ముస్లిం లీగు - కాంగ్రెసు లాలూచీ కి వ్యతిరేకంగా ఉద్యమం మీరు (ముస్లింలు) కలసి వచ్చిన మీతో కలసి, మీరు కలసి రాకున్న, మీరు లేకుండా, మ...
మీరు (ముస్లింలు) కలసి వచ్చిన మీతో కలసి, మీరు కలసి రాకున్న, మీరు లేకుండా, మీరు ఎదిరించిన మిమ్ములను ఎదిరించి హిందువులు స్వాతంత్ర్యం సాధిస్తారు.. వీర సావర్కర్
1939లో సావర్కర్ వందేమాతర గీతం జన్మస్థానమైన వంగ రాష్ట్రాన్ని దర్శించాడు. ఖుల్నాలో జరిగిన ఒక సమావేశంలో ఆయన గావించిన ఉపన్యాసం బెంగాలు రాష్ట్రాన్ని చకితం చేసింది. భారత రాజకీయాలకు ఒక కొత్త మాణిక్యంగా శ్యామ ప్రసాదముఖర్జీని పరిచయం చేసి హిందూ సంఘటనోద్యమానికి మరింత ఉత్తేజం కల్గించాడు. బారిస్టరు యన్ సి ఛటర్జీ, అండమాను వీరుడు అశుతోష్ లహరీ ఇంకా ఎందరో మేధావులు, కార్యకర్తలు హిందూ మహాసభలో చేరారు. అక్కడి నుంచి సావర్కరు బీహారు రాష్ట్రం ప్రవేశించి హిందూరాష్ట్ర సందేశాన్ని ప్రతిష్ఠచేసి, మహాకోసల పర్యటనలో జబ్బల్పూరులో హిందూజాతి ఎదుర్కొంటున్న భీకర సమస్యలను వివరించాడు. బీహారు పర్యటనలో ఆదిమ జాతులలో చైతన్యం కలిగించాడు. హైదరాబాదు చుట్టుపక్క ప్రాంతాల నుండి హైదరాబాదు పోరాటానికి వేల కొలది స్వచ్చంద సేవకులను సమీకరించాడు.
కాంగ్రెస్, ముస్లిం లీగ్ల దౌర్జన్యాలు: 1939 సెప్టెంబరులో వీరసావర్కర్ కర్ణాటకలో ధార్వాడ్, హుబ్లి, హోసూరు, దుర్గా, బెలుహాంగలు పట్టణాలలో ఎర్యటించి దక్షిణాపధంలో హిందూ సంఘటనోద్యమాన్ని ఉజ్జీవింపజేశాడు. అచ్చట నుండి మీరట్లో మధ్యంతర ఎన్నికల ప్రచారానికి వెళ్లాడు. అక్కడ సావర్కర్ ఉత్సవంపై ముస్లింలు దౌర్జన్యం చేయగా కాంగ్రెసువారు వారికి వత్తాసుగా నిలిచారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వ ఉత్తర్వుల వలన పోలీసులు దుండగులపై చర్య తీసుకోలేదు.
ఝంఝామారుత సదృశమైన తన పర్యటనను సాగించి బొంబాయికి తిరిగిరాగానే సర్ కాస్టి జహంగీర్, సర్ చిల్డ్రన్ లాల్ సెతల్వాడు, వి యస్ చంద్రావర్కర్, ఎస్ సి కేల్కర్, జమునాదాస్ మెహతా, డాక్టరు అంబేద్కర్లతో కలసి సావర్కర్ ఒక సంయుక్త ప్రకటన చేస్తూ అందులో కాంగ్రెసు ప్రభుత్వాలు ఫాసిస్టు నాజీ పక్షాల లాగా ఇతర పార్టీలను రూపుమాపి దేశంలో కాంగ్రెసు పార్టీ ఒక్కటే వుండాలని భావిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ఘాతం వంటిది అని కాంగ్రెసు వారి దౌర్జన్య చర్యలు ఖండించారు. ఆ కాంగ్రెసు వారసత్వం ఈ నాటికీ సాగుతూనే వున్నది.
ద్వితీయ ప్రపంచ సంగ్రామం: 1939 అక్టోబరు 9 తేదీన వీరసావర్కర్ జీవితంలో ఒక మహత్తరమైన పన్నివేశం జరిగింది. ఏ బ్రిటిష్ ప్రభుత్వమైతే వీర సావర్కరును తమ పై యుద్ధం ప్రకటించిన శత్రువుగా భావించి 27 సంవత్సరాలు అండమాన్ తదితర జైళ్లలో ఉంచిందో, అదే బ్రిటీష్ ప్రభుత్వ వైస్రాయి లార్డులిన్ లిత్ 1939 సెప్టెంబరు 1 తేదీన ప్రకటింపబడిన రెండవ ప్రపంచ యుద్ధం గురించి సావర్కర్ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఆయనను పిలిపించి సంభాషించాడు. ఆ సంభాషణలలో సావర్కర్ తాను అప్పటికి ఇప్పటికి విప్లవవాదినని స్వాతంత్య్రమే తన ధ్యేయమని స్పష్టం చేసి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాజనీతిజ్ఞత దష్ట్యా హిందువులను సైనిక దళంలో చేరడానికి ప్రోత్సాహించగలనని చెప్పాడు. దేశ సరిహద్దు రాష్ట్రాలలో సిక్కు, గూర్కా సైన్యాలను ఉంచాలని దేశంపై దండయాత్ర తూర్పు వైపు నుంచి వస్తుందని తవ అభిప్రాయాన్ని తెలిపాడు. భారత రాజనీతిజ్ఞులలో ఒక్క సావర్కర్ మాత్రమే భారతీయ దృక్పథంతోను అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా యుద్ధ పరిస్థితిని అతి నేర్పుతో చర్చించాడని వైస్రాయి తన సహాయకులతో చెప్పాడు.
అటు మిత్ర రాజ్యాలు (ఇంగ్లండు, ఫ్రాన్సు వారి మిత్రులు) కానీ ఇటు లక్ష (జర్మనీ, ఇటలీ బృందాలు) రాజ్యాలుగానీ ఏ ఉన్నత ఆదర్శాల కొరకు గాని యుద్ధం చేయటం లేదు. తమ జాతుల సామ్రాజ్యవాద స్వార్థ ఆశయాల కోసం యుద్ధానికి దిగాయి. ఈ పరిస్థితులను మన దేశ ఆశయ సాధనకు వినియోగించుకోవాలని సునిశితమైన వాస్తవిక దృష్టితో సావర్కర్ ప్రకటించాడు.
హిందూ మహాసభ - కలకత్తా సమావేశం: 1939 డిశంబరులో హిందూ మహాసభ సమావేశాలకు సావర్కర్ అధ్యక్షుడుగా మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. కలకత్తా సభలలో రెండు లక్షలకు పైగా హిందువులు సమావేశమయ్యారు. ఈ సమావేశాల గూర్చి వ్యాఖ్యానిస్తూ అమృత బజారు పత్రిక 'బెంగాలులో కాంగ్రెసు తన పట్టు పోగొట్టు కొంది భారత రాజకీయాలలో ఈ నాటికి నందిని నంది అని, పందిని పంది అని సత్యాన్ని స్పష్టంగా చెప్పగల నాయకుడు ఒక్కడైనా ఉన్నాడు అని సావర్కర్ను కొనియాడింది.
దక్షిణ భారత పర్యటన: 1940 మార్చి నెలలో పశ్చిమ ఖాన్దేశ్ ప్రాంత పర్యటన పూర్తి చేసి సావర్కర్ దక్షిణాపధ దిగ్విజయ యాత్రను ప్రారంభించాడు. సేలం హిందూ సమావేశంలో పాల్గొని, అంతకు పూర్వం కాంగ్రెసుకు హిందూ మహాసభకు అధ్యక్షుడుగా ఉన్న కురు వృద్ధుడు విజయ రాఘవాచారి పట్ల తన ఆదరాభిమానాలను తెలిపి, డాక్టరు వరద రాజులు నాయుడును హిందూ మహాసభలోనికి ఆకర్షించాడు. తర్వాత మద్రాసు నగరంలో బ్రహ్మాండమైన సభలో ఉపవ్యపించాడు. మళ్లీ ఒక పక్షం తర్వాత తిరువాంకూరు సంస్థానములో (నేటి కేరళ) పర్యటించి, త్రోవలో అనేక పట్టణాలలో హిందూ రాష్ట్ర సందేశాన్ని వినిపిస్తూ మధుర దర్శించారు. ఇక్కడ సావర్కరుకు జరిగిన సన్మానం హిందూ కేతనానికి జరిగిన సన్మానం మరువరానివి.
ఆరోగ్య భంగం: 1940 జూలై 5 తేదీన సావర్కర్ మరల బ్రిటీష్ వైస్రాయితో జాతీయు అంతర్జాతీయు రాజకీయ పరిస్థితులను గూర్చి చర్చించాడు. కాని తన సుడిగాలి పర్యటన దేశ రాజకీయాలు దేశ విభజన వైపు మొగ్గు చూపడం. ముస్లింలు అధికులుగా వున్న ప్రాంతాలలో హిందువులు సర్వనాశనమయ్యే పరిస్థితులు, కాంగ్రెసు హిందువులను ఆత్మహత్యకు ప్రోత్సహించే రాజకీయ వైఖరిని అవలంబించడం, ఇంత జరుగుతున్నా హిందూ జాతి ఉపేక్షా భావంతో వుండడం, సావర్కర్ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీశాయి. హిందూ సంఘటనోద్యమం పూర్తిగా సావర్కర్ పైనే ఆధారపడినది. అండమాను దీవులలో, అంత కాలము కష్టాలను అనుభవించిన ఆ దేహం ఇంతటి మహోద్యమం బాధ్యతలను భరించగలగడం, ఆశ్చర్యకరమైన విషయమే ఇది ఆయన ఆత్మశక్తికి తార్కాణం.
మధుర సభలలో నూతన శంఖారావం: 1940 డిశంబరులో మధురలో జరుగనున్న హిందూ మహాసభ సమావేశాలకు సావర్కర్ తిరిగి అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు. తన ఆరోగ్య పరిస్థితి వలన కదలలేని పరిస్థితులలో, హిందూ సంఘటన వాదుల ఒత్తిడి వలన, సావర్కరు మధురకు ప్రత్యేక రైలులో వచ్చాడు. సమావేశ వేదికపైకి ఆయనను కుర్చీలో మోసుకొని తీసుకొని పోవలసి వచ్చింది. ఈ సమావేశంలో సావర్కర్ సింధు, వాయువ్య సరిహద్దు ప్రాంతములలో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలను, దక్షిణాదిలోని హిందువులకు వివరించి, హిందూ జాతి మనుగడకై కాంగ్రెస్ పలుకుబడి నుండి విడివడి, హిందూ జాతి ప్రయోజనాలను త్యాగం చేయను అని ప్రతిజ్ఞచేసిన వారికే ఓట్లు వేయాలని ఆయన హిందువులకు విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు యుద్ధాన్ని అవకాశంగా తీసుకొని, హిందువులు సైనిక శిక్షణను పొందడం, దేశంలో కీలకమైన పరిశ్రమలను స్థాపించడం, మొదలైన నిర్మాణ కార్యక్రమాలను చేపట్టాలని కూడా పావర్కర్ విజ్ఞప్తి చేశాడు.
అదే సమావేశంలో పలు విధములైన రాజకీయ సిద్ధాంతాలను గూర్చి మాట్లాడుతూ, సావర్కర్ మన దేశ ప్రయోజనాలకు ఎవరైతే ఉపయోగపడతారో, వారి రాజకీయ సిద్ధాంతాలను లెక్క చేయక వారితో స్నేహం చేయడం, అది కూడా మనకు ఉపయోగపడుతున్నంత వరకు మాత్రమే స్నేహం చేయడం - ఆచరణ యోగ్యమైన రాజకీయాలు కోరే మనకు ఆచరణీయం, అని దేశభక్తి యుక్తమైన రాజనీతిని ప్రతిపాదించాడు. జైళ్ళకు పోవడం మాత్రమే దేశభక్తి కాదు, మన జాతిని ఒక సైనిక జాతిగా రూపొందించండి అని యువకులకు ఉద్బోధించాడు.
భగల్పూరు హిందూ మహాసభ: 1941 డిసెంబరు ఆఖరు వారంలో హిందూ మహాసభ వార్షిక సమావేశం బీహారులోని భగల్ పూరులో జరుగవలసింది, బీహారు ప్రభుత్వం ఆ సమావేశాన్ని నిషేధించింది. తీవ్ర అనారోగ్యం వలన హిందూ మహాసభ అధ్యక్షత నుండి తొలగాలని నిర్ణయించుకున్న సావర్కర్. ఈ నిషేధాన్ని ఒక సవాలుగా తీసుకొని అధ్యక్ష పదవిని అంగీకరించి భగల్పూరులో పవనావేశాన్ని జరిపి తీరాలని ఆదేశించాడు. హిందూ ధ్వజ గౌరవాన్ని విలపడానికి లక్షకు మించి ప్రతినిధులు భగల్పూరు వైపు పయనించారు. లాఠీ చార్జీలు ఆశ్వారూఢ సైనికులు కొరడాల ఝులిపింపులు, బైనెట్ల బెదిరింపులు కారాగారాలు వారిని ఆపలేక పోయాయి. భగల్పూరుకు పయనిస్తున్న సావర్కరు ని గయ వద్ద అరెస్టు చేసి జైలులో ఉంచారు. అప్పుడు బెంగాలులో మంత్రులుగా ఉండిన శ్యామ ప్రసాద్ ముఖర్జీని, ఇతర ప్రముఖ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కాని భగల్పూరు సమావేశం జరగనే జరిగింది. లోకమాన్య తిలక్ మనుమడు గజానన్ వి. కేట్కర్ సావర్కర్ అధ్యక్షోపవ్యాసాన్ని సమావేశంలో చదివాడు. వారం రోజుల తరువాత సావర్కర్ విడుదలయ్యారు. భగల్పూరు పోరాటం, హిందూ సంఘటనోద్యమంలో మరియొక ఘట్టం.
No comments