Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మదన్ లాల్ ధీంగ్రా ఆత్మాహుతి - Savarkar Life History - సావర్కర్ జీవిత చరిత్ర -3

మదన్ లాల్ ధీంగ్రా ఆత్మాహుతి మా వీరుల హృదయాలలో దేశభక్తి మిగిలి ఉన్నంత కాలం హిందూస్థానపు ఖడ్గం తీక్షణంగానే ఉంటుంది. ఒకానొక రోజున అ...


మదన్ లాల్ ధీంగ్రా ఆత్మాహుతి

మా వీరుల హృదయాలలో దేశభక్తి మిగిలి ఉన్నంత కాలం హిందూస్థానపు ఖడ్గం తీక్షణంగానే ఉంటుంది. ఒకానొక రోజున అది లండన్ నగరంలోకి దూసుకు పోతుంది. (బహదూర్ షా - 1857)

గణేశ సావర్కరుకు యావజ్జీవ కారాగార శిక్షావార్తతో లండన్ లోని విప్లవకారుల సహనం నశించి పోయింది. మొదటి దెబ్బ తీయడానికి మదన్ లాల్ ధీంగ్రా ఎన్నుకోబడ్డాడు. అంతకు ముందు ఒకసారి మదన్ లాల్ ఆత్మత్యాగానికి సమయ మాసన్నమైనదా? అని సావర్కరు ని అడుగగా ఆత్మార్పణం చేయబూనిన వాడు సంకల్పంతో అందుకు సిద్దమైతే ఆత్మత్యాగానికి సమయమాసన్నమైనట్లే అని ఆయన జవాబు చెప్పాడు. ధీంగ్రా మొదట లార్డు కర్జన్  ను ఒక సభలో చంపాలని నిర్ణయించు కొన్నాడు, కాని సభలోనికి ప్రవేశం వీలుకాక పోవడంతో ఆ పథకం సఫలం కాలేదు. తర్వాత సర్ కర్జన్ విల్లీని హత మార్చ నిశ్చయమైంది ధీంగ్రాకు నికిల్ ప్లేటు వేయబడివ రివాల్వరు ఇస్తూ " ఈ సారి తప్పినావా నీ ముఖం నేను చూడము అవి సావర్కర్ హెచ్చరించాడు. 1909 జూలై 1 తేదీన ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ హాలులో జరుగుతున్న ఒక సభలో పాల్గొంటున్న కర్జన్ విల్లీని గురి తప్పకుండా కాల్చి చంపాడు మదన్ లాల్ ధీంగ్రా వెంటనే ధీంగ్రా అరెస్టు చేయబడ్డాడు.

సావర్కర్ గర్జన: మదన్ లాల్ ధీంగ్రా సాహస కార్యంతో లండను నగరం దద్దరిల్లింది. బ్రిటిష్ వారికి విధేయులైన కొందరు భారతీయులు ఒక సంతాప సభ జరిపారు. ఆ సభకు అధ్యక్షత వహించిన సర్ ఆగాఖాన్ ధీంగ్రా చర్యను ఖండిస్తూ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తోంది అని ప్రకటించాడు. వెంటనే కాదు, ఏకగ్రీవంగా కాదు అనే గర్జన సభలో నుండి వినిపించింది. " అలా అనేది ఎవరు? ' అనే అధ్యక్షుని ప్రశ్నకు నేను నా పేరు సావర్కర్ అవే జవాబు రాగానే విప్లవకారులు ఆ సభలో బాంబులు వేయ బోతున్నారనే భీతితో ఎక్కడి వారు అక్కడ చిల్లా పిల్లాగా పరుగెత్తి పోయారు.

ధీంగ్రా జ్వలిత సందేశం: మదన్ లాల్ ధీంగ్రా బ్రిటిష్ వ్యాయస్థానంలో ఈ విధంగా ప్రకటించాడు.  దేశ భక్తులైన భారతీయ యువకులను ఉరి తీయడం, ద్వీపాంతర వాస శిక్షలకు గురి చేయడం వంటి అమానుషమైన అత్యాచారాలకు ప్రతీకారంగా ఇంగ్లీషు వారి రక్తాన్ని ప్రవహింప చేయుడానికి చేసిన ఈ ఉద్యమాన్ని నేను అంగీకరిస్తున్నాను. పర దేశీయులు ఆయుధ బలంతో ఒక జాతివి బానిసత్వంలో ఉంచినంతకాలం ఆ జాతి తన విమోచనకు పోరాటం సాగిస్తూనే ఉంటుంది. ఆయుధాలు లేని జాతి బహిరంగంగా యుద్ధం చేయలేదు కాబట్టి, నేను మెరపు దాడి చేశాను, నాకు తుపాకులు అందుబాటులో లేవు కాబట్టి పిస్టలుతో కాల్చాను హిందువునైన నేను నా జాతికి జరుగుతున్న ఈ అవమానాన్ని భగవంతునికే జరుగుచున్న అవమానంగా భావిస్తున్నాము. భగవంతునికి నా తుది ప్రార్ధన ఏమిటంటే ఇదే జనవి గర్భంలో మరల మరల జన్మించి నా ధ్యేయం సిద్దించి నా జనని మానవ కళ్యాణానికై భగవంతుని దివ్యకీర్తి ప్రకాశానికై స్వాతంత్ర్యంతో వర్దిల్లే వరకు మరల మరల మరణించాలన్నది మాత్రమే.

ఈ మదన్ లాల్ ధీంగ్రా ప్రకటన ప్రపంచానికి తెలియకుండా చేయడానికి బ్రిటిష్ పోలీసులు విశ్వ ప్రయత్నమే చేశారు. ధీంగ్రా ఇంటిలో ఉండిన ప్రతిని ఆయన వద్దనే ఉండిన ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కానీ ఆ ప్రకటనను రూపొందింప జేయడంలో ముఖ్య పాత్ర వహించిన సావర్కర్ వద్ద మూడవ ప్రతి ఉన్న విషయం వారు తెలుసుకోలేక పోయారు. జూలై 22 తేదీన సావర్కరు ధీంగ్రాను బ్రిస్టల్ జైలులో కలుసుకొన్నాడు. తన ప్రకటన ప్రపంచ దృష్టికి వచ్చిందన్న ఆత్మ సంతృప్తిని ధీంగ్రాకు కలిగించడానికి సావర్కర్ నిర్ణయించు కొన్నాడు. ఫలితంగా డైలీ న్యూస్ పత్రికలో పని చేస్తున్న ఒక ఐరిష్ సహాయ సంపాదకుని సహాయంతో ధీంగ్రా పూర్తి ప్రకటన ఛాలెంజ్ అనే శీర్షికతో 1909 ఆగస్టు 16 తేదీన ఆ పత్రికలో వెలువడింది.

1909 ఆగస్టు 17వ తేదీన మదన్ లాల్ ధీంగ్రా ఉరితీయబడ్డాడు. అతని చివరి కోరిక హిందూ సంప్రదాయం ప్రకారం నన్ను దహనం చేయాలి, నా శరీరాన్ని హైందవేతరులు తాకరాదు నా దుస్తులు, వస్తువులు ఇతరములు జాతీయ విధికి సమర్పించాలి. ఇటువంటి దేశభక్తుని హిందూ దేశం తప్ప ఏ దేశం కని యుండలేదు కదా!! కానీ ధీంగ్రా భౌతిర కాయాన్ని జైలు ఆవరణలోనే  ఖననం చేశారు. అదే సమయంలో గ్లాస్కో నగరంలో ఆ రోజులలో 35 లక్షల రూపాయలు విలువ చేసే ప్రత్తిమిల్లు బ్రహ్మాండమైన అగ్ని జ్వాలలో మసి అయిపోయింది. దీనిని ధీంగ్రా దహన క్రియగా విప్లవకారులు భావించారు.

నాటి నాయకుల మనస్తత్వం: ధీంగ్రా ఆత్మార్పణం జరిగిన సమయంలో జవహర్ లాల్ నెహ్రూ ఇంగ్లండులోనే ఉన్నప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ విప్లవ వాదులకు దూరంగా ఉండిపోయారు. అంతే కాదు తర్వాత ఆయన వ్రాసుకొనిన ఆత్మ చరిత్రలో ఈ మహత్తర సంఘటనను గూర్చి ఒక్క మాట కూడ వ్రాయలేదు. గాంధీజీ - ఈ ధీంగ్రా చర్య వల్ల గానీ భారతదేశంలో జరిగే అటువంటి చర్యల వలన గానీ భారతదేశం లాభం పొందుతుందని నమ్మేవారు చాల తీవ్రమైన పొరబాటు చేస్తున్నారు. ధీంగ్రా దేశభక్తుడు కావచ్చు కానీ అతని దేశ ప్రేమ గుడ్డి ప్రేమ అతను తన జీవితాన్ని తప్పు దారిన నడుపుకొన్నాడు దాని ఫలితం వినాశనం మాత్రమే ' అవి వ్యాఖ్యానించినారు. అప్పటికి గాంధీజీకి సంపూర్ణ స్వాతంత్ర్య సాధన అనే భావమే లేదు 1929లో కాబోలు కాంగ్రెసు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని తీర్మానించింది. బ్రిటిష్ రాజకీయ వేత్త లాయడ్ జార్జి చర్చిల్తో ధీంగ్రా చాలా గొప్ప దేశభక్తుడని చెప్పగా చర్చిల్ అందుకు అంగీకరించి, ధీంగ్రా తుది పలుకులు దేశభక్తి పేరిట చెప్పబడిన మహావాక్యాలలో అపూర్వమైనవి అన్నారు.

ధీంగ్రా కర్జన్ విల్లీని హతమార్చిన రోజున సోదరి వివేదిత ఫ్రాన్సులో ఉండటం కాకతాళీయం మాత్రమే కాని బెంగాల్ విప్లవ కారులతో పన్నిహిత సంబంధం కలిగియుండిన సోదరి వివేదిత ఆనాడు ఫ్రాన్సులో ఉండడాన్ని కొందరు విప్లవ చరిత్ర కారులు ప్రముఖంగా పరిగణించారు.

మదన్ లాల్ ధీంగ్రా సాహస కృత్యం తర్వాత భారత స్వాతంత్ర్యోద్యమం నూతన ఘట్టంలో ప్రవేశించింది. వీర సావర్కరు పై బ్రిటిష్ వారు తమ దుష్ట దృష్టి కేంద్రీకరించారు. ఈ సందర్భంలో సావర్కర్ వ్యక్తిత్వంను గురించి ఒక విషయం చెప్పాల్సి ఉంది. సర్ కర్జన్ విల్లీ శవాన్ని చూచి విలపిస్తున్న అతని భార్యను చూచి సావర్కర్ సహచరుడొకడు పకపకా నవ్వాడు అది చూచి సావర్కర్ ఒక పతి తన భర్తకై విలపించడం, నీకు ఆనందదాయకంగా ఉందా నీవు నమ్మదగిన వాడవు కావు అని అన్నాడు, ఆ మాట నిజమైంది ఇతడు తర్వాత దేశ ద్రోహిగా మారి సావర్కర్కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చాడు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments