Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

విప్లవ శంఖారావం - Savarkar Life History - సావర్కర్ జీవిత చరిత్ర -2

విప్లవ శంఖారావం ధర్మంకోసం ప్రాణ త్యాగం చేయి - కానీ మరణిస్తూ మరణిస్తూ నీ ధర్మానికి శత్రువులైన వారి ప్రాణాలు తీసి మరీ మరణించు ఇలా...


విప్లవ శంఖారావం

ధర్మంకోసం ప్రాణ త్యాగం చేయి - కానీ మరణిస్తూ మరణిస్తూ నీ ధర్మానికి శత్రువులైన వారి ప్రాణాలు తీసి మరీ మరణించు ఇలా పోరాడి సంహరించి నీ రాజ్యాన్ని మళ్లీ సంపాదించు. - సమర్థ రామదాసు.


లండనులో విప్లవ కార్య కలాపాలు: 1906 జూలై మొదటి వారంలో సావర్కర్ లండను చేరాడు. పండిత శ్యాంజీ కృష్ణవర్మ స్థాపించిన ఇండియా హౌజ్' లో వివాసం ఏర్పాటు అయింది. న్యాయ శాస్త్ర కళాశాల గ్రేవ్ లో చేరినాడు. అండనులోని భారతీయ యువకులను సమీకరించి తన ఉద్యమానికి అర్హులైన వారితో రహస్య బృందాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు. ఈ బృందంలో భాయి పరమానంద, లాలా హరదయాళ్, సేవాపతి బాపట్, వీరేంద్ర నాధ చట్టోపాధ్యాయ, జె పి ముఖర్జి, జ్ఞాన్ చంద్ వర్మ, యస్ ఆర్ రాణా, మాడమ్ కామా, వి వి యస్ అయ్యర్, యం పి టి ఆచార్య, హర్నామ్ సింగ్ ముఖ్యంగా చెప్పుకో తగినవారు. ఈ కాలములో సావర్కర్తో సన్నిహితంగా ఉండిన ముస్లింలలో అబ్దుల్లా సుహ్రావర్దీ, ఆర్ యమ్ ఖాన్, మీర్జా అబ్బాస్ అసఫ్ ఆలీ, సికందర్ హయ్యత్ ఖాన్ ముఖ్యులు కానీ ముస్లిం మత నాయకులు వీరిని స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనకుండా ఒత్తిడి చేయసాగారు. 1909 లో శ్యాంజీ కృష్ణవర్మకు వ్రాసిన ఒక లేఖలో అసఫ్ ఆలీ ఈ విధంగా వ్రాశాడు - నేను ఇప్పుడు జాతీయ వాదులతో సహకరించడాన్ని సహించలేని కొందరు ముస్లిం మిత్రులతో కలసి ఉంటున్నాను. సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు నేను వారిని అనవసరంగా రెచ్చగొట్టదలచడం లేదు.

విప్లవ కార్యాచరణకు పూనుకొనిన సావర్కరు ముందుగా ఐరోపాలోని వివిధ విప్లవ కారులతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని బాంబులు, ఇతర మారణాయుధాలు తయారుచేస్తూ రహస్యోద్యమాలు నడుపుతూ సాహిత్యాన్ని, ఆయుధాలను సేకరించి వాటివి భారత దేశానికి పంపసాగాడు. ఇవి భారత దేశంలోని విప్లవ బృందాలకు చేరేవరకు ఇంగ్లండులో విప్లవోద్యమం రహస్యంగా ఉంచబడింది. విప్లవ వీరుల ఉద్రేకం అంతర్వాహిని గానే ఉండింది.

'ఇండియా హౌస్' లో గాంధీజీ: 1906 అక్టోబరులో గాంధీజీ లండనుకు వచ్చి మొదట 'ఇండియా హౌస్' లో దిగారు కానీ రెండు రోజులకే ఆ ఉద్రిక్త వాతావరణంలో ఆయన ఇమడ లేక మూడవ రోజున ఆ రోజులలో లండనులో అతి విలాస వంతమైన హోటలకు బస మార్చు కొన్నారు.

తరువాత ఒక ఆదివారం సాయంత్రం గాంధీజీ  ఇండియా హౌస్ కు పోయారు. అప్పుడు సావర్కర్ వంటపనిలో నిమగ్నుడై రొయ్యల వేపుడు చేసుకొంటూ ఉన్నాడు. ఆ సమయంలో గాంధీజీ రాజకీయ విషయాలు చర్చించబోగా రాజకీయాలు తర్వాత ముందు భోజనం చేద్దాం రండి అని సావర్కర్ ఆహ్వానించాడు. అందుకు గాంధీజీ తాము శాకాహారి నని చెప్పగా సావర్కర్ నవ్వుతూ మాతో కలసి భోజనం చేయలేనప్పుడు, మాతో కలసి ఎలా పని చేయగలరు? ఇక్కడ వుండేది ఉడికించిన చేపలు మాత్రమే మాకు కావలసింది బ్రతికి వున్న బ్రిటిష్ వారిని నమిలి మ్రింగడానికి సమర్శలైన వారు" అని అన్నాడు. గాంధీజీ వెంటనే అక్కడి నుండి వెళ్లి పోయారు.

మరల 1909 అండనుకు గాంధీజీ వచ్చినప్పుడు దసరా ఉత్సవానికి అధ్యక్షత వహించడానికి రమ్మని వి వి యప్ అయ్యర్ ఆహ్వానించినప్పుడు తనకు ప్రత్యేకంగా శాకాహారం ఏర్పాటు చేయాలని ముందుగనే చెప్పుకొన్నాడు. కాని ఆ రోజు కూడ ఘర్షణ తప్పలేదు. గాంధీజీ రాముని ఆదర్శవంతమైన వ్యక్తిత్వం గూర్చి మాట్లాడగా, సావర్కర్ శ్రీరాముని అవతార లక్ష్యం దుష్ట శిక్షణ, ధర్మ రక్షణగా వర్ణించారు.

సావర్కర్ – లెనిన్: 1909 మార్చి మొదటి పక్షంలో సావర్కర్ అనుయాయుడైవ బ్రిటిష్ జాతీయుడు (తండ్రి ఆంగ్లేయుడు, తల్లి ఐరిష్ వవిత) గైఏ ఆల్ ట్రెడ్ అజ్ఞాత వాసంలో ఉన్న ఒక రష్యన్ విప్లవకారుని సావర్కర్తో మాట్లాడటానికి ఇండియా హౌప్ కు తీసుకొని వచ్చాడు. ఈ విప్లవకారుడు అటు రష్యా ఇటు బ్రిటిష్ గూఢచారుల కండు కప్పి మారు పేరుతో, మారువేషంతో సంచరించే వాడు . ఈ ఇద్దరు విఖ్యాత విప్లవ కారులు మూడు నాలుగు సార్లు ఇదే విధంగా కలుపుకొని రాజకీయ, ఆర్థిక విషయాలపై, విప్లవ విధానాలపై ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు కూడా చర్చించు కొన్నారు. కొంత సమయం వారిద్దరే రహస్యంగానూ, తరువాత ఇతర భారత విప్లవ కారులతో కలపి చర్చలు జరిపినారు. ఒక సమావేశంలో మదవ్ లాల్ ధింగ్రా కూడా పాల్గొన్నాడు. ఈ రష్యన్ విప్లవ కారుడే నవ రష్యా నిర్మాత లెనిన్.

స్వదేశంలో విప్లవ కార్యకలాపాలు: లండన్ లోని సావర్కర్ బృందంనుండి విప్లవ సాహిత్యం ఆయుధాలు చేరడంతో మహారాష్ట్రలో విప్లవోద్యమ౦ ఉదృతమైంది. బాంబుల పిస్తోళ్ళ మోతలు బ్రిటిష్ వారిని భయకంపితులను చేశాయి. బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించినందుకు ఉత్తేజకరమైన విప్లవ గీతాలు వ్రాసినందుకు గణేశ పావర్కర్ నిర్బంధింపబడ్డాడు. "దయయుంచి తెలుపండ్ని యుద్ధం చేయక ఎవరైనా రాజకీయ స్వాతంత్ర్యం సాధించుకొన్నారా?" అని ఒక ఉద్రేక పూరితమైన గీతంలో ప్రజలను ప్రశ్నించారు గణేశ పావర్కర్.

గణేశ సావర్కర్ 1908 జూన్ నెలలో యావజ్జీవ ద్వీపాంతర వాస శిక్ష విధింపబడింది. ఈ విషయం లండన్ లో వినాయక్ పావర్కర్కు తెలియగా నే తన వదిన యశోదాబాయికి ఈ క్రింది విధంగా సాంత్వన సందేశం పంపించాడు.

“మన మాతృ దేశం పారతంత్ర్యమనే మొసలి పట్టును వదలించుకొనేందుకు భగవంతుని సహాయం అర్థిస్తూ మన తోటలోనికి వచ్చి మన చెట్టు కొమ్మపై వున్న ఒక పవిత్రమైన, నవ నవోవ్మేషమైన పుష్పాన్ని త్రుంచి ఆయన పాద సన్నిధిని ఉంచింది. మన ఈ త్యాగ పరిమళం దిగంతాలకు వ్యాపించ గలదు.

ఓ సోదరీ, శ్రద్ధగా గమనించు ఒక వైపు గతించిన మహాత్ముల మహాఋషుల, మన జాతి గర్వించదగిన మహావీరుల ఆత్మలు గతాన్ని పరికిస్తూ విలచి ఉన్నవి మరియొక వైపు ఇంకా జన్మించని భావి తరాలు ఉన్నవి.

మాతృ దేశ బంధ విముక్తికై ఏ కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఆత్మార్పణం చేస్తారో, మానవుని పురోగతి సంక్షేమాలకై తమ త్యాగ పరిమళాలతో దిగంతాలను నింపుతారో ఆ కుటుంబానికి మరణమే లేదు ".


1908 సంవత్సరానికి భారతదేశంలో విప్లవోద్యమం పతాక స్థాయికి చేరుకొంది. ఇంగ్లీషు వారు ఎంత ఘోర కృత్యాలకు పాల్పడితే విప్లవ వీరులు అంతగా దెబ్బకు దెబ్బ కొట్ట సాగారు. 1908 జూలైలో లోకమాన్య బాల గంగాధర తిలక్ మాండలే ప్రవాసానికి పంపబడ్డాడు. అటు బెంగాల్ లో కూడా విప్లవోద్యమం విజృంభించింది. ఖుదీరామ్ బోస్ త్యాగం అనుపమానమైనది. పోలీసులు ప్రపుల్ల కుమార్ చాకీ తలను తెంచి స్పిరిటు పోసిన గాజు జాడీలో ఉంచి పోలీసు స్టేషన్లో ప్రదర్శించారు. ఆనాటి రాజకీయ స్థితిని సమీక్షిస్తూ లండను టైమ్సు పత్రిక ఇట్లా వ్రాసింది.

"ఉద్రేక స్వభావుడైన బెంగాలీ తన వీరకృత్యాలను దర్శించవలసినదిగా ప్రపంచాన్నంతా పిలుస్తాడు. వాస్తవవాదియైన చిత్పనవ బ్రాహ్మణుడు (సావర్కర్ మొదలగువారు) నిశ్శబ్దంగా పని చేస్తాడు. దక్కను ప్రాంతమంతా రహస్య సంఘాలు తేనే  తుట్టెల వలె అల్లుకొని పోయి ఉన్నాయి. బెంగాలీలు వివాదాలు ఎక్కువగా చేస్తారు. బెంగాలీ అతివాదులకు పూణె మేధా సంపద మార్గదర్శకం."

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments