Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కాంగ్రెసు ముస్లిం లీగు కుట్రపై పోరాటం - Savarkar life History - సావర్కర్ జీవిత చరిత్ర - 16

కాంగ్రెసు ముస్లిం లీగు కుట్రపై పోరాటం హిందూ మహాసభ – కాన్పూరు సమావేశం:  1942 డిసెంబరులో జరిగిన హిందూ మహాసభ కాన్పూరు సమావేశం చారిత...

కాంగ్రెసు ముస్లిం లీగు కుట్రపై పోరాటం

హిందూ మహాసభ – కాన్పూరు సమావేశం: 1942 డిసెంబరులో జరిగిన హిందూ మహాసభ కాన్పూరు సమావేశం చారిత్రాత్మకమైనది. “దేశాన్ని వదలి పోండి" అని నినాదంతో ప్రజలను మభ్యపెడుతూ “దేశాన్ని విభజించండి' అనే స్థితికి దిగజారిన కాంగ్రెసు వారి విధానాన్ని ఆ సభ ఖండించింది. జిన్నాకు వ్రాసిన జాబులో "గాంధీజీ ప్రజల పక్షాన ముస్లింలీగు ఏర్పరచే ప్రభుత్వాన్ని కాంగ్రెసు వ్యతిరేకించక పోవటమే గాక అట్టి ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా వుండగలదు. ఇది బాగా ఆలోచించి చిత్తశుద్ధితో చెప్పుతున్న విషయం" అన్న విషయాన్ని బహిరంగ పరచి సావర్కర్ రానున్న, ఉపద్రవాలము గూర్చి హెచ్చరించారు.

హిందువులు యుద్ధ ప్రియులైన వీరజాతి కావాలి: "హిందువులకు భవిష్యత్తు వుండాలంటే హిందువులు యుద్ధ ప్రియులైన వీరజాతిగా రూపొందడం, అన్ని రాజకీయ విధానాలను హిందువుల క్షేమం దృష్ట్యా మాత్రమే అలోచించడం అవసరమని చెబుతూ" మంచి భవిష్యత్తు గల వందలకొలది హిందూ యువకులు అపుడే కింగ్స్ కమీషన్, వైస్రాయి కమీషన్లు పొంది అత్యంత శక్తి సామర్థ్యాలతో సైన్యాలకు నాయకత్వం వహిస్తూ, అనేక యుద్ధ క్షేత్రాలలో ఆధునిక యుద్ధ పద్ధతులను గూర్చి క్షుణ్ణంగా తెలుసుకోవటమే గాక, ప్రత్యక్షంగా యుద్ధ విద్యా ప్రావీణ్యాన్ని గూడా పొందుతున్నారు. వైమానిక బలంలో కూడా ఇదే విధంగా జరుగుతున్నది నేను చెప్తున్నాను నమ్మండి యుద్ధానంతరం కూడా ఈ సైనిక శిక్షణ వలె మరేదీ హిందువులను బలంతో గౌరవ స్థానంలో ఉంచలేదు. ఈనాడు భారత సైన్యంలో నౌకాబలంలోను వైమానిక బలంలోను పనిచేసే ప్రతిఒక్క సైనికుడూ ప్రతి అధికారీ భగల్ పూరు జైలుకు పోయిన వారి సేవకంటే ఎక్కువ జాతీయ సేవ చేస్తున్నారని నిస్సందేహంగా చెప్తున్నాను" అని ప్రకటించారు.

తక్షణ కర్తవ్యం - ఇంకా సావర్కర్ ఇట్లా యువకులను మేల్కొలిపారు: యుద్ధ పరిస్థితిని జాతి యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలి, అస్పృశ్యతను నివారించి హిందూ సంఘటనోద్యమాన్ని ద్విగుణీకృతోత్సాహంతో కొనసాగించాలి, కాంగ్రెస్ ఉచ్చులలో నుండి బయటపడి హిందువులు హిందూ మహాసభను బలపరచి, దేశ విభజనను ప్రతిఘటించండి. ముస్లింలు అధికులుగా ఉన్నచోట్ల వారు నెరపే హిందువుల వినాశనాన్ని నివారించడమే మీ తక్షణ కర్తవ్యం.

విఫలమైన కాంగ్రెసు కుట్ర: తన కుట్ర ఫలించి, దేశ విభజన వివాదానికి తన తీవ్ర ప్రతిఘటనను హిందూ మహాసభ విరమించుకొంటుందని ఆశించిన వారికి ఆశాభంగంగా దేశ విభజనకు వ్యతిరేకంగా హిందూ మహాసభ కాన్పూరు సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. గాంధీజీ అంతర్వాణికి ప్రతినిధి అనబడే రాజాజీ హిందూ ముస్లిం ఐక్యతకు, నా ప్రతిపాదనలకు సానుభూతి చూపే ఆ కొద్దిమంది హిందూ నాయకులు కూడా కాన్పూరు ప్రజావాహినికి లోబడి కొట్టుకొనిపోయి సామాన్య జన మనస్తత్త్వానికి ఆహుతి అయిపోయారు అని విలపించి, అనాలోచితంగా జరిగిన కుట్రను అంగీకరించారు. రాజాజీ పేర్కొన్న నాయకులలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గాని రాజమహేశ్వర దయాల్ గాని ఉండి ఉండవచ్చునని ఊహించారు గాని ఆ నాయకులు తాము అలా చేయలేదని ప్రకటించారు.

కాంగ్రెసు శాసనోల్లంఘన ఉద్యమ వైఫల్యం: ఈలోగా కొన్ని వారాలు సాగిన హింసాయుత చర్యలు శాసనోల్లంఘనం తర్వాత కాంగ్రెసు ఆగస్టు ఉద్యమం విఫలమెంది. కాంగ్రెసు వారు జైళ్ళకు పోయే పధకాన్ని గాలికి వదలి, జైళ్లనుండి విడుదల అయ్యే పథకాన్ని చేపట్టారు. గాంధీజీ ఉద్యమ వైఫల్యం గమనించి10-2-1943 న 21 రోజుల నిరాహార దీక్షబూనారు, గాంధీజీని విడుదల చెయ్యమని వైస్రాయికి విన్నపాలు చేసే కన్నా దేశ క్షేమం దృష్ట్యా గాంధీజీ దీక్ష విరమించు కోవాలని సావర్కర్ ప్రకటించారు. ఇంతేకాదు ఈ నిరాహార దీక్షను విరమింప జేసే మిషతో హిందువుల హక్కులను త్యాగం చేయటానికి ఎవరికీ హక్కులేదని కూడా ప్రకటించారు.

గాంధీజీ దేశ విభజనకు అంగీకరించారు: ఇది జరిగిన తర్వాత దేశమంతా నివ్వెరపొయ్యేటట్లు ఈ నిరాహార దీక్ష సమయంలోనే గాంధీజీ తన దేశ విభజన ప్రణాళిక మూలసూత్రంగా జిన్నాతో సంప్రదింపులు చేయటానికి తనకు అధికార మిచ్చినట్లు రాజాజీ ప్రకటించారు. ఒక్క సావర్కరు మాత్రమే గాంధీజీ పద్ధతులను అంచనా వేయగలిగారు. ఈలోగా ముస్లింలీగు తన ప్రణాళికలను అమలు పరచసాగింది. సింధు అసెంబ్లీలో పాకిస్థాన్ తీర్మానాన్ని ఆమోదింపజేశారు. ఒక్క హిందూ మహాసభ సభ్యులు మాత్రం దీనిని ప్రతిఘటించారు. కాంగ్రెసు అనుకూలుడైన అసెంబ్లీ సభ్యుడు అల్లాబక్షు సభకు కూడా హాజరుకాలేదు. ఆయన కొద్ది రోజుల తర్వాత హత్య చేయబడ్డారు. సావర్కర్ దేశాన్ని మరలా హెచ్చరించారు. పాకిస్థాన్ రూపం దృష్టిని నిలుపకుండా పరుగెత్తే వాడికి కూడా కనపడవంత స్పష్టమవుచున్నది, గ్రుడ్డివారు పిరికి పందలు మాత్రమే ఈ విషసర్పాన్ని రజ్జవుగా నమ్మడానికి ప్రయత్నిస్తున్నారు.

