Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పాకిస్థాన్ హిందువుల సర్వ నాశనం - గాడ్సే చేతుల్లో గాంధీజీ హత్య - Savarkar life History - సావర్కర్ జీవిత చరిత్ర - 21

పాకిస్థాన్ హిందువుల సర్వ నాశనం - గాడ్సే చేతుల్లో గాంధీజీ హత్య కాందిశీకుల దైన్యగాథలు:  దేశమంతా ముఖ్యంగా ఉత్తర హిందూస్థాన్ గందరగోళ...

పాకిస్థాన్ హిందువుల సర్వ నాశనం - గాడ్సే చేతుల్లో గాంధీజీ హత్య

కాందిశీకుల దైన్యగాథలు: 
దేశమంతా ముఖ్యంగా ఉత్తర హిందూస్థాన్ గందరగోళంలో పడి పోయింది. లక్షలాది హిందువులు తమ సర్వస్వాన్ని పోగొట్టుకొని ప్రాణభీతితో స్వతంత్ర హిందూస్థాన్ లోకి వస్తూ తెచ్చిన విషాదగాథలు నెహ్రూ ప్రభుత్వం ఎంత అణచి పెట్టినా దేశ ప్రజలను కలవర పెట్టి, తిరుగు దెబ్బ తీయటానికి ఉద్రిక్తులను చేసింది. గాంధీజీ అహింసావాదం దేశానికి, హిందువులకు ఆత్మహత్యా సదృశంగా భావింపబడింది. ఆ పరిస్థితులను వర్ణిస్తూ గాంధేయుడైన కె.యం. మున్షీ గత ముప్పయి అయిదు సంవత్సరాలుగా హిందూ ముస్లిం ఐక్యత సహజమైనది, తప్పని సరియైనది అనే వివాదాలపై ఆధారపడేటట్లు చేయడం జరిగింది. నౌఖాలీ, బీహారు, రావల్పిండి ఇంకా వేల కొలది గ్రామాల నుండి రక్షణకై పరుగెత్తే లక్షల కొలది పురుషులు, స్త్రీలు, పిల్లలు పై వినాదాలన్నీ పగటి కలలని ఋజువు చేసినారు. పచ్చి కార్యాచరణ వాది అయిన ముస్లిం, ఈ వినాదాలలోని అప్రయోజకతను తెలుసుకొని, స్వప్రయోజనాలకు చక్కగా వాడుకోగా, హిందువులు ఇంకా ఆ వివాదాలను పట్టుకొని ఊగులాడుతున్నారు" అని సోషల్ వెల్ఫేర్ అనే పత్రికలో వ్రాశారు.

గాంధీ హత్యకు దారి తీసిన పరిస్థితులు: గాంధీజీ యొక్క అహింసా సిద్ధాంతం పనికి మాలినదిగా పేర్కొంటూ, అదే దేశ విభజనకు చాలా వరకు కారణమైందనీ, పురుషోత్తమ దాసు టాండన్ ప్రకటించారు. ఇట్టి పరిస్థితులలో పాకిస్థాన్ కు కారణభూతమైన గాంధీజీ పై అవిశ్వాసం, ఆగ్రహం పెల్లుబుక సాగినవి. స్వాతంత్ర్యానికి 24 గంటల ముందు కలకత్తాలో గాంధీజీ బసపై గుంపులు రాళ్ళు రువ్వి "గాంధీ వెళ్ళిపో" అనే నినాదాలు చేశారు. గాంధీజీ అహింస గాలికి ఎగిరి పోయినది. కాశ్మీరులో దాడిచేసే ముస్లింలను కాంగ్రెసు ప్రభుత్వం తుపాకీ గుండ్లతో ఎదుర్కొన్నదే గానీ, చరఖాలతో పత్తి ఏకులతో ఎదుర్కోలేదు. గాంధీజీ ప్రార్థనా సమావేశాలలో ప్రజలు గలభాలు చేసి, ఎగతాళిచేసి, సమావేశాలను భగ్నం చేయసాగారు. గాంధీజీ ప్రార్థనా సమావేశాలను సాధారణ దుస్తులతో సి.ఐ.డి.లు కాపలా కాయసాగారు. ప్రజలు యే నాయకుని మాటలు వినే స్థితిలో లేరు. అంతటా గందరగోళం అస్థిరత్వం, భీతి, ఆగ్రహావేశాలు.

ఇటువంటి పరిస్థితులలో 1948 జనవరి 13వ తేది గాంధీజీ నిరాహార దీక్ష బూని, ముస్లింల ఇండ్లను, మసీదులను ముస్లింలకు యిచ్చి, వారికి ఆత్మ విశ్వాసం కలిగించాలని, పాకిస్థాన్ కు ఇవ్వవలసిన 55 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేశాడు. దాని ఫలితంగా ముస్లింలు ఖాళీచేసి పోయిన మసీదులలో, ఇండ్లలో తలదాచుకొన్న లక్షలాది హిందూ కాందిశీకులు, వీరు గడ్డకట్టే చలిలో వీధులలోకి త్రోసి వేయబడ్డారు. వారి సంగతి పట్టించుకొనే నాథుడు లేకపోయారు.

ఇటువంటి విషాదకరమైన గందర గోళ పరిస్థితులలో 1948 జనవరి 30 తేది నాథూరాం వినాయక గోడ్సే గాంధీజీ ప్రార్థనా సమావేశానికి పోతూండగా కాల్చి చంపివేశాడు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

No comments