కేంద్రంలో కాంగ్రెస్ – ముస్లింలీగు ప్రభుత్వం పదవులు చెరి సగం 1939 డిసెంబర్ లో హిందూ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ జిన్నా, గాంధీజ...
కేంద్రంలో కాంగ్రెస్ – ముస్లింలీగు ప్రభుత్వం పదవులు చెరి సగం
1939 డిసెంబర్ లో హిందూ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ జిన్నా, గాంధీజీ హిందూ ప్రతినిథిగా తనవద్దకు వచ్చేటట్లయితే హిందూ ముస్లిం సమస్యను అరగంటలో పరిష్కారం చేస్తాను, అని అనగా గాంధీజీ "జిన్నాకు పిచ్చిపట్టింది. హిందువుల ప్రతినిధిగా నేనెప్పటికి ఆయనను కలుసుకోను. ఆ పని హిందూ మహాసభది.” అన్నారు. కానీ 1946 సంవత్సరంలో కాంగ్రెస్ సవర్ణ హిందువుల కోటాలో మాత్రమే కేంద్ర ప్రభుత్వంలో చేరడానికి ఒప్పుకొని ఆ కోటా ఆరు స్థానాలలో సవర్ణ హిందువుల ప్రతినిధులుగా ఒక ముస్లిం, నిమ్న జాతి హిందువును చేర్చి తన పతనాన్ని ప్రపంచానికి తెలియకుండా మభ్యపెట్టచూచింది. ముస్లింలీగు ముస్లిం ప్రతివిధిగా ఐదు స్థానాలు, సిక్కు నిమ్న జాతుల ప్రతినిధులుగా ఆయా ప్రతినిధులు ఇద్దరిలో ప్రభుత్వంలో పదవుల పంపకం చేసుకొంది.
ఆరోగ్యం కొంత కుదుటబడగానే సావర్కర్ 1946 అక్టోబరు 5న బొంబాయికి తిరిగి వచ్చారు. అప్పటికి దేశమంతటా హిందువులపై జరిగిన హత్యాకాండ వల్ల నెత్తురు ప్రవహిస్తోంది. హిందూ సంఘటన వాదులు హిందూ బాధితులను ఆదుకోడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు.
కాంగ్రెసు చివరి లొంగుబాటు: ఈలోగా ముస్లింలీగు తాత్కాలిక కేంద్ర ప్రభుత్వంలో చేరింది. 54 శాతం వున్న సవర్ణ హిందువులకు మాత్రమే తాను ప్రతినిధిగా కాంగ్రెసు, 22శాతం వున్న ముస్లింలకు ప్రతినిధిగా ముస్లింలీగు సమాన స్థాయిలో పదవులు పంచుకొన్నారు. ముస్లింలీగు ప్రభుత్వం లోపల నుండి పోరాటం ప్రారంభించింది. బ్రిటీష్ ప్రభుత్వ ఆహ్వానంపై నెహ్రూ, జిన్నా చర్చలకై లండన్ కు పోయారు. జిన్నా మరల విజయం సంపాదించాడు. ముస్లింలీగు ఒప్పుకోనిదే భారత రాజ్యాంగ నిర్మాణం జరుగదని నిర్ణయించారు. నెహ్రూ దీనికి అంగీకరించారు. సర్దారు పటేలు మాత్రం ఈ నిర్ణయాన్ని తిరస్కరించాలని ప్రకటించారు. కానీ 1947 జనవరి 15న జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం పై నిర్ణయాన్ని ఆమోదించింది. సర్దారు పటేల్ ఈ సమావేశానికి హాజరు కాలేదు.
గోరఖపూర్ హిందూ మహాసభ సమావేశము: 1946 డిసెంబర్ గోరఖపూరం హిందూ మహాసభ సమావేశము భోపట్కర్ అధ్యక్షతన జరిగింది. దేశ ఐక్యతపై తన నమ్మకాన్ని హిందూ మహాసభ మరోసారి ప్రకటించింది. అదే నెలలో రాజ్యాంగ సంవిధాన సభ ఏర్పాటైంది. కాంగ్రెసు వారు డోలాయమాన ధోరణిలో దూరదృష్టి లేకుండా దేశ క్షేమానికి ఐక్యతకు విరుద్ధమైన పద్ధతులు అనుసరించసాగారు. డాక్టరు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ సభలో మాట్లాడుతూ "తమకు తామే బలీయమైన కేంద్రాన్ని చంపినందుకు" కాంగ్రెసు నాయకులను నిలదీసి ప్రశ్నించారు.
ఈ విషాద పరిస్థితులలో 1947 ఫిబ్రవరి 10న శ్యామ ప్రసాద్ ముఖర్జీ సావర్కర్ కు ఒక లేఖలో "హిందువులు మీ పిలుపును విని వుంటే వారి జన్మస్థానంలోనే బానిసలై పడివుండి వుండేవారు కాదు'' అని ముస్లిం మెజార్టీ రాష్ట్రాలలోని హిందువుల దుర్గతిని గూర్చి ఆవేదన వెలిబుచ్చారు. హిందువులు ఎదుర్కొంటున్న ఈ విషాద పరిస్థితులు మరల సావర్కర్ మనస్సును క్రుంగతీశాయి. కారు మబ్బులలో ఒక్క మెరుపు బీహారు హిందువుల హిందూత్వ భావం. బెంగాలు హిందువులకు జరిగిన అవమానం తముకు జరిగినట్లు భావించిన ఐక్య హిందూ భావన సావర్కర్ కు కొంత ఊరట కల్గించింది. బీహారులోని వీరులైన హిందూ బాధితుల సహాయానికి సావర్కర్ కొంత నిధిని బీహారు హిందూ మహాసభకు పంపించారు.
మాస్టర్ తారాసింగ్ ప్రయత్నం: మార్చి 1947 లో నిర్జితములైన అఖండ హిందూస్థాన్ శక్తులు తిరిగి తమ శక్తిని సమీకరించుకొని తలఎత్త ప్రయత్నించాయి. సిక్కు నాయకుడు మాష్టరు తారాసింగ్ హిందూ సిక్కు ఐక్యతతో దేశ ఐక్యత కాపాడటానికి జేసిన ప్రయత్నాలను సావర్కర్ ఆశీర్వదించారు. తారాసింగ్ తన అంతిమ ప్రయత్నంలో ''హిందూ సిక్కు' సౌభ్రాతృత్వ హృదయాన్ని గురుగోవింద సింగు శక్తివంతం చేస్తారని, భారతదేశ స్వాతంత్ర్యం ఐక్యతలకై పోరాడే వారి చేతులను బలపరచ గలడని తన ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల మంత్రి సర్దారు పటేల్ "ప్రభుత్వంలోని ప్రతి ముస్లిం పాకిస్థానీయుడు కాబట్టి ప్రతి ఒక్కరం తానే పోలీసుగా భావించుకొని తన్ను తాను రక్షించుకోవాలని” తన విస్సహాయతను ప్రకటించారు.
No comments