మార్చి 1943లోనే ఒక దేశ నాయకుల సమావేశం ఏర్పాటు చేయబడింది. సావర్కర్ అక్కడికి పోయినపుడు నాయుకులు గాంధీజీ విడుదలను గూర్చి మాట్లాడుకొంటున్నారే గానీ, దేశ ఐక్యతా రక్షణను గూర్చి గానీ ముస్లింలు అధికులుగా ఉన్న చోట్ల హిందువుల రక్షణను గూర్చిగానీ ఎవరూ మాట్లాడటం లేదు. ఆసభలో మాట్లాడుతూ సావర్కర్ ఒక్క గాంధీజీనే కాదు శరచ్చంద్ర బోసు తదితర రాజకీయ నాయకులను కూడా విడుదలచేయాలని కోరాడు.

సావర్కర్ వజ్రోత్సవం: 1943 మేం 28 తేది పావర్కర్ వజ్రోత్సవం దేశమంతటా జరుపబడింది. ఆరోజు పూనాలో జరిగిన బ్రహ్మాండమైన సభలో సావర్కర్ సన్మానపత్రంతో బాటు లక్ష ఇరవై వేల రూపాయల నిధి బహూకరించబడింది. ఆ సభలో మాట్లాడుతూ సావర్కర్

రెండు ద్వీపాంతర వాస శిక్షలను అధిగమించి ఈనాడు మీముందు నిలబడతానని ఎవరూ వూహించలేదు. పలుమార్లు ఆత్మహత్య చేసుకోవలెననే ఆలోచనలు కూడా వచ్చినవి మేము ఇంచు మించు సమాధులలో నివసించాము. అగ్నిజ్వాల పరీక్షలలో మాఅపూర్వమైన ప్రతిజ్ఞను నిలబెట్టుకొన్నాము. విడుదలైనప్పుడు నేను నా సొంత వ్యక్తిని కాను, అత్యంత దీనావస్థలో వున్న హిందువుల యొక్క ఆక్రందన ప్రతిమూర్తిని మాత్రమే అని ప్రకటించారు.

సావర్కరును బొంబాయి, అహమ్మదాబాదులలో అదే విధముగా సత్కరించారు హిందూ మహాసభను తమ ధోరణిలోకి మార్చుకోవాలని కాంగ్రెసు వారు చేసిన ప్రయత్నాలన్నీ వమ్ము చేసిన తర్వాత సావర్కర్ జూలై 1943లో మరల అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చారు. కాని, ఆనాటి క్లిష్ట పరిస్థితులలో సావర్కర్ నాయకత్వం తప్పనిసరిగా భావించి హిందూ మహాసభ కార్యవర్గం రాజీనామాను అంగీకరించలేదు.

అంత అనారోగ్య పరిస్థితులలో కూడా సావర్కర్ విశిత దృష్టి పాకిస్థానీయుల ఎత్తుగడలను గమనిస్తూనే ఉండింది. అస్సాంలో హిందువుల ఆధిక్యత తగ్గించడానికి బెంగాలు, ఒరిస్సాల నుంచి ముస్లింల గుంపులు అస్సాం ప్రవేశాన్ని గమనించి అస్సాం హిందువులను హెచ్చరించారు. ఆనాడు ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేయడం వల్లనే, ఈనాడు మరల అస్సాం సమస్య తలెత్తింది.

సత్వార్ధ ప్రకాశిక: ఈ సమయంలో స్వామి దయానంద సరస్వతి రచించిన ఆర్య సమాజీయుల పవిత్ర గ్రంథంం సత్యార్థ ప్రకాశిక సింధు రాష్ట్రంలో నిషేధింపబడింది. సావర్కర్ దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఈ పద్దతిలో ఇతర మతస్థులను కించ పరచే బైబిలు, ఖురాములను కూడా నిషేధించవలసి వుంటుందని ప్రకటించారు. దీనిపై కాంగ్రెసు వారు మౌనం వహించారు.

బెంగాలు క్షామం: ఈ సమయంలోనే బెంగాలులో తీవ్రమైన క్షామం ఏర్పడింది. ఆకలితో అలమటించే హిందూ స్త్రీ శిశువులను ముస్లిం మతంలోకి మార్చడానికి పెద్దయెత్తున ఏర్పాట్లు జరిగాయి. అప్పటి బెంగాలులోని ముస్లింలీగు మంత్రివర్గం పాక్షపాత ధోరణితో ప్రవర్తిస్తుంటే ముస్లింలీగు వైపునుండి ముస్లింలకు మాత్రమే పునరావాసపు ఏర్పాట్లు జరుగుతుంటే హిందువులు పంపే ధనవస్తు విరాళాలను అందరికి పంచసాగారు. శ్రీమతి సరోజిని నాయుడు కాంగ్రెసు వారికి తగిన ధోరణిలో ముస్లింల సహాయానికి గానూ ప్రత్యేకంగా భూరివిరాళం వసూలు చేసి పంపారు. ముస్లింలు రెండు వైపులనుంచి సహాయం పొందుతూ ఆ విధులను అసహాయులైన హిందూ స్త్రీ, శిశువుల మతాంతీకరణకు వినియోగించటాన్ని బహిరంగ పరుస్తూ సావర్కర్ ఆత్మహత్య మానవత్వం కాదనే విషయం హిందువులు గుర్తుంచుకోవాలి. అమానుషమైన చర్యలకు త్రోవ తీసేటట్లు దుర్వినియోగమయ్యే మానవత్వం ఒక సుగుణం కాదు, అది ఒక ఘోరమైన నేరం అని చెప్పుతూ హిందువులను బెంగాలు హిందువులను మాత్రమే ఆదుకోమని కోరారు.

అమృతసర్ హిందూ సభ సమావేశం: 1943 డిసెంబరులో అమృతసర్ లో జరిగిన హిందూ మహాసభ సమావేశాలకు సావర్కర్ తీవ్ర అనారోగ్యం వల్ల పోలేకపోయారు, వారి స్థానంలో శ్యామప్రసాద్ ముఖర్జీ అధ్యక్షులుగా వ్యవహరించారు.

1944 సంవత్సరమంతా సావర్కర్ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పటికీ దేశ పరిస్థితులను గూర్చి హిందువులకు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వున్నారు. 1944 జూన్ నెలలో విప్లవవాది మానవేంద్ర నాథ రాయ్ తన భార్య ఎల్లెప్రాయితో కలసి అనారోగ్యంగా వున్న సావర్కరును చూడటానికి వెళ్లారు. ఈ సమయంలోనే జయపూరు సంస్థానంలో దివానుగా వున్న మీర్జా ఇస్మేల్ హిందూ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగిన ఉద్యమాన్ని ప్రోత్సాహపరచారు. పండరిపూరుకు పోయే హిందూ యాత్రీకుల పై బొంబాయి ప్రభుత్వం విధించిన నిర్బంధాలను తొలగించేందుకు ఉద్యమాన్ని నడిపించారు. అదే నెలలో మరల అమెరికా ప్రెసిడెంటు రూజ్వెల్టు ప్రతినిధి లాంప్టన్ చెర్రితో భారత అమెరికా సంబంధాలను గూర్చి చర్చించారు. వయస్సు వ్యాధిని లెక్కబెట్టక ఉద్యమాలు సాగించే సావర్కర్ ఉత్సాహక్రియా శక్తులు అపూర్వాలు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments