వీరసావర్కర్ నాయకత్వంలో హిందూ మహాసభ విజృంభణ సావర్కర్ హిందూ మహాసభ నాయకత్వ స్వీకారం దేశంలోని హిందూ సంఘటన శక్తులకు ఆత్మ విశ్వాసం, స...
వీరసావర్కర్ నాయకత్వంలో హిందూ మహాసభ విజృంభణ
సావర్కర్ హిందూ మహాసభ నాయకత్వ స్వీకారం దేశంలోని హిందూ సంఘటన శక్తులకు ఆత్మ విశ్వాసం, స్వతంత్ర ఆఖండ హిందూస్థాన్ సముపార్జన లక్ష్యసాధనకై ఆశా భావాన్ని, ఉత్సాహశక్తిని సమకూర్చింది. ఇప్పటి నుంచి హిందూ సంఘటనోద్యమం దేశాన్నంతా కదలించివేసింది.
రైఫిల్ క్లబ్బులు స్థాపించండి. జీవితంలో విలాసాలకు స్థానం ఉంది కానీ, తల్లి మరణ వేదనలో ఉన్నప్పుడు జీవితాన్ని విలాసవంతంగా గడపడం కన్నా పాపకార్యం వేరే లేదు. సావర్కర్ యవతరానికిచ్చిన ప్రథమ సందేశం.
తర్వాత 1937 నవంబరులో మధ్యప్రదేశ్ బీరారు హిందూ పనూవేశంలో మాట్లాడుతూ సావర్కర్ స్వాతంత్ర్యానికి స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చాడు.
స్వాతంత్ర్యానికి నిర్వచనం: హిందూస్థానంలో అధిక సంఖ్యాకులైన హిందూ జాతి మాత్రమే స్వాతంత్ర్యానికై త్యాగాలు చేసింది. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే బెంగాలులో కూడా హిందువులే త్యాగ జ్యోతి జ్వాలను ఆరిపోకుండా చూశారు. అండమాన్ దీవుల్లో ఖననం చేయబడివ ఎముకలు సహితం స్వాతంత్ర్య యోధులు హిందువులు మాత్రమే అని సగర్వంగా ప్రకటిస్తాయి. ఈ దేశంలో ఏదైనా సాధింపబడి ఉంటే అదంతా హిందువుల కృషి, త్యాగాల ఫలితమే. అందువలన హిందువుల సంస్కృతి సంక్షేమం గౌరవం పురోభివృద్ధి పెంపొందింప చేయగలిగిన రాజ్యాంగం మాత్రమే హిందువుల రాజ్యాంగంగా పరిగణింపబడగలదు.
1937 డిశంబరులో నాగపూరులో సావర్కర్ మాట్లాడుతూ పాకిస్థాన్ ఏర్పడగల ప్రమాదాన్ని గూర్చి స్పష్టంగా హెచ్చరించాడు. కాశ్మీరులో హిందువులున్న అపాయకర పరిస్థితులను వివరిస్తూ కాశ్మీరును కాశ్మీరు ముస్లింలకు అప్పజెప్పి వారణాశిలో దైవ ధ్యానం చేసుకోమని కాశ్మీరు మహారాజాకు ఆయాచిత హితోపదేశమిచ్చిన పెద్ద మనిషి గాంధీజీ భోపాలు నవాబును, హైదరాబాదు నిజామును తమ సంస్థానాలను హిందువులకు అప్పజెప్పి మక్కాకు పోయి నమాజు చేసుకోముని పలహా ఇవ్వలేదేమని ఆయనను ప్రశ్నించాడు. 1937 డిశంబరులోనే వీరసావర్కర్ కర్ణావతి (అహమ్మదాబాదు) లో జరిగిన అఖిల భారత హిందూ మహాసభ సమావేశాలకు అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు. ఈ అధ్యక్షస్థానం నుండి హిందూజాతి ధ్యేయాన్ని గూర్చి ఆయన ఈ క్రింది విధంగా ప్రకటించాడు.
సార్వజనీన రాజ్యాంగం: "భారత రాజ్యాన్ని పూర్తిగా భారతీయంగానే వుండ నివ్వండి ఎన్నికల హక్కులలోగానీ ఉద్యోగాల్లో కానీ పదవులకు గానీ పన్నుల విధానాల విషయంలో కానీ ఒకవ్యక్తి హిందువా? ముస్లిమా? క్రైస్తవుడా అనే సూత్రం మీద ఏలాటి భేదమూ మాపవద్దు. భారత రాజ్యంలోని ప్రతి వ్యక్తిని జనాభాలో ఆ వ్యక్తి మతస్థులు లేక జాతీయులు ఎంత శాతం ఉన్నారన్న సిద్దాంతంతో గాక అతని సొంత వ్యక్తిత్వం ఆధారంగా ఆదరించబడ నివ్వండి. ఇంగ్లండు అమెరికా వంటి ఇతర దేశాలలో ఏ విధంగా రాజ్యాంగం ఉందో అదే విధంగా ఈ దేశంలో అత్యధిక జనాభాకు ఏ భాష ఏ లిపి అర్థమవుతున్నాయో ఆ భాషను జాతీయ భాషగానూ, ఆ లిపిని జాతీయ లిపిగానూ ఉండ నివ్వండి. మత పరమైన దురభిమానంతో భాషను లిపిని సంకరం చేసి ఆ సంకరమైన వాటిని బలవంతంగా ప్రజలందరిపై రుద్దవద్దు. కులం, సంప్రదాయం, జాతి, మతం వంటి వాటితో సంబంధం లేకుండా ఒక మనిషికి ఒక ఓటు అనే దాన్ని సార్వజనీన సిద్దాంతంగా ఉంచండి. అటువంటి భారత రాజ్యాంగాన్ని ధ్యేయంగా ఉంచితే హిందూ సంఘటన వాదులు హిందూ సంఘటన శ్రేయస్సు కొరకై దానికి హృదయ పూర్వకంగా విధేయుతము చూపటానికి ప్రప్రథములుగా ఉంటారు.
జాతీయ ఐక్యత - హిందువుల దృక్పధం: హిందూ ముస్లిం ఐక్యతకు జరిగిన ప్రయత్నాల్లో ముస్లింలు ఏ విధంగా మత దురభిమానంతో హిందువులపై తమ ఆధిపత్యాన్ని రుద్దడానికి ప్రయత్నించింది వివరిస్తూ ఆయన హిందూ ముస్లిం ఐక్యత అనేది ఉభయ పక్ష శ్రేయకరంగా ఉండాలి. భారతదేశం పర పరిపాలనలో ఉంటే ముస్లింలు కూడా బానిసలుగా ఉంటారవే విషయం వారు గుర్తించి స్వాతంత్ర్య సంపాదనలో హిందువులకు సహాయ పడుతున్నామనే భావనతో గాక తమకు తాము సహాయం చేసుకొంటున్నామనే భావంతో స్నేహ హస్తాన్ని జాచితేనే శ్రేయస్కరమైన సంఘీభావం సాధ్యం' అని చెప్పి ఇక మీదట హిందూ ముస్లిం ఐక్యతకు ఏకైక సూత్రం ఏమిటంటే -
మీరు వచ్చినట్లయితే మీతో కలిసి
మీరు రాని యెడల మీరు లేకుండానే
మీరు వ్యతిరేకించి ప్రతి రోధకులైనప్పటికి
హిందువులు తమ జాతీయ స్వాతంత్ర్యము కొరకు తమ సర్వ శక్తులను, సామర్థ్యాన్ని వినియోగించి పోరాటాన్ని కొనసాగిస్తారు అని ప్రకటించాడు. అంతేకాదు -
ఆ సింధు సింధు పర్యంతమైన ఈ భారత భూమిని పితృభూమిగా పుణ్యభూమిగా భావించే హిందువులు ప్రపంచ జాతులన్నిటికన్నా విలక్షణమైన సాంఘిక సాంస్కృతిక లక్షణాలు కలిగిన ప్రత్యేకవెపైన జాతిగా ఉన్నారు. 'హిందూ మహాసభ సాంఘిక సాంస్కృతిక రాజకీయ రంగాలలో హిందూజాతి భవిష్యత్తును తీర్చిదిద్దే హిందూ రాష్ట్రసభే కానీ హిందూ ధర్మసభ కాదని సావర్కర్ స్పష్టం చేశాడు.
అహమ్మదాబాదు హిందు మహాసభ సమావేశ అధ్యక్షపీఠం నుండి సావర్కర్ ఇచ్చిన హిందూ రాష్ట్రవాద సందేశం విద్యుత్ తరంగం లాగా దేశం నలుమూలలకు ప్రాకింది. ఆ సమయంలో ఒక వైపు ముస్లింలు కాంగ్రెసు, బ్రిటీష్వారు ముస్లింలను సంపూర్ణంగా తృప్తి పరచనిదే స్వరాజ్యం లేదు అనే నినాదంతో దేశ విభజన వైపునకు త్రోవతీస్తూండగా మరొక వైపు హిందూ మహాసభ మీరు కలసి వచ్చిన మీతో కలసి, మీరు రాకున్న మీరు లేకుండా, మీరు ఎదిరించిన మిమ్ములను గూడ ఎదిరించి హిందువుల స్వధర్మం ఆత్మగౌరవాలతో మనగల స్వతంత్ర హిందూ స్థానాన్ని హిందూజాతి సాధిస్తుంది. అనే నినాదంతో భారత రాజకీయరంగంలో ప్రముఖ స్థానాన్ని వహించింది.
ప్రజలను ఉజ్జీవింపజేసిన సావర్కర్ పర్యటనలు: 1938 ఫిబ్రవరిలో సావర్కర్ ఢిల్లీకి వెళ్ళాడు 1761లో మహారాష్ట్ర సేనాని భావో ఢిల్లీ ప్రవేశాన్ని ఇది జ్ఞప్తికి తెచ్చింది. అక్కడి నుంచి కాన్పూరు ఫైజాబాదు, ఆగ్రా, బారాబంకి ,లక్నో, షోలాపూరులను వాయువేగంతో చుట్టి పంజాబు ప్రవేశించి లాహోరు, అమృత సర్ల లో సిక్కు సహిత హిందూ జనతను ఉత్తేజ పరచాడు. అమృతపర్ లో సిక్కులు ఆయనకు కృపాణాన్ని బహూకరించి ఆయన ఉద్యమానికి తమ అండదండలు ఉన్నవని చాటారు. అక్కడి మంచి అజ్మీరు, నాసిక్, గ్వాలియర్, జోధపూర్, సింధూ రాష్ట్రములలో పర్యటించారు. పాకిస్థాన్ అవతరణకు ముందస్తు తయారీగా గాంధీ ముస్లింల సంతృప్తి కొరకు సింధు రాష్ట్రమును బొంబాయి నుండి విడగొట్టించాడు. దీనితో అది ముస్లింలు అధిక సంఖ్యగల రాష్ట్రంగా మారింది. దానితోనే ఆ కొత్త రాష్ట్రంలో హిందువులపై అత్యాచారాలు ఉధృతం అయ్యాయి. సావర్కర్ ఆ రాష్ట్రంలోని హైదరాబాదు (సింధు) పక్కూరులలో పర్యటించి హిందువులలో ఆత్మ స్థైర్యాన్ని పమరోత్సాహాన్ని కల్గించాడు. 1938 సెప్టెంబరు కల్లా సావర్కర్ ఉత్తర హిందూస్థాన మంతటా పర్యటించి హిందూ మహాసభను బలీయమైన రాజకీయ పక్షంగా రూపొందించాడు. అదే సమయంలో నైజాంలోని హిందువుల ఆక్రందనం సావర్కర్ దృష్టిని హైదరాబాదు (దక్కను) వైపు ఆకర్షించింది.

No comments