అండమాన్ యాత్ర “నన్ను గుర్తించగలవా? దుస్తులె మారాయి చలి నుంచి ఈ దేహాన్ని కాపాడడానికి ఈ జైలు దుస్తులే చాలు అదృష్టముంటే మళ్లీ కలుస...
అండమాన్ యాత్ర
“నన్ను గుర్తించగలవా? దుస్తులె మారాయి చలి నుంచి ఈ దేహాన్ని కాపాడడానికి ఈ జైలు దుస్తులే చాలు అదృష్టముంటే మళ్లీ కలుసుకొంటాము. సంసారిక వాంఛలు కలిగినప్పుడు కొంచెం ఆలోచించు. జీవితమంటే బిడ్డలను పుట్టించి పెంచడమే అయితే పశుపక్ష్యాదులు కూడా అదే పని చేస్తున్నాయి. కానీ జీవితాన్ని విశాల దృక్పథంతో చూసినట్లయితే మనమూ మనుష్యుల వలె సగర్వంగా జీవించామని ఒప్పుకొంటాము. ఏదో ఒకనాడు వేలాది ఇండ్ల నుండి బంగారు వన్నె పొగ బైటికి రావాలన్న ఆశతో మన పొయ్యిని ఈ దినం మనం ఆర్పుకొన్నాం" ఇవి అండమాన్ బయలుదేరే ముందు తనను చూడవచ్చిన భార్య యము నాబాయికి సావర్కరు చెప్పిన సాంత్వన వచనాలు 1906లో 16 ఏండ్లు నిండవి తనను తన బిడ్డను వదలి లండన వెళ్ళిన సావర్కర్ బారిస్టరుగా తిరిగి వస్తాడని ఆమె బంగారు కలలు కన్నది ఆ అభాగిని, అప్పటికే తన బిడ్డను కోల్పోయింది. ఇప్పుడు తన 19వ సంవత్సరంలో ఆ వీరపత్నికి భర్త ఇలా చెప్పాడు.
అప్పటికే గణేశ సావర్కర్ అండమాను జైలుకు చేరి ఉన్నాడు. సోదరుడు నారాయణ సావర్కర్ బొంబాయిలో అప్పుడు వినాయక పావర్కర్ ఉన్న జైలులోనే ఉన్నాడు. సావర్కరును జైలులో పెట్టేముందు సులోచనాలతో సహా ఆయన ఆస్తి సర్వస్వాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆయన బి ఎ డిగ్రీవి కూడ రద్దు చేపింది. ఏదో దయ చూపినట్లు కళ్ళ అద్దాలను, భగవద్గీతను మాత్రం ఇచ్చి, వీటిని ప్రభుత్వ ఆస్తిగా మాత్రమే చూపి ఉపయోగించుకునేట్లు అనుమతి ఇచ్చింది.
ఆ సమయం లొనే ఒక జైలు ఉద్యొగి సావర్కరుతో - 1960లో మిమ్ము తప్పక విడుదల చేస్తారు. అంటే ఇంకా యాభై ఏండ్లు బ్రిటీషు పాలన భారత దేశంలో సాగుతుందా? అని ప్రశ్నించాడు. అవును ఆ భవిష్యద్వాణి ప్రకారం 1947లోనే బ్రిటిష్ వారు స్వాతంత్ర్య యోధుల నెత్తురు పారించి దేశ ఆర్థిక భాగ్యాన్ని చిదుగ గొట్టి, దేశాన్ని మూడు ముక్కలు జేసి, తమ మూట ముల్లె కట్టుకొని స్వదేశం చేరలేదా.
కారాగార వాసం - రచనలు: 1911 సంవత్సరం జూలై 4 తేదీన సావర్కర్ అండమాను జైలులో అడుగు పెట్టాడు. అప్పటికే గణేశ సావర్కర్ అక్కడ వున్నాడు. ఈ నరకములో సావర్కరుని పెట్టని కష్టాలు, అనుభవింపజేయని యాతనలు లేవు కానీ సావర్కరు మనో స్థైర్యం కోల్పోలేదు. ఆ ఆర్తితో వేల కొలది గీతాలు రచించి జైలు గోడలపై బొగ్గుతో, చీలలతో వ్రాసి కంఠస్థం చేసుకొని, తనతోడి ఖైదీలచే కంఠస్థం చేయించాడు. ముందుగా శిక్షలు పూర్తి అయిన ఖైదీలు ఆ గీతాలను మహారాష్ట్రలో ప్రాచుర్యంలోకి తెచ్చారు.
ఆయన అండమాన్లో వుండగా 15000 పంక్తులకు మించిన రచనలు సాగాయి అందులో ముఖ్యమైనవి కమల, సప్తఋషి, విరోచ్వాపి గీతాలు. కాలాపాని, వెనాప్లాంచి బంద్ నవలలు సవ్యప్తఖడ్గ, ఉషాప్, ఉత్తర క్రియ నాటకాలు, మాజీ జన్మథేప్ స్వీయ చరిత్ర.
జైలులో ఉద్యమాలు: అండమానులో జైలరుగా ఉండిన బారి దౌర్జన్యాలను ఎదిరిస్తూ సావర్కరు అనేక కఠిన తరమైన శిక్షలు అనుభవించాడు. తోటి ఖైదీలలో శిక్షల తీవ్రతను భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు, మతి చలించి పోయినవారు సావర్కరు హృదయాన్ని కదలించి వేశారు రాజకీయ ఖైదీలను ఆయన ఇలా ఉద్బోధించారు.
“మనము ప్రతీకార చర్య లేకుండ మరణించరాదు. దేశానికి శత్రువైన వానిని ఒక్కని నైనా చంపనిదే మనలో ఒకరు కూడా చావరాదు. ఒక నూతన రహస్య వార్తా గ్రాహక పద్ధతిని సృష్టించి జైలు అధికారుల కండ్లముందే భారత దేశ వార్తలను దీవులలోని వార్తలను సంగ్రహించి, రాజకీయ ఖైదీలకు చెప్పి ఉత్సాహ పరచే వాడు. దీనికిగాను ఆయన వ్యక్తిగతంగా ఎన్నో ప్రత్యేక కఠిన శిక్షలకు గురి అయ్యాడు. కాని అతని సంఘటనా పటిమ వలన జైలు జీవన స్థితిలో మార్పులు రాసాగినవి, సమ్మెలు జరిగినవి, నిరాహార దీక్షలు సాగినవి, జైలరు బారీ కూడా భయపడి రాజకీయ ఖైదీల చర్యలను చూచీ చూడనట్లు పోసాగాడు.
అండమాన్ హిందువుల హీనస్థితి - పునరుజ్జీవనం: అండమాన్ లోని హిందువుల దుస్థితిని సావర్కర్ గమనించాడు. ముస్లిం లు పలాను ఉద్యోగులు హిందూ ఖైదీలను ముస్లింలుగా మార్చడం జరిగేది కొద్ది సుఖాలకు ఆశపడి, స్వల్ప వాంఛలకు లొంగి, దుర్వ్యసనాలకు లోబడి విపరీతమైన జైలు బాధలకు భయపడి, హిందూ ఖైదీలు ముస్లింలుగా మారడం సావర్కరుకు భేదం కలిగించింది. హిందువులలో గల సాంఘిక దోషాలు సంకుచిత భావాలు, మతంతో సంబంధం లేని మూఢాచారాలు హిందూ సంఘాన్ని చెదల వలె తొలచి వేయడం సావర్కరు సహించ లేకపోయాడు. ఇలా జరిగి పోతుంటే ఒక నాటికి ఈ హిందూదేశం ఏమైపోతుందో? హిందూ సంస్కృతి, నాగరికతలు ధరణిపై కనపడతాయా! అన్న ఆలోచనలు మానసికంగా సావర్కరును కలచివేశాయి. ఈ సమయం లోనే సావర్కరు మనస్సులో హిందువంటే ఎవరు అనే ప్రశ్న ఉదయించింది ఫలితంగా ఈ విశ్వ విఖ్యాత నిర్వచనం ఆవిర్భవించింది.
ఆసింధు సింధు పర్యంతా యస్యభారత భూమికా
పితృభూ- పుణ్యభూశ్చైన సవై హిందురి తిస్మృత
'సింధునది నుండి సముద్రం వరకు వుండే ఈ భారత భూమివి ఎవడైతే పుణ్యభూమిగాను పితృభూమిగాను భావిస్తాడో అతడే హిందువు'.
ఒక రోజు ఒక హిందూ బాలుని ముస్లింగా మార్చేందుకు యేర్పాటు జరిగిందన్న విషయం సావర్కర్కు తెలిసింది. సావర్కర్ ప్రతిఘటనతో జైలు అధికారులు జంకి బాలుని మతమార్పిడి ఆపివేసారు. ఆ బాలుని సనాతన హిందూ ఖైదీలు తమ సరసన భోజనం చేయనీయలేదు. సావర్కర్ అతనికి తన సరసన కూర్చోబెట్టుకొని నందున ఆయనను అందరూ భంగీ బాబు' అని పిలువ సాగారు. అయినా ఆయన పట్టు విడువకుండా ప్రయత్నాలు సాగించారు. దీనితో శుద్ధి సంఘటన ఉద్యమాలు, వృద్ధి అయ్యాయి క్రమంగా హిందూ ఖైదీలు మతము మార్పిడి వల్ల సంఘానికి దేశానికి రాబోయే విపత్తు గ్రహించి, సావర్కర్ ఉద్యమానికి చేదోడు వాదోడుగా విలిచారు. మారిన ముస్లింలు క్రైస్తవులు తమ స్వధర్మం లోనికి తిరిగిరా ప్రారంభించారు. ఇప్పుడు ఆందోళన పడటం జైలు అధికారులకు ఫిర్యాదులు చేయడం, ముస్లింల వంతు అయినది ముస్లింలుగా పుట్టిన వారిని కూడా హిందూ మతంలోనికి మార్చి వేస్తున్నాడని సావర్కర్ కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయసాగారు. క్రమంగా హిందూ దృక్పథంలో మార్పు వచ్చింది. అండమాన్ దీవులలో దేవాలయాలు వెలిశాయి.
ఖిలాఫత్ ఉద్యమం: త్వరత్వరగా పరిస్థితులు మారాయి, 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. భారత స్వాతంత్య్ర వీరుల ఒత్తిడి వలన బ్రిటిష్ వారు తియ్యగా మాట్లాడుతూ కొన్ని కొన్ని రాజ్యాంగ సంస్కరణలు చేస్తున్నట్లు నటిస్తూ విభజించి పాలించు నీతిని ప్రవేశ పెట్టారు. 1918లో ప్రపంచ యుద్ధం ముగిసింది. 1920లో లోకమాన్య తిలక్ అస్తమించాడు. అదే సంవత్సరం గాంధీజీ ఖిలాఫత్ ఉద్యమం ని ప్రారంభించాడు. గాంధీజీ అహింసా సత్య నిర్వచనాలను ఖండిస్తూ ఈ ఖిలాఫత్ ఆఫత్ (దురదృష్ట కర సంఘటన) గా మారుతుందని సావర్కర్ జైలు నుండి ప్రకటించాడు. అనుకొన్నట్లే దేశమంతటా మతకల్లోలాలు చెలరేగాయి. మలబారులో మోప్లా ముస్లింలు హిందువులపై చేసిన అత్యాచారాలు వూహించనైనా వూహించలేము. ఈ మోప్లా అత్యాచారాల నేపధ్యంలో ఆయన ' మోప్ల్యాంచి బంద్ అయే నవలను వ్రాశారు.
జైలులో కుటుంబంతో కలయిక, యశోదాబాయి మరణం: ఎనిమిది సంవత్సరాల తర్వాత 1919 మే లో తమ్ముడు నారాయణరావు, భార్య యమునాబాయి, అండమానులో వినాయక సావర్కరు, గణేశ సావర్కర్ ను చూడటానికి పోయారు, వారి వెంట యశోదాబాయి లేకపోవడం పావర్కరుకు దిగ్భ్రాంతి కలిగించింది. బంధువులచే ఉపేక్షింపబడి, దేశభక్తిలేని ఇరుగు పొరుగు వారిచే ఒక ఖైదీ భార్యగా ఈపడింపబడి, దారిద్య్రం తో అలసిపోయి ఏకాకిగా, స్పృహలేని పరిస్థితిలో అంతకు రెండు నెలల ముందే ఆమె చనిపోయింది. సావర్కరుకు తల్లి, సోదరి, వదిన స్వాతంత్ర్యోద్యమానికి ప్రోత్సాహకారి అయిన యశోదాబాయి మరణ వార్త సావర్కర్కు అశనిపాతమే అయింది.

యశోదాబాయికి భర్తను చూడటానికి అండమాను పోవడానికి అనుమతి ఇవ్వడంలో ప్రభుత్వం ఆలశ్యం చేసింది. ఆమె చనిపోయిన మరునాడు అనుమతి పత్రం ఆమె ఇంటికి చేరింది విధి క్రూర అపహాస్యం! చేసింది.
No comments