Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అండమాను నుండి రత్నగిరికి - Savarkar life History - సావర్కర్ జీవిత చరిత్ర - 8

అండమాను నుండి రత్నగిరికి రెండు జీవిత ద్వీపాంతర వాస శిక్షలను అధిగమించి ఈ నాడు మీ ముందు నిలబడుతానని ఎవరూ ఊహించలేదు. అనేక సార్లు ఆ...


అండమాను నుండి రత్నగిరికి

రెండు జీవిత ద్వీపాంతర వాస శిక్షలను అధిగమించి ఈ నాడు మీ ముందు నిలబడుతానని ఎవరూ ఊహించలేదు. అనేక సార్లు ఆత్మహత్య ఆలోచనలు కూడ వచ్చాయి. మేము ఇంచు మించు సమాధులలోనే నివసించాము. అగ్నిజల పరీక్షలలో అనుపమానమైన ప్రతిజ్ఞకు నిలబడ్డాము. విడుదలైనపుడు నేను సావర్కర్ అనే వ్యక్తిని కాను, అత్యంత దీనావస్థలో వున్న హిందువుల ఆక్రందన స్వరూపాన్ని మాత్రమే. (వీర పావర్కర్ షష్ట్యబ్ద పూర్తినాడు 28 1943)

సావర్కర్ విడుదలకై దేశం అన్ని వైపుల నుండి ఒత్తిడి అధికం కాజొచ్చింది. ఇంగ్లండులోని భారత మిత్రులు, దేశం లోని వివిధ వర్గాల వారు సావర్కర్ విడుదలకై ఒక ఉద్యమాన్ని లేవదీశారు. 1921 మార్చిలో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో ఆయన విడుదలకై ఒక తీర్మానాన్ని తెచ్చారు.

స్వదేశ కారాగారాలలో మార్పులు: తుదకు సావర్కరు భారతదేశం లోని జైలుకు మార్చటానికి ప్రభుత్వము అంగీకరించక తప్పలేదు. 1921లో సావర్కర్ సోదరులను ఆలీపూరు జైలుకు మార్చారు. 1922లో తీవ్ర అస్వస్థతకు గురైన గణేశ సావర్కర్ విడుదల చేయబడ్డారు. వినాయక సావర్కర్ ను రత్నగిరి జైలుకు మార్చారు. రత్నగిరి జైలులో వుండగానే సావర్కర్ హిందూజాతి భవిష్యత్తును గూర్చి తీవ్రంగా ఆలోచింపసాగారు. ఈ సమయం లోనే తన చరిత్రాత్మక గ్రంథం ' హిందూత్వ ' ను పూర్తిచేసి రహస్యంగా నాగపూరులోని వి వి కేల్కారుకు పంపగా రచయిత పేరు లేకుండ ఒక మహారాష్ట్రుడు అను పేర అది ప్రచురితమైంది. రచయిత ఎవరైనది తెలియకపోయినా ఈ పుస్తకాన్ని చూచిన మదన మోహన మాలవీయ, లాలా లజపతి రాయ్ విజయ రాఘవాచారి మొదలైన నాయకులు ఇందులోని హిందూ పద నిర్వచనాన్ని ఎంతగానో శ్లాఘించారు.

మన ఋషులను ఉత్తేజితులను చేసిన వేదకాల ఉషోదయాలు, మరల ఈ గ్రంధకర్తకు ఈ హిందూత్వ రచయితకు, ఈ హిందూ నిర్వచన మంత్రాన్ని ప్రసన్నమతులై ఉపదేశం చేసినట్లున్నది అని సావర్కర్ హిందూ శబ్ద నిర్వచనాన్ని వేదమంత్రంగా శ్లాఘించారు స్వామి శ్రద్ధానంద. ఈ స్వామి శ్రద్ధానందను తర్వాత ఒక ముస్లిం మతోన్మాది కాల్చి చంపాడు.

మరల సావర్కర్ ని యరవాడ జైలుకు మార్చారు. సావర్కర్ విడుదలకై ఉద్యమాలు ఉధృతం అయ్యాయి. జవునా దాస మెహతా ఆధ్వర్యమున సావర్కర్ వివెవాచవ సంఘం ప్రజాభిప్రాయాన్ని సమీకరించింది. గాంధీ నెహ్రూలు మాత్రం విప్లవకారులను స్వాతంత్ర్యోద్యము వీరులుగా ఏనాడూ అంగీకరించ లేదు. వారిని జైలునుండి విడుదల చేయించటానికి సహకరించ లేదు. 1930లో భగవత్ సింగును ఉరితీసిన సందర్భంలో తాము ఆనాటి వైస్రాయితో చేసుకొనిన ఒప్పందం ప్రకారం గాంధీజీ ఇట్టి ఉపేక్షిత మూకీ భావాన్నే ప్రదర్శించారు.

రత్నగిరిలో పరిమిత స్వేచ్ఛ: చివరికి అయిదు సంవత్సరాలు రాజకీయాలలో పాల్గొనరాదని రత్నగిరి జిల్లా సరిహద్దులు దాటరాదని నిబంధనలు విధించి 1924 జనవరి 6వ తేదీన సావర్కర్ను యరవాడ జైలు నుండి విడుదల చేశారు.
 
హిందూ సంఘటనోద్యమం: రత్నగిరి సావర్కర్ నడపదలచిన హిందూ మహాఉద్యమానికి కార్యస్థానంగా మారింది. సావర్కర్ హిందూ సంఘటనోద్యమంపై తన దృష్టిని కేంద్రీకరించి సాంఘిక విప్లవానికి నేత అయ్యాడు. అంటరాని తనం పై యుద్ధం ప్రకటించాడు. మసీదుల ముందు హిందువులు మేళతాళాలతో ఊరేగింపులు తీసుకొని పోరాదనే దౌష్ట్య నిషేధాన్ని యెదిరించాడు. రత్నగిరిలోని పతిత పావన దేవాలయం సావర్కరు సాధించిన సాంఘిక విప్లవానికి చిరస్థాయి అయిన పవిత్ర చిహ్నం. సంఘటన ఉద్యమంతో బాటు, శుద్ధి ఉద్యమం కూడ కొనసాగింది. వందలాది క్రైస్తవులు ముస్లింలు తిరిగి హిందూ ధర్మం స్వీకరించారు. రత్నగిరి ప్రవాసంలో సావర్కర్ విస్తృత హిందూ సంఘటనోద్యమానికి పునాది వేశారు. రత్నగిరి హిందూ మహాసభ తన కార్యక్రమాలను విస్తృతం చేసింది. 1924లో కొద్దికాలం రత్నగిరిలో ప్లేగువ్యాధి వ్యాపించడం వలన తాత్కాలికంగా సావర్కరు వివాసం నాసిక్కు మారింది. ఆ సమయంలో 1924 ఆగస్టు 24 న డాక్టరు మూంజే అధ్యక్షతన జరిగిన సభలో సావర్కరుకు ఒక సహాయనిధి అందించబడింది. పూజనీయ యన్ సి కేల్కారు సన్మాన పత్రాన్ని చదివారు. శ్రీ పూరి శంకరాచార్య స్వాములవారు ఆశీస్సులు పంపించారు. రత్నగిరి ప్రవాసంలో వుండగానే గాంధీజీ షాకత్ ఆలి, యూసఫ్ మెహరాలీ వంటి రాజకీయ నాయకులు డాక్టరు హెడ్గేవార్ వంటి హిందూ సంఘటన నిర్మాతలు సావర్కరు కలుసుకొని దేశ పరిస్థితులను చర్చించారు.

1924లో నిమ్న జాతి నాయకుడు అంబేద్కరు అనుయాయుడు ఐన రాజభోజ్, సావర్కర్ అధ్యక్షత వహించిన నిమ్నజాతి సభకు విచ్చేసి నేను ఈ సావర్కర్ ఉద్యమం గూర్చి నిరాశావాదిగా వుంటూ వచ్చాను కానీ ఆయనతో పరిచయం, చర్చల తర్వాత స్వయంగా పరిశీలించిన తర్వాత ఆ ఉద్యమం సాధించగలిగే ఫలితాల విషయంలో పూర్తి నమ్మకం కలిగింది. ఈ రాజకీయ విప్లవవాదుల నాయకుడు తీవ్రమైన సంస్కరణవాది కూడా అని ప్రకటించడానికి నేను యెంతో సంతోషిస్తున్నాను అని అన్నారు. 1924 లోనే డాక్టరు హెడ్గేవార్ కూడ సావర్కర్ ను కలుసుకుని హిందూ సంఘటన ఉద్యమ నిర్మాణ ఆవశ్యకతను గూర్చి చర్చించారు. ఆ తర్వాత గణేశ సావర్కర్ తో కూడ చర్చించి డాక్టరుగారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని (ఆర్ యస్ యస్ ) నాగపూరులో స్థాపించారు. 1927లో గాంధీజీ, సావర్కరు ఆఖరు సారిగా కలుసుకున్నారు. శుద్ధి ఉద్యమం పట్ల తమ విముఖతను తెలిపారు.

మరల అరెస్టు – విడుదల: రత్నగిరి జిల్లా నివాసం అయిదు సంవత్సరాలుగా నిర్ణయింపబడినప్పటికి సావర్కర్ కు పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం భయపడుతూనే వచ్చింది. అందువలన నిర్బంధాలను 1937 వరకు పొడిగించింది. ఒక విధంగా చిన్న జైలు నుండి వచ్చి పెద్ద జైలులో కాలం గడిపినట్టయింది. అప్పటికింకా పోలీసులు మాటిమాటికీ సావర్కర్ నివాసంపై దాడులు చేస్తూనే వచ్చారు. ఆయన ఏమి చేస్తున్నాడో, యేమి వ్రాస్తున్నాడో, సి ఐ డీలు గమనిస్తూనే వచ్చారు. 1934లో ఒక మిలిటరీ ఆఫీసరుపై వామనరావు చవన్ అనే యువకుడు కాల్పులు జరిపాడు. సావర్కర్ను వెంటనే అరెస్టు చేసినారు. ఏమీ సాక్ష్యాలు దొరకనందు వల్ల రెండు వారాల తర్వాత విడుదల చేశారు.

నిర్బంధాల తొలగింపునకు ప్రయత్నాలు: 1937 ఎన్నికల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ షరతులకు లోబడి ప్రజా ప్రతినిధుల ప్రభుత్వాలు రాష్ట్రాలలో ఏర్పడ్డాయి. అప్పటికి భారతదేశం పై బ్రిటిష్ ఆధిపత్యం పూర్తిగా అంతరించి పోవాలనే విర్ణయానికి కాంగ్రెసు రాలేదు. అల్లూరు సీతారామరాజు పేరెత్తినందుకు కాంగ్రెసు పోషలిస్టు అయిన బాట్లి వాలాపై మద్రాసులో రాజాజీ ప్రభుత్వం రాజద్రోహం కేసు పెట్టి ఆరునెలల శిక్ష విధించింది. ఈ కేసు విచారణ నెల్లూరు కోర్టులో జరిగింది. అండమాన్లో మ్రగ్గుతున్న ప్రతివాద భయంకరాచారి విడుదల విషయమై ఆసక్తి చూపలేదు. 1937లో అదృష్ట వశాత్తు రాజకీయ ప్రతిష్టంభవ వలన బొంబాయిలో కాంగ్రెసువారు ప్రభుత్వాధినేతలు కాలేదు. దాంజీషా కూపర్ నాయకత్వంలో తిలక్ స్వరాజ్య పార్టీ నాయకుడు జమునా దాస్ మెహతా ఆర్థికమంత్రిగా తాత్కాలిక ప్రభుత్వం యేర్పడింది. వెంటనే జమునా దాస్ మెహతా సావర్కర్ విడుదలకు చర్యతీసుకొన్నారు.

నిర్బంధాల తొలగింపు: మే 10వ తేది భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పవిత్రదినం. 1857 మే 10 న ప్రధము స్వాతంత్ర్య సమరం ప్రారంభమై విప్లవ కేతనం ఎగురవేయబడింది. ఆ జాతీయ పర్వదినం నాడే స్వాతంత్ర్య వీర సావర్కర్ రత్నగిరి నిర్బంధాల నుండి విడుదలయ్యారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments