Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మహమ్మదు గజనీ నుండి మోహన్ దాస్ గాంధీ వరకు చరిత్ర సింహావలోకనం - Savarkar life History - సావర్కర్ జీవిత చరిత్ర - 9

మహమ్మదు గజనీ నుండి మోహన్ దాస్ గాంధీ వరకు చరిత్ర సింహావలోకనం "ఈ రాజ్యం మౌలికంగా హిందువులది. హిందూ ధర్మ రక్షకుడెవడైనా సరే, అ...


మహమ్మదు గజనీ నుండి మోహన్ దాస్ గాంధీ వరకు చరిత్ర సింహావలోకనం

"ఈ రాజ్యం మౌలికంగా హిందువులది. హిందూ ధర్మ రక్షకుడెవడైనా సరే, అతనికి శతధా నమస్కరిస్తాను. కానీ హిందూ ధర్మానికి తలవంపులైన ఏ పనినైనా అప్రతిష్ఠకరమైన ఏ కార్యమునైనా నేను ఏ మాత్రం అంగీకరించను.” ఛత్రపతి శివాజీ

1937 మే 10న అన్ని నిర్బంధాల నుండి విముక్తుడైన సావర్కర్ మొట్టమొదట కొల్లాపూరులోని శివాజీ సింహాసనానికి అంజలిఘటించి తన రాజకీయ రంగప్రవేశాన్ని ప్రకటించాడు. ఆయన విడుదలను అన్ని రాజకీయ పక్షాలూ హర్షించాయి. గాంధీజీ మాత్రం మౌనం వహించారు. కొల్హాపూరు నుండి పుండరీపూరుకు వెళ్ళి పాండురంగ భక్తుల స్మృతికి ప్రణమిల్లి, మిరాజ్ లో  మొదటిసారిగా కాంగ్రెసు వారి సిగ్గుమాలిన, నిర్వీర్యమైన విధానాలపై గళం విప్పాడు. ముస్లిం కొండజాతులవారు హిందూ స్త్రీలను అపహరించుకు పోవడాన్ని కేంద్ర అపెంబ్లీలో కాంగ్రెసు వారు సమర్థించడాన్ని తీవ్రంగా పరిగణించాడు. తర్వాత పూణే నగరం ప్రవేశించి తన రాజకీయ దిగ్విజయ యాత్రకు ధ్వజారోహణం గావించాడు. బొంబాయికి తన వివాసం మార్చుకొని తన సిద్ధాంతాన్ని ఒక సుడిగాలి వలె దేశం నలుమూలలకు వ్యాపింపజేశాడు. మొదట తిలక్ ప్రజాప్వామ్య పార్టీలో చేరి, స్వల్ప కాలం తర్వాత హిందూ మహాపభను  తన రాజకీయ వేదికగా చేసుకొన్నాడు.

1937 సంవత్సరానికి భారత రాజకీయాలలో కాంగ్రెసు ఉచ్ఛస్థితిలో ఉండి పదవుల పంపకపు ప్రహసనానికి నాంది పలికిన తరుణంలో సావర్కర్ హిందూ మహాసభను భారత రాజకీయాలలో ఓనమాలతో ప్రారంభించారు. ఆనాటి పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి హిందూ దేశ చరిత్రను సంక్షిప్తంగా సింహావలోకనం చేయాలి.

అఖండ అమర హిందూ సంస్కృతి: ఆధునిక చరిత్ర కారులచే చరిత్రగా పరిగణింపబడే ఐదువేల సంవత్సరాల చరిత్ర గల ఈ దేశంలో, నాలుగు వేల సంవత్సరాలు ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర, ఒకే నాగరికత కలిగిన సమగ్ర జాతిగ ఆసేతు శీతనగ పర్యంతం హిందూ జాతి సగర్వంగా మనింది. ఈ కాలంలో అనేక విదేశీ దండయాత్రలు జరిగినా అవి త్రిప్పి గొట్టబడ్డాయి. కొన్ని సందర్భాల్లో దండెత్తి వచ్చిన జాతులు తమ ప్రత్యేకతను కోల్పోయి ఈ జాతి జీవన వాహినిలో కలసి పోయాయి. మన దేశంపై దాడి చేసిన గ్రీకులు పిధియనులు, శకులు. హూణులు చరిత్ర పుటలలో తప్ప ప్రపంచంలో మచ్చుకైనా లేకుండా పోయారు.

పరాజయం - పతనం: కానీ 1120 వ సంవత్సరంలో గజని మహమ్మద్ దండయాత్ర సమయం నుండి హిందూజాతి ఓటమి తర్వాత ఓటమి చవి చూచింది. దుర్మార్గుడైవ ఘోరిమహమ్మద్ పై పృధ్వీరాజు ఆత్మఘాతకమైన ఔదార్యం చూపి తనకు తాను వినాశనం తెచ్చుకోవటమే కాక హిందూ దేశంలో తురుష్క రాజ్య స్థాపనకు అవకాశం కలిగించాడు. ఇక తర్వాత యుద్ధాలలో నాయకుడు మరణించటమో లేక కీలక స్థానంలో ఉన్నవారి ద్రోహమో కారణంగా హిందువులు ఓడిపోయారు. పరాజయ పరంపరలను చవి చూశారు. లక్షలాది హిందువుల తలలు తరుగబడ్డాయి. మానవతుల మానం మంటకలిసింది. వేలకు వేలుగా మానవతులు మంటలలో దూకి మసి అయిపోయి ఆత్మగౌరవాన్ని కాపాడుకొన్నారు. పవిత్ర దేవాలయాలు, విగ్రహాలు భంజింపబడ్డాయి. లక్షల కొలది బలవంత మతాంతీకరణల వల్ల విజాతీయులైవారు.

పునరుత్థానం: ఈ విధంగా దేశమంతా నిరాశా, నిస్పృహలు అలముకొన్న సమయంలో, 1627 సంవత్సరములో శివాజీ జన్మించి, సమర్థ రామదాసు స్ఫూర్తితో కాషాయ కేతనం చేత బూని ఇంతటితో ఆగండి అని గర్జించాడు. అది మొదలు హరి భక్తులకు అడ్డమే లేకుండా పోయింది. కోట తర్వాత కోట రాష్ట్రం వెంట రాష్ట్రం మహారాష్ట్ర నాయకత్వం క్రిందకు వచ్చాయి. మహారాష్ట్రుల రాజవీతి, యుద్ధ వ్యూహ పద్ధతులతో హిందూజాతి తిరిగి తలెత్తి హిందూ పదపాదుషాహి (హిందూ సామ్రాజ్యం) స్థాపించింది. 1758 సంవత్సరం నాటికి అటక్ నుండి కటక్ వరకు, కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు హిందువుల అధికారం పునరుద్ధరింపబడింది. 1761 లో హిందువుల సర్వసైన్యాధికారి భావో ఢిల్లీలో ప్రవేశించి, మొగల్ సింహాసనాన్ని సుత్తితో ముక్కలు ముక్కలుగా పగులగొట్టి ఆ పురాతన పాండవుల రాజధాని హస్తినాపుర దుర్గంపై హిందూ విజయకేతనాన్ని ఎగురవేశాడు. మహదాజీ షింధే మొగలు చక్రవర్తిని తన బందీగా చేసుకొని, పోషక భృతిని ఏర్పాటు చేసి తన గుప్పెటలో ఉంచుకొన్నాడు. 1857 సంవత్సరంలో హిందువలు ముస్లింలు కలిసి బ్రిటీష్ వారిని ఎదిరించిన సందర్భాలను వర్ణిస్తూ వీర సావర్కర్ - ఏనాడైతే హిందూ జాతి యొక్క హరిభక్త సైన్యాలు భావో నాయకత్వాన దిగ్విజయంగా ఢిల్లీలో ప్రవేశించి ముస్లిం సింహాునాన్ని కిరీటాన్ని శాసిన చండాన్ని ముక్కలు ముక్కలుగా చేసి విశ్వాసరావు పాద తలాన దొళ్లేటట్లు (1761 సంవత్సరములో ) వేశాయో ఆ దినమే హిందూ ముస్లింల మధ్య గౌరవ పూర్వకమైన స్నేహ సంబంధాలు ఏర్పడడానికి వీలైంది. అని వ్రాశాడు అంటే బలహీనమైపై నిర్జింపబడిన జాతియే నాడు గాని బలవంతమైన విజేతలతో సమానమైన ప్రతిపత్తితో స్నేహాన్ని పొందలేదు. ఈ విధంగా ఏ హిందూ జాతి తన పూర్వ విజేతలను మట్టి గరిపించి గర్వోన్మీలనంగా తలెత్తి 1795 నాటికి హిందూ పదపాదు షాహిని స్థాపించి రాజనీతిజ్ఞతతో నవాబులను సుల్తానులను పాదుషాలను తోలుబొమ్మల్లాగా ఆడించి సర్వాధికారాలను హస్తగ తం వేసుకొన్నదో, ఆ జాతి మరలా ఇంకొక బలవత్తరమైన జాతితో వెంటనే పోరాటం సాగించ వలసి వచ్చింది.

మరలా దుర్దశ: ఈ కొత్త శత్రువు కుటిల రాజనీతితో నూతన ఆయుధ సంపత్తితో దేశభక్తి రహితులైన స్వజాతి ద్రోహుల సహాయంతో 1818 సంవత్సరానికి హిందూ సామ్రాజ్యాన్ని కూలద్రోసి బ్రిటిష్ రాజ్యాన్ని నెలకొల్ప గలిగాడు. ఆనాడు హిందూ జాతివే విర్ణింపబడిన ముస్లింలు స్నేహ హస్తం జూపి హిందువులతో కలసి 1857 సంవత్సరంలో ప్రధమ స్వాతంత్ర్య సమరాన్ని సాగించారు. ఈ సంగ్రామం విఫలమైన తర్వాత దేశంలో నిర్వీర్యస్తబ్దత నీతి వ్యాపించాయి. ఈ దుస్థితి శివాజీ జననానికి ముందు ముస్లిం పరిపాలనలో ఏర్పడిన పరిస్థితి వంటిది. కానీ శివాజీ వలె 1879లో వాసుదేవ బల్వంత పడ్కే మరలా విప్లవ కేతనాన్ని ఎగురవేశాడు. అప్పటి నుండి స్వాతంత్ర్యం కోసం విప్లవోద్యమం విజృంభించ సాగింది. అయితే ఇదంతా విద్యా వంతులైన హిందూ, సిక్కు యువకులు సాగించగా మహమ్మదీయులు కొంత కాలం చైతన్య రహితమై పట్టించు కోకుండా ఉండిపోయారు. తర్వాత ఆంగ్లేయుల ప్రోత్సాహంతో మరల ముస్లిం సామ్రాజ్య వాదాన్ని ఇస్లాం వ్యాప్తి వంటి భావాలను పునశ్చరణ చేయసాగారు. వీరు హిందువులతో కలవక పోవడమే కాక ఇంగ్లీషు వారికి అండగా నిలబడటం మొదలు పెట్టారు. ఇట్టి స్థితిలో 1920 సంవత్సరంలో దేశానికి దురదృష్టకరమైన సంఘటనలు దాపురించాయి. విప్లవోద్యమాన్ని నడుపుతున్న వేలాది యువ కులు ఉరితీయబడటమో లేక అండమాన్ దీవులకు నిర్వాసానికి పంపబడటమో జరిగింది. స్వరాజ్యం నా జన్మ హక్కు  అని నినదించిన లోకమాన్య బాలగంగాధర తిలక్ మరణించాడు.

గాంధీజీ రంగ ప్రవేశం: నాయకులు లేని దేశంలో అంతకు ముందు స్వాతంత్ర్య ఉద్యమంతో ఏలాటి సంబంధమూ లేని గాంధీజీ స్థానికంగా జరిగే అన్యాయాలను నిరసించి నిలచి తన వ్యక్తిగత శీలము వలన సత్యం అహింస వంటి నినాదాలను లేవదీసి పేరు ప్రఖ్యాతులను పొంది ఎదురు లేని నాయకుడై నిలిచాడు. ఒక దురదృష్టకరమైన ముహూర్తంలో ముస్లిం సహకారం లేనిదే హిందువులు ఏమీ సాధించలేరనే నిరాశాపూరిత నినాదాన్ని ప్రతిపాదించి, ఆ వివాదాన్ని బ్రిటిష్ వారికి  అప్రతిహత ఆయుధంగా అందించాడు. మహారాష్ట్రులు తర్వాత పెక్కులు ఆ తరువాత బ్రిటీషు వారిచేతుల్లో ఓటమి పాలైన ముస్లింలు మరలా కొత్త కొత్త కలలు కనసాగారు. స్వార్థ శక్తుల వలన వర్ణ ద్వేషాల వలన, జాతి ద్వేషాల వలన దేశం ముక్కలయ్యే పరిస్థితులు ఏర్పడిన క్లిష్ట సందర్భాలలో జర్మనీకి బిస్మార్కు, ఇటలీకి గారిబాల్డి మాజినీలు, అమెరికాకు అబ్రహం లింకన్ వంటి నాయకులు వచ్చి ఆ దేశాలను రక్షించి బలవత్తరమైన సంఘటిత జాతులుగా రూపొందించారు. దురదృష్ట వశాత్తు భారతదేశానికి అటువంటి నాయకులు లేకపోవటమే గాక విపత్కర పరిస్థితులలో దేశాన్ని నట్టేట ముంచే నాయకుల చేతులలో హిందువులు తమ భవిష్యత్తును యోగ క్షేమాలను ఉంచారు. తద్వారా నిర్వీర్యమైన జాతి అనే పేరును సార్ధకం చేసుకొన్నారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments