Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మృత్యు పత్రం - Savarkar life History - సావర్కర్ జీవిత చరిత్ర - 5

మృత్యు పత్రం పరీక్షా సమయము ఆసన్నమైనది అగ్ని గుండంలో ప్రవేశిస్తున్నాం మన ఆలోచనలు మన వాక్కు మన వక్తృత్వము అన్నీ మాతృదేశానికే సమర్ప...


మృత్యు పత్రం

పరీక్షా సమయము ఆసన్నమైనది అగ్ని గుండంలో ప్రవేశిస్తున్నాం మన ఆలోచనలు మన వాక్కు మన వక్తృత్వము అన్నీ మాతృదేశానికే సమర్పితం. -తన మృత్యు పత్రం లో సావర్కర్

సావర్కర్ పారిస్ నగర వాసం: మదన్ లాల్ ధింగ్రా ఆత్మాహుతి తర్వాత లండన్ లోని విప్లవకారులపై కారు మబ్బులు క్రమ్ముకొన్నవి. పోలీసుల ఒత్తిడి వలవ వారి నాయకుడు సావర్కర్కు నిలువ నీడలేని పరిస్థితి ఏర్పడింది. ' ఇక రాజకీయాలలో పాల్గొనను అని వ్రాసి ఇవ్వడానికి నిరాకరించినందుకు గానూ ఆయనకు బారిస్టరు పట్టా లభించలేదు. ఆరోగ్యం దెబ్బతిన్నది. స్నేహితులు ఒత్తిడి పై మార్పుకై 1910 జనవరిలో పారిస్ నగరానికి వెళ్లాడు.

విప్లవాగ్ని: అదే సమయములో భారత దేశములోని విప్లవ కారులు త్యాగాగ్నిలో సమిధలై పోతున్నారు. వందల కొలది యువకులు ఉరి తీయబడ్డారు. ద్వీపాంతర వాస నరక యాతనలో త్రోయబడ్డారు. గణేశ పావర్కర్ అండమాన్ పంపబడ్డాడు. అందుకు ప్రతిగా నాసిక్ జిల్లా కలెక్టరు జాన్సన్ ను కాల్చి చంపిన కన్హరే, అతని అనుచరులు దేశపాండే, కార్వేలు 1909 డిశంబరు 31వ తేదిన ఉరి తీయబడ్డారు. ఈ లోగా అహమదాబాదులో వైస్రాయి లార్డుమింటో పై బాంబు వేసే ప్రయత్నం జరిగింది. ఆ కారణంగా సావర్కరు తమ్ముడు నారాయణ సావర్కర్ను అరెస్టు చేశారు.

తన అనుయాయులు, త్యాగాలు చేస్తుంటే తాను సురక్షితంగా పారిస్ నగరంలో ఉండటం సావర్కరు భరించ లేక పోయాడు. అప్పటికే సావర్కర్ అరెస్టుకు వారెంటు జారీ అయింది. మిత్రులు, అనుచరులు సావర్కరును పారిస్ నగరం నుండే ఉద్యమాన్ని వడుపమని ప్రార్థించారు ' నా మిత్రులు అనుచరులు వేటాడ బడుతూంటే, నేను చూస్తూ వుండలేను నాయకుడుగా నేను వారి బాధలను పంచుకోవాలి అని అంటూ లండనుకు బయలు దేరాడు.

లండనులో అరెస్టు: అది 1910 మార్చి 13, ఆదివారం, సావర్కర్ పారిస్ నుండి తిరిగి వచ్చి లండను విక్టోరియా స్టేషన్ లో దిగగానే, లండన్ పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారు. మృత్యు గహ్వరంలోకి సావర్కర్ అడుగు పెట్టాడు. అప్పటి సావర్కరు పరిస్థితి ఇది తన కుమారుడు అంతకు ముందే మరణించాడు. 18 సంవత్సరాలైనా నిండని భార్యను ఓదార్చుటకైనా వీలుపడవి దీనస్థితి అది. తన అన్న గణేశ సావర్కర్ అండమాను జైలులో నరక యాతన అనుభవిస్తున్నాడు. తమ్ముడు నారాయణ సావర్కర్ పట్టుబడి ఉరి లేక అండమాను జైలా అన్నట్లు ఉన్నాడు. తనను తల్లిగా పెంచిన వదిన యశోదాబాయి దిక్కుతోచని స్థితిలో ఉంది. తాను బ్రిక్వ్ జైలులో ఉన్నాడు. అట్టి పరిస్థితులలో తనకు అత్యంత ప్రియమైన వదినకు తన వకీలు ద్వారా పంపిన సందేశమే "నా మృత్యు పత్రం"

ప్రియమైన వదినకు చరమ సందేశం

'ధర్మ రక్షణ కొరకు పని చేస్తాం మరణిస్తాం అని ప్రమాణం చేసాము గుర్తున్నదా? పరీక్షా సమయము ఆసన్నమైంది అగ్ని గుండములో ప్రవేశిస్తున్నాం. మన ఆలోచనలు మన వాక్కు మన వక్తృత్వం అన్నీ మాతృదేశానికే సమర్పితం '

'మాతృ దేశ జననీ నీ బలి పీఠమున నా ఆరోగ్యాన్ని  నా సంపదను త్యజించి నీ పాద తలమున సమర్పించాను. వ్యధతో నిరీక్షిస్తున్న లేబ్రాయపు భార్య కరుణరసపూర్ణ దృక్కులుగానీ ఏకాకియై పస్తులతో అలమటిస్తున్న వదిన విస్సహాయ స్థితిగానీ నీ రణభేరి ఆహ్వానానికి నన్ను విముఖుని చేయజాలదు'.

'నా అగ్రజుడు - అత్యంత ధైర్యశాలి దృఢ సంకల్పుడు నన్ను ఎంతో ప్రేమతో ప్రేమించేవాడు నీ బలి పీఠమున ఆహుతి అయ్యాడు. నా తమ్ముడు నాకు అత్యంత ప్రీతి పాత్రుడు పసివాడు, అతను కూడా అన్నతో త్యాగాగ్ని జ్వాలలోనికి ఉరికాడు. ఇప్పుడు ఇక్కడ యాగ మండపమున యూపస్తంభమున కట్టి వేయబడి నేనున్నాను. ఇదొక విషయం కాదు తల్లీ మేము ముగ్గురమేకాక ఏడుగురమై వుండినా వారినందరికి నీ సేవ కొరకు అంకితం చేసే వాడివే కదా'.

వీడ్కోలు ప్రియమైన వదినా నీకు వీడ్కోలు నా భార్యకు నా ప్రేమ తెల్పుతూ ఈ విధంగా కూడా తెలియజేయి -  మవం స్వీకరించిన మార్గమును గుడ్డి నమ్మకంతో మాత్రం స్వీకరించలేదు. తర్కం, చరిత్ర, మానవ ప్రకృతి వీటి యొక్క ప్రకాశవంతమైన వెలుగులో ఈ వర్గంలో ప్రవేశించాము. యాత్రికుని త్రోవ మృత్యులోయల గుండా సాగి పోతోందని తెలిసి తెలిపి త్యాగకేతనం ధరించి అతనిని అనుసరిస్తున్నాము.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments