Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సవ్యసాచి సావర్కర్ - Savarkar Life History - సావర్కర్ జీవిత చరిత్ర - 4

సవ్యసాచి సావర్కర్ లేదు ఒక విప్లవ యుద్ధానికి స్వాతంత్ర్యమో లేక మరణమో తప్ప యుద్ధ విరమణలు సంధులు లేవు. ఓ సాటిలేని త్యాగధనులారా మీ వ...

సవ్యసాచి సావర్కర్

లేదు ఒక విప్లవ యుద్ధానికి స్వాతంత్ర్యమో లేక మరణమో తప్ప యుద్ధ విరమణలు సంధులు లేవు. ఓ సాటిలేని త్యాగధనులారా మీ వద్దవున్న పరిమితమైన సాధనాలతో నియంతృత్వం మీదే కాదు, నియంతృత్వం దేశ ద్రోహాల కలయిక పైన గూడా యుద్ధంసాగించ కంకణం బూనండి. (ఖాల్సా లో వీర పావర్కర్)

సావర్కర్ ఒక చేత పిస్టలు ఇంకొక చేత పెన్నుతో విప్లవోద్యమాన్ని నడిపించాడు. ఆయన వక్తృత్వం ఎంత విశితమైనదో ఆయన కలం అంతకన్న తీవ్రమైనది. లండన్ చేరిన మొదటి ఆరు నెలలలోనే, ఇటలీ విప్లవ నాయకుడు మాజినీ ఆత్మకథను మరాఠీలోనికి అనువదించాడు. ఇది మహారాష్ట్రలో ఎంత ప్రాచుర్యం పొందిందంటే సర్ వాలెంటైన్ ఛిరోలు దానిని "జాతీయవాదుల పాఠ్య పుస్తకం" అని వర్ణించాడు. ఈ పుస్తకం ప్రభుత్వంచే నిషేధింపబడింది. ఈ నిషేధం 40 సంవత్సరముల తర్వాత మాత్రమే తొలగింపబడింది. తర్వాత ' ఖాల్పా' అను పేరుతో గురుముఖిలో సిక్కులను సైనికులను ఉద్దేశించి ఒక కరపత్రాన్ని ప్రచురించాడు. తర్వాత చారిత్రాత్మకమైన “ప్రధమ స్వాతంత్ర్య సమరం'" రచింప బూనాడు.

ప్రధమ స్వాతంత్ర్య సమర చరిత్ర: 1857 సంవత్సరంలో బ్రిటిష్ వారిపై జరిగిన భారత సైనికుల తిరుగుబాటు విషయమై, బ్రిటిష్ మ్యూజియంలో ఉండిన అసలు వ్రాత ప్రతులను లేఖలను పత్రాలను వారాల తరబడి పరిశీలించి మరాఠీ భాషలో ప్రధము భారత స్వాతంత్ర్య సమరం వ్రాతప్రతిని సిద్ధం చేసి ముద్రణకై భారతదేశం పంపించాడు. భారతదేశంలో ఆ పుస్తకాన్ని ముద్రించి ప్రచురించడం అసాధ్యమైంది. పసి కట్టిన సిఐడీలు మహారాష్ట్రలోని ముద్రణాలయాలపై దాడులు చేయసాగారు. అదృష్టవశాత్తు వ్రాతపతిని ప్యారిస్కు చేర్చగలిగారు. మరాఠీ భాషలో ముద్రణ కష్టతరమైనందున ఆంగ్ల భాషలోనికి అనువాదం చేయబడింది. వి వి యస్ అయ్యర్ సారధ్యంలో ఐపియస్ పరీక్షకు చదువుతున్న కొందరు మరాఠీ యువకులు ఈ అనువాదం చేశారు. ఇంగ్లండులోని స్కాట్లండు యార్డు పోలీసులు ఈ అనువాదంలో కొన్ని భాగాలను సంపాదించారు. వీటిని విప్లవాత్మకమైన, శక్తివంతమైన ప్రేలుడు పదార్థం అని వారు గగ్గోలు చేశారు. ఈ పుస్తకం అప్పటికి ఇంకా ప్రచురింపబడలేదు. అయినప్పటికి బ్రిటిష్ ప్రభుత్వము ఆ పుస్తకాన్ని నిషేధించింది. ప్రచురణ కాకుండానే పుస్తకం నిషేధింపబడటం ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అపూర్వం.

ఐరోపా, అమెరికా పత్రికలే కాక బ్రిటన్లోని కొన్ని పత్రికలు కూడా దీనిని బ్రిటిష్ వారి సిగ్గుమాలిన పని అని వర్ణించాయి. సావర్కర్ అభినవ భారత సంఘం ఈ నిషేధాన్ని ఒక సవాలుగా తీసుకొన్నారు. బ్రిటిష్ పోలీసులు ఇంగ్లండులోనే గాక ఫ్రాన్సు జర్మనీలలో కూడా ఈ పుస్తకం ప్రచురణ కాకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. కానీ పుస్తకం హాలెండులో 1909 సంవత్సరంలో ప్రమరింపబడింది. ప్రచురణే కాదు, ప్రతులను మన దేశంలో నలుమూలలకు పంపడం కూడా అపూర్వంగా జరిగింది. పిక్విక్ పేపర్పు స్కాటు రచనలు వంటి ప్రాచుర్యం పొందిన ఇంగ్లీషు పుస్తకాల అట్టలతో ఇండియా అమెరికా జపాన్ చైనాలకు ఇవి వేరాయి. ఆ రోజులలో ఒక్కో పుస్తకం 300 రూపాయలకు అమ్ముడైంది. దేశ దేశాలలో ఈ పుస్తకం గురించి చర్చలు జరిగాయి అనేక భాషలలో అనేక ముద్రణలు జరిగాయి. ఈ పుస్తకం విప్లవ కారులకు 'గీత' వలె అయింది. సర్దార్ భగత్సింగు ప్రచారం కొరకు, నిధుల కొరకు భారతదేశంలో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. 1942లో జర్మనీలో జర్మన్ భాషలో ప్రచురింపబడింది. 1943లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ పుస్తకం నుండి స్ఫూర్తితో భారత జాతీయ సైన్యం విభాగాలకు పేర్లు నినాదాలు పాటలు విర్ణయించాడు. ఈ పుస్తకం పై నిషేధం 1947 సంవత్సరంలో తొలగింపబడింది. 38 సంవత్సరాలు నిషేధంలో ఉండి అంత ప్రాచుర్యం పొందిన పుస్తకం మరేదీ లేదేమో!

దీని తర్వాత సావర్కర్ ' శిక్కుల చరిత్ర ' అనే పుస్తకాన్ని 1909లో పూర్తి చేశాడు. కానీ వ్రాత ప్రతి పోలీసుల చేతిలో పడి పోయింది, అందువలన పుస్తకం ముద్రణ కాలేదు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments