హిందూ సంఘటనోద్యమ నిర్మూలనానికి కాంగ్రెస్, కమ్యూనిష్టుల పథకం హిందూ సంఘటన వాదులపై హింసాకాండ: హిందూ ప్రజల ముందు తల ఎత్తుకోలేని కా...
హిందూ సంఘటనోద్యమ నిర్మూలనానికి కాంగ్రెస్, కమ్యూనిష్టుల పథకం
హిందూ సంఘటన వాదులపై హింసాకాండ: హిందూ ప్రజల ముందు తల ఎత్తుకోలేని కాంగ్రెస్వారికి గోడ్సే చర్య మంచి అవకాశం కల్పించింది. ప్రజలపై, ప్రభుత్వంపై అప్పటికే తన పట్టును కోల్పోతున్న గాంధీజీ మరణించి జీవించారు. హిందూ సంఘటనోద్యమం నడుము విరిగింది. కాంగ్రెస్ వారు, కమ్యూనిష్టులు, సంఘ వ్యతిరేక శక్తులను కూడగట్టుకొని హిందూ మహాసభ, ఆర్.ఎస్.ఎస్ లపై యుద్ధం ప్రకటించారు. వీర సావర్కరు ఇంటి పైన దాడి చేయగా, హిందూ సంఘటనా వాదులు కలసి కట్టుగా దాడిని త్రిప్పికొట్టి ఆయనను రక్షించారు. ఒంటరిగా దొరికిన నారాయణ సావర్కర్ ను విపరీతంగా కొట్టి కొన ఊపిరితో వదిలారు. గోడ్సే ఇంటి పేరు గల ఒక కుటుంబాన్ని మంటలలో త్రోసి చంపారు. హిందూ మహాసభ సభ్యుల ఆస్తులను ధ్వంపం చేశారు. అనేక మందిని తీవ్రంగా కొట్టారు. ముద్రణాలయాలను, సినీవాసాలను, స్టూడియోలను తగులబెట్టారు.
ఒక్క నేరానికి 25 వేల మంది నిర్బంధం: ఈ దౌర్జన్య మూకలకు బాసటగా ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగి దేశమంతటా 25,000 మందిని నిర్బంధంలోకి తీసుకొన్నది. ఒక నేరానికి ఇన్ని వేల మందిని నిర్బంధించడం ప్రపంచ చరిత్రలోనే అపూర్వం. 1948 ఫిబ్రవరి 5 న సావర్కర్ ని అరెస్టు చేసి బొంబాయి జైలులో ఉంచారు. కాంగ్రెసు పత్రికలు సావర్కర్ పై దుమ్మెత్తి పోశాయి. చాలా కాలం వరకు సావర్కర్ పై ఏలాటి నేరమూ మోపబడలేదు. అతను ఎక్కడ వున్నది. ప్రపంచానికి తెలియ నివ్వలేదు.
సావర్కర్ వ్యతిరేకంగా ఢిల్లీలో కుట్ర: ఈలోగా ఢిల్లీలో గాంధీజీ హత్యా నేరంలో సావర్కరు ని ఇరికించటానికి కుట్ర జరిగింది. క్రింది తరగతి పోలీసు ఉద్యోగులు సావర్కరుతో దురుసుగా ప్రవర్తించి అవమానించేటట్లు ఏర్పాటు అయింది. చాలా కాలం తర్వాత అంతరంగికులతో మాట్లాడుతూ ఆ విధంగా చేయవలసి నట్లు తనపై వత్తిడి వచ్చిందని సర్దారు పటేలు అంగీకరించారు. సర్దారు పటేలుపై వత్తిడి చేయగల సమర్థుడు దేశంలో ఎవరన్నది అందరికి తెలిసిందే కదా!
1948 మార్చి 11 తేది ఢిల్లీ పోలీసు వారంటుతో గాంధీజీ హత్యతో సంబంధం వున్నదనే నేరం మీద సావర్కరు మరల అరెస్టు చేశారు.
No comments