Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందూజాతి సైనికీకరణ స్వతంత్ర హిందూస్దాన్ కు ఆయువు పట్టు - Savarkar life History - సావర్కర్ జీవిత చరిత్ర - 14

హిందూజాతి సైనికీకరణ స్వతంత్ర హిందూస్దాన్ కు ఆయువు పట్టు కాంగ్రెసు సత్యాగ్రహం ముస్లిం లీగుకు అధికారమిచ్చింది:  1939 సెప్టెంబర్ 1...

హిందూజాతి సైనికీకరణ స్వతంత్ర హిందూస్దాన్ కు ఆయువు పట్టు

కాంగ్రెసు సత్యాగ్రహం ముస్లిం లీగుకు అధికారమిచ్చింది: 1939 సెప్టెంబర్ 1న బ్రిటన్ జర్మనీపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధాన్ని భారతదేశ స్వాతంత్ర్య సాధనకు, దృఢమైన భారతదేశ పునర్నిర్మాణానికి యే విధంగా ఉపయోగించుకోవాలి. ' అని ఆలోచించిన యేకైక నాయకుడు సావర్కర్. కాంగ్రెస్ దూరదృష్టి లేకుండా, ఏడు రాష్ట్రాలలో మంత్రి పదవులను వదలి వేసింది. ఆ సమయానికి ముస్లిం మెజారిటీ రాష్ట్రములలో కూడా ముస్లింలీగు ప్రభుత్వం ఒక్కటయినా లేదు. కానీ వ్యక్తి సత్యాగ్రహం వలన కాంగ్రెస్ జైలు యాత్ర కార్యక్రమం జిన్నాకు తన స్థానాన్ని బలపర్చుకోవడానికి చక్కని అవకాశం ఇచ్చింది. దీనితో జిన్నా అయిదు రాష్ట్రాలలో ముస్లింలీగు మంత్రి వర్గాలను నిర్మించు కొనగలిగాడు.

యుద్ధం - వివిధ రాజకీయ పక్ష నాయకుల అభిప్రాయాలు: గాంధీజీ వైస్రాయి లిత్ గోను  కలుసుకొన్నపుడు జర్మనీ బాంబుల వల్ల లండన్ వెస్టు మినిష్టరు అబే పార్లమెంటు భవనము ధ్వంసమైనవని వైస్రాయి చెప్పగా గాంధీజీ కండ్ల నీరు కార్చినారు. చైనా నుండి తిరిగి వస్తున్న నెహ్రూ బ్రిటన్ కష్ట పరిస్థితులను భారతదేశ స్వాతంత్ర్య సముపార్జనకై వినియోగించుకోబోమని బర్మాలో ప్రకటించారు. డాక్టరు అంబేద్కర్ - అప్పటి రాజకీయ పరిస్థితులలో భారతదేశానికి తన  అభిప్రాయాన్ని ప్రకటించే అవకాశం లేనందుకు చింతిస్తూ భారతీయులను స్వదేశ రక్షణకు ఆయత్తం చేయమని ప్రభుత్వాన్ని కోరారు. జిన్నా ఇచ్చిపుచ్చుకోవాలన్న సూత్రంపై తన  సహకారాన్ని ప్రకటిస్తూ అరబ్బుల హక్కులను రక్షించాలని గూడా కోరాడు.

సావర్కర్ దృక్పధం: భారతదేశాన్ని పారతంత్ర్యంలో ఉంచిన బ్రిటన్ తాను యుద్ధంలో దిగింది. మానవ హక్కుల సముద్ధరణ కోసం అని ప్రకటించడం కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమే అని సావర్కరు ప్రకటించారు. భారత సైన్యంలో ముస్లింలు 70% ఉండేటప్పుడు తమ భవిష్యత్తును గూర్చి ఏలాటి ఆలోచన లేని మెత్తటి హిందువులను జాతి రక్షణకు సమర్ధులుగా చేయడానికి ఒక సైనిక జాతిగా తీర్చిదిద్దడం ఎలా అన్నది మాత్రమే సావర్కర్ ఆలోచించారు. శాంతి సమయంలో హిందువులను నమ్మక ముస్లింలను మిలిటరీలో ఎక్కువ మందిని తీసుకొవడం వలన ఈ యుద్ధ సమయంలో బ్రిటీష్ అవసరాన్ని అవకాశంగా తీసుకొని హిందువులు వేలలో లక్షలలో సైన్యంలో చేరి సైనిక శిక్షణ పొందటం అవసరమని సావర్కర్ బహిరంగ సభలలో కళాశాల విద్యార్థుల సమావేశాలలో ఉద్బోధించారు.

ఇంకా ఈ దినం సైన్యంలోని జవానులు విదేశీ ప్రభుత్వ జీతం తీసుకొనే బానిసలుగా కనిపించవచ్చును కానీ అత్యవసర క్లిష్ట సమయాలలో వీరు అకుంఠిత దేశ భక్తులుగాను స్థిరమైన హిందువులు గాను విరూపించు కోగలరు.

1857 లో జరిగిన ప్రధమ స్వాతంత్య్ర సంగ్రామ కాలంనుండి బ్రిటీషు వారు సైన్యానికి రాజకీయ వాసన తగలని పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు సాధ్యమైనన్ని మార్గాల ద్వారా రాజకీయాలను సైనికుల వద్దకు తీసుకొని పోవడమే మన వ్యూహం కావాలి ఇది సాధించగలిగితే స్వాతంత్వ పోరాటంలో మనం విజయం సాధించినట్లే.

తమ వేరుదాటి పోయిన పరిస్థితులలో బ్రిటీషు వారు మిమ్ములను నమ్మి ఆయుధాలను మందుగుండు సామాగ్రిని మీ చేతులలో పెడుతున్నారు. ఇంతకు ముందు మన యువకులు పిస్టళ్ళు పట్టుకొన్నందుకే జైళ్ళలో మగ్గి పోయారు. కానీ నేడు రై ఫిల్సు తుపాకులు ఫిరంగులు మిషన్ గన్సు బ్రిటీషు వారు మీ చేతులలో పెడుతున్నారు. సైనికులుగా సేనా నాయకులుగా పూర్తి నైపుణ్యం సంపాదించండి. వేలకొలది నిపుణులైన పనివారలు ఓడలను విమానాలను తుపాకులను మందుగుండు ఫాక్టరీలను నిర్మించడంలో శిక్షణ పొందండి.

మీకు లాభం కలిగేచోట ఎందుకు బ్రిటీష్ వారితో సహకరించరు? మెకాలే ఆశలను మీరు వమ్ము చేయలేదా? మీ శత్రువులెవరో మీకు తెలుసు సైన్యంలో చేరి తుపాకులు పట్టి స్వాతంత్య్ర సముపార్జనకై వాటిని ఉపయోగించండి. ఇది మీకు నేను దాపరికం లేకుండా చెప్పుతున్నాను ఇదే విషయం నేను వైస్రాయితో కూడా చెప్పాను. వ్రాసి ఇచ్చిన బాండ్లను అగ్రిమెంట్లను లెక్క చేయనవసరం లేదు. ఆకాగితము ముక్కల వెనుక వైపు ఖాళీగానే వున్నది. సమయమాసన్నమైనపుడు ఆ ఖాళీ జాగాలలో కొత్త అగ్రిమెంట్లు బాండ్లు వ్రాసుకోవచ్చును. ఒకటి మాత్రం మనస్సులో ఉంచుకొండి ప్రపంచాన్నంతా నింపివేయ కలిగిన కాగితపు తీర్మానాలు స్వరాజ్యాన్ని సాధించలేవు. కానీ మీ భుజాల మీది తుపాకులు తీర్మానాలు చేసినప్పుడు స్వరాజ్యాన్ని సాధిస్తాయి అని సావర్కరు హిందూ జాతిని సైనిక జాతిగా చేయండి. రాజకీయాలను హిందూ భావాలతో నింపండి అని ఉద్బోధించారు. ఇవి క్రాంతిద్రష్ట జ్వలిత భావాలు.

నిజాయితీ లేని కాంగ్రెసు పద్ధతులు: ఒకవైపు గాంధీ సేవా సంఘం ద్వారా సైన్యాలకు దుప్పట్లు సరఫరా చేస్తూ విధించిన పన్నులనన్నింటిని చెల్లిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్న గాంధేయులు సావర్కర్ సైన్యాన్ని అవహేళన చేశారు. దూరదృష్టి లేని నినాదనాయకులకు రాజనీతి యేమి అర్థం అవుతుంది? తరువాత ఈ సైన్యాల నుండియే కదా నేతాజీ భారత జాతీయ సైన్యాన్ని నిర్మించకలిగింది? ఈ నాయకులే కదా బ్రిటీషువారిపై తిరుగుబాటు చేసి బ్రిటీషు సామ్రాజ్యపు నడుము విరుగ గొట్టింది? ఏమైతేనేం సావర్కర్ ఉద్దేశ్యం ఫలించింది! ముస్లింలీగు గుండెలో దడపుట్టింది. సావర్కర్ యొక్క సైవికీకరణ ప్రబోధం ఆశ్చర్యకరమైన విజయాన్ని సాధించినదని ముస్లింలీగు పత్రిక ఈస్టరన్ టైమ్సు ఆక్రందించింది.

నేతాజీబోస్ - సావర్కర్: దేశ గౌరవ సుభాష్ చంద్రబోస్ వీరసావర్కర్ పై ఎనలేని గౌరవం కలిగి ఉండేవాడు. 1941 జనవరిలో దేశం నుండి  తప్పించుకొని పోవటానికి కొద్ది నెలల ముందు వీరసావర్కరును కలుసుకొని రెండవ ప్రపంచ యుద్ధ పరిణామాల దృష్ట్యా దేశ పరిస్థితులను అంతర్జాతీయ పరిస్థితులను చర్చించి స్వాతంత్ర్య సమరాన్ని ఉధృతం చేయటానికి దేశం బైట నుంచి ఆయుధ విప్లవాన్ని తేవటానికి ఉన్న అవకాశాలను సమాలోచించారు. సుభాష్ చంద్రబోస్ ఈ ఆలోచనలను ఆచరణలోనికి తెచ్చి యుద్ధ ప్రారంభం వరకు జపాన్లో హిందూసభ అధ్యక్షుడుగా ఉండిన రాష్  బిహారి బోసుచే స్థాపించబడిన భారత జాతీయ సైన్యానికి నేతృత్వం వహించి నేతాజీ అయ్యారు.

విప్లవకారుడైవ రాష్  బిహారి బోసు అంతకు చాలా కాలం ముందే బ్రిటీషు వారి కళ్ళుగప్పి జపాను చేరుకొన్నాడు. రాష్  బిహారి బోసు, సుభాష్ చంద్రబోసు అనేకసార్లు రేడియోలో సావర్కర్కు సందేశాలు పంపించారు. 1944 జూన్ 26 రాత్రి రేడియోలో మాట్లాడుతూ సుభాష్ చంద్రబోసు ఈ క్రింది విధంగా అన్నారు.

తప్పుత్రోవ పట్టిన సంకుచిత రాజకీయ అభిప్రాయాలు కలిగి స్పష్టమైన భవిష్యత్ దర్శనం లేని కాంగ్రెసు నాయకులందరూ భారత సేనలోని సైనికులను బత్తెం కోసం సేవ చేసే వారని వర్ణిస్తుండగా వీర సావర్కర్ మాత్రం యువకులను సైన్యంలో చేరమని ఉద్బోధిస్తున్నారని తెలిసి ఎంతో సంతృప్తి చెందుతున్నాను. ఈ సైన్యంలో చేరిన యువకులే భారత జాతీయ సైన్యంలోనికి సైనికులుగా శిక్షణ పొందిన వీరులను ఇవ్వగలుగుతున్నారు. శ్రీ రాష్  బిహారి బోసు రేడియో ద్వారా సావర్కరును సంబోధిస్తూ మీకు వందనం చేయడం ద్వారా ఆయుధాలు ధనించిన నా కన్నా పెద్దవాడైన సోదరులలో ఒకరి యెడ నా విద్యుక్త ధర్మాన్ని విర్వర్తిస్తున్నాని భావిస్తున్నాను మీకు వందనం చేయడం ద్వారా మూర్తీభవించిన త్యాగానికి వందనం చేస్తున్నాను " అని చెపుతూ వందేమాతరం నినాదంతో ముగించారు. భారత జాతీయ సైన్యంలోని దళాలకు పేర్లు స్పూర్తి ఆదర్శాలు వీర సావర్కర్ వ్రాసిన 1857 ప్రథమ స్వాతంత్ర్య సమరం నుండి గ్రహించడం జరిగింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments