Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

భాగ్యనగర్ లో పోరాటం – హిందూ సంఘటన విజయం - Savarkar life History - సావర్కర్ జీవిత చరిత్ర - 12

భాగ్యనగర్ లో పోరాటం – హిందూ సంఘటన విజయం కాకతీయ సామ్రాజ్య పతనం: ఓరుగల్లు (ఏకశిలా నగరము)ను కాకతీయులు ఆంధ్ర వైభవానికి ప్రతినిధులై...


భాగ్యనగర్ లో పోరాటం – హిందూ సంఘటన విజయం

కాకతీయ సామ్రాజ్య పతనం: ఓరుగల్లు (ఏకశిలా నగరము)ను కాకతీయులు ఆంధ్ర వైభవానికి ప్రతినిధులై పరిపాలించారు. 1308 ప్రాంతంలో ఢిల్లీ సుల్తానులు ఓరుగల్లును పూర్తిగా స్వాధీనం చేసుకొన్నారు. కడపటి కాకతీయ సార్వభౌముడు ప్రతాపరుద్రుడు బంధింపబడిన తర్వాత ఆంధ్రదేశ రాజులు ఏకమై స్వాతంత్ర్య సమరాన్ని సాగించి తిరిగి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు. కాని 1347 ప్రాంతానికి బహ్మనీ సుల్తావులు ఈ ప్రాంతముము మరల తమ ఆధిపత్యంలోనికి తెచ్చుకొన్నారు. 1687 సంవత్సరంలో ఔరంగజేబు గోల్కొండను స్వాధీన పరచుకొని ఆపిఫ్ఫ్జాహ్ అవే సర్దారుకు నిజాం ఉల్ ముల్క్ (దేశానికి రాజప్రతినిధి) అనే హోదాలో భాగ్యనగర (హైదరాబాదు) పాలనను అప్పగించాడు. వీరిలో ఏడవ కడపటి నిజాం - ఉస్మాన్ ఆలీఖాన్.

మహారాష్ట్ర హిందూ సామ్రాజ్య విస్తరణ: మహారాష్ట్ర హిందూ సామ్రాజ్య విస్తరణ సమయంలో నిజాములు వారికి సామంతులై, తలెత్తినప్పుడల్లా వారిచే దండింపబడుతుండే వారు 1728లో పాల్ఫేడ్, 1737లో బోకల్, 1705లో సింధుఖేడ్, 1786లో ఉదయగిరి యుద్ధ క్షేత్రములలో ఓడింపబడ్డారు. కానీ హిందువుల అదృష్టము తిరగబడి ఆంగ్లేయులు దేశాన్ని స్వాధీనం చేసుకొన్నప్పుడు నిజాం ఇంగ్లీషు వారితో కుట్రచేసి వారికి తాబేదారై సంస్థానాధిపతి అయ్యాడు. ఏడవ నిజాం ఉస్మాన్ ఆలీఖాన్ పరిపాలనలో ఈ సంస్థానంలో 85 శాతం ఉన్న హిందువుల జనాభాను తగ్గించటానికి తీవ్ర ప్రయత్నాలు కొనసాగాయి.

ఉస్మాన్ ఆలీఖాన్ నిరంకుశ పాలన: సంస్థానంలో హిందువుల ఆత్మగౌరవాన్ని కించపరచే ఈ క్రింది నిర్బంధాలను విధించడం జరిగింది.....

1. ముస్లిం పండుగల సమయంలో హిందువులు వివాహాలు చేసుకోకూడదు.
2. ముస్లిం పండుగ దినాలలో హిందువుల పండుగలు వస్తే వాటిని తమ ఇండ్ల లోపలనే చేసుకోవాలి, మేళ తాళాలు వాయించరాదు.
3. మాతృభాషను పాఠశాలలలో బోధించరాదు, ఉర్దూనే బోధవా భాషగా ఉండాలి. 1938 ఏప్రిల్లో ముస్లిం గూండాలు మతకలహముల పేర హిందువులపై అతి తీవ్రమైన దౌర్జన్యాలు సాగించారు. వెంటనే సావర్కరు నిజాముకు " హిందువుల హక్కులకు రక్షణ కల్పించాలి అని టెలిగ్రాం ఇచ్చాడు" కానీ నిజాం ఉస్మాన్ ఆలీఖాన్, ఆ టెలిగ్రాంను నిర్లక్ష్యం చేయడమే కాక, ఈ క్రింది విధముగా కవిత్వం చెప్పాడు. 

నారా - ఏ- తక్బీర్ (అల్లా కీర్తనలతో కూడిన యుద్ధాహ్వానం) వివాదం మిన్నంటగానే హిందువుల శంఖారావం నిశ్శబ్దం అయిపోయింది. భూకంప ప్రకంపనాల దెబ్బ తిన్నట్లు యజ్ఞోపవీతాలు ముక్కలు ముక్కలైనవి.

పోరాటం ప్రారంభం: 1938 అక్టోబరు 27న ఆర్యసమాజ కార్యకర్త మాణిక్యరావు హైదరాబాదులో కాల్చి చంపబడ్డాడు, దీనితో నిజాముకు బుద్ది చెప్పాలని సావర్కర్ నిర్ణయించాడు. ఆర్యసమాజ నాయకులతో సంప్రదించి వెంటనే ఉద్యమం ప్రారంభించాడు. నాథురాం గోడ్సె ప్రప్రధమంగా ఉద్యమ దళాన్ని హైదరాబాదులో ప్రవేశ పెట్టాడు. నిజాం దుష్పరిపాలనను స్వరాజ్యంగానే భావించే గాంధీజీ కాంగ్రెసువారు, ఈ ఉద్యమానికి సహకరించరాదని ఆదేశాన్నిచ్చాడు. హిందూ మహాసభ అంతర్జాతీయ ఆర్యసమాజాల ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగింది. నిజాం దుష్ట చట్టాలను ధిక్కరించినందుకు 15వేల మంది చెరసాలలో నిర్బంధింపబడి, అనేక అమానుష బాధలకు గురి చేయబడ్డారు. జైళ్ళలో 8 మంది మరణించారు. జాతీయ కవులు ప్రబోధ్య గీతాలను అల్లి ప్రజలను ఉత్తేజ పరచినారు. కాళోజీ నారాయణరావు ఎనబైకి ఇరవై సమానమనే తురక లెక్కలింక ఎన్నాళ్ళో అని అవ హేళన చేసినాడు. ఈ విమోచనోద్యమంలో ధర్మవీర భోపట్కర్ జి వి కేట్కారు (లోకమాన్య తిలక్ మనువుడు) వీర యశ్వంతరావు జోషీ, భిడే గురూజీ మొదలగు నాయకులు పాల్గొని జైలు శిక్షలు అనుభవించారు.

నిజాం దిగిరాక తప్పలేదు హిందువుల పౌర హక్కులను అంగీకరిస్తూ 1939 ఆగస్టు 17వ తేదీన ఒక ప్రకటన చేశాడు. ఆగస్టు 17వ తేదీన ఉద్యమ వీరులందరికి నిజాం విందు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చులతో వారివారి తావులకు పంపు ఏర్పాట్లు చేశాడు.

సావర్కర్ నాయకత్వ దక్షత: చార్మినారు వద్ద ఉండే మక్కా మసీదులో ఏడుగోరీలు ఉన్నవి అందులో ఆరు ఉస్మాన్ ఆలీఖాన్ పూర్వీకులని ఏడవది ఖాళీగా ఉండేది ఏడవ గోరీ అప్పుడు పాలిస్తున్న నిజాం ఉస్మాన్ ఆలీఖాన్ కొరకు సిద్ధం చేయబడిందని, తర్వాత నిజాములే ఉండబోరనీ వీర సావర్కర్ పలుమార్లు చెపుతూ ఉండేవాడు. అది అక్షరాలా నిజమైంది ఈ ఉద్యమం సావర్కరు కార్యాచరణ శక్తిని, పోరాట నిర్వహణ పాండితిని మరియొక సారి ప్రదర్శించింది.

ఈ భాగ్యనగర పోరాటం జరుగుతున్నప్పుడు 1938 డిశంబరులో షోలాపూరులో జరిగిన ఆర్యసమాజ సమావేశంలో పాల్గొని ఆర్యసమాజ నాయకులకు మార్గ నిర్దేశనం చేశాడు. అదే నెలలో రెండవ సారి అఖిల భారత హిందూ మహాసభకు అధ్యక్షుడుగా ఎన్నికై నాగపూరులో జరిగిన వార్షిక సమావేశ అధ్యక్ష పీఠం నుండి కాంగ్రెసు ముస్లింలీగు కలయిక వల్ల హిందూ జాతికి కలుగనున్న ఘోర విపత్తును గూర్చి హిందూజాతిని హెచ్చరించాడు.

గాంధీజీ వ్యతిరేకత: సావర్కర్ సాగించిన భాగ్యనగర పోరాటాన్ని గాంధీజీ బహిరంగంగా వ్యతిరేకించాడు. 1939 ఏప్రెల్ 5వ తేదీన షోలాపూరులో జరిగిన ఆర్య సమావేశంలో గాంధీజీ ప్రోద్బలంతో పోరాటం నుంచి ఆర్యసమాజాన్ని విరమింపజేయడానికి ప్రయత్నం జరిగింది. కానీ ఆ సమావేశంలో సావర్కర్ పాల్గొని తన ప్రాణవంతమైన ఉపన్యాసంలో కుట్రను బహిర్గతం చేసి భంగపరిచాడు. గాంధీజీ తన ప్రయత్నం సఫలమై ఆర్యసమాజం ఉద్యమాన్ని భంగపరుస్తూందనే గట్టి నమ్మకంతో, సావర్కర్ కూడ ఆ విధంగా చేయవలసినదిగా టెలిగ్రాం ఇమ్మని డాక్టరు మూంజేని కోరాడు హిందూ మహాసభ ప్రారంభించి నడుపుతున్న ఉద్యమాన్ని గూర్చి గాంధీజీ అంత శ్రమ పడవవసరం లేదనీ ఉద్యమాన్ని ఎప్పుడు ఏ విధంగా ఉపసంహరించాలో సావర్కర్కు బాగా తెలుసునని డాక్టరు మూంజే గాంధీకి జవాబు ఇచ్చాడు. ఇంతకు ముందే తెలిపినట్లు ఉద్యమం విజయం సాధించిన తర్వాతనే 1939 అక్టోబరులో విరమింపబడింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments