దేశాన్ని వదలండి అనే నినాదంతో దేశాన్ని విభజించండి అన్న గమ్యానికి ! కాంగ్రెసు వారు చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి: 1940 నుండి భారత...
దేశాన్ని వదలండి అనే నినాదంతో దేశాన్ని విభజించండి అన్న గమ్యానికి !
కాంగ్రెసు వారు చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి: 1940 నుండి భారత రాజకీయాలు దురదృష్టకర ధోరణిలో సాగాయి. కాంగ్రెసు వాదులు బహిరంగంగా ప్రజలకు ఒకటి చెపుతూ రహస్యంగా లాలూచీ రాజకీయాలు సాగించారు. మార్చి 1942 లో సి రాజగోపాలాచారి బహిరంగంగా పాకిస్థాన్ వాదనను సమర్థించారు. అప్పటికి ప్రపంచ యుద్ధ పరిణామాలు, మిత్ర రాజ్యాలకు ఆందోళన కల్గిస్తూ వచ్చాయి. 1942 మార్చి 23 తేది బ్రిటీషు మంత్రి సర్ స్టాఫర్డు క్రిప్స్ రాయబారానికి భారతదేశానికి వచ్చాడు. ఆయన యుద్ధానంతరం పరిమిత స్వాతంత్ర్యం ఇచ్చేటట్లు రాష్ట్రాలకు కేంద్రం నుండి విడిపోవటానికి హక్కులుండేటట్లు ప్రతిపాదనలు చేశాడు. ఇది దేశ విభజనకు ప్రోత్సాహకారిగా ఉందని పేర్కొంటూ వీర సావర్కర్ తిరస్కరించారు. ఈ సందర్భంలో సావర్కర్ క్రిప్పుతో జరిపిన సంభాషణ ఆనాటి రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. సావర్కర్ వాదనాపటిమ ముందు క్రిప్పు అవాక్కు అయ్యాడు. ఈ విషయాన్ని వ్రాస్తూ నెహ్రూ వాణి అనదగిన నేషనల్ హెరాల్డు పత్రిక తనతో సావర్కర్ జరిపిన వాగ్యుద్ధాన్ని క్రిప్సు తన జన్మలో మరచిపోలేడని పేర్కొవడం గమనార్హం.
క్రిప్సు ప్రతిపాదనల నిరాకరణ: బ్రిటీషు మంత్రి వర్గ ప్రతిపాదనలను తిరస్కరించిన మొట్టమొదటి పక్షం హిందూ మహాసభ. రెండవ సారి క్రిప్పు సావర్కర్ ను సంభాషణలకు పిలవగా ప్రతిపాదనలలో దేశ విభజనకు దారితీసే అంశాలున్నంత వరకూ సంభాషణలు వ్యర్థముని, సంప్రదింపులకు పోవటానికి నిరాకరించారు. కానీ, బొంబాయి గవర్నరు కోరిక మేరకు బొంబాయిలో అతనిని కలుసుకొని తన అభిప్రాయాలను పునరుద్ఘాటించారు.
స్ధిర చిత్తం లేని కాంగ్రెసు: ఇప్పటికే కాంగ్రెసు వారు బాగా దిగజారిపోయారు. 1942 ఏప్రిల్ లో ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగు కమిటి ఏ ప్రాంత ప్రజలైనా భారత సమాఖ్య లో ఉండదలచు కోకపోతే, వారిని బలవంతం చేయబోము అని తీర్మానించింది. అమెరికాలో అబ్రహాంలింకన్, జర్మనీలో ఫెడరిక్, బిస్మార్క్, ఇటలీలో మజినీ గారిబాల్దీ వలె దేశ సమైక్యతకు, తుపాకీ చేపట్టే నాయకులు మన దేశంలో లేకపోవడం దురదృష్టకరం. 1942 మేం 2వ తేది అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో బాబూ జగత్ నారాయణలాల్ అఖండ హిందూస్థాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజాజీ, కాంగ్రెసు ముస్లింలు వ్యతిరేకించినప్పటికీ అత్యధిక మెజారిటీతో ఆ తీర్మానం ఆమోదింపబడింది.
కానీ నెహ్రూ, అబ్బుల్ కలాం ఆజాద్ - ఈ అలహాబాదు తీర్మానం రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారాన్ని ఆమోదించే ఢిల్లీ తీర్మానాన్ని త్రోపిపుచ్చలేదు అని ప్రకటించి అఖండ హిందూస్థాన్ తీర్మానాన్ని నీరు కార్చివేశారు.
సావర్కర్ ప్రతిఘటన: దీనికి వీర సావర్కర్ అత్యంత ఆందోళన చెంది, సమీపిస్తున్న విషాద పరిణామాన్ని వివారించడానికి తుది ప్రయుత్నాలు చేయసాగారు. భారతదేశ పరిస్థితి ప్రపంచ ప్రజల దృష్టికి కూడా తేవడానికి ప్రయత్నించారు, న్యూయార్కు టైమ్స్ సంపాదకునికి ఒక కేబుల్ ఇలా పంపాడు దేశాన్ని ముక్కలు ముక్కలు చేసే రాష్ట్ర స్వయం నిర్ణయాధికారం ప్రతిపాదించి నందుననే కిప్పు ప్రతిపాదనలు హిందు మహాసభ తిరస్కరించింది. తమ దేశ విభజనను నివారించి దేశ ఐక్యతను కాపాడటానికి తమ సొంత అన్నదమ్ములతో యుద్ధం చేసిన అమెరికన్లు దేశ విభజనను వివారించటానికి ప్రయత్నించే హిందువుల దృక్పథాన్ని అర్థం చేసుకోగలరు, అన్ని న్యాయమైన రక్షణలను, మైనారిటీలకు కల్పించటానికి 'హిందువులు సంపిద్ధంగా ఉన్నారు, కానీ ఒక రాష్ట్రంలోనే అనేక రాష్ట్రాలను కల్పించే ప్రయత్నాలను సహించలేరు '.
గాంధీజీ విభిన్న ప్రకటనలు: 1941 - 42 లో హిందూ మహాసభ బలమైన ప్రతిపక్షమై నిలిచింది. అనేక మధ్యంతర ఎన్నికలలో కాంగ్రెసును ఓడించి ఉత్తర హిందూస్థానంలో అనేక స్థానిక సంస్థలను హస్తగతం చేసుకొన్నది. గాంధీజీ అనుక్షణం భిన్నములైన ప్రకటనలు చేయసాగారు. దేశ విభజన మహాపాపం అన్నారు, దేశాన్ని విభజించే ముందు తనను ఖండించమన్నారు. కాని మరియొక వైపు ముస్లింలు కోరిన వాటినన్నింటిని హిందువులు ఒప్పుకోవాలని ముస్లిం రాజ్యము కూడ స్వరాజ్యానికి సమాన మేనని అన్నారు. ఇంతేగాక ముస్లింలు స్వయంగా కాని, బ్రిటీషువారి సహాయంతోగాని విభజనను మనపై రుద్ద ప్రయత్నిస్తే దానిని నిరోధించరాదన్నారు. నెహ్రూ కూడా పాకిస్థాన్ సమస్యను సమగ్రంగా ఆలోచించక తన ధోరణిలో ఆచరణ యోగ్యం కాని ధర్మాలను వల్లిస్తూ వుండేవాడు.
వివిధ నాయకుల సంప్రదింపులు: 1942 లో ప్రముఖ రాజకీయవేత్తలు పలువురు సావర్కర్తో సంభాషించారు. 1942 మేం నెలలో అమెరికన్ రాయబారి కార్యాలయ రెండవ కార్యదర్శి అదే నెలలో చైనా నుండి ఒక ముస్లిం ప్రతినిధి వర్గం భారతదేశానికి వచ్చి ముస్లింలీగును ప్రోత్సహించారు. యుద్ధం ముగిసిన తర్వాత భారత ముస్లింలకు పూర్తి తోడ్పాటు యివ్వగలనని వాగ్దానం చేసారు. అదే సమయంలో హిందువుల హక్కులకు భంగం కలిగిస్తూ హిందువులపై కాలు దువ్వుతున్న వెల్లూరు ముస్లింలకు కూడా చైనా ప్రతినిధులు ఒక సందేశం పంపించారు చైనా ముస్లిం మిషన్ చర్యలను సావర్కరు బహిరంగ పరచి ఖండించారు. ఇదే సమయములో పీర్ పగారో నాయకత్వంలో సింధులోని హుర్ ముస్లిం తెగ హిందువులపై తీవ్రమైన అత్యాచారాలు చేయసాగింది.
రాజాజీ బహిరంగంగా పాకిస్థాన్ అనుకూల ఉద్యమాన్ని లేవదీసి కాంగ్రెసు అధిష్టాన వర్గం లోలోపల గొణిగే విషయాన్ని తాను బయటికి పెద్దగా స్పష్టంగా చెప్పుతున్నానన్నారు. సరిహద్దు గాంధి అనబడే గఫార్ ఖాన్ సోదరుడు ఖాన్ సాహేబు గూడా కాంగ్రెసువారు రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి అనుకూలం అని ప్రకటించారు. అప్పుడే సావర్కర్ ప్రజలను పాకిస్థాన్ అనుకూలంగా త్రిప్పుకోవటానికి కాంగ్రెసు వారు రాజాజీని బుద్ధిపూర్వకంగా ఉపయోగించుకొంటున్నారని ప్రజలు మౌనంగా ఉంటే కాంగ్రెస అధిష్టాన వర్గం బైట పడటానికి రాజాజీ మాటలతో తమకు సంబంధం లేనట్లుగా ఉండటానికి చేసిన కుట్ర అని ప్రకటించారు.
హిందూ సంఘటన కార్యకర్తలు హిందు సిక్కు నవజవాన్ సభ, ఆర్య సనాతన సభల ఒత్తిడి మీద మొదటిసారిగా 1942 జూలైలో సావర్కర్ కాశ్మీరు దర్శించారు సావర్కర్తో బాటు శిక్కు నాయకుడు మాష్టరు తారాసింగ్ కూడా పర్యటించారు. కాశ్మీరు పర్యటనతో పాటు అమృతపర్ లాహోరు, వజీరాబాదు, రావల్ పిండి లను సందర్శించి కాంగ్రెసు ముస్లింలీగు కుట్రను గురించి ప్రజలకు హెచ్చరించారు.
సావర్కర్ అనారోగ్యం - రాజీనామా: సావర్కర్ ఆరోగ్యం క్షీణింపసాగింది జూలై 31వ తేదీ హిందూ మహాసభ అధ్యక్షపదవికి రాజీనామా పంపారు. ఆయన రాజీనామా హిందూ సంఘటన కార్యకర్తలకు అశనిపాత మయింది భాయిపరమానంద భోపట్కర్ అశుతోష్ హరి శ్యామప్రసాద్ ముఖర్జీ వరదరాజులు నాయుడు వంటి నాయకులు హిందూ సభలో ఉన్నప్పటికి దేశం మొత్తాన్ని సంఘటిత పరచి ఉత్తేజ పరచగల నాయకుడు ఒక్క సావర్కర్ మాత్రమే అందువలన రాజీనామాను ఉపసంహరించుకోమని కోరారు దేశమంతటినుండి టెలిగ్రాంలు, ఉత్తరములు 'సావర్కర్ సదన్ కు వచ్చాయి.
కాంగ్రెసు క్విట్ ఇండియా ఉద్యమం: ఈలోగా కాంగ్రెసు క్విట్ ఇండియా (భారతదేశం వదలి పెట్టిపోండి) ఉద్యమాన్ని తలపెట్టి ప్రజల దృష్టిని ముస్లిం దౌష్ట్యాలు కుట్రల నుండి మరలించింది. ముస్లిం సహకారం లేనిదే స్వరాజ్యం లేదు అనే నినాదాన్ని విడవాడి తనంతట తాము క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభింప దలచడం కొంతమేలే అయినా కాంగ్రెసు వారు పాకిస్థాన్ యేర్పాటు చేయటానికి సుముఖులుగా ఉన్న విషయం సావర్కరుకు ఆందోళన కలిగించింది. ఈ క్విట్ ఇండియా ఉద్యమం స్ల్పిట్ ఇండియాగా (ఇండియాను ముక్కలు చేయండి) దిగజారుతుందని ముస్లింలను కాంగ్రెసు వారిని యెరిగిన సావర్కరు గుర్తించారు. కాంగ్రెసు దేశ ఐక్యత విషయంలో స్థిరంగా నిలచే పక్షంలో హిందూ మహాపభఉద్యమంలో పాల్గొంటుందని ప్రకటించారు. కాంగ్రెసు సావర్కర్ ప్రకటనను నిర్లక్ష్యం చేయడమే గాక 7–8–1942వ జరిగిన బొంబాయి సమావేశాలలో రాష్ట్రాలకు స్వయం నిర్ణయాధికారమే గాక, ఇతోధికమైన ఇతర అధికారాలు కూడా ఉంటాయని ప్రకటించి ముస్లింలను తృప్తి పరచాలని చూచింది.
క్విట్ ఇండియా ఉద్యమం - సావర్కర్: 1942 ఆగస్టు 8వ తేది గాంధీజీతో సహా అందరు కాంగ్రెసు నాయకులుఅరెస్టు అయ్యారు. దేశ భక్తులైన హిందూ యువకులు మాత్రమే ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేతనైన విధంగా సత్యాగ్రహం, అహింసలను ప్రక్కకు నెట్టి - నిర్వర్తించారు.
ముస్లింలీగు, ముస్లింలు ఉద్యమానికి దూరంగా ఉండి దేశ విభజన పన్నాగాలను బలపరచు కొన్నారు ఈ ఉద్యమాన్ని నిరోధించటానికి బ్రిటీషు ప్రభుత్వం సాగించిన దమనకాండను సావర్కర్ ఖండిస్తూ బాధ్యతగల పదవులలోను వాయు నౌకాపదాతి దళాలలో ఉండే హిందూ సంఘటన వాదులు, ఉద్రేకాలకు లోనుకాకుండా, తమ తమ స్థానాలను వదలకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతేకాదు, బ్రిటీషు పత్రికలకు ఈ దమనకాండ విషయాలలో బ్రిటీషు వారి పద్ధతులను నిరసిస్తూ బైవెట్లు స్వాతంత్ర్య కాంక్షను అణచలేనని హెచ్చరిస్తూ ప్రకటవలు పంపారు. ఇంగ్లండులోని టైమ్స్ , మాంఛెప్టర్, గార్డియన్ వగైరా పత్రికలు వీనిని ప్రముఖంగా ప్రకటించాయి.
జాతీయ కోర్కెల పత్రం: ఈ సమయంలోనే జాతీయుల కోర్కెల విషయమై దేశంలోని ప్రముఖులతో సంప్రదించి దానికి ఒక్క స్పష్టమైన రూపం ఇవ్వటానికి శ్యామ ప్రసాద్ ముఖర్జీ తదితర నాయకులతో ఒక సంఘాన్ని సావర్కర్ యేర్పాటు చేశారు. సిక్కులు మోమినులు ఆజాద్ ముస్లిం పమావేశం క్రైస్తవులు, ముస్లింలీగు కాంగ్రెసు తప్ప ఇతర అన్ని పక్షాల ఆమోదంతో ఈ సంఘం ఈ క్రింది జాతీయ కోర్కెలను రూపొందించింది.
1. భారతదేశాన్ని వెంటనే స్వతంత్ర జాతిగా బ్రిటీషు పార్లమెంటు గుర్తించాలి. 2. ఒక సైనిక శాఖ తప్ప అన్ని శాఖలను జాతీయ సమైక్య ప్రభుత్వానికి అప్పగించాలి. 3. యుద్ధం పూర్తికాగానే భారత రాజ్యాంగాన్ని రూపొందించటానికి రాజ్యాంగ నిర్మాణ (సంవిధాన సభ) సభను ఏర్పాటు చేయాలి. ఈ కోర్కెలను విశదీకరిస్తూ బ్రిటీషు ప్రధాని చర్చిల్ కి ఒక మెమొరాండం పంపించారు.
హిందూసభ – ముస్లింలీగు మిశ్రమ ప్రభుత్వాలు: సావర్కర్ వద్దని చెప్పినా శ్యామ ప్రసాద ముఖర్జీ జిన్నాను కలుసుకొన్నారు కానీ అతని నుంచి ఎలాంటి సహకారం పొందలేకపోయారు. అయినప్పటికి సింధులోను బెంగాలులోను హిందూ మహాసభ ప్రతినిధులు ముస్లింలీగుతో కలసి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. కానీ గవర్నరు తన ఆత్మగౌరవాన్ని భంగం కలిగించే విధంగా తన ప్రజాసేవకు అడ్డంకులు కల్పించగా శ్యామ ప్రసాద్ బెంగాలు మంత్రి వర్గంనుండి రాజీనామా చేశారు. ముఖర్జీ గవర్నరు మధ్య అప్పుడు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఉత్తేజకరాలు - దేశ భక్త్యావేశ పూరితాలు ఈ విధంగా హిందూ మహాసభ అన్ని వర్గాలతో సహకరించి హిందూ రాష్ట్ర ఐక్యతము కాపాడటానికి ప్రయత్నం చేసింది.
హిందూ మహాసభను వశపరచుకునేందుకు కాంగ్రెసు కుట్ర: ఈ సమయంలో హిందూ మహాసభను తన పలుకుబడిలోకి తెచ్చుకొనేందుకు కాంగ్రెసు మార్గంలోనే నడిచేట్లు చేయడానికి కొందరు కాంగ్రెసు వారు కుట్రచేశారు. శ్రీ కె.ఎం మున్షి పనిగట్టుకొని హిందూ మహాసభ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. డాక్టరు శ్యామ ప్రసాద్ ముఖర్జీని రాజమహేశ్వర దయాళు, రాజాజీ ఇంచు మించు తన ఆలోచనా పరది లోకి తిప్పుకొన్నాడు. ఇది గమనించిన సావర్కర్ క్షీణిస్తున్న తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యక విభజన వాదుల కుట్ర నుండి హిందూ మహాసభను, దేశ ఐక్యతావాదులను రక్షించి, వారి మనస్థైర్యాన్ని నిలబెట్టడానికి తన రాజీవామాను ఉపసంహరించుకోవటమే గాక, హిందూ మహాసభ అధ్యక్షపదవికి పోటీ చేస్తూన్నట్లు కూడా ప్రకటించారు వెంటనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
No comments