Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సావర్కర్ - శిక్కులు - Savarkar life History - సావర్కర్ జీవిత చరిత్ర - 29

  సావర్కర్ - శిక్కులు ( శిక్కులు హిందూజాతిలో ఒక భాగమే) "సకల జగత్ మే ఖాల్సా పంథ్ గాజే, జగే ధర్మ్ హిందు సకల భంద్ భాజే” ఈ ఖాల్...

 

సావర్కర్ - శిక్కులు (శిక్కులు హిందూజాతిలో ఒక భాగమే)

"సకల జగత్ మే ఖాల్సా పంథ్ గాజే,
జగే ధర్మ్ హిందు సకల భంద్ భాజే”
ఈ ఖాల్సా పంథా సకల జగత్తులోను ప్రఖ్యాతం కావాలి ( ఆ విధంగా) చిరస్థాయిగా హిందూ ధర్మం నిలచి మిథ్యాతత్వం నశించాలి. - గురుగోవింద్ సింగ్

స్వాతంత్ర్య సమరంలో శిక్కులు పాల్గొనేలా సావర్కర్ చేసిన ప్రయత్నాలు: 1857 ప్రథమ స్వాతంత్ర్య సమరంలో శిక్కులు, గూర్కాలు పాల్గొనక పోవడం, ఆ పోరాటం విఫలం కావడానికి కొంతవరకు కారణ భూతమైనట్లు గుర్తించి వారిని స్వాతంత్ర్య పోరాట రంగంలోకి తీసుకొని రావటానికి ప్రయత్నాలు చేసినారు. ప్రపంచంలో ఒకే ఒక స్వతంత్ర హిందూ రాజ్యమైన నేపాలు యెడ ఆయన ప్రత్యేక గౌరవం చూపేవారు. హిందువులలో ఒక భాగమైన శిక్కులను హిందూ జీవన స్రవంతిలోకి తేవటానికి సావర్కర్ లండన్ చేరినప్పటి నుండి ప్రయత్నం చేశారు.

శిక్కుల చరిత్రను అధ్యయనం చేసిన తర్వాత, గురుముఖి లిపిని నేర్చుకొని, శిక్కుల 'ఆది గ్రంథం', పంథ్ ప్రకాశ్, సూర్య ప్రకాశ్, విచిత్రవాటక' మొదలైన గురు రచితములైన మత గ్రంథాలన్నింటిని అధ్యయనం చేశారు. ఇక శిక్కులను ఉద్దేశించి అనేక కరపత్రాలు విడుదల చేశారు. ఖాల్సా అను గురుముఖిలో రచించిన కరపత్రాలను శిక్కు సైనికులకు చేరేటట్లు చేశారు. ఈ కరపత్రంలో రానున్న పోరాటాలలో శిక్కు సైనికుల బాధ్యతను తెలుపుతూ స్వాతంత్ర్యపోరాటాన్ని గురించి వారికి వివరించారు.

బ్రిటీష్ ప్రభుత్వం ఇది గమనించి జాగ్రత్త పడసాగింది. 1908 డిసెంబరు 29 తేదీన గురుగోవింద సింగ్ జయంతి లండన్ కాక్సాన్ హాలులో జరుపబడింది. "అమరేశ్" గీతంతో ప్రారంభించి ఈ సభలో సావర్కరు వ్రాసిన 'ప్రియకర్ హిందూస్థాన్' అనే మరాఠీ గీతాన్ని కూడా పాడారు. గోకుల చంద్ నారంగ్, లాలా లజపతిరాయ్, బాబు బిపిన్ చంద్రపాల్ సభలో పాల్గొన్నారు. సావర్కర్ తన ఉపన్యాసంతో శ్రోతలను ఉర్రూతలూపారు. తర్వాత సావర్కర్ ' శిక్కుల చరిత్ర” అనే గ్రంథాన్ని రచించారు. కానీ దీని వ్రాతప్రతి పోలీసుల చేతిలో చిక్కినందువ ముద్రణ కాలేదు. ఈ సమయంలో సావర్కర్ చేసిన ప్రయత్నాలను గూర్చి ఆయన మాటలలోనే చూడండి.

శిక్కులు హిందూజాతిలో ఒక భాగమే: "నేను ఇంగ్లండులో విప్లవ కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర వహించే రోజులలో (1908–1909) నా శిక్కు సహచరుడు ర్దారు హరినాం సింగ్ శిక్కులలో జాతీయభావ వికాసం కల్గించే విషయమై చర్చించాను. ఆ కాలంలో అనేక శిక్కు విద్యార్థులు ఇంగ్లండులో విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు. భారత సైన్యంలోకి సైనిక సేకరణకు పంజాబు ముఖ్యస్థానం కాబట్టి చదువు పూర్తి అయిన తర్వాత పంజాబుకు పోయినప్పుడు ఇంటింటికి, గ్రామ గ్రామానికి జాతీయ భావస్పూర్తిని కలిగించడం ఈవిద్యార్థులకు సులభంగా వుంటుంది. ఈ పని ఏ విధంగా చేయవలసిందీ నా స్నేహితునికి చెప్పి అందుకు ఒక పధకం తయారు చేశాను.

హిందూ సమాజంలో సిక్కులు ఒక భాగం కాబట్టి ఈ పథక ప్రయోజనాలను నేను నొక్కి చెప్పాను. కాని హరినాం సింగుకు దీనిపై అంత ఆశ కనిపించలేదు. శిక్కులు ఒక ప్రత్యేక తెగగా సముదాయంగా, తాము ప్రత్యేకమనే అత్యంత సంకుచిత భావన కలవారు. పంజాబులో తమ నివాస ప్రాంతాన్ని గూర్చి తప్ప, ఒక భవిష్వర్దర్శనం గానీ, విశాల భావన గానీ, లేని వారని హరినాం సింగ్ అభిప్రాయం వెలిబుచ్చారు. వారికి జాతీయ దృక్పథం లేదు. అంతేకాదు ఎప్పటికైనా వారిని జాతీయవాదులుగా ఆలోచించేట్లు లేక భావించేట్లు ఒప్పించడం సాధ్యమౌతుందా అని సందేహం వెలిబుచ్చారు. పంథ్ వైపున వారికి ఉన్న తీవ్ర మతాభిమానం వారిని భారతీయులుగా భావించేటట్లు చేయడానికి రాజకీయంగా వారు హిందువులలో ఒకటేనని నమ్మంచటానికి తీవ్ర ఆటంకంగా వుంది. అప్పుడు నా స్నేహితునితో నేను అన్నాను “చూడు, నీవు కూడా శిక్కువే. రాజకీయాలలో మితవాద అభిప్రాయాలు గల సర్దారు కుటుంబం నుంచి వచ్చినవాడివే. నీవు ఇంగ్లండులో విద్యాభ్యాసం చేస్తూ మాలో ఒకడివైనావు. నావలెనే సర్వస్వం దేశానికై త్యాగం చేయటానికి సంసిద్ధుడవై విప్లవ కారుడవైనావు. నీవంటి ఒక శిక్కు ఇంతకొద్ది కాలంలో ఈ విధంగా మారినపుడు ఇతర శిక్కులందరు ఇదే విధంగా ఎందుకు కాకూడదు? నేను శిక్కుల చరిత్ర చదివినాను. మీరు ఎటువంటి వారైనది నాకు తెలుసు. నా పథకాన్ని ఆమోదించి (ప్రయత్నించుటకు మ్మతించి) దానిని గూర్చి నీకు తటస్థించిన ప్రతి శిక్కుతో ఇంగ్లండులో, ఇండియాలో మాట్లాడుతూ, చర్చిస్తూ వుంటే, అయిదారు సంవత్సరాలలో గొప్పమార్పు చూస్తావు. వారందరు మనవైపు నిలబడ్డారు.”

విప్లవోద్యమంలో శిక్కులు: సావర్కరు అండమానులలో వుండగనే 'గదర్' ఉద్యమంలో శిక్షింపబడిన శిక్కుల మొదటి దళం అండమాను దీవిలో అడుగు పెట్టింది. సావర్కరు ఆనందాతిరేకంతో జైలులోని బాధలన్నిటిని మరచి "చూడండి ఈ శిక్కులను. నేను ముందు చెప్పినట్లు ఇక్కడికి రానే వచ్చారు" అని అన్నారు. ఈ సందర్భంలోనే "ఇక ఇప్పుడు మనతో ఒకటి కావలసినవారు నేపాలీయులు. శిక్కులతో పాటు గూర్కాలను కూడా హిందూ సంఘటన పరిధిలోనికి లాగుకొన్నట్లయితే హిందువులంతా ఒకటవుతారు. మిగతా భారతదేశానికి సంఘటిత బలాన్ని ప్రదర్శిస్తారు" అని వ్రాశారు. హిందూ సంఘటనలో, స్వాతంత్ర్య పోరాటాలలో శిక్కులకు సావర్కర్ ఎంత ప్రాధాన్యాన్ని ఇచ్చారో దీనివలన తెలియగలదు. అండమాన్ వచ్చిన శిక్కులు తాము హిందూజాతిలో భాగముగా మనసా భావించేట్లు చేయటానికి ప్రయత్నించారు.

హిందీ - శిక్కులు: "హిందీని గురించి శిక్కులకు చ్చచెప్పటానికి నేను మరియొక వాదనా పద్ధతిని అనుసరించవలసి వచ్చింది. గురు గోవింద సింగ్ వ్రాసిన అత్యుత్తవ గ్రంధం 'విచిత్ర' అనే నాటకం, 'సూర్య ప్రకాశ' అనే చరిత్ర 'హిందీలో వ్రాయబడినవని వారికి తెలియదు. అత్యంత పరిశుద్ధమైన హిందీ అయిన వ్రజభాషలో అవి వ్రాయబడ్డాయి. ఈ విధంగా వారి మత భాష హిందీ అని, గురుముఖి లిపి అపభ్రంశం చెందిన దేవనాగరి లిపి యని వచ్చచెప్పాను. అప్పుడు వారు జాతీయ భాషగా మాత్రమే గాక వారి పంతా భాషగా కూడా హిందీ ఉపయోగాన్ని గుర్తించారు.

గురుగోవింద సింగ్ మహావీరకావ్యం: సావర్కరు దృష్టిలో గురుగోవింద సింగ్ కి అత్యున్నతమైన స్థానమున్నది. 50 సంవత్సరాలు ద్వీపాంతరవాస శిక్ష విధింపబడగనే మొదట మానసికంగా కృంగినా వెంటనే తేరుకొని "నేను ఒక నిశ్చయానికి వచ్చాను. నా జీవితం వ్యర్థమేమో అన్న భయం నన్ను వీడింది. దినానికి పది నుంచి ఇరవై గేయాల వంతున నాజీవన శిక్ష పూర్తి అయేటప్పటికి 50వేల నుండి లక్ష పంక్తులుగల వీర కావ్యాన్ని రచించవచ్చునని లెక్క వేసుకొన్నాను. నా కావ్యానికి గురు గోవింద సింగ్ జీవితాన్ని కధా వస్తువుగా ఎన్నుకొన్నాను.

గురుగోవింద సింగ్ త్యాగ వీరులలో అగ్రేసరుడు. పరాజయం పై విజయం సాధించిన అమరవీరుడు. పూర్తి ఓటమి పొందబోతూ చామకూర్ దుర్గం నుండి తప్పించుకొని పోవడానికి ప్రయత్నించిన ఆదృశ్యాన్ని ఊహించుకొండి. తల్లి, భార్య, బిడ్డ ఒకరి మండి ఒకరు విడిపోయి, పరిస్థితుల ప్రభావం వల్ల దూరంగా విసిరి వేయబడి ధ్వంసమైన ఆయన కుటుంబ జీవితాన్ని ఒకసారి మనసుకు తెచ్చుకొండి! ధ్యేయసాధనకు అతనితో నిలబడి కృషిచేయటానికి ప్రమాణం చేసి క్లిష్ట పరిస్థితులలో ఆయనకు ద్రోహం చేసి, తమ గమ్యం విఫలటానికి ఆయన కారణమని నిందించిన శిష్యులను జ్ఞప్తికి తెచ్చుకోండి! అంతేకాదు తుదకు విధి ఆయన పెదవుల ముందు వుంచిన పరాజయ, పరాభవాలనే విషాన్ని కాలకంఠ రుద్రునివలె మ్రింగి అత్యంత ధీరుడుగా సింహ పరాక్రమశాలిగా, ముందు తరాలకు మార్గదర్శి అయిన అవతార పురుషుడుగా ఏ విధంగా ఋజువు చేసుకొన్నదీ ఒకసారి మననం చేసుకొండి. అట్టి మహాపురుషుని జీవితం వీరకావ్యానికి తగిన వస్తువుగా నేను భావించాను" అని వివరించారు.

అండమాన్ జైలులో కూడా హిందూ శిక్కు ఐక్యతను సాధించడానికి జైలు నిబంధనలను కూడా లెక్కచెయ్యక అధికారుల కండ్లుగప్పి జైలు ఆవరణలో గురుగోవింద సింగ్ జన్మదినాన్ని జరిపించారు.

హిందూత్వం - శిక్కులు: తన కారాగార సమయంలోనే రచించిన ''హిందూత్వ" గ్రంథంలో శిక్కులను గురించి ఈ విధంగా వ్రాశారు. "లక్షలాది శిక్కు సోదరులకు వారి హిందూత్వం స్వయం విదితమే. సహజ ధారులు, ఉదాశీలురు, నిర్మలులు, గహన గంభీరులు, సింధి శిక్కులు జాతి పరంగాను, రాష్ట్రపరంగాను హిందువులని గర్విస్తారు. వారి గురువులు 'హిందూ సంతానం కావడం వల్ల వారిని హైందవేతరులుగా వర్గీకరిస్తే వారు అవమానించినట్లు భావిస్తారు.

జాతి ఐక్యత ఎంత అసందిగ్ధం, ఎంత పరిపూర్ణ మైనదంటే శిక్కులకు సనాతములకు మధ్య అంతర్వివాహాలు జరుగుతూనే వున్నాయి.

శిక్కులు సనాతనులు కాకపోయినా హిందువులే: మన శిక్కు సోదరులకు మరోసారి చెప్పుతున్నాను. “నాతన ధర్మంలో వారికి చ్చని మూఢ విశ్వాసాలను ఆచారాలను, వేదాలు అపరుషేయాలు అన్న నమ్మకంతో సహా, అన్నిటిని వదలి పెట్టడానికి సంపూర్ణ స్వేచ్చవున్నది?" అని. దానితో వారు నాతనులు కాకపోవచ్చును కానీ, హిందువులు మాత్రం కాకపోవడం జరుగదు.

"హిందువులలో ఈ అల్ప సంఖ్యాక వర్గాలు, అధిక సంఖ్యాక వర్గాలు ప్రత్యేక స్పష్టులు కావు. ఆకాశం నుండి వూడిపడ్డవి కావు. అవి అన్నీ ఒకే భూమి ఒకే సంస్కృతులలో వ్రేళ్ళు నాటుకొని, సహజ సిద్దంగా వృద్ధి చెందినవి మాత్రమే! ఒక గొర్రెపిల్ల మొలకు కచ్చ (లంగోటి) కృపాణాలను కట్టినంత మాత్రాన అది సింహమై పోతుందా? ఆత్మ బలిదాతలు వీరావతంసులైన యోధ బృందాన్ని మన గురువు రూపొందించగలిగినాడంటే దానికి కారణం ఆయన, ఆ యోధ బృందం పుట్టిన జాతి, వారిని ఆతీరుగా తీర్చిదిదింది.

సింహబీజాలే సింహాలను పుట్టించ గలవు. "నేను వికసించి సుగంధాన్ని వ్యాపింపజేయడానికి కారణం యీ తొడిమ నుంచి పుట్టడమే గాని వేళ్ళతో నాకు ఏమీ సంబంధం లేదు” అని పుష్పం అనగలదా? అదే విధంగా మన పూర్వీకులు బీజాన్నికాని, రక్త సంబంధాన్ని కాని విరాకరించలేము. గురు భక్తుడైన ఒక శిక్కును చూపించామంటే గురు భక్తుడైన హిందువును చూపించినట్లే. ఎందుకంటే అతను శిక్కుకాక ముందు నుంచీ, ఇప్పుడు కూడా హిందువే గనుక! మన శిక్కు సోదరులు శిక్కు మతానికి విధేయులుగా వున్నంతవరకు వారు తప్పకుండా హిందువులుగా కొనసాగక తప్పదు. కొనసాగుతారు కూడా! వారికి "ఆ సింధు సింధు పర్యంతమైన భూమి పితృభూమియేగాక పుణ్య భూమికూడా అయితీరుతుంది. వారు శిక్కులు కాకుండా పోతేనే హిందువులు కూడా కాకుండా పోతారు''.

స్వర్ణ దేవాలయంలో సావర్కర్కు సన్మానం: సావర్కర్ రత్నగిరి నిర్బంధం తరువాత హిందూ మహాసభ అధ్యక్షత వహించి హిందూ సంఘటనోద్యమంలోకి శిక్కులను తీసుకొని రావడానికి ర్వప్రయత్నాలు చేశారు. 1938మే లో అమృతసర్ నగరంలోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించారు. వేలకొలది శిక్కులు సావర్కరు కు వీరోచిత స్వాగతం ఇచ్చారు. త కార్యక్రమాలన్నిటిని రద్దు చేసుకొని సావర్కర్ కు స్వాగతం చెప్పటానికి మాస్టర్ తారాసింగ్ వచ్చారు. వారి అధ్యక్షతన దర్బారు హాలులో జరిగిన సభలో తనకు సమర్పించిన సన్మాన పత్రానికి జవాబు చెబుతూ గురు గోవింద సింగు ఆదర్శంగా వుంచుకొని నడుచుకోవలసిందిగా శిక్కులను ఆయన కోరారు. తర్వాత సరాఫ్ బజారులో జరిగిన సభలో ఆయనకు శిక్కులు కృపాణాన్ని బహుకరించారు. అప్పుడు సావర్కర్ శిక్కులను ఉద్దేశించి "మిమ్ములను అహింసా సిద్ధాంతం ఆవహించి కృపాణానికి అర్థం లేకుండా పోయింది. ఈ తరుణంలో ఒక మహారాష్ట్రునికి కత్తిని బహూకరించి ఏమి ప్రయోజనం సాధించ దలచారు?" అని ప్రశ్నించినారు. గాంధీ అహింసా సిద్ధాంతం శిక్కులను కూడా నిర్వీర్యులుగా చేయ ప్రారంభించిందని సావర్కర్ భావించారు.

హిందువులు శిక్కులు పాల్గొన్న పోరాటాలు:

1939లో హైదరాబాదులో ఆర్యసమాజ్, హిందూ మహాసభ ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో శిక్కు దళాలు కూడా పాల్గొన్నాయి.

1942 జూలైలో హిందూ శిక్కు వ జవాన్ సభ, ఇతర హిందూ సంఘటన వాదుల ఆహ్వానంపై సావర్కర్ కాశ్మీరులో గావించిన పర్యటనలో మాస్టర్ తారాసింగ్ సావర్కర్ వెంట ఉన్నారు. జమ్ములో హిందూ శిక్కు ఐక్య సంఘటన బ్రహ్మాండమైన ఉత్సవం జరిపి, సావర్కర్ ను న్మానించింది. హిందు, శిక్కు సమావేశానికి సావర్కర్ అధ్యక్షత వహించారు.

1944లో కాంగ్రెసు గుట్టుబైటపడి పోయినది. పాకిస్థాన్ కు అనుకూలంగా ముస్లింలీగుతో కుట్ర చేయటానికి ప్రారంభించారు.

ఇక అఖండ హిందూస్థాన్ ఉద్యమం సావర్కర్, మాస్టర్ తారాసింగ్ భుజస్కంధాల మీద ఆధారపడింది.

మాస్టర్ తారాసింగ్ ప్రబోధం: అక్టోబరు 7–8 తేదీలలో అఖండ హిందూస్థాన్ నాయకుల సమావేశం ఢిల్లీలో జరిగింది. అందులో తారాసింగ్ మాట్లాడుతూ శిక్కులు భారతదేశ ద్వారా రక్షకులు. అఖండ 'హిందూస్థాన్ పొలిమేరలు రక్షించటానికి మీకు సహాయం చేయడానికి రాలేదు.

కానీ అఖండ హిందూస్థాన్ రక్షించటానికి ప్రతిజ్ఞ పూనిన శిక్కులకు మీ సహాయం కోరుతున్నాను. అంతేకాదు హిందువులలో ఎక్కువ మంది పాకిస్థాన్ కు ఒప్పుకొన్నప్పటికీ, దానిని శిక్కులపై రుద్దటానికి వారికి యెటువంటి హక్కులేదని ఆయన హెచ్చరించారు.

1947 ఫిబ్రవరిలో పాకిస్తాన్ కనుచూపుమేరలోకి వచ్చింది. ఓడిపోయిన అఖండ హిందూస్థాన్ శక్తులను కూడ కట్టుకోవటానికి మాస్టర్ తారా సింగ్ ఆఖరు ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నాలకు సావర్కర్ త ఆశీస్సులు తెల్పుతూ "హిందూ శిక్కు సోదరుల హృదయాలకు గురు గోవింద సింగ్ ప్రేరణనిచ్చును గాక, స్వాతంత్ర్యం కొరకు ఐక్యభారతం కొరకు పోరాడే శక్తులను బలపరచుగాక” అని పలికారు.

కాంగ్రెస్ ఘాతుక చర్య - హిందు - శిక్కుల సంఘాత మరణాలు: గాంధీజీ ఆశీస్సులతో పాకిస్థాన్ యేర్పడనే యేర్పడింది. హిందువులు ఐక్యంగా నిలబడనందున హిందువులతో పాటు శిక్కులు కూడా ముహమ్మదీయు మతోన్మాదానికి, మారణ హోమానికి ఆహుతైనారు. కాంగ్రెస్ నాయకులు శిక్కులను వెన్నుపోటు పొడిచారు.

సావర్కర్ - మాస్టర్ తారా సింగ్: గాంధీ మరణానంతరం మాస్టరు తారా సింగ్ ని కూడా నిర్బంధించి, 1949 లో విడుదల చేశారు. ఆ సందర్భంలో సావర్కర్ ఆయనను అభివందిస్తూ “దేశ విభజన నాడు పంజాబును ఆవరించిన చీకటి రోజులలో మన ప్రజల వీరోచిత మన స్థైర్యాన్ని నిలబెట్టి, తూర్పు పంజాబును మనకు నిలబెట్టిన నాయకులలో తారా సింగ్ ప్రముఖుడు. హిందూ శిక్కు ఐక్య ధ్యేయానికి తారా సింగ్ చేసిన సేవలను నాకన్న ఎక్కువగా ఇంకెవరూ అభినందించలేరు'' అని తెలిపారు. దీనికి జవాబుగా మాస్టరు తారాసింగ్ ఒక సందేశాన్ని పంపుతూ ఇప్పుడు హిందూ శిక్కుల మధ్య సంబంధాలు బెడిసిపోయి, జైలులో వున్న నాకు చాలా ఆందోళన కలిగించింది. పాకిస్థాన్ గనుక హిందూస్థాన్ పై దురాక్రమణ చేస్తే మనమతం, మన సంస్కృతి, మనకు పవిత్రమైన ప్రతి ఒక్కటీ ర్వనాశనమై పోతాయి... మీరు ఒక్కరే ఈ దుస్థితిని నివారించగలిగిన సమర్థులు, అందువల్ల మీ దృష్టిని ఈ తీవ్రమైన సమస్యపై కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులలో హిందువులు నన్ను నమ్మడం లేదు. అందువలన నేను యేమీ చేయలేకుండా వున్నాను. నా మటుకు నేను ఈ అత్యవసర కార్యంలో మీకు ఎటువంటి సహాయమైనా చేయటానికి సిద్ధంగా వున్నాను" అని సావర్కర్ కు ఆవేదనాత్మక సందేశం పంపించారు. ఇంకొక చోట వ్రాస్తూ తారా సింగ్ యూదులకు పాలస్తీన ఇవ్వటానికి క్రైస్తవ ప్రపంచమంతా ఏకమైంది. దేశ విభజన వల్ల కల్గి విషపరిణామాలను తొలగించటానికి హిందూ ప్రపంచమంతా ధీరులైన 'ఖల్సా' తో ఎందుకు కలిసి పనిచేయరాదు? ఇది జరిగేంతవరకు లేక స్వతంత్ర భారతంలో స్వతంత్ర ప్రతిపత్తి వచ్చేంత వరకు ఖాల్సా విశ్రమించదు అని తెలిపినారు. కాంగ్రెస్ వారు ఒక వైపున అధికార దాహంతో, శిక్కులను కించపరచి హిందూ శిక్కు వైషమ్యాలకు ప్రోది చేస్తూ ఉండగా, శిక్కు నాయకులకు సావర్కర్ పై వున్న విశ్వాసం యేమాత్రము డలలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలచే అవమానింపబడి, వేధింపబడిన సావర్కర్ అలసిపోయి, ప్రత్యక్ష రాజకీయాల నుండి వైదొలగిపోయారు.

1953 నవంబరు 10 వ తేది మాస్టరు తారా సింగ్ బొంబాయిలో సావర్కర్ ను కలుసుకొని హిందూ శిక్కు ఐక్యతకు సంబంధించిన సమస్యలను, పంజాబు భాషా రాష్ట్ర కోర్కెలను గురించి రెండు గంటలసేపు చర్చించారు. కానీ వారిద్దరు యేమి చర్చించినది బహిరంగ పరచలేదు.

పంజాబు సమస్యను పరిష్కరించగల సమర్మడు సావర్కర్ మాత్రమే: 1958 జూలై 5వ తేది బొంబాయిలో సావర్కర్ అమృతోత్సవ (75వ జన్మ దినము) సందర్భములో, బాంబే మేయరు మిరాజ్కర్ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో వృద్ధ కాంగ్రెస్వేది బి.ఎఫ్. భరూచా ప్రసంగిస్తూ “పంజాబు సమస్యను పరిష్కరించటానికి హిందువుల చేతను శిక్కుల చేతను సమానంగా ప్రేమించబడే సావర్కర్ సహాయాన్ని భారత ప్రభుత్వం అర్థించాలి. కానీ సావర్కర్ పైవారికి గల ద్వేషభావం వలన వారు ఆవిధంగా చేయరు” అని పేర్కొన్నారు.

శిక్కుల చరిత్ర, శిక్కుల మనస్తత్వాన్ని ఎరిగిన వీర సావర్కర్ మాత్రమే శిక్కుల సమస్యను 1907లోనే గమనించి శిక్కులను భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములుగా చేసి వారిలో తాము వేరు అనే భావాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేసి చాలా వరకు సఫలీకృతుడైనాడు. కానీ దేశ విభజనకు ముందు శిక్కులను వెన్నుపోటు పొడిచి భజన్ లాల్ వంటి ఆయారామ్ గయారామ్ ల ద్వారా పంజాబును తన గుప్పిట్లోవుంచుగొన ప్రయత్నించిన కాంగ్రెసు వారు, ఇందిరాగాంధి, వీరులైన శిక్కులలోని విద్వేషాన్ని నింపి పంజాబులో చిచ్చుపెట్టారు. హిందూ శిక్కు ఐక్యతను కాంక్షించిన మాస్టరు తారా సింగ్, వీర సావర్కర్ వంటి దేశభక్తులైన నాయకులు ఈ క్లిష్ట పరిస్థితులలో మన డుము లేక పోవడం దురదృష్టకరం. ఈ సమస్యకు పరిష్కారం ఒకనాడు వీరసావర్కర్ చెప్పినట్లు "హిందూ శిక్కు సోదరుల హృదయాలను గురుగోవింద సింగ్ ప్రేరితం చేసి, ఐక్య భారతం కోసం పోరాడే శక్తులను బలపరచుగాక" అని ఆశించవలసి ఉంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

No comments