Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

కాంగ్రెస్ నమ్మక ద్రోహం – పాకిస్థాన్లో హిందువుల నిర్మూలన కార్యక్రమం - Savarkar life History - సావర్కర్ జీవిత చరిత్ర - 20

కాంగ్రెస్ నమ్మక ద్రోహం – పాకిస్థాన్లో హిందువుల నిర్మూలన కార్యక్రమం "విభజనను అంగీకరించవద్దు" అని గాంధీ మాకు చెప్పి వుంట...

కాంగ్రెస్ నమ్మక ద్రోహం – పాకిస్థాన్లో హిందువుల నిర్మూలన కార్యక్రమం

"విభజనను అంగీకరించవద్దు" అని గాంధీ మాకు చెప్పి వుంటే మేము పోరాడుతూ ఇంకా కొంతకాలం వేచి వుండే వాళ్ళం అని పండిత నెహ్రూ తర్వాత వాపోయారు. ఇదేనెహ్రూ లాహోరు నగరం తూర్పు పంజాబ్లోకి రావాలనే వాదం పట్ల, కొన్ని నగరాలు అటు, కొన్ని నగరాలు ఇటూ అయితే మునిగిపోయేది ఏమిలేదు అని అన్నారు. అంతేకాదు తర్వాత తర్వాత చైనా అనేక వేల చదరపు మైళ్లు భూభాగాన్ని ఆక్రమంగా ఆక్రమించుకొనినపుడు కూడా ఆ భూమిలో గడ్డిపరక మొలవదు కదా అని ఉపేక్షించి, తర్వాత చైనా చేతిలో భారత జాతి అవమానం పొందటానికి కారకులయ్యారు. దృఢత్వం, దూరదృష్టిలేని నాయకత్వమేని హిందూజాతి దురదృష్టం.

1947 ఆగస్టు 15 తేదిన దేశం రెండు ముక్కలైంది. ఒక భాగం సర్వస్వతంత్ర్య దేశంగా రూపొందింది. ఇంకో భాగం ముస్లిం మతోన్మాదానికి దాసోహామై అచ్చటి హిందువులు తమ జన్మస్థలంలో బానిసల కన్న హీనమైన పరిస్థితిలో చిక్కుకొని పోయారు.

ఖద్దరు, చరక లేని జాతీయ పతాకం: సావర్కరు స్వాతంత్ర్యం పొందిన దేశ చిహ్నంగా త్రివర్ణ పతాకం, అఖండ హిందూస్థాన్ సంకేతంగా కాషాయ ధ్వజాన్ని తన ఇంటి వద్ద ఎగురవేశారు. బ్రిటీషు పతాకమైన యూనియన్ జాక్. దేశ విభజనకు దారితీసిన ఖద్దరు, చరక  జండా, తొలగింపబడినందుకు సావర్కర్ సంతోషపడ్డారు. ప్రజాస్వామ్యం పై సంపూర్ణ విశ్వాసం ఉన్న సావర్కరు ఖండిత దేశ చిహ్నంగా త్రివర్ణ పతాకాన్ని గుర్తించారు. కానీ గాంధీజీ తన చరక  చిహ్నంతో ఖద్దరు త్రివర్ణ పతాకం జాతీయ పతాకంగా ఎన్నిక కానందుకు ఆగస్టు 3న తేదీన హరిజన పత్రికలో తన అసంతృప్తిని వెళ్ళబుచ్చుతూ దేశ పతాకం ఖద్దరుకు చరక ప్రాతినిథ్యం వహించకపోతే అది విలువలేనిది” అని వ్రాశారు. హిందూజాతి గౌరవ పతాకాన్ని కాంగ్రెస్ మెజారిటీ గల సంవిధాన సభ ఎలాగూ ఆమోదించబోదని భావించి, త్రివర్ణ జండాలో కాషాయరంగు ఒక భాగంగా వుంచి చరఖా స్థానంలో ధర్మ చక్రాన్ని వుంచమని సభాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ సావర్కర్ టెలిగ్రాం పంపించారు. ఎందుకంటే 1907లోనే అభినవ భారత సంఘపక్షాన జర్మనీలో జరిగిన సోషలిస్టు కాంగ్రెస్లో సావర్కర్ ప్రోత్సాహ మేడం కామా ఒక త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయగా, సభ్యులందరు దానిని భారత పతాకంగా వందనం చేశారు. ఆ త్రివర్ణ పతాకం పై వందేమాతరం అన్న అక్షరాలు ఉండేవి.

గాంధీ నెహ్రూల ఉపేక్ష: దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యానికే కాంగ్రెసు వారు ఉత్సవాలు చేసుకొంటూ ఉంటే పాకిస్థాన్ భాగాల నుండి నెత్తురు గడ్డకట్టే వార్తలు రాసాగాయి. "నవ్వుతూ నవ్వుతూ పాకిస్థాన్ పొందాము, కత్తితో సాధిస్తాం హిందూస్థాన్" అనే నినాదాలతో ముస్లిం గుంపులు హిందువులపైబడి ముస్లిం మతోన్మాదులు ఎప్పుడూ చేసే రీతిలోనూ అత్యాచారాలు చేయసాగారు. ఆ పాకిస్థాన్ ప్రభుత్వం ప్రోత్సాహకరమైన నిర్లిప్తతను పాటించగా అపాయకరమైన ఆయుధాలతో ఒక ప్రణాళిక ప్రకారం శిక్షణ పొందిన మతోన్మాద పూరితమైన మూక హిందూ, సిక్కు పౌరులపై బడి అత్యాచారాలు చేస్తూ తూర్పు పంజాబు, ఢిల్లీలను కైవశం చేసుకోవాలని హుంకరిస్తుంటే, పాకిస్థాన్ వైపునుండి శరణార్థులు మాన ప్రాణ సంరక్షణకై సర్వస్వాన్ని వదలుకొని ఇండియాలోకి పరుగెత్తి వచ్చారు. ఈ జన ప్రవాహం చరిత్రలో ఇంకెక్కడా జరిగి వుండదేమో!

నెహ్రూ శ్రీరంగనీతులు - సావర్కర్ నిరసన: ఇట్టి పరిస్థితులలో నెహ్రూ, గాంధీజీ హిందువులకు శాంతి వచనాలు వల్లించసాగారు. హిందువులు సిక్కులు పాకిస్థాన్ భాగాల నుండి తరలి రావద్దని కోరారు. హింసాయుత ప్రతీకార చర్యలను తీసుకోవద్దని కోరారు. అంతేకాదు నెహ్రూ ఇంకా ముందుకుపోయి హిందూ రాష్ట్రం కావాలనే హిందూ ఫాసిస్టులను తుడిచి పెట్టి వేస్తాను అని అన్నారు. నెహ్రూ ప్రకటనలకు జవాబు ఇస్తూ సావర్కర్ “ఇప్పటి పరిస్థితులలో లక్షలాది హిందువులు, సిక్కులు తాము జీవించాలనే మానవ సహజమైన ప్రేరణతోను, హిందువులంతా ఒక్కటే అనే భావనతోమా ఆయుధాలు దాల్చి తూర్పు పంజాబులో భరతపూరులో, ఆల్వారులో, పాటియాలాలో, ఢిల్లీలో, తూర్పు పంజాబుపై దండెత్తి రాకుండా ముందుకు సాగివస్తున్న ముస్లిం మూకలను ఆపి, తిరుగుదెబ్బ కొట్టి, మోహరింపబడిన ముస్లిం దండ్లు ఢిల్లీని స్వాధీనం చేసుకోకుండా కాపాడితే ఆశ్చర్య పోవలసిందేమీ లేదు. నెహ్రూ, ఆయన కాంగ్రెసు మిత్రులు, తమ అధికార పదవులలో క్షేమంగా వున్నారంటే, అత్యంత కీలకమైన సమయంలో హిందూ సంఘటనా వాదులు, సిక్కులు జరిపిన ధైర్య సాహసోపేతాలైన పోరాటాల ఫలితమే... కాని వెహ్రూ గారు ఇపుడు సిగ్గులేకుండా ప్రభుత్వానికి మాత్రమే శత్రువు పై తిరిగుదెబ్బ తీసే అధికారం వుందని శ్రీరంగనీతులు చెప్తున్నారు” అని ప్రకటించారు.

కాశ్మీరుపై దాడి: ఈ సమయంలోనే పాకిస్థాన్ సైన్యం, ముస్లిం కొండజాతుల వారితో కలిసి కాశ్మీరుపై దండయాత్ర చేసి బీభత్సం చేయసాగింది. కాశ్మీరు మహారాజా కాశ్మీరును భారతదేశంలో విలీనం చేస్తూ రక్షణకై విజ్ఞప్తి పంపారు. నెహ్రూ ఆయోమయ స్థితిలోబడి మహారాజా రాజ్యాన్ని వదలుకొని అధికారాలను షేకు అబ్దుల్లాకు స్వాధీనం చేసే షరతుపై సైన్యాలను పంపారు. భారత సైన్యం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో కాశ్మీరులో దిగి అనేక త్యాగాలు చేసి పాకిస్థాన్ మూకలను తిప్పి కొట్టింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments