Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పాకిస్థాన్ ఏర్పాటు ఖాయం - Savarkar life History - సావర్కర్ జీవిత చరిత్ర - 19

పాకిస్థాన్ ఏర్పాటు ఖాయం పాకిస్థాన్ విభజించడమే రాజనీతి: ఇప్పుడు పాకిస్థాన్ ఏర్పడటం ఖాయమని తేలిపోయినది. ముస్లింలీగు కోరిన, కాంగ్రెసు వారు ధార...


పాకిస్థాన్ ఏర్పాటు ఖాయం

పాకిస్థాన్ విభజించడమే రాజనీతి:
ఇప్పుడు పాకిస్థాన్ ఏర్పడటం ఖాయమని తేలిపోయినది. ముస్లింలీగు కోరిన, కాంగ్రెసు వారు ధారాదత్తం చేయబోయే పాకిస్థాను విభజించటమే హిందూ మహాసభ ధ్యేయమైంది. ఒకనాడు విభజనను వ్యతిరేకించి వేలాది ప్రజలు ప్రాణాలు ఒడ్డిన బెంగాలును విభజించి కలకత్తాతో సహా పశ్చిమ బెంగాలును, కేంద్ర హిందూస్థాన్లో వుంచటానికి జరిగే ప్రయత్నాలను బలపరుస్తూ సావర్కర్ 1947 మార్చి 27వ ప్రకటన చేశారు.

మౌంట్ బాటన్ రంగ ప్రవేశం: ఈ సమయంలోనే లార్డు వేవెల్ స్థానంలో లార్డు మౌంటు బాటన్ వైస్రాయిగా వచ్చినారు. లార్డు వేవెల్ ఏదో ఒక విధంగా భారత దేశాన్ని ఐక్యంగా వుంచటానికి ప్రయత్నించారు. మౌంటు బాటన్ రాక పాకిస్థాన్ ఏర్పాటుకు నాంది ప్రస్తావన వంటిది. హిందూ మహాసభ నాయకులతో, మాస్టరు తారాసింగ్ తో కూడ సంప్రదించ వలసినదిగా మౌంటు బాటన్ కు సావర్కర్ టెలిగ్రాం పంపారు.

1947 ఏప్రిల్ 4న ఒక ప్రకటనలో సావర్కర్ బెంగాలు హిందువులను బెంగాల్ హిందూపభను హిందూ మెజారిటీ గల పశ్చిమ బెంగాలు ఏర్పాటుకు పోరాడవలసింది గాను, అస్సాంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ముస్లింలను తరిమి వేయవలసింది గాను ఉద్ఘాటించారు.

హిందువులు అత్యధికంగా ఉన్న సింధు రాష్ట్రంలోని జిల్లాలను ముంబాయిలో కలపాలని విజ్ఞప్తి చేస్తూ పాకిస్థాన్లో హిందువులు ఏ విధంగా చూడబడతారో హిందూస్థాన్లో ముస్లింలు అదే విధంగా చూడబడతారని హెచ్చరించారు.

కొత్త వైస్రాయి మౌంటు బాటన్ కాంగ్రెసు ముస్లింలీగు నాయకులతో సంభాషించి లండన్ చర్చలకై పోయారు. ఆయన పోయేముందు శ్యామ ప్రసాద్ ముఖర్జీ హిందువులు అధికంగా వున్న పశ్చిమ బెంగాలును ప్రత్యేక రాష్ట్రంగా హిందుస్థానంలో వుంచాలని ఒక విజ్ఞప్తిని వైస్రాయికి అందచేసారు. వైస్రాయి ప్రతిపాదనలను బ్రిటీషు ప్రభుత్వం అంగీకరించింది. అంతిమ నిర్ణయం జరిగిపోయింది.

పాకిస్థాన్ కు కాంగ్రెసు ఆమోదం: తుది యత్నంగా సావర్కర్ 1947 మే 29వ కాంగ్రెసు వారికి ఒక విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు వారు ఎన్నికలలో అఖండ భారత్ నినాదంతో హిందువుల ఓట్లుతో గెలిచారు. కాబట్టి పాకిస్థాన్ విషయమై మరల ఎన్నికలు జరిపి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ఆయన కోరారు. కాంగ్రెసు వారు దానిని లెక్కచేయలేదు. హిందువులు తాము పుట్టిన మట్టిలో తాము బానిసలు కామున్నామని, ముస్లిం మతోన్మాద తోడేళ్ళ బారికి తమ నాయకులు తమను నిర్దాక్షిణ్యంగా వదలివేసి సురక్షితంగా ఢిల్లీ గద్దె మీద కూర్చుని "మీరు వేరే దేశం ప్రజలు, మీ కష్ట సుఖాలతో మాకు సంబంధం లేదు'' అని చెప్పుతారని ఊహించలేదు. హిందువులపై కలిగే పరిణామాల్ని కాంగ్రెసు వారు పరిగణలోనికి తీసుకోలేదు. కార్యవర్గ సభలో ఈ విషయం చర్చకు వచ్చినపుడు సోషలిస్టులు మౌనం వహించి తమ ఆమోదాన్ని వ్యక్తం చేశారు. ఆ సభలో ఒక్క బాబు పురుషోత్తమ దాసు టాండన్ పాకిస్థాన్ ను బహిరంగంగా వ్యతిరేకించారు. ఖడ్గానికి ఖడ్గమని గర్జించిన సర్దారు పటేల్ లొంగుబాటుతో పాకిస్థాన్ వ్యతిరేకతకు కాంగ్రెసు సభలో జీవం పోయింది. గాంధీజీ తన పలుకుబడినంతా ఉపయోగించి, నాయకుల గౌరవ ప్రతిష్టలను కాపాడటానికి కార్యవర్గం పాకిస్థాన్ ప్రతిపాదనను ఆమోదించాలని ఒత్తిడి చేశారు. కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు నాయకులు జాతికన్న గొప్పవారు కాదని ప్రజలను పదే పదే సావర్కర్ హెచ్చరించారు. డాక్టరు అంబేద్కరు కూడా "ప్రజల భవిష్యత్తును నిర్ణయించేటప్పుడు నాయకుల, వ్యక్తుల, పార్టీల గౌరవ ప్రతిష్ఠలు గడ్డి పోచలతో సమానంగా చూడాలి" అని రాజ్యాంగ నిర్ణయ సభలో ఉద్ఘాటించారు. ఏమైతేయేం ప్రజల అభిప్రాయాలతో పనిలేకుండా తమకు తామే కాంగ్రెసు నాయకులు దేశ ఐక్యతకు ద్రోహం చేసిన వారైనారు.

పాకిస్థాన్ నిర్మాణానికి చివరి ప్రతిఘటన: అఖండ హిందూస్థాన్ గళం కొన ఊపిరితో నినదించడానికి పెనుగులాడింది. 1947 జూలై 3 పాకిస్థాన్ వ్యతిరేకదినంగా దేశమంతటా జరుపబడి అన్ని పట్టణాలలో హర్తాళ్ళు, నల్లజెండా ప్రదర్శనలు జరిగాయి. ఆగస్టు 2 తేదీన పూనాలో జరిగిన బ్రహ్మాండమైన సభలో సభికుల మనస్సులు ద్రవించే విధంగా ఉపన్యాసం ప్రారంభం చేస్తూ సావర్కర్ "పాకిస్థాన్ ఏర్పాటుకు అంతంలేని ప్రతిఘటన వల్ల అపకీర్తిపాలైన నావంటి నాయకుని ఉపన్యాసం వినడానికి మీరు వేలసంఖ్యలో ఈనాడు రావడం వల్ల హిందూజాతి మనుగడకు ఆశ ఉందని నమ్ముతున్నాను'' అని చెబుతూ కాంగ్రెసు నాయకులను సరియైన సమయంలో నాయకత్వం నుండి తొలగించనందున, కాంగ్రెస్ నాయకులతో బాటు కొంత వరకు హిందూ ప్రజలంతా విభజనకు బాధ్యులే అని నిర్మొహమాటంగా చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని జాతీయతను మతోన్మాదానికి ఏ విధంగా బలియిచ్చిందీ వివరిస్తూ, బుజ్జగింపు ధోరణి దురాక్రమణ చేసే వారిని ఆపలేదు. తృప్తి పరచలేదు అని ప్రకటించారు.''

ఢిల్లీలో హిందూ సమావేశం: ఇక అఖండ హిందూస్థాన్ శక్తుల ఓటమిని సావర్కర్ అంగీకరించారు. రణరంగంలో ఓడిపోయినా అఖండ భారత్ కొరకై యుద్ధాన్ని కొనసాగించడానికి సావర్కరు నిలబడ్డారు. విభజనకు తమ వ్యతిరేకతను మరొకసారి ప్రకటించటానికి ఆగస్టు 8న తేది హిందూ సమావేశం ఢిల్లీలో ఏర్పాటు చేయబడింది. జీవితంలో మొదటిసారిగా విమాన ప్రయాణం చేసి ఢిల్లీ చేరారు సావర్కర్. సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, పాకిస్థాన్ ఏర్పాటుకై అల్లర్లు, కొట్లాటలు, ఆందోళనలు చేసి, దేశ విభజనకు ఏ మాత్రం తక్కువ లేకుండా బాధ్యత వహించిన హిందూస్థాన్లో మిగిలిపోయిన నాలుగు కోట్ల ముస్లింలను మనస్సులో పెట్టుకొని ముందు ముందు రానున్న అపాయాలను ఎదుర్కోవటానికి మేల్కొని సంసిద్ధులు కాకపోతే ఇక మీదట ఇంకా చాలా పాకిస్థాన్లు ఏర్పాటు కాబోతాయి అని హిందువులను హెచ్చరించారు. మాతృభూమి ముక్కలు అయ్యే ఆగస్టు 15 నాడు ఏలాటి ఆనందోత్సవాలు జరుపరాదని ఆదేశించారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments