Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ముఖ్యమంత్రి కంటే వైద్యునిగా పిలుపించుకునేందుకే ఇష్టపడ్డ ప్రజానేత బిధాన్ చంద్ర రాయ్ - About Bidhan Chandra Roy in Telugu

ముఖ్యమంత్రి కంటే వైద్యునిగా పిలుపించుకునేందుకే ఇష్టపడ్డ ప్రజానేత "ఎక్కడైతే వైద్య విద్య ప్రేమించబడుతుందో, అక్కడ మానవత్వంపై ప...

ముఖ్యమంత్రి కంటే వైద్యునిగా పిలుపించుకునేందుకే ఇష్టపడ్డ ప్రజానేత

"ఎక్కడైతే వైద్య విద్య ప్రేమించబడుతుందో, అక్కడ మానవత్వంపై ప్రేమ కూడా ఉంటుంది". వైద్య శాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధి పొందిన హిప్పోక్రీట్స్ చెప్పిన ఈ సామెత, బిధాన్ చంద్ర రాయ్ దయా హృదయానికి సరిగ్గా సరిపోతుంది. రాజ్యాంగ పరంగా అత్యంత శక్తివంతమైన పదవుల్లో ఒకటైన ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టినప్పటికీ, బిధాన్ చంద్ర రాయ్ మాత్రం వైద్యునిగా పేరొందేందుకే అమితంగా ఇష్టపడ్డారు. భారత వైద్య సంఘానికి ఈయన వ్యవస్థాపకులు. ఆ తర్వాత దీనికి అధ్యక్షుడి బాధ్యతలు కూడా చేపట్టారు. "ఎప్పుడైతే పౌరులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారో అప్పుడే దేశం అసలైన స్వరాజ్(స్వయం పాలన)ను సాధిస్తుందీ" అని రాయ్ తరచూ చెప్పేవారు. వైద్య రంగానికి ఆయన చేసిన గణనీయ సేవలకు గుర్తింపుగా, ప్రతి ఏడాది ఆయన జయంతి నాడు జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.

రాయ్ పాట్నాకి సమీపంలో ఉన్న బంకిపూర్లో జూలై 1, 1882న జన్మించారు. ఈయన తన పదవ తరగతిని 1897లో కాలేజియేట్ పాఠశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత కోల్కతాలో ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ఇంటర్, పాట్నా కాలేజీ నుంచి బి.ఎను హానర్స్ మ్యాథమెటిక్స్ లో పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత, బెంగాల్ ఇంజనీరింగ్ కాలేజీకి, కోల్కతా వైద్య కాలేజీకి దరఖాస్తు చేసుకున్నారు. రెండు కాలేజీల్లో ఆయన ఎంపికైనప్పటికీ, ఆయన వైద్య రంగాన్నే ఎంచుకున్నారు. తన చదువుల కోసం ఆయన 1901లో కోల్కతా వెళ్లారు. అదే సమయలో రాయ్ తండ్రి పదవీ విరమణ కావడంతో, ఆర్థికపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పుస్తకాలు కొనుగోలు చేసేందుకు కూడా ఆయన వద్ద డబ్బులు ఉండేవి కావు. బెంగాల్ ను బ్రిటీష్ విభజించినప్పుడు అయన తన వైద్య విద్యను కోల్కతాలోనే సాగిస్తున్నారు. బెంగాల్ విభజనపై ఎంతో ఆందోళన చెందిన రాయ్, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జరిగే పోరాటంలో తాను కూడా పాలుపంచుకోవాలనుకున్నారు. కానీ తాను వైద్య విద్యను అభ్యసించడం ద్వారా దేశానికి మరింత సేవ చేయొచ్చనే ఆలోచన దృక్పథంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. 1909లో రాయ్ సెయింట్ బర్తోలోమో ఆసుపత్రి నుంచి వైద్య విద్యలో పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేసేందుకు కేవలం రూ.1200 ఖర్చుతో తెరచాప పడవలో బ్రిటన్ కు వెళ్లారు.

ఆసియా నుంచి వచ్చిన విద్యార్థులకు ప్రవేశం ఇవ్వడానికి ఆ కాలేజీ డీస్(అధిపతి) సమ్మతించకపోవడంతో, ఆయన దరఖాస్తు పలుమార్లు తిరస్కరణకు గురైంది. అయినప్పటికీ రాయ్ ఆ కాలేజీకి దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. చివరికి 30 దరఖాస్తుల తర్వాత రాయ్ కి ఈ కాలేజీలో ప్రవేశం లభించింది. ఆయన తన ఎం.ఆర్.సి.పిసు, ఎఫ్.ఆర్.సి.ఎస్ ను రెండున్నర ఏళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే పూర్తి చేసి రికార్డులోకి ఎక్కారు. రాయ్ జాదవ్పూర్ టి.బి ఆసుపత్రి, చిత్తరంజన్ సేవా సదన్, కమల నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇన్స్టిట్యూషన్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. 1923లో తొలిసారి ఆయన దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టి, బారక్పూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రముఖ రాజకీయ నేత సురేంద్ర నాథ్ బెనర్జీని ఓడించారు. 1928లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా చేరారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని 1929లో బెంగాల్లో సమర్థవంతంగా నిర్వహించారు. 1933లో ఆయన పశ్చిమ బెంగాల్ మేయర్గా ఎంపికయ్యారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బెంగాల్ ముఖ్యమంత్రిగా రాయ్ పేరును ప్రతిపాదించింది. అయితే రాయ్ మాత్రం తన వైద్య వృత్తినే కొనసాగించాలనుకున్నారు. మహాత్మా గాంధీ సూచన మేరకు, ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు. 1948 నుంచి 1962 వరకు 14 ఏళ్ల పాటు రాయ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు తన వైద్య వృత్తిపై ఉన్న మక్కువతో, రోగులపై శ్రద్ధ చూపడం ఎప్పుడూ మానలేదు. పశ్చిమ బెంగాల్లో ఐదు కొత్త నగరాలు- దుర్గాపూర్, కల్యాణి, బిధాన్ నగర్, అశోక్ నగర్, హబ్రాలను స్థాపించారు. దేశానికి, సమాజానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను 1961లో ఆయనకు 'భారత రత్న' పురస్కారం వరించింది. జూలై 1, 1962లో ఆయన స్వర్గస్తులయ్యారు. ఆయన కన్నుమూయక ముందే, తన ఇంటిని నర్సింగ్ హోమ్ నడిపేందుకు దానం చేశారు. దీనికి తన తల్లి పేరు అఘోర్కామిని దేవిగా పెట్టబడింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

No comments