యమం, టర్కీలో ఖలీఫాకు బ్రిటీష్ వారు అన్యాయం చేశారు?" అనే మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ముస్లింలు తన సహాయ నిరాకరణోద్యమానికి సహకరించేలా చేయబూనాడు. కానీ ముస్లిం మతోన్మాదానికి తనవారు పరవారు అనే భేదం లేదనే విషయం అతి త్వరలోనే విశదమైంది. బ్రిటీష్ వారిని ఏమీ చేయలేని అసమర్ధులైన ముస్లింలకు సుసంఘటితులుకాని వివాదాలకు బానిసలైన హిందువులు అనువుగా దొరికారు. మలబారులో ముస్లింలు హిందువులపై విచ్చలవిడిగా అత్యాచారాలను జరిపారు. వేలాది హిందువులు చంపబడ్డారు. హిందూ స్త్రీల మాన ప్రాణాపహరణ వంటి దురాచారాలు జరిగాయి. బలవంతపు మత మార్పులు జరిగాయి. ఈ పాశవిక చర్యలని గాంధీజీగాని, ఆయన యువ అనుచరులుగాని ఖండించలేదు. మలబారు తర్వాత ముల్తాను లో అదే విధంగా అత్యాచారాలు జరిగాయి. తర్వాత 1924 సెప్టెంబరు 9 తేదీన కోహట్లో ఇరవై వేల మంది హిందువులను దోపిడీ చేసి, అవమానించి, నగరం వదలి పారిపోయేటట్లు చేశారు. మరల ఈ దేశంలో ముస్లిం రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్యమం నాటకానికి నాంది జరిగింది. కాంగ్రెసు వారిని బలహీమలైన హిందూ నాయకులుగా లెక్కగట్టి ముస్లింలు ప్రత్యేక రాజకీయ సంస్థని స్థాపించుకొని హిందువులను వెన్నుపోటు పొడిచే హక్కులను వరుపగా సంపాదించుకొన్నారు.

కాంగ్రెసు లొంగుబాటు రాజకీయాలు - దుష్పలితాలు

1. 1916 లక్నోలో కాంగ్రెసు, ముస్లిం లీగు నాయకులతో సంప్రదించి వారి కోర్కెలనన్నింటినీ అంగీకరించింది. దీనితో ముస్లింల ప్రతినిధిగా ముస్లిం లీగు, హిందువుల ప్రతినిధిగా కాంగ్రెసును గుర్తింపబడ్డాయి.

2. 1919 లో మతపరంగా ప్రాతినిథ్యం ఇచ్చే ఎన్నికల పద్ధతిని ఆమోదించి, ముస్లింలకు వారి జనాభాకు మించిన ప్రాతివిధ్యం కల్పించారు.

3. 1921, 1931, 1941 సంవత్సరములో జరిగిన జనాభా సేకరణను కాంగ్రెసు బహిష్కరించగా, ముస్లిలు ఒక పద్దతి ప్రకారం తమ జనాభాను ఉన్నదాని కన్నా అధికంగా నమోదు చేయించుకొన్నారు. కాంగ్రెసు యొక్క, హిందువుల యొక్క మౌఢ్యాన్ని సందుచేసుకొని అప్పుడు అధికారంలో ఉండిన ముస్లిం లీగు ప్రభుత్వం బెంగాలులో 14 శాతం ఉన్న కొండ జాతులను హిందువుల జాబితాలో చేర్చనే లేదు. కానీ, తాను బహిష్కరించిన జనాభా సేకరణలోని జనాభా అంకెలను కాంగ్రెసు మౌలికంగా అంగీకరించి పాకిస్తాన్ ను విభజించి హిందూ జాతికి తీరని ద్రోహం చేసింది.

4. 1924 లో కాంగ్రెసు ఆమోదముద్రతో కలకత్తా కార్పొరేషన్, ముస్లింలకు 100కి 60 వంతుల ఉద్యోగాలు ఇవ్వడానికి నిర్ణయించింది.

5. 1926 లో శుద్ధి ఉద్యమము సాగించినందుకు స్వామి శ్రద్ధానంద మరికొందరు హిందూ నాయకులు హత్య చేయబడ్డారు. దీని తర్వాత ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో హిందువులు ఉండలేరన్న భీతిని సృష్టించారు.

6. సంయుక్త భారతదేశాన్ని ప్రతిపాదించిన సైమన్ కమీషన్ వివేదికను, కమీషన్ కార్యక్రమాలను తాము బహిష్కరించామన్న మిషతో కాంగ్రెసు విరాకరించగా, ముస్లింలీగు దానిని ప్రతిఘటించింది. దానితో ఆ నివేదికను బ్రిటిష్ వారు త్రోసిపుచ్చి దేశ విభజనకు ప్రణాళిక వేశారు.

7. 1930లో రౌండు టేబిల్ సమావేశ సందర్భంలో గాంధీజీ ముస్లిం నాయకులకు వారి షరత్తులనన్నిటిని అంగీకరిస్తావని 'బ్లాంకు చెక్కు' వాగ్దానం చేశాడు. జిన్నా కోరిన 14 కోర్కెలను ఆమోదించాడు.

8. 1932 లో ముస్లింలకు కమ్యూనల్ అవార్డు ఇవ్వబడింది. దీనిని కాంగ్రెసు ఆక్షేపించలేదు. దీనిని అంబేద్కరు హిందువుల ఆక్షేపణలను లెక్క చేయకుండా ముస్లింలు కోరిన వాటినల్లా అంగీకరించడంగా వర్ణించాడు.

9. 1925 లో ముంబాయి నుండి సింధు ప్రాంతాన్ని, పంజాబు నుండి వాయువ్య సరిహద్దు ప్రాంతాలను విడదీసి ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడానికి కాంగ్రెసు అంగీకరించింది. దీనితో పాకిస్థాన్ గా ఏర్పడవలసిన ప్రదేశాలను గుర్తించడం ప్రారంభమైంది.

10. 1920లో ఖిలాఫత్ ఉద్యమం విఫలమైన తర్వాత కొందరు ముస్లిం నాయకులు ఆఫ్ఘనిస్థాన్ అమీరును భారతదేశం పై దండెత్తి రమ్మని ఆహ్వానాలు పంపించారు. ఇందుకు గాంధీజీ అనుంగు మిత్రులు ఆలీ సోదరులు సహకరించారు. ఈ కుట్రను గాంధీజీ ఈ విధంగా సమర్థించివాడు - 'వారు (ఆలీ సోదరులు) నేను చేయరానివని తలచే పనులు ఏమీ చేయలేదు. వారు అమీరుకు ఏదైనా సందేశం పంపి ఉంటే, అమీరును ఎదిరించి తరిమి వేయుటకు బ్రిటీష్ ప్రభుత్వం చేసే ఏ పనికీ భారతీయులు సహాయం చేయకుండా నా శక్తి మేరకు నివారిస్తాను". ఒక వైపు ముస్లింల కోర్కెలను తృప్తి పరిచేందుకు లొంగిపోతూ మరొక వైపు తాను తలపెట్టిన ఉద్యమాలు (1920 - 1930) ఘోరంగా విఫలం కావడంతో చివరికి దీన్ని ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఈ సందర్భంలో 1933లో నేతాజీ సుభాష్ చంద్రబోసు చేసిన వ్యాఖ్య గమనించ దగినది

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమర్శ: “రాజకీయ నాయుకుడుగా గాంధీజీ విఫలుడయ్యాడు అని నేను చెప్పినందుకు కొందరు మిత్రులు ఆగ్రహమూ, ఆందోళనా చెందారు. ఒక నాయకుని జయాపజయాలు ఆయన సాగించిన ఉద్యమాల జయాపజయాలపై ఆధారపడి ఉంటాయి. దాదాపు పన్నెండు సంవత్సరాలు నేను గాంధీ నాయకత్వం క్రింద పోరాడాను. సహాయ నిరాకరణోద్యమ సఫలతకు నాశక్తి కొలది సహకరించాను. కానీ, మహాత్మాజీ లేక ఇప్పటి ఆయన పద్దతి విఫలమైనదని నేను చెప్పినప్పుడు ఆయన దేశ స్వాతంత్ర్య సంపాదన లో విఫలుడయ్యాడని మా భావం నా అభిప్రాయం స్పష్టంగా ఉన్నది. సహాయ నిరాకరణోద్యమాన్ని మధ్యలో ఆపి వేయడం మన వాయకుడు చేసిన నమ్మక ద్రోహనుని నేను నమ్ముతున్నాను. మన నాయకుని ఈ చర్యను విమర్శించడానికి నాకు హక్కు ఉన్నది. ఇది 1922 నాటి బార్డోలి ఉద్యమ విరమణ తప్పిదం కన్న ఎక్కువ తీవ్రమైన తప్పిదం. మాత్రమే గాక గత 12 సంవత్సరాలలో అనుభవించిన కష్టాలను, చేసిన త్యాగాలను వమ్ముచేసింది.

గాంధీజీ నాయకత్వం దేశ భక్తులకు ఏ విధంగా నిరాశా నిస్పృహలు కల్గించిందీ, ముస్లిం మత తత్వాన్ని ఏ విధంగా రెచ్చగొట్టి దేశ విభజనకు హిందూ జన మారణ హోమానికి కారణమైందీ, పై వివరాలు స్పష్టం చేయగలవు.

సావర్కర్ సమీక్ష – హిందూ మహాసభా వేదిక స్వీకారం: 1937లో వీర పావర్కర్ రత్నగిరి నిర్బంధం నుంచిచి బయటకు వచ్చి దేశ పరిస్థితులను సింహావలోకనం చేశాడు. సమర్శడైన నాయకుడు లేని హిందువులు ఉపేక్షితులై, గమ్యం లేని త్యాగాలు చేస్తూ ఉంటే ముస్లింలు సుసంఘటితులై బ్రిటీష్ వారి సహకారంతో బలపడుతూ వచ్చారు. హైందవేతరులచే నిరాకరింపబడి, హిందువులకు మాత్రమే ప్రతినిధుల మని చెప్పుకోవడానికి సిగ్గుపడే కాంగ్రెసు బలహీనపు లొంగుబాటు ధోరణి వలన, వాయువ్య సరిహద్దు ప్రాంతం, పంజాబు సింధు బెంగాలు, అస్సాం రాష్ట్రాలను, కాశ్మీరు, భోపాలు, జూనాఘడ్, హైదరాబాదు సంస్థానాలు కలుపుకొని అఖండ పాకిస్థాన్ నిర్మాణానికి ముస్లింలు పథకాలు వేయసాగారు. ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉండే ప్రాంతాలలోను ముస్లిం పాలిత సంస్థానాలలోను హిందువులను నామ రూపాలు లేకుండా చేసేందుకు ఒక పథకం ప్రకారం అత్యాచారాలు చేయసాగారు. డాక్టరు బి ఆర్ అంబేద్కర్ మరొక సందర్భంలో చెప్పివట్లు ఆధునిక కాలంలో భారత రాజకీయాలలో అది ఒక కారు చీకట్లలో మునిగి ఉన్న కాలం. ఈ పరిస్థితులలో సమర్థ రామదాసు, శివాజీలు జపించిన స్వధర్మ స్వరాజ్య మంత్రం వీరసావర్కరు ను ఆవహించింది. కాంగ్రెస ముస్లింలీగు బ్రిటీష్ ప్రభుత్వాల కలయికను  ఛేదించడానికి ఆయన హిందూ మహాసభను రాజకీయ వేదికగా స్వీకరించాడు.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments